tag:blogger.com,1999:blog-6769183920316093900.post1249924449696421858..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: స్వాగతాంజలికంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-92168487174284772852017-05-06T17:15:21.233+05:302017-05-06T17:15:21.233+05:30ప్రత్యుత్తరం
NAGAMANI PUSAPATIమార్చి 29, 2017 6:44...ప్రత్యుత్తరం
NAGAMANI PUSAPATIమార్చి 29, 2017 6:44 AM

శ్రీ వినాయక

హేవిళంబి ఉగాది పద్య మాల
తే: చైత్ర మాసంపు చెంగావి చీర కట్టి,
కంచుకమ్ము వైశాఖమ్ము ఎంచి ఈయ,
జ్వేష్ట ఆషాడ మాసంబు లిష్ట పడుచు
గాజుగమ్ములై ముంజేల కాంతులిడగ,

తే: శ్రావణపు కుంకుమ నుదుట సౌఖ్య మీయ,
భాద్రపదపు ముక్కెర నీకు భాగ్య మిడగ,
కర్ణములకు ఆశ్వయిజము కార్తికములు
కమ్మలై శోభ నంబుగా అమరి పోవ,

తే: మార్గశిరము కంఠమ్మున హారమొసగ
పుష్య మాసమ్ము పాపట పొంత చేర,
పసిడి బిళ్ళతో జడమిసమిసలుగొలుప
మాఘ ఫాల్గుణ మాసముల్ నీ ఘనమగు

తే: చరణ దోయికి గజ్జెలై శిరము వంచ,
ప్రతి పదాది తిధుల పూలబాట నడుమ,
అశ్వనీ తారకలు శ్వేత హయము లన్ని
ఆరు రుతువుల బంగరు తేరు నడుప

తే: పుల్ల మావుల సిగ్గు దోబూచులాడ,
వేప పూచిరు నగవుల్ విందు చేయ
ఉదయ భానుని కిరణాలు సుందరముగ
భువికి చేరు సమయమున హేవిళంబి

తే: కన్నియా వచ్చుచుంటివా కాంతు లిడుచు
తెలుగు ప్రజలకు ఘనముగ మేలు చేయ,
తెలుపు చుంటిమి ఎల్లరం చెలిమి తోడ
స్వాగతంబులు నీకు సుస్వాగతంబు

పూసపాటి కృష్ణ సూర్య కుమార్

సాహితీ సార్వభౌములకు హేవలంబి ఉగాది శుభాకాంక్షలు
ప్రత్యుత్తరంpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9837902078036328922017-03-30T09:30:43.100+05:302017-03-30T09:30:43.100+05:30సీతాదేవిగారికి ధన్యవాదములు.సీతాదేవిగారికి ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59142767187531089162017-03-30T00:50:39.929+05:302017-03-30T00:50:39.929+05:30నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వృత్తం: వసంతమంజరి
వనజ...నూతన సంవత్సర శుభాకాంక్షలు.

వృత్తం: వసంతమంజరి

వనజనేత్రి, శుభాంగి, ఋతుపతి వచ్చుటన్ గని లజ్జ వొం
ది నును జెక్కిట జేరిన పసను దెచ్చి మావి చివుళ్ళ పై
ననువు గా ననురాగము నెఱయ నద్దెనా? మధు భావ ధూ
ననము దెచ్చియు కొమ్మల నటుల నల్లనల్లగ నూపి యౌ
వనపు సుందర కాంతుల వలపు వాసనల్ పువులందు పా
తినదియేమొ? వసంతసఖుడట తెంపసేసియు గూర్పగన్
ధనువు, కోకిల కూజిత మృదు సుధా తరంగ సునాద మే
తనదు గొంతుక పాడగ పరభృతమ్ము గూడను నేర్చె నే
మొ? నెట జూచిన బంగరు రమ సముల్లసిల్ల దిసించెనే
కనక ధారల జల్లుచు కలిమి కన్య మాయమ వచ్చెనో?Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80263675682768933312017-03-29T22:01:19.305+05:302017-03-29T22:01:19.305+05:30డా.పిట్టా
మేలునుగన్న దుర్ముఖి, నిమీలిత నేత్రకు వంద...డా.పిట్టా
మేలునుగన్న దుర్ముఖి, నిమీలిత నేత్రకు వందనమ్ము నీ
సాలుకు సంస్కృతిన్ గొలుచు చక్కని మేళన మీయ బమ్మెరన్
సాలుకు సాలు సాగెడిని సత్కృతి పోతన పద్య శోభకున్
పూలను గూర్చు సత్కవుల పూజలవశ్యము హేవళంబినిన్ 6

పాలన బంచు ముఖ్యు కనుపాపల క్రిందనె నీతిబాహ్యపుం
హేలలు నుండ నోపు మతి హీనుల కియ్యది పాటి ,వారికిన్
గాలము వేయగా నియతి గాంచెడు సత్వర చర్యలెన్నగా
శూలము ద్రిప్పు పెద్దలను చూడరె వారి సమర్థతన్ గనన్;
బేలలమైతిమీ కృపణ బృందపు టైక్యత గాచె లంచమున్ 7

ఆగదదన్ని నాళ్ళకన నార్తుడు నమ్మును గాని యేండ్లకున్
సాగని కార్యమున్నగదె సర్వులు లంచములీయబూనుటల్
మూగగ సాగునీ వచన మోహన బాసల గట్టిపెట్టగా
దాగుడుమూతలేల ప్రజదైన ధనమ్మును మ్రింగ న్యాయమే?!8

పెద్దకు ముట్టునింతయను పీడనముంగలదిందు తప్పదీ
పద్దుయటంచు నిచ్చెదరు పామర ,విజ్ఞ,విధేయులీగతిన్
గద్దియ నున్న యాతడిటు గానడు ఖ్యాతిని కర్మచారిగా
గద్దరిచేష్టలన్ సుగతి గానవు సత్యము నమ్ము మగ్రజా! 9

గట్టిగ కర్మచారులను గావునుబట్టిన(శిక్షించిన) వోట్లు రావనే
వట్టి భ్రమల్ దొలంగవలె వారును వారలకైనవారలున్
చుట్టములైన మెచ్చరది చోద్యమె పూనరు నీతి నిల్పగన్
గట్టుకుజేర్చ నీ ప్రజకు గావలె గండర గండడీయెడన్
బెట్టుకు నప్పు గూర్చితిరి పేదల పాలిట ముప్పు గాదొకో
పట్టుడు ద్రోహులన్ బహు సెబాసన నిర్వహణంపు సత్కళన్! 10

Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12840452836895084812017-03-29T21:03:41.673+05:302017-03-29T21:03:41.673+05:30డా.పిట్టా
హేవళంబి యుగాది
శ్రీకరి హేవళంబి శ్రిత శీ...డా.పిట్టా
హేవళంబి యుగాది
శ్రీకరి హేవళంబి శ్రిత శీలన శీలివి హేల హారి వ
స్తోకము జూడ నీ యుగపు ధుర్యత నీ జన మానసంబు ల
న్నేకమము జేయ స్వాగతము!నేతల బృందము నీతి నిల్ప వా
క్శ్రీకము చేతలన్ జెలగ శ్రీలు వెలుంగ తెలుంగు నేలపై 1

ఆగమ శాఖలంబొలయు నట్టిది కాదొకొ పద్య గాన మిం
దాగడకారులందరును యాకెడు పచ్చడికైన నోచరే
రాగము 'రహ్మనాంం'కితము'రాకనురోలు'ల నృత్యవాసియున్
సాగగ పోతనన్ గనిన సౌరభమేది తెలుంగు నేలకున్?! 2

పాటుకు వోటుకున్ బొసగు పద్ధతి యెచ్చట మాట తీరునన్
వ్రేటును వేసి లాగు మిష వీసముకున్ గొరగాని వేళ జం
ఝాటమె గెల్వ బూనుమతి జాతిని నెత్తిన నెత్తుకొంచు నా
ర్భాటము సల్ప నీయకుము బంగరు బాటలు వేయ నుర్వినిన్ 3

పత్రికలెల్ల జూచునవె బాసటగా సరి నిల్చు ధోరణిన్
ఆత్రము నాత్ర మా గడుల(కాలమ్స్)నందముగా మలచంగ న్యాయమే?
సూత్ర విహీన గాలిపట సోయగ మెట్టిది దంభ జీవికన్
గాత్రము విప్ప నీతినిట గైకొను వారలె లేరు విజ్ఞతన్ 4

గాలి విమర్శకే భయము?గాంచ విశక్ష సతర.క ధోరణుల్
లీలగ దేల్చనిండు పరులే తగ వెన్నును జూడ నిక్కమీ
పాలన రక్తి గట్టును యపాయము లేదవకాశ మీయగా
చాలునవజ్ఞ లెల్లెడల సామమునందెదుగంగ భావ్యమౌ! 5Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27998680640027044392017-03-29T18:25:58.166+05:302017-03-29T18:25:58.166+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65950424325583828812017-03-29T16:19:53.738+05:302017-03-29T16:19:53.738+05:30పంచెదరు షడ్రుచులుగల
పంచామృతమది యుగాది పచ్చడి మరియు...పంచెదరు షడ్రుచులుగల
పంచామృతమది యుగాది పచ్చడి మరియున్
పంచాంగము చదువుచు గ్రహ
సంచారము తెలుపుచుంద్రు సత్పండితులే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53235895061743655382017-03-29T15:41:51.463+05:302017-03-29T15:41:51.463+05:30మిస్సన్నగారూ ! మీ కైత లద్భుతం! వందన శతములు!🙏🙏🙏�...మిస్సన్నగారూ ! మీ కైత లద్భుతం! వందన శతములు!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79500177113481805532017-03-29T15:38:02.789+05:302017-03-29T15:38:02.789+05:30. *హేవిళంబి యుగాది*
చేరె నవవసంతమ్మిట .... *హేవిళంబి యుగాది*

చేరె నవవసంతమ్మిట శ్రీకరమ్ము
గూర్చ కాలగమనమందు కువలయముకు
చెలియ తనువున పరువాలు చేరినట్లు
ప్రకృతి కందాలె యమరెనే వాసిగాను

వెడలె దుర్ముఖి తనదారి వేగముగను
వదలి మరువరానట్టి జ్ఞాపకములిచట
వీడు కోలంచు తెలుపరే నేడు స్వాగ
తింపుమికహేవిళంబిని ధీటుగాను

కోమలరాగమందు నవకోకిల పాటల నాలకింపగన్
మామిడి పూతపూసి మధుమాసము బిల్వగ వచ్చెతానిట
న్నామని జేరవచ్చెనిట కందము లెన్నియొ తోడు దెచ్చెనా
భామను వత్సరాంగన శుభమ్ముల సంచితమౌ సహోదరిన్

వలదు విలంబమిక హే
విళంబి ముంగిటను జేరు వేళయె సుమ్మీ
పిలువుము సాదరముగ నీ
తెలుగు భువిలోన దివ్య తేజము నిలుపన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34581910654216877922017-03-29T14:25:30.832+05:302017-03-29T14:25:30.832+05:30హేవిళంబి వత్సరమా...స్వాగతం...!!
వసంతతిలకా వృత్తము...హేవిళంబి వత్సరమా...స్వాగతం...!!

వసంతతిలకా వృత్తము:
ఓ హేవిళంబిరొ మహోత్తమ మిట్టి వేళన్
మాహాత్మ్య మొప్పఁగను మాన్యతలన్ గొనన్, మే
మూహించనట్టి గతి మోదము నందఁజేయం
గోహో వసంతతిల కోద్ధృతిఁ జూప రావే!

సుగంధి వృత్తము:
మందమందమౌ సుగంధ మారుతమ్ము వీవఁగా
విందుఁగూర్చు పూవుఁదేనె వేగఁ జేకొనంగ, నా
నందమంది బంభరమ్ము నాట్యమాడి పాడఁగా
సందడింప, హేవిళంబి సంతసానఁ బ్రోచెడిన్!

మత్తకోకిలా వృత్తము:
గున్నమావి పసిండి పిందెలఁ గ్రొత్త కోర్కెల మొగ్గలన్
మిన్నయౌ సొగసుల్ ధరించియు మించినట్టులు పూవులన్
వన్నె చిన్నెల హేవిళంబిటఁ బచ్చ యంద మెలర్ప, సం
పన్నమై సను లేఁజిగుళ్ళను మత్తకోకిల మేసెగా!

ధ్రువకోకిలా వృత్తము:
కనఁగ వేడుచు మించు కోర్కెనుఁ గన్నులకుఁ దా విందొసం
గనుఁ, బసందగు వేపపూఁతల, కమ్ర నింబ తరూత్తమల్,
సునయనమ్ముల వెల్గఁజేసెడు చూతవృక్ష రసాలముల్
వనులఁ గాంచియు సంతసమ్మునఁ బాడెరా ధ్రువకోకిలల్!

మానినీ వృత్తము:
కాననమందు శుకాళి పికాళులు గారవ మొప్ప నగమ్ములపై
మే నలరంగను మేలుకొనంగను మిన్నులు ముట్టెడు మేళములన్
వీనుల విందుగ వీణియ మీట విభిన్న విధమ్ముల వించు నిఁకన్
మానినులున్ విసుమానము హెచ్చ నమంద ముదంబునుఁ బొందిరయా!

మందాక్రాంతా వృత్తము [పంచపాది]:
ప్రొద్దుల్ వోయెన్ బదమనుచుఁ బూఁబోండ్లతోఁ బోరు భర్తల్
ముద్దౌ చేఁతల్ హసనములతో ముచ్చటల్ సెప్పు బాలల్
విద్దెల్ వెల్గన్ విలువ పెరుఁగన్ విద్య బోధించు నొజ్జల్
పద్దెమ్మిందున్ స్వరచితములన్ బండితుల్ వే బఠింపన్
సుద్దుల్ వించున్ సకల జనులున్ జొక్కి రీ హేవిళంబిన్!

మాలినీ వృత్తము:
పలువుఱిట యుగాదిన్ బార్వతీశున్ రమేశున్
నలువ నెపుడుఁ గొల్వన్ నాస్తికత్వ మ్మణంగున్!
కలలు నిజము లౌచున్ గాంక్షితమ్మే ఫలింపన్
విలువలఁ గొన రారే మాలినుల్ హేవిళంబిన్!!

ఉత్పలమాలా వృత్తము:
తీయని చైత్రమాసమున దిక్కుల నామని శోభ వెల్గఁగా,
హాయియు శ్రోత్ర పేయము శుకాళి పికాళుల గానరావముల్
శ్రేయ మొసంగ, నుత్పలము శ్రేష్ఠతరమ్మగు స్వాగతమ్మిడన్,
బాయని పోఁడిమిన్ సతత వందిత రాఁగదె హేవిళంబిరో!

మంగళమహాశ్రీ వృత్తము:
మానిత యుగాది! సుసమంచిత గుణాత్మక విమర్శనము సర్వజనకోటిన్
ధ్యానవహ ధీమహిత దాతృగుణ మాత్మగత దైవకృప రక్షణము సేయన్,
జ్ఞానము భవిష్యము వికాసము ధనాప్తత సుఖాప్తతలు శాంతుల నిడంగన్,
మేనఁ గలుషాలు విడి, మీఱెడి చిరాయు విడు మెప్పుడును మంగళమహాశ్రీ!

స్వస్తి
మధురకవి గుండు మధుసూదన్మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29129986129691204542017-03-29T14:22:33.879+05:302017-03-29T14:22:33.879+05:30చాలా బాగున్నాయండీ శంకరయ్యగారూ మీ పద్యాలు! అభినందనల...చాలా బాగున్నాయండీ శంకరయ్యగారూ మీ పద్యాలు! అభినందనలు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5213859143463229392017-03-29T13:49:16.903+05:302017-03-29T13:49:16.903+05:30తలుపు నెవ్వరో తట్టిన యలికి డాయె
తెరచి చూచితి పిల్ల...తలుపు నెవ్వరో తట్టిన యలికి డాయె
తెరచి చూచితి పిల్ల తెమ్మెర యొకండు
చల్లగా నన్ను తాకిన దుల్ల మలర
మలయ మారుత వీచివా మంచి దంటి.
గడప దాటితి వాకిట నడుగు బెట్ట
సన్నగా నెవ్వరో నవ్వుచున్న సడులు
గుబురు పొదవంక జూచితి గుట్టు నెరుగ
మల్లె మొగ్గల నవ్వులు తెల్లగాను!
తోచె నల్లంత దూరాన రోచు లేవొ
లేత యెర్రని డవులుతో లీలగాను
తలను పైకెత్త సిగ్గు దొంతరలు క్రమ్మ
నెర్ర బారిన చివురుల నెలమి మావి!
ఇంతలో గుప్పుమని తాకె నింపుగాను
నాసికను కాస్త వగరౌ సువాసన యది
కొమ్మ రెమ్మల తెలి మంచు క్రమ్మి నట్లు
విరగ బూసిన యొయ్యారి వేప మొక్క.
ఉల్ల మానంద డోలిక నూయ లూగ
నెవ్వరో నన్ను కోయని యింపుగాను
పిలువ పరికించి చూచితి నలు దెసలను
మావి కొమ్మల కోయిల మాటు వేసె.
హృదయ మానంద కెరటాల నెగసి పడగ
కంటి దిక్కుల క్రొంగ్రొత్త కాంతి ఝరులు
పలు సువర్ణాల మేలిమి పట్టు చీర
ప్రకృతి పడతుక ధరియించి పరవశించె.
ఏమిటి విశేష మెల్లెడ నీ దినాన
నింత హాయియు నానంద మినుమడించె
నోహొ తెలిసిన దీ సుముహూర్త వేళ
వచ్చె వాసంతు డల్లదే వసుధ వైపు.
మలయమారుతవీచియు మల్లె మావి
వేము కోయిల క్రొవ్విరుల్ వెడలె నెదురు
స్వాగతమ్మని పిలువ వాసంత సఖుని
నేను నెదురేగి రమ్మందు నిపుడె వత్తు.

హేవిళంబి వైన హేమలంబివి యైన
భూమి జనుల కెల్ల ప్రేమ తోడ
క్షామ మీయబోకు మామంచి దానవు
క్షేమ మీయ రమ్ము చేతు నతులు.
దుర్ముఖ సమ్ముఖమ్మునను దుఃఖము సేమము చెట్టపట్టలై
మర్మ మదేమొ కాని కడు మాన్యత నొందెను, హేవిళంబిలో
ఘర్మము నోడ్చుచున్ మనకు కమ్మని తిండిని బెట్టు రైతుకున్
కర్మము కాలనీకు మని కాలమురూపగు నీశు వేడెదన్.
నూతన వత్సరం బది వినూతన శోభల వచ్చుచుండె నా
రాతలు మార్చునంచు పటు భ్రాంతిని పొందుట పాడిగాని, దా
ధాత లిఖించు వ్రాత లవి తప్పని వెన్నడు జీవితమ్మునన్
ప్రీతిని శోకసౌఖ్యముల భీతిని జెందక యొప్పు టొప్పగున్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60823041254844659102017-03-29T13:47:02.263+05:302017-03-29T13:47:02.263+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26196685395523743632017-03-29T13:46:50.509+05:302017-03-29T13:46:50.509+05:30చంద్రశేఖర్ గారూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ...చంద్రశేఖర్ గారూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిటైర్ అయాక ఖాళీయా అంటే లేదు. పోనీ ఏమైనా ఉద్ధరిస్తున్నామా అంటే అదీ లేదు.
కవిత ఝరి ఇంకిపోతోంది. మీరెలా ఉన్నారు?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89138608093018685952017-03-29T13:35:26.039+05:302017-03-29T13:35:26.039+05:30లలిత పదజాల ములతోడ లహరి వోలె
సాగె మీయది కవనమ్ము శం...లలిత పదజాల ములతోడ లహరి వోలె
సాగె మీయది కవనమ్ము శంకరార్య!
యేమి భాగ్యము మాయది యీపుడమిని
మీకు శిష్యుల మైతిమి మేము మరినిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38534409417341791992017-03-29T10:09:26.913+05:302017-03-29T10:09:26.913+05:30మిస్సన్నమిత్రమా, మీరు రిటైర్మెంట్ పుచ్చుకొన్నారా? ...మిస్సన్నమిత్రమా, మీరు రిటైర్మెంట్ పుచ్చుకొన్నారా? ఎక్కడ మీ కవితా ఝరి? అట్లాగే వసంత కిషోర్ గారూ?The Otherhttps://www.blogger.com/profile/16567911169596604958noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57908747598227136382017-03-29T10:03:45.087+05:302017-03-29T10:03:45.087+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54448814259643765612017-03-29T09:00:16.020+05:302017-03-29T09:00:16.020+05:30మంచి కవితనందించిన గురుదేవులకు నమస్సులు! నూతన సంవత్...మంచి కవితనందించిన గురుదేవులకు నమస్సులు! నూతన సంవత్సర శుభాకాంక్షలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19922314925594205162017-03-29T07:42:43.858+05:302017-03-29T07:42:43.858+05:30మనోజ్ఞకవితావసంతాన్ని దర్శింపజేసీనమీకు తెలుగువత్సరా...మనోజ్ఞకవితావసంతాన్ని దర్శింపజేసీనమీకు తెలుగువత్సరాది శుభకామనలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com