తే.గీ:జాషువాకవీ! హరిజన జాతి పొందు వేదనను దెల్పు గ్రంథముల్ వేలె యున్న నిలచు భవ్యమై నీదు కన్నులనె బడిన గబ్బిలమ, నీ కనులు మనోజ్ఞములు గావె” (గబ్బిలమ = గబ్బిలమే. ఈ విషయం పై అనేకక గ్రంథా లున్నా నె దృష్టిలో పడిన గబ్బిలమే నిలబడుతుంది. నీ దృష్టి గొప్పది.)
ఉ:అబ్బుర మైన రీతిని మహాకవి వ్రాసిన మేఘదూతమన్ గబ్బము నే గ్రహించి కులకల్మషమున్ కథ గా గ్రహించి నీ కబ్బము నందు వ్యంగ్యమును గల్పెడునట్టి మహా ప్రయోగ మీ గబ్బిలమా? మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్” (కాళిదాసు కావ్య మైన మేఘసందేశాన్ని గ్రహించి దానికి వ్యంగ్యాన్ని కూర్చిన కావ్యమా? అని పాఠకుడు గ్రహించి ఆశ్చర్యం తో అభినందించినట్లు.)
గ – జ్ఞ ల యతి మైత్రి నా యభిప్రాయమున నభిలషణీయము కాదు. జ మఱియు ఞ లు రెండును క వర్గము లోనివి కావు. జ్ఞ వికృతిలో న గా మారును. న-గ లకు యతి లేదు. అప్పకవి మాత్రమే యీ యతి చెప్పెను. కాని యిచ్చిన ఉదాహరణములలో పండితారాథ్య చరిత్రలోఁ దక్క మిగిలినవి వానిలోఁ బాఠాంతరము లున్నవి.
*జ్ఞానికి నుపదేశవిధిఁ బ్ర*కాశము సేయం... [భారత.శాం. ౪.౨౫౫] “ప్రజనితము సేయం” అని పాఠాంతరము గలదు.
తేటగీతి
రిప్లయితొలగించండిదళిత జాతుల పైబడు దారుణములె
శ్రామికుల జీవనముసుందరమన బల్కి
విశ్వనాథుని మేల్కొల్ప విశదపఱుచ
గబ్బిలమ! నీ కనులు మనోజ్ఞములు గావె!
ఉత్పలమాల
జబ్బుగఁ దోచఁగన్ దళిత జాతుల జీవిత సంకటమ్ములున్
నిబ్బరమొప్పఁ దెల్పితివె నీవట శ్రామికజీవనంబదే
యబ్బురమొల్క సుందరమె! త్ర్యంబకు సన్నిధి విన్నవించితే!
గబ్బిలమా! మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణముల్!
ఎరకలుపయోగ పడుచుండ నెచటికయిన
రిప్లయితొలగించండిజిమ్మ చీకటిలో కూడ జేర వలయు
గమ్యమును చేర్చు చుండెడి కన్నులున్న
గబ్బిలమ ! నీ కనులు మనోజ్ఞములు గావె”
రిప్లయితొలగించండికనక వర్ణ దేహము నీది కాదు చిలుక
ముక్కు వలె నంద మైనట్టి ముక్కు కాదు
నెమలి కున్నట్టి పింఛమ్ము నీకు లేదు
గబ్బిలమ నీ కనులు మనోజ్ఞములు గావె.
*(కావె.....కావు అని)*
అబ్బుర పర్చు వర్ణమది యంచ విధమ్మున లేదు నింగిలో
మబ్బుల గాంచినంత నహిమారక మట్లును నృత్యమాడవే
నిబ్బర మంద డెవ్వడిల నీ మెయి గాంచి కసీస జీవి హే
గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్.
*(కావు అనే అర్థంలో)*
నిబ్బరమెంతయో కలిగి నింగికి దూసుక పోవుచుంటివే
రిప్లయితొలగించండిమబ్బుల మీదుగా,దళిత మానవ బాధలు విన్నవించగన్
గిబ్బపటాణి రౌతునకు క్షిప్రము నీవును వెండికొండకున్
గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయ వీక్షణల్
గుబ్బటిల్లిన దైన్యంబు గుండెదిగులు
రిప్లయితొలగించండిగిబ్బరౌతుకు వినిపింప నిబ్బరమున
మబ్బు లందున దూరుచు మాయమైన
గబ్బిలమ! నీ కనులు మనోజ్ఞములు గావె
దబ్బున దీపమార్పినను దైన్యమునే వివరింప వేడగా
గుబ్బలిపట్టి పెన్మిటికి గోడును దెల్పగ మింటిదారిలో
నబ్బురమొప్పగా భరత యాత్రకు సాగిన పక్షివైతివే
గబ్బిలమా! మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్
-
రిప్లయితొలగించండిఅబ్బె నిశిరాత్రి చూడ్కలు నచ్చె పోవె
గబ్బిలమ నీ కనులు; మనోజ్ఞములు గావె
శంకరాభరణమ్మున చక్కనైన
పూరణలు నీకు వేనోళ్ల పొగిడికలును
-
రిప్లయితొలగించండిఅబ్బురమైన నేత్రములు యామిని భామిని దీటు చూడ్కలా
పబ్బుల కిక్కు మద్యములు పారిన కన్నుల కుర్రకారు పై
కప్పుల చీల్చు గాత్రముల కైపుల రెక్కలనార్చు మ్రోతతో
గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ:జాషువాకవీ! హరిజన జాతి పొందు
రిప్లయితొలగించండివేదనను దెల్పు గ్రంథముల్ వేలె యున్న
నిలచు భవ్యమై నీదు కన్నులనె బడిన
గబ్బిలమ, నీ కనులు మనోజ్ఞములు గావె”
(గబ్బిలమ = గబ్బిలమే. ఈ విషయం పై అనేకక గ్రంథా లున్నా నె దృష్టిలో పడిన గబ్బిలమే నిలబడుతుంది. నీ దృష్టి గొప్పది.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ॥ అబ్బుర మయ్యె గబ్బిలములావిధి చీకటి యందుఁ జక్కగన్
రిప్లయితొలగించండిదబ్బున సాగుచుండుటను తగ్గని వేగము నొంది చూడఁగన్
నిబ్బరమొంది పద్యమున నెమ్మిని వ్రాసితి సంతసమ్ముగన్
గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయ వీక్షణల్
జాషువా గారి కలమున జాలు వారి
రిప్లయితొలగించండిపాఠకుల మది దోచిన భాగ్య దాయి
గబ్బిల మ! నీకనులు మనో జ్ఞ ములు గావె
యనుచు నుతియించె నొకడు దా నబ్బురముగ
ఉ:అబ్బుర మైన రీతిని మహాకవి వ్రాసిన మేఘదూతమన్
రిప్లయితొలగించండిగబ్బము నే గ్రహించి కులకల్మషమున్ కథ గా గ్రహించి నీ
కబ్బము నందు వ్యంగ్యమును గల్పెడునట్టి మహా ప్రయోగ మీ
గబ్బిలమా? మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్”
(కాళిదాసు కావ్య మైన మేఘసందేశాన్ని గ్రహించి దానికి వ్యంగ్యాన్ని కూర్చిన కావ్యమా? అని పాఠకుడు గ్రహించి ఆశ్చర్యం తో అభినందించినట్లు.)
చెట్ల పైన వ్రేలాడిన నెట్లు గొప్ప
రిప్లయితొలగించండిదొంగలును జరియింపరె పొంగి నిశల
నేల నీ కింత గర్వము సాలు చాలు
గబ్బిలమ నీ కనులు మనోజ్ఞములు గావె
కబ్బము లందు సత్కవి నికాయము దుష్ట తరోపమానముల్
గబ్బు సెలంగఁ జేయుదురు కార్యమె యట్టు లొనర్ప నక్కటా
యబ్బుర మౌను నీ చరిత మారయ గాఢ తమస్సు నందు నో
గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయ వీక్షణల్
గబ్బిలమ నీ కనులు మనోజ్ఞములు గావె
రిప్లయితొలగించండిగ – జ్ఞ ల యతి మైత్రి నా యభిప్రాయమున నభిలషణీయము కాదు. జ మఱియు ఞ లు రెండును క వర్గము లోనివి కావు. జ్ఞ వికృతిలో న గా మారును. న-గ లకు యతి లేదు. అప్పకవి మాత్రమే యీ యతి చెప్పెను. కాని యిచ్చిన ఉదాహరణములలో పండితారాథ్య చరిత్రలోఁ దక్క మిగిలినవి వానిలోఁ బాఠాంతరము లున్నవి.
*జ్ఞానికి నుపదేశవిధిఁ బ్ర*కాశము సేయం... [భారత.శాం. ౪.౨౫౫]
“ప్రజనితము సేయం” అని పాఠాంతరము గలదు.
*కర్మ మధర్మ మ*జ్ఞాన మాగడము [పండితా.పురాతన. ౨౮౪ పు.]
*జ్ఞానేంద్రియజ్ఞాన*కళ లౌరుసౌరుగా [కాశీ. ౧.౧౩౯]
["సీ. ఘ్రాణేంద్రియజ్ఞానకళ యౌరుసౌరుగా జిహ్వావివేకంబు చిఱుతవోవ." కాశీ. ౧,ఆ. ౧౩౯.]
జ్ఞ - క - ఖ - గ - ఘ - లు పరస్పరము చెల్లును. దీనిని విశేష యతి అంటారు.
తొలగించండితే.గీ. జ్ఞాన సౌభాగ్యమే మన గౌరవంబు.
తొలగించండికావ్య నిర్మితి వలన విజ్ఞాన ప్రగతి.
ఖండ కావ్యమ్ము కూడ విజ్ఞతనొసంగు
జ్ఞాన భాగ్య సంవృద్ధిని ఘనత పెఱుఁగు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కారు చీకట్లు క్రమ్మిన గాని నీవు
నేర్పుగా వేట చేసెడు నోర్పు నీది
దేవళములందు హెచ్చుగా తిరుగుచుండు
గబ్బిలమ! నీ కనులు మనోజ్ఞములు గావె?