16, అక్టోబర్ 2026, శుక్రవారం

సమస్య - 5622

17-10-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట”

(లేదా...)

“దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో”

(న.చ. సాహిత్ శతావధానంలో మరుమాముల దత్తాత్రేయ శర్మ గారి సమస్య)

14 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ధర్మవిగ్రహమ్మని భువి దాశరథిని
    పల్లె పల్లెను నాలయాలెల్లగట్టి,
    మ్రొక్కు బాబాలనగ రామమూర్తి మించు
    దేవుఁడే లేఁడనుచు, నేల దేవులాట?

    మత్తకోకిల
    ప్రోవు వాడని పల్లె పల్లెను మ్రొక్కనెంచఁగ రామునిన్
    తావులుండగ నాలయాలుగ ధర్మమూర్తికి కోట్లుగన్
    జావిడీలను మాయఁజేసెడు స్వాములుండగ వారిలో
    దేవుఁ డేలనొ లేకపోయెను! దేవులాట లిఁకేలనో!

    రిప్లయితొలగించండి
  2. కష్టముల నుండి మనలను గాపుగాయు
    దేవుఁడే లేఁడనుచు ; నేల దేవులాట
    యిడుము నందు సాయపడెడి హితునికొరకు ?
    తెలియనగు నట్టి యాప్తుడే దేవుడనుచు

    రిప్లయితొలగించండి
  3. బావులు చెరువులు మరియు పంటలెండె
    వానలు కురియ కుండుట వాస్తవమ్ము
    నీలి మబ్బుకై చూడకు నింగివంక
    దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట

    బావు లెండెను చెర్వులెండెను వానలే కనరావులే
    రావు రావని చెప్పుచుండిరి రావులే మరి వానలే
    నీవు చూడకు మాటిమాటికి నింగిలో కరిమబ్బుకై
    దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో

    [ దేవుడు = మేఘుఁడు ]

    రిప్లయితొలగించండి

  4. భర్తృహీనయె మామతో పలికె నిటుల
    భోగ భాగ్యాల కోసమై పూజ లేల
    పూజ నీయుండయిన ప్రేమ మూర్తి నాదు
    దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట.


    శ్రావణమ్ము పవిత్ర మాసము సౌభగమ్మును గోరుచున్
    కోవెలన్ జని కొల్వుమంచన కోడలిట్లనె మామతో
    జీవితేశుని జేర బోయెను చెల్వుడెప్పుడొ కాదె నా
    దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో.

    రిప్లయితొలగించండి
  5. మత్తకోకిల:
    నీవు నాస్తికవాది నందువు నిత్యముక్తుని నమ్మవే
    దేవళమ్మున కేగవెన్నఁడు దేవునిన్ స్మరియించవే
    రావడిన్ కుసిలించునప్పుడు రామునిన్ తలపోతువే
    దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో

    రిప్లయితొలగించండి
  6. దైవమును నమ్మవెన్నఁడు దలచుకొనవు
    మూఢభక్తి యనందువు పూజసేయ
    రావడిని మ్రొక్కి గొలుతువు రామునేల?
    దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట

    రిప్లయితొలగించండి
  7. తే॥ తర్కమును నరసింహయ్య తలఁచి నిలిపి
    శాస్త్ర గతి హేతువాదపు సరళి పరఁగ
    జనులకు తెలియఁ జెప్పుదమనుచు పలికె
    దేవుఁడే లేఁడనుచు, నేల దేవులాట

    (ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య గారు దేవుడు లేడని అనలేదండి. కాని మేము భగవంతులము అని miracles చేస్తున్న విషయము పైన వారు బెంగుళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి గా ఉన్నపుడు శాస్త్రజ్ఞుల సహాయంతో ‘The Scientific Investigation of the Miracles’ ప్రారంభించారు. కాకపోతే అది ముందుకు సాగలేదండి)

    మత్త॥ భావకుండగు హేతు వాదిగ పల్కె నిట్టుల సాధనన్
    జీవితమ్మిల నొప్పుఁ దప్పకఁ జేతనా ధృతి మోదమౌ
    భావి పౌరుల కిద్ది సూత్రము బద్ధులై చనఁ దెల్పఁగన్
    దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాటలిఁ కేలనో

    (నాస్తికులలో స్వంత కష్టము నమ్ముకొని పైకి వచ్చే హేతువాదులుంటారండి. ఆస్తికులైన సాధన కష్టము తప్పదు. దానికి తోడు దైవ ప్రార్థన ధైర్యము కలుగజేస్తుంది)

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:ధ్యాన మొనరించు నట్టి యద్వైతి తోడ
    ద్వైతి యిట్లనె " నేనె యా బ్రహ్మము "నని
    బలికితివి కదా ! నిన్ మించు పరము డైన
    దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట
    (అద్వైతి అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతం మాట్లాడాడు. నీవె బ్రహ్మం అని చెప్పుకొన్నాక దేన్ని వెతుకుతూ ధ్యానం చేస్తున్నావు? అని ద్వైతి ఎక్కిరించాడు.)

    రిప్లయితొలగించండి
  9. ఉ:దైవమౌ రఘురాముడే తన త్రాత యౌ నను భక్తి తో
    దైవమున్ భజియించు గోపన తల్చు రీతిని తానిషా
    సేవకుల్ గమనించి హాస్యము జేసి రిట్టుల రాముడన్
    దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో!
    (తానీషా సేవకులు మహ్మదీయులు. రాముణ్ని దేవు డంటే నమ్మరు. రాము డనే దేవుడే లేడయ్యా! ఇంకా దేవులాడతా వెందుకు? అని పోలీసులు దొంగని గేలి చేసే పద్ధతి లో గేలి చేసారు. )




    రిప్లయితొలగించండి
  10. లోన యున్నఁ జూడ నగునె మానసమ్ము
    గాలి యున్నను లోకుల కంటఁ బడునె
    కాన కేరికిఁ దా నిలఁ గాచుచుండు
    దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట


    ప్రోవులై వెత లుండ నిత్యము భూమిపైఁ గనఁ డెన్నఁడుం
    గావు మంచును మ్రొక్కు వారికిఁ గాన రాడిల నెన్నఁడున్
    సేవ లంచును దోఁచు చుండినఁ జింత నందఁడె యెన్నఁడున్
    దేవుఁ డేలనొ లేక పోయెను దేవులాట లిఁకేలనో

    రిప్లయితొలగించండి
  11. ఎంత శ్రమియించి నన్ గాని సుంత యైన
    ఫలిత మీయని వాడౌచు పావనంపు
    దేవు డే లేడనుచు నేల దే వు లాట
    చేయ బో వకమసలు టే శ్రే ష్ట మగును

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కంటి రెప్పల వోలెను కాచు తల్లి
    కష్టపడి పోషణము చేయు కన్న తండ్రి
    దైవ సములని తెలిసియు తల్లి,తండ్రి
    దేవుడే లేడనుచు నేల దేవులాట?

    రిప్లయితొలగించండి
  13. ఆరయ నారాయణు నే
    క్షి రాబ్ది సుత మనువాడె : శివుని ముదముతో
    కోరి తపంబున పతి గా
    వారిజ నేత్రయు వరించె వలచియు సుకవీ!

    రిప్లయితొలగించండి