చం॥ విదితము సృష్టి నాశమగు వేళను నిద్రకు బ్రహ్మలోనగున్ బిదపయె క్రొత్త సృష్టిఁ గను ప్రీతిగ నూత్న యుగమ్ము సాగఁగన్ గదులును గాల మెప్పుడును గల్పము నంతమునొందు చుండెడిన్ ముదిమి వయస్సులో కనులు మూతలు పడ్డవి పద్మసూతికిన్
(కల్పము అంతమయ్యే సమయములో అంటే బ్రహ్మ దినము ముగిసి రాత్రి వస్తుండగా ఆ సమయంలో బ్రహ్మకు నిద్రవలన కనులు మూతలు పడినాయి అనే విధంగా, ప్రతి యుగము ఒక కల్పముగా ఊహించి)
చం:చదివిన వేద విద్య నది సంపద గూర్చక పోగ,ద్వేషముల్ కదలుచు నుండె,నేటి కలి కాలమునన్, మరి విప్రుడన్న యా పదమె విమర్శలన్ బడెను, బ్రహ్మయు జూడడొ యేమొ! యెంచగా ముదిమి వయస్సులో కనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్”
కం:" ముది మది దప్పిన వేల్పునె యెదిరింతురు విప్రు" లనడె యీ పెద్దన? యా పదముల నే మార్చి యనెద ముదిమినిఁ గనుమూతలు వడె భూతాత్మునకున్” (పెద్దన గారు మనుచరిత్రలో అరుణాస్పద బ్రాహ్మణులు ముసలితనం లో మతి తప్పిన మొదటి వేల్పునే మించి పోయా రని చెప్పారు. కనుక నేను ఈ పదాలు రాస్తే తప్పేముంది అని ఒక కవి అన్నట్లు. )
[నాల్గు యుగము లొక్క దివ్య యుగము వేయి దివ్య యుగములు బ్రహ్మ కొక్క పవ లనఁగా 720 నిమిషములు ప్రస్తుతము నడచు చున్నది 28 వ కలి యుగము. అనఁగా28 వ దివ్య యుగము. 28 దివ్య యుగములు బ్రహ్మకు 28×720/1000 = 19.44 నిమిషములు. బ్రహ్మ యొక యేఁడు తపస్సు చేసి సృష్టి ప్రారంభించెను]
అదిరి పడకు సహజముగనె
రిప్లయితొలగించండిముదిమినిఁ గనుమూతలు వడె ; భూతాత్మునకున్
ముదిమి నెలకొపదు గావున
జదువుల పడతి దరిజేరి సరసములాడున్
కందం
రిప్లయితొలగించండిపదఁపడి బ్రళయము పొడమగ
సదమలమగు సృష్టి నెల్ల చాలించు గతిన్
కదనము ముగిసిన గతి, నా
ముదిమినిఁ గనుమూతలు వడె భూతాత్మునకున్.
చంపకమాల
పొదలిన కల్పకాలమును బూర్తిగ ముంచి లయంబు జేయఁగన్,
పదఁపడి నిత్య కృత్యమగు బాధ్యత సృష్టిని నుజ్జగించి, తా
నిది సమయంబు విశ్రమము నించుకఁ బొందఁగ నంచు నెంచుచున్,
ముదిమి వయస్సులో కనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్.
రిప్లయితొలగించండిచదివిన చదు వేమయ్యెనొ
యదితిజులకు లేదు జ్యాని యది సత్యంబే
గద, యెటుల పలికితి విటుల
ముదిమినిఁ గనుమూతలు వడె భూతాత్మునకున్.
విదురుడ వీవటంచు పలు విద్యలు నేర్చితి వంచు నమ్ముచున్
ముదమున గౌరవించితిని పొత్తది లేదు వియచ్చకుండ్రకున్
గద, తమరీ విధిన్ బలుక కాంచితి రెక్కడ స్థావరమ్మనే
ముదిమి వయస్సులో కనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్.
రిప్లయితొలగించండిపదుగురు చెప్పినన్ వినడు పాండవు లన్నను ప్రేమ జూపడే
హృదయము నందు జాలి యది ఇంచుకయున్ గన రాదు మూర్ఖుడై
వదరెడి వాని ఫలమున వ్రాతను వ్రాసెడి వేళ యందునన్
ముదిమి వయస్సులో కనులు మూతలు పడ్డవి పద్మ సూతికిన్
కుదురగు సోయగమున్నను
రిప్లయితొలగించండిముదిమినిఁ గనుమూతలు వడె; భూతాత్మునకున్
మదిఁ మ్రొక్కెదఁ మరు జన్మను
జిదిమిన పాల్గారు నట్టి చెక్కిలి కొరకై
చదువుల వేల్పు సౌష్ఠవము సంస్థితమైన మనోజ్ఞ రూపమున్
జిదిమిన పాలుగారు నును చెక్కిలి నాకిడి సృష్టిజేసినన్
ముదిమి వయస్సులో కనులు మూతలు వడ్డవి; పద్మసూతికిన్
సదమల భక్తిఁ బూజలిడి చక్కనిమై మరు జన్మ కోరెదన్
[ ఓ అందమైన మహిళ కనులు మూతపడే వేళ మదిలో తలపులు ]
చం॥ విదితము సృష్టి నాశమగు వేళను నిద్రకు బ్రహ్మలోనగున్
రిప్లయితొలగించండిబిదపయె క్రొత్త సృష్టిఁ గను ప్రీతిగ నూత్న యుగమ్ము సాగఁగన్
గదులును గాల మెప్పుడును గల్పము నంతమునొందు చుండెడిన్
ముదిమి వయస్సులో కనులు మూతలు పడ్డవి పద్మసూతికిన్
(కల్పము అంతమయ్యే సమయములో అంటే బ్రహ్మ దినము ముగిసి రాత్రి వస్తుండగా ఆ సమయంలో బ్రహ్మకు నిద్రవలన కనులు మూతలు పడినాయి అనే విధంగా, ప్రతి యుగము ఒక కల్పముగా ఊహించి)
చం:చదివిన వేద విద్య నది సంపద గూర్చక పోగ,ద్వేషముల్
రిప్లయితొలగించండికదలుచు నుండె,నేటి కలి కాలమునన్, మరి విప్రుడన్న యా
పదమె విమర్శలన్ బడెను, బ్రహ్మయు జూడడొ యేమొ! యెంచగా
ముదిమి వయస్సులో కనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్”
కం:" ముది మది దప్పిన వేల్పునె
రిప్లయితొలగించండియెదిరింతురు విప్రు" లనడె యీ పెద్దన? యా
పదముల నే మార్చి యనెద
ముదిమినిఁ గనుమూతలు వడె భూతాత్మునకున్”
(పెద్దన గారు మనుచరిత్రలో అరుణాస్పద బ్రాహ్మణులు ముసలితనం లో మతి తప్పిన మొదటి వేల్పునే మించి పోయా రని చెప్పారు. కనుక నేను ఈ పదాలు రాస్తే తప్పేముంది అని ఒక కవి అన్నట్లు. )
సదసద్హృదయుని పదములు
రిప్లయితొలగించండిమది స్మరియించు తఱి నాకు మైకము కప్పన్
విదిత మజున కా వైనము,
ముదిమినిఁ గను మూతలు వడె, భూతాత్మునకున్
ఎదను గణింప నేఁడును బయిన్ నిమిషమ్ములు కొన్ని ప్రాయమౌ
ముదిమినిఁ గాదు తాత పువు పుట్టువు చుట్టఱికమ్ము చేతనే
చెదరిన దైన స్వప్నమునఁ జెప్పెద రిప్పగిదిం బరాకునన్
ముదిమి వయస్సులోఁ గనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్
[నాల్గు యుగము లొక్క దివ్య యుగము
వేయి దివ్య యుగములు బ్రహ్మ కొక్క పవ లనఁగా 720 నిమిషములు
ప్రస్తుతము నడచు చున్నది 28 వ కలి యుగము. అనఁగా28 వ దివ్య యుగము.
28 దివ్య యుగములు బ్రహ్మకు 28×720/1000 = 19.44 నిమిషములు.
బ్రహ్మ యొక యేఁడు తపస్సు చేసి సృష్టి ప్రారంభించెను]
కదలక పద్మాసనమున
రిప్లయితొలగించండివదలక ప్రతిజీవి నుదుటిపై వ్రాతలతో
సదమదమై యలయికతో
ముదిమినిఁ గనుమూతలు వడె భూతాత్మునకున్
వదలక జీవజాలముల వావిరిగా సృజియించు కార్యమున్
రిప్లయితొలగించండిసదయుఁడు పద్మసంభవుడు సల్పుచునుండె ననేక కల్పముల్
వదనములందు వేసటయవార్యముగా బొడసూపినంతటన్
ముదిమి వయస్సులో కనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వదలక సుదీర్ఘ రోగము
ముదిమినిఁ గనుమూతలు వడె;
భూతాత్మునకున్
వదనమున లేదలసటయు
సదయుండై సృష్టిలీల జరుపుచు నుండన్.