24, సెప్టెంబర్ 2026, గురువారం

సమస్య - 5600

25-9-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బావిని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో”

(లేదా...)

“బావిని నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేడెదన్”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య)

7 కామెంట్‌లు:

  1. గోవులశాల దరిని యవి
    త్రావుటకు జలము నమరుచ దలచుట జేతన్
    మేవడిగ సలుపుటను గని
    బావిని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో”

    రిప్లయితొలగించండి
  2. కందం
    సేవించి శారదాంబను
    గావించితి ప్రౌఢ భాషఁ గావ్యములెన్నో!
    భావ నిగూఢమున 'దిగుడు
    బావిని' నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోతన శారదాంబతో.....

      ఉత్పలమాల
      పావన రామమూర్తి నను భాగవతమ్ము రచింపఁ బూనఁగన్
      సేవకునట్లు కావ్యమును జేసితిఁ, గూళులకమ్మ,! హాళికున్
      జీవనమెంచి, దాశరథిఁ జేర్చెద! నీ కృతి నమ్ముమా! మదం
      బా! విని నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేడెదన్!

      తొలగించండి

  3. జీవితమున మొట్ట మొదట
    పావన మౌ నీ చరితను వచనంబున నీ
    కోవెల లో వ్రాసితి నం
    బా! విని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో.


    జీవిత మందు ముందుగను శ్రీకర కారిణి వంచు నమ్మి నీ
    కోవెల జేరి నీ కృపను గోరుచు పద్యము లందు వ్రాసితిన్
    బావన మైన నీ చరిత భాగ్యమటంచు దలంచి శారదాం
    బా! విని నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేడెదన్.

    రిప్లయితొలగించండి
  4. [ కవి కాళిదాసు అంతరంగము... ]

    దీవెనలిడి నాలోనన్
    జేవను సమకూర్చి కవిని జేసితి వనుచున్
    భావించుచు వ్రాసితి నం
    బా! విని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో

    భావము లెన్నియో మదిని పాదుకొనంగ వరంబులిచ్చియున్
    దీవన లంద జేసి నను తీరిచి దిద్దగ దీర్ఘ దర్శినై
    నీవర సంగ్రహమ్మనగ నేనొక కావ్యము వ్రాసి యుంటి నం
    బా! విని నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేడెదన్

    రిప్లయితొలగించండి
  5. కం:నీ విచ్చిన వాక్కు లనుచు
    గావించితి కావ్య మిద్ది కని మెచ్చ నహం
    భావము లడ్డములగు నం
    బా! విని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో”


    రిప్లయితొలగించండి
  6. ఉ:బావిని నీరు లే దనెడు బాధను దెల్పగ వ్రాసి, తాగ్రహం
    బా! వికటమ్ముగా భువికి బంపుము నీ సతి నంటి ,నా మనం
    బావిధి నుండె,నీ క్షమకె బ్రార్థన జేసెద,నెట్టు లింక సాం
    బా! విని నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేడెదన్?

    (యమకం- బావి లో నీరు లేదనే బాధతో నీ భార్య ఐన గంగని పంపు అని ఒక కవి శ్రీనాథుని శైలి లో వికటం గా వ్రాసాడు.తిరిగి పశ్చాత్తాపం చెందాడు. నువ్వు క్షమిస్తే చాలు.నా కవిత్వాన్ని మెచ్చే కవిని చూప మని ఎలా వేడుకొంటాను? అన్నాడు. )






    రిప్లయితొలగించండి