6, అక్టోబర్ 2026, మంగళవారం

సమస్య - 5612

7-10-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాక్షసహితుఁడగు శ్రీరాముఁ డొగిన్”

(లేదా...)

“రాక్షసలోకమిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే”

(న.చ. సాహిత్ శతావధానంలో బోరెల్లి హర్ష సమస్య)

17 కామెంట్‌లు:

  1. కందము
    దారికి రాడను రావణు
    బారిన పడకుండ విడి యభయమున్ గోరన్
    కూరిమి విభీషణుండటఁ
    జేరిన రాక్షస హితుఁడగు శ్రీరాముఁ డొగిన్!

    శార్దూలవిక్రీడితము
    సాగన్ బోవక వైరి మార్గమున కంజాక్షిన్ రమా రూపిణిన్
    వేగన్ రాముని జేర్చ సేమమనినన్ వేరెంచెడున్ సోదరున్
    బేగిన్ వీడి విభీషణుండభయముున్ వెన్నంటి నాశించుచున్
    దాగన్రాక్షస లోకమిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే!

    రిప్లయితొలగించండి
  2. రామస్ససహజో నిత్యం పార్థివం సమపూజయత్ ।
    భస్మ రుద్రాక్షధారీ చ విరజాగమమాస్థితః
    (రాముడు నిత్యం పార్థివ శివలింగాన్ని పూజిస్తూ, భస్మం మరియు రుద్రాక్షలు ధరించి, విరజాగమ విధానాన్ని అనుసరించినాడు)
    అనే శ్లోకాన్ని అనుసరించి రుద్రాక్ష సహిత రామస్తుతి

    కం.
    నీరజనాభుడు రిపు సం
    హారముజేసినమనుష్యునవతారమునన్
    కోరిహరునిపూజించెను
    శ్రీరుద్రాక్ష సహితుడగు శ్రీరాముడొగిన్*!

    రిప్లయితొలగించండి

  3. *(త్రిజట స్వప్న వృత్తాంత మని సీతకు చెప్పినట్లుగా)*

    ఈరస మందున నగ్రజు
    డా రావణుడు వెలివేసి నంతట దాపున్
    గోరుచు విభీషణుడు దరి
    చేరగ, రాక్షసహితుఁడగు శ్రీరాముఁ డొగిన్.


    అకటా యంచు వచించె నా త్రిజట సత్యంబంచు తా నప్పుడున్
    వికచాబ్జా నన యాలకించు నృపునే వేటాడి పృథ్వీశు గా
    ప్రకటించున్ గద ధర్మ మూర్తినిక నీరాముండనిన్ జెప్పె సీ
    తకు, నా రాక్షసలోకమిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే.

    రిప్లయితొలగించండి
  4. అవనిజను పెండ్లి యాడగ
    భవసాగర మీదుటకయి భజనము జేసెన్
    శివునికి బ్రీతిక రమయిన
    శివరుద్రాక్ష సహితుఁడగు శ్రీరాముఁ డొగిన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. [ హనుమంతుడు లంకలో రావణునితో...]

      జనకుని గాదిలి పట్టిని
      తన నెచ్చెలి నపహరించి తప్పిదమొన రిం
      చిన మూర్ఖుడవు శరణు జొ
      చ్చినయెడఁ రాక్షస!హితుఁడగు శ్రీరాముఁ డొగిన్

      దురహంకారముతోడ సీత నిటకున్ దోడ్కొంటివే రావణా!
      పొరపాటేనని సమ్మతించి వడిగా భూపుత్రినర్పింపుమా!
      కరుణా సాగరు డాతడే! ప్రజవితో కయ్యంబునన్ నిల్వ నీ
      తరమా రాక్షస! లోకమిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే

      తొలగించండి
  6. కం॥ అరయఁగ శాపవశమ్మున
    వరలఁగ దనుజులుగ ధరను వారలఁ దునిమెన్
    దరిఁ జేర్చుకొన గ్రహించితి
    స్థిరముగ రాక్షస హితుఁడగు శ్రీరాముఁ డొగిన్

    మ॥ స్థిరమౌ ప్రజ్ఞను బొంది సాగుచును సందేహమ్ములన్ దీర్చుచున్
    బరఁగన్ విజ్ఞులు నంతరార్థమును శాపగ్రస్తులన్ ద్రుంచుటన్
    గరపన్ గాంచితి విష్ణు తత్వమును వక్కాణింతు స్పష్టమ్ముగన్
    ధరలో రాక్షస లోకమిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే!

    (రాముడు శాపగ్రస్తులైన రాక్షసులను గూల్చి వారికి ముక్తి కలిగించినందున రాక్షస మిత్రుడని చెప్పగలము కదండి)

    రిప్లయితొలగించండి
  7. కం: శ్రీరాముని నసురారిగ
    నే రచనల జూప నేల హింసాదూరుం
    డౌ రావవణా నుజుని నతి
    చే రాక్షసహితుఁడగు శ్రీరాముఁ డొగిన్”
    (శ్రీ రాముణ్ని రాక్షసాంతకుడిగానే చిత్రించటం న్యాయం కాదు.హింసా దూరుడైతే రావణుని తమ్మునికి కూడా హితుడే అయ్యాడు. )





    రిప్లయితొలగించండి
  8. 2)శా:నీమమ్ముల్ విడనాడి జానకిని కన్నీటన్ గడున్ ముంచి శ్రీ
    రామున్ గాసిల జేసినావు గద యో రాజన్య! నీ భ్రాత నై
    సేమమ్మున్ వచియించుచుంటి వడిగా సీతన్ విడన్ మేలు భ్రా
    తా! మా రాక్షసలోకమిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే”

    రిప్లయితొలగించండి
  9. నరవరులను హింసింపం
    గ ఋషి వరేణ్యులఁ గడింది కాఱియ వెట్టన్
    ధరణిజ కొసఁగ వెతలు సు
    స్థిరం బరాక్షస హితుఁడగు శ్రీరాముఁ డొగిన్


    మరణాంతమ్ములు వైరముల్ పుడమి నా మన్నించి కాకుత్స్థుఁడే
    శరణం బెల్లర కీయ రక్కసుల కాశ్చర్యమ్ముగా సాయ మా
    హరి సందోహ మిడన్ విభీషణుఁడు రాజ్యం బేలు చుండంగ నా
    ధరలో రాక్షస లోక మిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే

    రిప్లయితొలగించండి
  10. కందం:
    సురలైన నసురులైనను
    శరణము గోరినను గాచి సంరక్షించున్
    శరణని యసురుఁడు మోడ్చిన
    శిరమును రాక్షస హితుఁడగు శ్రీరాముఁ డొగిన్

    మత్తేభము:
    సురలైనన్ పొలదిండులైన శరణంచున్ వేఁడ శ్రీరామునిన్
    కరుణన్ భేదనమెంచకన్ మదిని సంకాశమ్ముగా గాఁచు, నా
    సురుడైనన్ దశకంఠు సోదరు కృపన్ జూచెన్ విధేయజ్ఞుగా
    ధరలో రాక్షసలోకమిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆ రావణుడు వినడనుచు
    కూరిమిని విభీషణుండు కోరుచు నభయం
    బా రాముని సన్నిధికిన్
    జేరగ రాక్షస హితుడగు శ్రీరాముఁ డొగిన్.

    రిప్లయితొలగించండి
  12. అవివేకమ్మున మౌని పుంగవుల నత్యంతమ్ము బాధించుచున్
    భువి వారిచ్చిన శాపముల్ కతన నుద్భూతమ్మునై, క్రోధ మొం
    ది విషాదమ్ముల కల్గజేయ, హరి పృథ్విన్ బుట్టె దైత్యాళి, యీ
    అవనిన్ రాక్షసలోకమిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే

    రిప్లయితొలగించండి