17, సెప్టెంబర్ 2026, గురువారం

సమస్య - 5593

18-9-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తార్క్ష్యునిపై శంకరుఁడు దిరిగె సురలు నుతింపన్”

(లేదా...)

“తార్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడం౦గన్”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో నేనిచ్చిన సమస్య)

7 కామెంట్‌లు:

  1. కందం
    జననీ దాస్యము వాపిన
    ఘనుడనుచుఁ బదవినొసఁగఁ గమలాక్షుఁడుఁ, దా
    గొని 'హరి'ని నిల్పగన్ దా
    ర్క్ష్యునిపై శంకరుఁడు, 'దిరిగె సురలు నుతింపన్'


    మత్తేభవిక్రీడితము
    వినతా పుత్రుడు తల్లి దాస్యమునకున్ వీడ్కోలు పల్కెన్ ధృతిన్
    గనుచున్ శౌర్యము, మాతృభక్తిఁ, బదవిన్ గట్టంగ
    శ్రీవిష్ణువే
    వినయంబందున వాహనంబుగఁ దగన్ బేర్గాంచగన్, శౌరి తా
    ర్క్ష్యునిపై నెక్కి చరించె! శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడం౦గన్!

    రిప్లయితొలగించండి

  2. జినుడెట్లు తిరుగు? వృషభ వ
    హనమెక్కి తిరుగున దెవరు హాహలమును కో
    కనదుండేల గొనెనొ? తా
    ర్క్ష్యునిపై, శంకరుఁడు దిరిగె, సురలు నుతింపన్.


    వినతా దాస్య విమోచనమ్ము కొరకై పీయూష మున్ గోరగా
    మొనలో వజ్రధరండనే గెలువగన్ పొంపెంత యో జూపగా
    గని తా మెచ్చి యనస్సు గా వరము ప్రాగ్వాంశుండు
    తానిచ్చి తా
    ర్క్ష్యునిపై నెక్కి చరించె , శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడగన్.



    రిప్లయితొలగించండి
  3. కనవచ్చిన దృశ్యమట న
    వనీ ధరాగ్రమున నంది వహనము పైనన్,
    జినుడు దిరుగాడగా తా
    ర్క్ష్యునిపై, శంకరుఁడు దిరిగె సురలు నుతింపన్

    కనవచ్చుంగద వైజయంతుని పయిన్ గంభీరమౌ గెల్పుతో
    ఘనుడా తార్క్ష్యుడు సేసినాడు జననీ కైంకర్యమే తొల్గగా
    వినతాసూనుని పై విహార మనుచున్ విశ్వాత్ము డానాడు తా
    ర్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాఁడగన్

    రిప్లయితొలగించండి
  4. మ॥ కని భస్మాసురునట్టులన్ శివుని రక్షార్థమ్ము నేతెంచుచున్
    దనదౌ శైలినిఁ ద్రుంచ మాధవుఁడు సంత్రాణమ్ము సిద్ధించఁగన్
    జనగా నిద్దరు విష్ణు వాహనమునన్ సంతోష మేపార తా
    ర్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁడమర్త్యుల్ సూచి కొండాడఁగన్

    (భస్మాసుర వధ తరువాత ఇద్దరూ కలసి అలా తిరిగినారని అండి)
    ఎదుటి వారు కారులో డ్రాప్ చేసిన విధంగా

    రిప్లయితొలగించండి
  5. అనురక్తిని భస్మావృత
    తనుండు ముక్కంటి సన్నుత వృషభ రాజ
    మ్మున నలరి సమర్చిత తా
    ర్క్ష్యునిపై శంకరుఁడు దిరిగె సురలు నుతింపన్


    ఘన చక్రాయుధ మూని హస్తమున రక్షశ్శ్రేణి హింసార్థమై
    వనజాక్షుండు రమా మనోధవుఁడు నాపన్నప్రసన్నుం డహో
    వన సంజాతము లారగింపఁ దమి నప్పక్షీంద్రుఁ డింపారఁ దా
    ర్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడఁగన్

    దుష్కర ప్రాసతో సమస్య:

    మార్క్ష్య వరాయుధమ్మును సమంచిత మూని కరాబ్జమం దహో
    పార్క్ష్య తటీ విహార రిపు భంజన కార్య నిమగ్న చిత్తుఁడై
    వార్క్ష్యము లారగింపఁ దమిఁ బక్షి వరేణ్యము పద్మనాభుఁడే
    తార్క్ష్యునిపైన నెక్కి చనెఁ ద్ర్యక్షుఁడు శంకరుఁ డా సురల్ గనన్

    [మార్క్ష్యము = మృక్షమునకు (గీకెడు నాయుధము) సంబంధించినది; పార్క్ష్యము = యుద్ధమునకు సంబంధించినది; వార్క్ష్యము = వృక్షమునకు సంబంధించినది]

    రిప్లయితొలగించండి

  6. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఘనుడగు హరి తిరిగెను తా
    ర్క్ష్యునిపై;శంకరుడు దిరిగె సురలు
    నుతింపన్
    తన వాహనమగు వృషభ
    మ్మునెక్కిముజ్జగములెల్ల మురియుచు
    నుండన్.

    రిప్లయితొలగించండి