తే॥ తర్కమును నరసింహయ్య తలఁచి నిలిపి శాస్త్ర గతి హేతువాదపు సరళి పరఁగ జనులకు తెలియఁ జెప్పుదమనుచు పలికె దేవుఁడే లేఁడనుచు, నేల దేవులాట
(ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య గారు దేవుడు లేడని అనలేదండి. కాని మేము భగవంతులము అని miracles చేస్తున్న విషయము పైన వారు బెంగుళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి గా ఉన్నపుడు శాస్త్రజ్ఞుల సహాయంతో ‘The Scientific Investigation of the Miracles’ ప్రారంభించారు. కాకపోతే అది ముందుకు సాగలేదండి)
ఉ:దైవమౌ రఘురాముడే తన త్రాత యౌ నను భక్తి తో దైవమున్ భజియించు గోపన తల్చు రీతిని తానిషా సేవకుల్ గమనించి హాస్యము జేసి రిట్టుల రాముడన్ దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో! (తానీషా సేవకులు మహ్మదీయులు. రాముణ్ని దేవు డంటే నమ్మరు. రాము డనే దేవుడే లేడయ్యా! ఇంకా దేవులాడతా వెందుకు? అని పోలీసులు దొంగని గేలి చేసే పద్ధతి లో గేలి చేసారు. )
తేటగీతి
రిప్లయితొలగించండిధర్మవిగ్రహమ్మని భువి దాశరథిని
పల్లె పల్లెను నాలయాలెల్లగట్టి,
మ్రొక్కు బాబాలనగ రామమూర్తి మించు
దేవుఁడే లేఁడనుచు, నేల దేవులాట?
మత్తకోకిల
ప్రోవు వాడని పల్లె పల్లెను మ్రొక్కనెంచఁగ రామునిన్
తావులుండగ నాలయాలుగ ధర్మమూర్తికి కోట్లుగన్
జావిడీలను మాయఁజేసెడు స్వాములుండగ వారిలో
దేవుఁ డేలనొ లేకపోయెను! దేవులాట లిఁకేలనో!
కష్టముల నుండి మనలను గాపుగాయు
రిప్లయితొలగించండిదేవుఁడే లేఁడనుచు ; నేల దేవులాట
యిడుము నందు సాయపడెడి హితునికొరకు ?
తెలియనగు నట్టి యాప్తుడే దేవుడనుచు
బావులు చెరువులు మరియు పంటలెండె
రిప్లయితొలగించండివానలు కురియ కుండుట వాస్తవమ్ము
నీలి మబ్బుకై చూడకు నింగివంక
దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట
బావు లెండెను చెర్వులెండెను వానలే కనరావులే
రావు రావని చెప్పుచుండిరి రావులే మరి వానలే
నీవు చూడకు మాటిమాటికి నింగిలో కరిమబ్బుకై
దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో
[ దేవుడు = మేఘుఁడు ]
రిప్లయితొలగించండిభర్తృహీనయె మామతో పలికె నిటుల
భోగ భాగ్యాల కోసమై పూజ లేల
పూజ నీయుండయిన ప్రేమ మూర్తి నాదు
దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట.
శ్రావణమ్ము పవిత్ర మాసము సౌభగమ్మును గోరుచున్
కోవెలన్ జని కొల్వుమంచన కోడలిట్లనె మామతో
జీవితేశుని జేర బోయెను చెల్వుడెప్పుడొ కాదె నా
దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో.
మత్తకోకిల:
రిప్లయితొలగించండినీవు నాస్తికవాది నందువు నిత్యముక్తుని నమ్మవే
దేవళమ్మున కేగవెన్నఁడు దేవునిన్ స్మరియించవే
రావడిన్ కుసిలించునప్పుడు రామునిన్ తలపోతువే
దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో
దైవమును నమ్మవెన్నఁడు దలచుకొనవు
రిప్లయితొలగించండిమూఢభక్తి యనందువు పూజసేయ
రావడిని మ్రొక్కి గొలుతువు రామునేల?
దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట
తే॥ తర్కమును నరసింహయ్య తలఁచి నిలిపి
రిప్లయితొలగించండిశాస్త్ర గతి హేతువాదపు సరళి పరఁగ
జనులకు తెలియఁ జెప్పుదమనుచు పలికె
దేవుఁడే లేఁడనుచు, నేల దేవులాట
(ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య గారు దేవుడు లేడని అనలేదండి. కాని మేము భగవంతులము అని miracles చేస్తున్న విషయము పైన వారు బెంగుళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి గా ఉన్నపుడు శాస్త్రజ్ఞుల సహాయంతో ‘The Scientific Investigation of the Miracles’ ప్రారంభించారు. కాకపోతే అది ముందుకు సాగలేదండి)
మత్త॥ భావకుండగు హేతు వాదిగ పల్కె నిట్టుల సాధనన్
జీవితమ్మిల నొప్పుఁ దప్పకఁ జేతనా ధృతి మోదమౌ
భావి పౌరుల కిద్ది సూత్రము బద్ధులై చనఁ దెల్పఁగన్
దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాటలిఁ కేలనో
(నాస్తికులలో స్వంత కష్టము నమ్ముకొని పైకి వచ్చే హేతువాదులుంటారండి. ఆస్తికులైన సాధన కష్టము తప్పదు. దానికి తోడు దైవ ప్రార్థన ధైర్యము కలుగజేస్తుంది)
తే.గీ:ధ్యాన మొనరించు నట్టి యద్వైతి తోడ
రిప్లయితొలగించండిద్వైతి యిట్లనె " నేనె యా బ్రహ్మము "నని
బలికితివి కదా ! నిన్ మించు పరము డైన
దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట
(అద్వైతి అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతం మాట్లాడాడు. నీవె బ్రహ్మం అని చెప్పుకొన్నాక దేన్ని వెతుకుతూ ధ్యానం చేస్తున్నావు? అని ద్వైతి ఎక్కిరించాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:దైవమౌ రఘురాముడే తన త్రాత యౌ నను భక్తి తో
రిప్లయితొలగించండిదైవమున్ భజియించు గోపన తల్చు రీతిని తానిషా
సేవకుల్ గమనించి హాస్యము జేసి రిట్టుల రాముడన్
దేవుఁ డేలనొ లేకపోయెను దేవులాట లిఁకేలనో!
(తానీషా సేవకులు మహ్మదీయులు. రాముణ్ని దేవు డంటే నమ్మరు. రాము డనే దేవుడే లేడయ్యా! ఇంకా దేవులాడతా వెందుకు? అని పోలీసులు దొంగని గేలి చేసే పద్ధతి లో గేలి చేసారు. )
లోన యున్నఁ జూడ నగునె మానసమ్ము
రిప్లయితొలగించండిగాలి యున్నను లోకుల కంటఁ బడునె
కాన కేరికిఁ దా నిలఁ గాచుచుండు
దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట
ప్రోవులై వెత లుండ నిత్యము భూమిపైఁ గనఁ డెన్నఁడుం
గావు మంచును మ్రొక్కు వారికిఁ గాన రాడిల నెన్నఁడున్
సేవ లంచును దోఁచు చుండినఁ జింత నందఁడె యెన్నఁడున్
దేవుఁ డేలనొ లేక పోయెను దేవులాట లిఁకేలనో
ఎంత శ్రమియించి నన్ గాని సుంత యైన
రిప్లయితొలగించండిఫలిత మీయని వాడౌచు పావనంపు
దేవు డే లేడనుచు నేల దే వు లాట
చేయ బో వకమసలు టే శ్రే ష్ట మగును
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కంటి రెప్పల వోలెను కాచు తల్లి
కష్టపడి పోషణము చేయు కన్న తండ్రి
దైవ సములని తెలిసియు తల్లి,తండ్రి
దేవుడే లేడనుచు నేల దేవులాట?
ఆరయ నారాయణు నే
రిప్లయితొలగించండిక్షి రాబ్ది సుత మనువాడె : శివుని ముదముతో
కోరి తపంబున పతి గా
వారిజ నేత్రయు వరించె వలచియు సుకవీ!