tag:blogger.com,1999:blog-6769183920316093900.post131546635726310835..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1203 (దసరా పండుగ దివ్యకాంతులను)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21067564103740144532019-09-16T19:55:06.641+05:302019-09-16T19:55:06.641+05:30ముసిముసి పెసిమిస్టు:
దిశలన్ మ్రోగెడి డప్పు నాదముల...ముసిముసి పెసిమిస్టు:

దిశలన్ మ్రోగెడి డప్పు నాదములతో దీదీదిదౌ వంగనున్
విసుగున్ దీర్చెడి దుర్గమాయి కిడునా వీడ్కోలుతో సాగగా
దసరా పండుగ;...దివ్యకాంతులను సంధానించె దీపావళిన్
ముసుగుల్ తీసిన క్రొవ్వువత్తు లిచటన్ ముమ్మారు లార్పోవుచున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88182138042783696642013-10-14T21:25:06.927+05:302013-10-14T21:25:06.927+05:30గురువర్యులకు నమస్కారములు, ప్రయత్నం చేసాను తప్పులుం...గురువర్యులకు నమస్కారములు, ప్రయత్నం చేసాను తప్పులుంటే సరిచేయగలరని మనవి.

విసుగే చెందక సింహవాహినిగ నీ విశ్వాన్ని రక్షించగన్
కసితో దైత్యుని రూపుమాపి సుఖముల్ గల్గించ పోరాడె నీ
వసుధన్ లోకులు వేడుకల్ జరుపగా భాసిల్లె ప్రత్యూషమై
దసరా పండుగ, దివ్య కాంతులను సంధానించె దీపావళిన్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40942365866088840692013-10-14T09:18:54.391+05:302013-10-14T09:18:54.391+05:30ముసిరెన్ మేఘములెల్లచోటులదిగో పుష్పించె చేమంతులున్
...ముసిరెన్ మేఘములెల్లచోటులదిగో పుష్పించె చేమంతులున్
పసివాండ్రున్ సరి యెల్లవారలకునిప్పర్వంబులిప్పట్టునన్
కొసరౌ సంతసమిచ్చె;నిట్లిచట మేఘుండంత నివ్వెన్నెలన్
దసరా పండుగ దివ్యకాంతులను, సంధానించె దీపావళిన్.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44807276779822273762013-10-14T08:38:54.106+05:302013-10-14T08:38:54.106+05:30శ్రీ నేమాని గురువర్యులకు నమస్కారములు.
సాహితీ జి...శ్రీ నేమాని గురువర్యులకు నమస్కారములు.

సాహితీ జిలుగులు అనేది దుష్టసమాసము అవుతుంది కదాండీ.

సాహితీప్రభలు దీపింపన్ దివారత్రమై అంటే సరిపోతుందా గురువుగారూ ?? సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56862962351852787952013-10-14T04:51:34.110+05:302013-10-14T04:51:34.110+05:30శ్రీ గుండు మధుసూదన్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము ...శ్రీ గుండు మధుసూదన్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము మనోహరముగా నున్నది. అభినందనలు.

శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
మీ పద్యము పంచ పాదములతో మనోహరముగా నున్నది.

స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90820864262763313022013-10-14T04:46:24.265+05:302013-10-14T04:46:24.265+05:30శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ ...శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. శారద రాత్ర యుత్సవము అనుచోట యడాగమమునకు తావు లేదు. శారద రాత్ర పర్వతతి అందాము. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83215207087931829422013-10-13T21:33:21.689+05:302013-10-13T21:33:21.689+05:302004 లో సప్తగిరి ఛానల్ లోని సమస్యాపూరణం కార్యక్రమం...2004 లో సప్తగిరి ఛానల్ లోని సమస్యాపూరణం కార్యక్రమంలో ప్రసారమైన నా పూరణ:

అసువుల్ బాయగ రాక్షసంబు నవ దుర్గారాధనల్ జేయగన్
వసుధన్ శారద రాత్ర యుత్సవము! బ్రోవన్ ధాత్రి కృష్ణుండు స
త్య సమేతంబుగఁ గూల్చి యా నరకుఁ బ్రత్యక్షంబుగా నుర్వికిన్
దసరా పండుగ!,దివ్యకాంతులన్ సంధానించె దీపావళిన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49095980122800638222013-10-13T21:25:48.631+05:302013-10-13T21:25:48.631+05:30నేమాని పండితార్యా! పొరబాటుకు చింతిస్తున్నాను. ధన్య...నేమాని పండితార్యా! పొరబాటుకు చింతిస్తున్నాను. ధన్యవాదములు.

వెస దీర్పంగను భక్తకోటి వెతలన్ వేవేగ రమ్మంచు నే
దెసలన్ జూచిన నమ్మవారి ప్రతిమల్! దివ్యార్చనల్! శోభలున్!
నిసి, కండ్లన్ మిరుమిట్లు గొల్పు వెలుగుల్! నీరాజనాల్! దీపముల్!
దసరా పండుగ దివ్యకాంతులను, సంధానించె దీపావళిన్!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43317856028069894892013-10-13T21:22:52.039+05:302013-10-13T21:22:52.039+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2667508642211434542013-10-13T18:44:04.422+05:302013-10-13T18:44:04.422+05:30గురువులకు, పెద్దలకు, కవిమిత్రులకూ విజయదశమీ శుభాకాం...గురువులకు, పెద్దలకు, కవిమిత్రులకూ విజయదశమీ శుభాకాంక్షలు.

దసరాపద్యము లాలపించుచును జేతన్ విల్లుతో ఛాత్రులున్
దసరా బొమ్మలకొల్వు,బాలికల నుత్సాహంపు కోలాటముల్
నొసటన్ బొట్టును పంచకట్టు గురువుల్ నూటొక్క గేహమ్ములన్
విసుగున్ జెందక నేగి కట్నధనమున్ వేడ్కన్ గొనన్ నాటియా
దసరా పండుగ దివ్యకా౦తులను స౦ధాని౦చె దీపావళిన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12857214249413939982013-10-13T18:44:03.335+05:302013-10-13T18:44:03.335+05:30గురువులకు, పెద్దలకు, కవిమిత్రులకూ విజయదశమీ శుభాకాం...గురువులకు, పెద్దలకు, కవిమిత్రులకూ విజయదశమీ శుభాకాంక్షలు.

దసరాపద్యము లాలపించుచును జేతన్ విల్లుతో ఛాత్రులున్
దసరా బొమ్మలకొల్వు,బాలికల నుత్సాహంపు కోలాటముల్
నొసటన్ బొట్టును పంచకట్టు గురువుల్ నూటొక్క గేహమ్ములన్
విసుగున్ జెందక నేగి కట్నధనమున్ వేడ్కన్ గొనన్ నాటియా
దసరా పండుగ దివ్యకా౦తులను స౦ధాని౦చె దీపావళిన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5682147113469273362013-10-13T18:29:11.809+05:302013-10-13T18:29:11.809+05:30శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: శుభాశీస్సులు.
మీ ప...శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. 3వ పాదములో సాహితీ జిలుగులు అనుట సాధు ప్రయోగము కాదు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33636454685210401752013-10-13T18:14:38.822+05:302013-10-13T18:14:38.822+05:30అయ్యా! శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
మీ పద్యము...అయ్యా! శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 1వ పాదములో యతి? స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28727872062467545702013-10-13T16:50:24.976+05:302013-10-13T16:50:24.976+05:30సాహితీ మిత్ర కవి పండిత వీక్షకాళికి విజయదశమి పర్వది...సాహితీ మిత్ర కవి పండిత వీక్షకాళికి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!

అసమానోజ్జ్వల దివ్య శక్తి యుతయై, హర్యక్ష సంయానయై,
యసురానీక వినాశకాయుధకర ప్రాంచన్మహోద్వేగయై,
యసురుం ద్రుంచ భవాని, భూజనులు "నాహా" యంచు వెల్గించ "నా
దసరా పండుగ" దివ్యకాంతులను సంధానించె దీపావళిన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17269393417093689712013-10-13T16:48:09.689+05:302013-10-13T16:48:09.689+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83037668930155871242013-10-13T15:35:48.651+05:302013-10-13T15:35:48.651+05:30గురువులకు, పెద్దలకు, కవిమిత్రులకూ విజయదశమీ శుభాకాం...గురువులకు, పెద్దలకు, కవిమిత్రులకూ విజయదశమీ శుభాకాంక్షలు.

వెస దీర్పంగదె మా వెతల్ జనని యంచున్ వేడుచున్, భక్తి నే
దెసలన్ జూచిన నమ్మవారి ప్రతిమల్! దివ్యార్చనల్! శోభలున్!
నిసి, కండ్లన్ మిరుమిట్లు గొల్పు వెలుగుల్! నీరాజనాల్! దీపముల్!
దసరా పండుగ దివ్యకాంతులను, సంధానించె దీపావళిన్!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20708401891586371022013-10-13T15:16:09.911+05:302013-10-13T15:16:09.911+05:30శ్రీగురుభ్యోనమ:
అసురాధిక్యతలెల్ల బోయి విమలాహ్లాదం...శ్రీగురుభ్యోనమ:

అసురాధిక్యతలెల్ల బోయి విమలాహ్లాదంబులన్ పొందగా
కుసుమంబుల్వికసించె చంద్రికలు జేకూర్చెన్ సదా వెల్గులన్
వసుధాదేవి ముదంబునొందినది,దివ్యంబౌ శరత్కాలమే
దసరా పండుగ దివ్యకాంతులను సంధానించె దీపావళిన్.
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27928160088998135802013-10-13T09:36:48.620+05:302013-10-13T09:36:48.620+05:30గురువులు శ్రీ శంకరయ్య, శ్రీ పండిత నేమాని గారలు మరి...గురువులు శ్రీ శంకరయ్య, శ్రీ పండిత నేమాని గారలు మరియు కవి మిత్రులకు ,పాఠకమహాశయులకు విజయ దశమి శుభాకాంక్షలు.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21315747682849555942013-10-13T09:34:55.282+05:302013-10-13T09:34:55.282+05:30గురువర్యు లెల్లరకు మరియు బ్లాగు కవిమిత్రు లందరికీ ...గురువర్యు లెల్లరకు మరియు బ్లాగు కవిమిత్రు లందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82171753956974845632013-10-13T09:21:47.205+05:302013-10-13T09:21:47.205+05:30వ్యసనంబుల్పరిమార్చి ధర్మనిరతీ వ్యాపారమన్ నిల్పి సం...వ్యసనంబుల్పరిమార్చి ధర్మనిరతీ వ్యాపారమన్ నిల్పి సం
తసమున్ గూర్చుచు భక్తితత్వముల నుద్భాసించుచున్ పెంచుచున్
వెసఁ విద్వత్ప్రభ సాహితీ జిలుగులే వెల్గన్ దివారాత్రమై
దసరా పండుగ దివ్యకాంతులను సంధానించె దీపావళిన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.com