3, సెప్టెంబర్ 2026, గురువారం

సమస్య - 5579

4-9-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ద్రుపదాత్మజ పెండ్లియాడె దుర్యోధనునిన్”

(లేదా...)

“ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో వెలుగు ప్రభాకర్ గారి సమస్య)

11 కామెంట్‌లు:

  1. కందం
    అపురూపమైన నటులన
    ద్రుపదాత్మజ పాత్రధారి దుర్యోధనులే
    యుపయమమంద జనులనిరి
    ద్రుపదాత్మజ పెండ్లియాడె దుర్యోధనునిన్!

    మత్తేభవిక్రీడితము
    అపురూపంబుగ ద్రౌపదీలలనగా నాహార్య మొల్కంగనే
    నిపుణత్వంబున రాజరాజు నటనన్ దేజమ్ములేపారెడున్
    విపులాత్ముండును ప్రేమతో జతపడన్ విశ్వంబు నిట్లాడెనే!
    ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్!

    రిప్లయితొలగించండి
  2. ద్రుపదుని నిర్ణయ మందున
    నా పాండుసుతులయినట్టి అయిదు యువకులన్
    ద్రుపదాత్మజ పెండ్లియాడె ; దుర్యోధనునిన్
    ఆపడతుక భాను పెండ్లి యాడెననెదరే

    రిప్లయితొలగించండి

  3. ఉప పాండవ మాత యెవతె?
    కపర్ది ప్రభ నేమిచేసె? గదతోడను గా
    డుపు చూలి చంపె నెవనిని?
    ద్రుపదాత్మజ, పెండ్లియాడె, దుర్యోధనునిన్.


    అపరాధమ్ములు చేయ నిచ్ఛగల పాపాత్ముండు దుశ్శాసనుం
    డపరాహ్నమ్మున నిద్రలో గనెనె యత్యంతాద్భుతంబైన దౌ
    స్వపమొక్కంటిని, యగ్రజుండచట మత్స్య యంత్రమున్ గొట్టగా
    ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్.

    రిప్లయితొలగించండి
  4. అపుడచట పాండవులనే
    ద్రుపదాత్మజ పెండ్లియాడె; దుర్యోధనునిన్
    విపరీతమ్ముగ నమ్ముచు
    శపథమొనర్చిన హితుండు సావిత్రుడగున్

    నిపుణత్వమ్మును జూపి కృష్ణసఖుడే నెట్టించి కొంపోయినన్
    జపలత్వంబును వీడి పాండవులనే సంతృప్తితో సమ్మతిన్
    ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా; దుర్యోధనుం బ్రేముడిన్
    విపరీతమ్ముగ మెచ్చు కర్ణుడు సదా వెన్నంటి నిల్చెన్ గదా

    రిప్లయితొలగించండి
  5. -
    తపమొనరిచి నైదుగురిని
    ద్రుపదాత్మజ పెండ్లియాడె; దుర్యోధనునిన్
    చపలత గాంచిన నగవు త
    న పెనిమిటుల కొంప గూల్చె నక్షములోనన్


    రిప్లయితొలగించండి
  6. Is it true Bhanumati as name proposed by Narayana Bhattar in 11th century for the first time and vyasa bharata does not explicitly specify duryodhana's wives names ?

    any knows pl clarify

    అపురూపమ్ముగ నాల్గుపైనొకరుగా కాంతుల్ కిరీటిన్ సహన్
    ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా; దుర్యోధనుం బ్రేముడిం
    ప పురాణమ్మున భార్య భానుమతిగా భట్టారు నారాయణుం
    డు ప్రతిష్టాపన చేసెనంట నిది దండోరా ప్రకాశమ్ముగా




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను S.S.L.C. చదుచున్నప్పుడు (1962-63) మా తెనుఁగు పాఠ్య పుస్తకములో నొక పాఠము. కర్ణ దుర్యోధనుల స్నేహపు టౌన్నత్యమును దెలుపునది.

      ఈ నడి రేయిలో నిభ పురేశ్వరు నంతి పురాన హర్మ్య సో
      పాన పరంపరాగ్రముల పైన కెకాయెకి నెక్కు నెవ్వఁడీ
      మానిసి రాణి భానుమతి మందిర రత్న కవాట కాంతిలో
      నానన సీమ వెల్గెడిని యంగ నరేశుఁడు సూత సూనుఁడే

      తొలగించండి
  7. కం:విపరీత మ్మిది, విప్రుని
    ద్రుపదాత్మజ పెండ్లియాడె, దుర్యోధనునిన్,
    నిపుణుల నన్యుల విడెను న
    రపతుల కవమాన మనిరి రాజు లలుగుచున్.


    .

    రిప్లయితొలగించండి
  8. మ:కృపణుల్ కౌరవు లిట్లు బల్కిరి సభన్ హీనమ్ముగా నవ్వుచున్
    "విపరీతమ్ముగ నేవురన్ బ్రియముగా వేడ్కన్,విలాసమ్ముగా
    ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా! దుర్యోధనుం బ్రేముడిన్
    స్వపతీ స్థానము నందు జేర్చె వడి లో వాలన్ మహా పాపమే?"


    రిప్లయితొలగించండి
  9. మ॥ నిపుణుల్ హిందువులన్న కోపమెసగన్ నేమమ్మునున్ నీతినిన్
    గపటుల్ వీడుచు పల్కఁ దప్పుగ సదా కార్పణ్య మేపారఁగన్
    విపరీతమ్మకొ క్రొత్త గాదు తెలుపన్ విడ్డూరమా యట్టిదే
    ”ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా ధుర్యోధనున్ బ్రేముడిన్”


    సమస్య మొదటి లేక చివరి పాదంలో పెట్టాలనే ప్రయత్నమండి

    రిప్లయితొలగించండి
  10. అప రారుంధతి నాఁ బరఁ
    గు పరమ సాధ్వి యనినం దగును నేరక యే
    కపటమ్ము భానుమతి యో
    ద్రుపదాత్మజ! పెండ్లియాడె దుర్యోధనునిన్


    విపరీ తార్థము గైకొనంగఁ దగునే విద్యాధికశ్రేణికిం
    జపలత్వమ్మునఁ గాదు సుస్థిర మతిన్ సాధించె రారాజునిన్
    నృప వంశోద్భవ యైన భానుమతి, కుంతీపుత్రులం బొందఁగా
    ద్రుపదాత్మోద్భవ, పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్

    రిప్లయితొలగించండి