1-10-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను”
(లేదా...)
“హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో”
(న.చ. సాహిత్ శతావధానంలో శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠాధీశ్వరుల వారిచ్చిన సమస్య)
తేటగీతి నాటక కళా సమితి వారి నాటకాలురేబవళ్ళుగ సాగుచు ప్రీతి గూర్చ దూరమున్నట్టి వేదిక చేరనెంచి హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను!ఉత్పలమాల శంసనఁ జేయగన్ దరమె జంటకు నబ్బిన నాట్యవిద్య నుధ్వంసము లేని గానముల ధాటి నటింతురు రేబళ్ళు! మీమాంసనమందు గెల్వ నసమాన్యులు! బేగిని వేదిఁ జేరగన్హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో
దారను కను చుండె నలువ తావసించి హంసపై ; శంకరుఁడు వచ్చె హాయిగానువృషభమెక్కి యచట సాగు విషయ మరయ సాదరముగ నాహ్వానించె జన్యు వపుడు
(శారదా,చంద్రమౌళీశ్వరుల హంసవాహన సేవ ఊరేగింపు వైభవం చూసినంతనే కనుల నిండా భక్తి పారవశ్యంతో ఆనంద భాష్పాలు రాలుతాయని,జన్మతరిస్తుందని భావము)(ఉత్పలమాల సమస్యా పాదము కందపద్యంలో)కం.కనులుప్పొంగిజలము రాలును“ *హంసను నెక్కి* *శంకరుఁడు హాయిగ వ* *చ్చెను శారదాంబతో* ”*హ్లాదనమునవేడుకనుజూచితరియించవలెన్(హ్లాదనము= ఆనందము)
దేవ దేవుడు తిరుగాడు దేని పైన కాల కూటముద్భవ మందు పాళ మందు స్వీకరింపగ వచ్చిన వేలుపెవరు? హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను.హంస విధాత యే చెలగునందురదే విధి తెల్పు? మన్మధున్ ధ్వంస మొనర్చె నివ్వడట? తక్షణమే వచియింపు మంటి ప్రే యాంసునిగా గనన్ బిసరు హాసను డెవ్వరి తోడ నుండినో? హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో.
కంసహింసకాలయమును కన్గొనంగహంసు డరిగి హంసలదీవి హాయినొందెహంస గద్గద సహితుడై యాత్రముగియహంసపై శంకరుఁడు వచ్చె హాయిగానుహంసుని యాత్రసాగెనటనద్భుత రీతిని సుందరమ్ముగాకంసవిరోధి మందిరముఁ గన్గొన వచ్చెను నీలకంఠుడేహంసల దీవివేలుపును హాయిగ జూచి ప్రశాంతచిత్తుడైహంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో[హంస = మేరువునకు ఉత్తరమున ఉండెడు ఒక కొండ; పై = మీదుభాగము; శారదాంబ = పార్వతి]శివుడు పార్వతితో వేణుగోపాలుని ఆలయానికి హంసలదీవికి వెళ్ళి యాత్ర ముగిసే సమయంలో హంస పర్వతం మీదుగా వచ్చాడని భావము.
తే.గీ:జ్ఞానమార్గగామిని, చిన్న నాటి నుండియెంత భక్తియో శ్రీ రామ కృష్ణ పరమహంసపై! శంకరుఁడు వచ్చె హాయిగానుమాయ తొలగించి బ్రోవ నా మదికి నేడు(చిన్నతనం నుంచి శ్రీరామకృష్ణ పరమహంస అంటే భక్తి.ఈ నాడు ఆది శంకరుడు నా మదిలో ప్రవేశించాడు. ఇరువురిదీ అద్వైతమే.)
ఉ:హింసలు వెట్ట దుష్టమతహీనకుతర్కము లెల్ల,వేద విద్వాంసుల గాచ, సత్యమును బల్కగ జక్కని"సోహ" మన్న యాహంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతోధ్వంస మొనర్చ నజ్ఞతను పావన శృంగగిరిన్ వసించగన్.(సోహం అనేది అద్వైతతత్త్వం.అదే ప్రతీక గా హంస. ఆ హంస నెక్కి ఆది శంకరులు శృంగేరీ పీఠానికి వచ్చారు. )
ఉ॥ హింసను గూర్చె నేర్తునని యెల్మినిఁ జూపి విదేశ పౌరుఁడేధ్వంసముఁ జేయఁ దెల్పినది తాల్మిని బ్రహ్మకు వాహనమ్మనన్హంసయె భార్య వాణి యని యన్నను విస్మృతిఁ గాంచి పల్కెనే!హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో(కొంతమంది విదేశీయులు భారత సంస్కృతిపై ఆకర్షితులై వచ్చి ఉండిపోతారండి. అలాంటి ఒక విదేశీయుడు వచ్చిన క్రొత్తలో పడిన తికమక)
వెండి కొండ పైనుండి ఘనుండు నాగభూషణుండు త్రినేత్రుండు మోద మలర హరుఁడు హింసింపకయు సుంత యంత వృషభ హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను [వృషభ హంస = వృషభ శ్రేష్ఠము] హింసను నొల్లకున్న సృజియించిన దుష్టుని బాలవైరి నాకంసుని శంకరుం డన సుఖమ్ము లొసంగెడి వాఁడు బ్రహ్మ మీమాంస నెడంద నూనకు ప్రమాదము లేదు తలంప నవ్విధిన్ హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో
వేంకటేశ్వరుఁ బెండ్లికి వేగ వచ్చెపలుకుతొయ్యలితో గూడి పద్మభవుఁడుహంసపై, శంకరుఁడు వచ్చె హాయిగానునంది వాహనారూఢుఁడై నగజఁ గూడి
తేటగీతి
రిప్లయితొలగించండినాటక కళా సమితి వారి నాటకాలు
రేబవళ్ళుగ సాగుచు ప్రీతి గూర్చ
దూరమున్నట్టి వేదిక చేరనెంచి
హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను!
ఉత్పలమాల
శంసనఁ జేయగన్ దరమె జంటకు నబ్బిన నాట్యవిద్య ను
ధ్వంసము లేని గానముల ధాటి నటింతురు రేబళ్ళు! మీ
మాంసనమందు గెల్వ నసమాన్యులు! బేగిని వేదిఁ జేరగన్
హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో
దారను కను చుండె నలువ తావసించి
రిప్లయితొలగించండిహంసపై ; శంకరుఁడు వచ్చె హాయిగాను
వృషభమెక్కి యచట సాగు విషయ మరయ
సాదరముగ నాహ్వానించె జన్యు వపుడు
(శారదా,చంద్రమౌళీశ్వరుల హంసవాహన సేవ ఊరేగింపు వైభవం చూసినంతనే కనుల నిండా భక్తి పారవశ్యంతో ఆనంద భాష్పాలు రాలుతాయని,జన్మతరిస్తుందని భావము)
రిప్లయితొలగించండి(ఉత్పలమాల సమస్యా పాదము కందపద్యంలో)
కం.
కనులుప్పొంగిజలము రా
లును“ *హంసను నెక్కి* *శంకరుఁడు హాయిగ వ*
*చ్చెను శారదాంబతో* ”*హ్లా
దనమునవేడుకనుజూచితరియించవలెన్
(హ్లాదనము= ఆనందము)
రిప్లయితొలగించండిదేవ దేవుడు తిరుగాడు దేని పైన
కాల కూటముద్భవ మందు పాళ మందు
స్వీకరింపగ వచ్చిన వేలుపెవరు?
హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను.
హంస విధాత యే చెలగునందురదే విధి తెల్పు? మన్మధున్
ధ్వంస మొనర్చె నివ్వడట? తక్షణమే వచియింపు మంటి ప్రే
యాంసునిగా గనన్ బిసరు హాసను డెవ్వరి తోడ నుండినో?
హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో.
కంసహింసకాలయమును కన్గొనంగ
రిప్లయితొలగించండిహంసు డరిగి హంసలదీవి హాయినొందె
హంస గద్గద సహితుడై యాత్రముగియ
హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను
హంసుని యాత్రసాగెనటనద్భుత రీతిని సుందరమ్ముగా
కంసవిరోధి మందిరముఁ గన్గొన వచ్చెను నీలకంఠుడే
హంసల దీవివేలుపును హాయిగ జూచి ప్రశాంతచిత్తుడై
హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో
[హంస = మేరువునకు ఉత్తరమున ఉండెడు ఒక కొండ;
పై = మీదుభాగము; శారదాంబ = పార్వతి]
శివుడు పార్వతితో వేణుగోపాలుని ఆలయానికి హంసలదీవికి వెళ్ళి
యాత్ర ముగిసే సమయంలో హంస పర్వతం మీదుగా వచ్చాడని భావము.
తే.గీ:జ్ఞానమార్గగామిని, చిన్న నాటి నుండి
రిప్లయితొలగించండియెంత భక్తియో శ్రీ రామ కృష్ణ పరమ
హంసపై! శంకరుఁడు వచ్చె హాయిగాను
మాయ తొలగించి బ్రోవ నా మదికి నేడు
(చిన్నతనం నుంచి శ్రీరామకృష్ణ పరమహంస అంటే భక్తి.ఈ నాడు ఆది శంకరుడు నా మదిలో ప్రవేశించాడు. ఇరువురిదీ అద్వైతమే.)
ఉ:హింసలు వెట్ట దుష్టమతహీనకుతర్కము లెల్ల,వేద వి
రిప్లయితొలగించండిద్వాంసుల గాచ, సత్యమును బల్కగ జక్కని"సోహ" మన్న యా
హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో
ధ్వంస మొనర్చ నజ్ఞతను పావన శృంగగిరిన్ వసించగన్.
(సోహం అనేది అద్వైతతత్త్వం.అదే ప్రతీక గా హంస. ఆ హంస నెక్కి ఆది శంకరులు శృంగేరీ పీఠానికి వచ్చారు. )
ఉ॥ హింసను గూర్చె నేర్తునని యెల్మినిఁ జూపి విదేశ పౌరుఁడే
రిప్లయితొలగించండిధ్వంసముఁ జేయఁ దెల్పినది తాల్మిని బ్రహ్మకు వాహనమ్మనన్
హంసయె భార్య వాణి యని యన్నను విస్మృతిఁ గాంచి పల్కెనే!
హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో
(కొంతమంది విదేశీయులు భారత సంస్కృతిపై ఆకర్షితులై వచ్చి ఉండిపోతారండి. అలాంటి ఒక విదేశీయుడు వచ్చిన క్రొత్తలో పడిన తికమక)
వెండి కొండ పైనుండి ఘనుండు నాగ
రిప్లయితొలగించండిభూషణుండు త్రినేత్రుండు మోద మలర
హరుఁడు హింసింపకయు సుంత యంత వృషభ
హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను
[వృషభ హంస = వృషభ శ్రేష్ఠము]
హింసను నొల్లకున్న సృజియించిన దుష్టుని బాలవైరి నా
కంసుని శంకరుం డన సుఖమ్ము లొసంగెడి వాఁడు బ్రహ్మ మీ
మాంస నెడంద నూనకు ప్రమాదము లేదు తలంప నవ్విధిన్
హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో
వేంకటేశ్వరుఁ బెండ్లికి వేగ వచ్చె
రిప్లయితొలగించండిపలుకుతొయ్యలితో గూడి పద్మభవుఁడు
హంసపై, శంకరుఁడు వచ్చె హాయిగాను
నంది వాహనారూఢుఁడై నగజఁ గూడి