tag:blogger.com,1999:blog-6769183920316093900.post1504613358062124380..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 15కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81854512727620534612019-03-21T07:40:41.557+05:302019-03-21T07:40:41.557+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3001875667038796632019-03-21T06:28:23.881+05:302019-03-21T06:28:23.881+05:30ప్రీతిని విల్లునున్ విరిచి రీతిగ రాముడు గారవమ్ముతో...ప్రీతిని విల్లునున్ విరిచి రీతిగ రాముడు గారవమ్ముతో
సీతను పెండ్లియాడె;...శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్
ఖ్యాతిని మన్మథున్ దునిమి కన్నును విప్పుచు ఫాలమందునన్
శీతల శైలమున్ తపపు చింతను మానుచు పెండ్లియాడగాG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9085951026812642782010-06-20T07:16:17.778+05:302010-06-20T07:16:17.778+05:30చింతా రామకృష్ణారావు గారూ,
శ్రీ చింతాన్వయ తిలకా!
న...చింతా రామకృష్ణారావు గారూ,

శ్రీ చింతాన్వయ తిలకా!
నా చిత్రము బ్లాగులోన నయముగఁ బెట్టన్
సూచించితి రటులే మీ
కై చేర్చెదనండి కొంత కాలము పిదపన్.

(ప్రస్తుతానికి ఫోటొ అందుబాటులో లేకపోవడం, ఫోటోను బ్లాగులో పెట్టగల సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం తదితర కారణాల వల్ల ఇంతకాలం పెట్టలేక పోయాను. సాధ్యమైనంత త్వరలో చిత్రాన్ని పెడతాను. మీ సూచనకు ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7937500582838737472010-06-20T07:03:41.643+05:302010-06-20T07:03:41.643+05:30ఆచార్య ఫణీంద్ర గారూ,
మీ చక్కని పూరణ భా
షా చాతుర్య...ఆచార్య ఫణీంద్ర గారూ,

మీ చక్కని పూరణ భా
షా చాతుర్యమ్ము గలిగి సంతస మొసఁగెన్
దోచితిరి మా మనమ్ముల
ఆచార్య ఫణీంద్ర! మేటి వని నుతియింతున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60227583655117685382010-06-19T22:48:02.140+05:302010-06-19T22:48:02.140+05:30నామదినున్న భావనను నామదిఁదూరి గ్రహించి యుంటిరో!
ఏమన...నామదినున్న భావనను నామదిఁదూరి గ్రహించి యుంటిరో!
ఏమని ప్రస్తుతింతుమిము యిందరి కంది న శంకరయ్య!మీ
మోమును చిత్తరంబునను ముచ్చటతో గన వేడు చుంటి.నో
ధీమతి పెట్టుచుంటిరిగ? దీప్యముగా భవదీయ బ్లాగునన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57491002969357982332010-06-19T22:28:37.237+05:302010-06-19T22:28:37.237+05:30తా తప మాచరించునెడ దారగ చేకొనుమన్న అంబికా
మాత ననుగ్...తా తప మాచరించునెడ దారగ చేకొనుమన్న అంబికా
మాత ననుగ్రహింపుమని మారుడు గోరగ రాయబారియై,
ఆతని హత్య జేసి, మరి ఆపయి ఏమి ఎరుంగనట్టు లి
స్సీ! తను పెండ్లియాడె శశిశేఖరు డంబిక సంతసిల్లగాన్!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35780081132940345562010-06-19T20:24:21.068+05:302010-06-19T20:24:21.068+05:30రవి గారూ,
భావం మంచిదే. కాని పద్యంలో గణ వ్యాకరణ దోష...రవి గారూ,
భావం మంచిదే. కాని పద్యంలో గణ వ్యాకరణ దోషాలున్నాయి. పద్యాన్ని సవరించి వీలైతే ఈ రాత్రి వ్యాఖ్యానిస్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35491596708396802962010-06-19T20:20:25.941+05:302010-06-19T20:20:25.941+05:30నేనిచ్చిన సమస్యకు నా పూరణ .....................
ఖ్...నేనిచ్చిన సమస్యకు నా పూరణ .....................
ఖ్యాతిగ రాఘవుండు శివకార్ముక మెక్కిడి యేమి చేసె? న
శ్శీతనగంబుపై నెవఁడు చేయును తాండవనృత్య? మెవ్విధిన్
జేతురు హిందువుల్ ముదముచే నవరాత్రుల నుత్సవంబుగా?
సీతను పెండ్లియాడె; శశిశేఖరుఁ; డంబిక సంతసిల్లఁగన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88990341956540089392010-06-19T20:19:29.377+05:302010-06-19T20:19:29.377+05:30చింతా రామకృష్ణారావు గారూ,
మీ పూరణ అద్భుతం, ఆనందదాయ...చింతా రామకృష్ణారావు గారూ,
మీ పూరణ అద్భుతం, ఆనందదాయకం. ధన్యవాదాలు.
ఇక మీరిచ్చిన సమస్యకు నా పూరణ .....
ఇతరుల కెద్దియేని హిత మెన్నఁడుఁ జేయక స్వార్థబుద్ధితో
పతితుఁడు కాగ జీవనము వ్యర్థము చేసి చలచ్చవంబగున్;
సతతము సర్వ జీవ హిత సాధనకై శ్రమియించు నా దయా
మృతుఁడు సుఖించు, సౌఖ్యమును మేలుగఁ గూర్చుచు సజ్జనాళికై.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81073265405450882022010-06-19T16:48:55.364+05:302010-06-19T16:48:55.364+05:30చెప్పదల్చుకున్నది ఇదివరకే అందంగా చెప్పబడి ఉన్నది క...చెప్పదల్చుకున్నది ఇదివరకే అందంగా చెప్పబడి ఉన్నది కాబట్టి, భావం నాకే బావోలేకపోయినా విభిన్నంగా ఉండాలని ఈ పూరణ ఇలా ప్రయత్నించాను.

కోతల రాయులై తిరుగు గుంపొక నాటకమేయ, యందునన్
సీతను ఇంతి పార్వతిగఁ జేసెను. అంబిక గంగగానటన్
ఆతుర మొప్పగా నటన యాడిరి. పల్లెజనంబులంతటన్
కూతలు వెట్టుచుండగను, కుమార సంభవ నాటకమ్ములో
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85416442903027050742010-06-19T11:23:30.222+05:302010-06-19T11:23:30.222+05:30రాతిని నాతిఁ జేసి; రఘురాముడు సీత ప్రశస్తి నెంచి;సం...రాతిని నాతిఁ జేసి; రఘురాముడు సీత ప్రశస్తి నెంచి;సం
ప్రీత మనంబుతోడఁ జని శ్రీకరమైన స్వయంవరంబునన్
ఖ్యాతిని గన్న చాపమును గౌరవ మొప్పగ పట్టి చీల్చి యా
సీతను పెండ్లియాడె. శశిశేఖరుడంబిక సంతసిల్లగన్.

ఆర్యా! సహృదయుల పూరణ కోసం నేటి నా సమస్యతిలకించండి.

మృతుఁడు సుఖించు; సౌఖ్యములు మేలుగ కూర్చును సజ్జనాళికిన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57060066278246896492010-06-19T09:29:19.759+05:302010-06-19T09:29:19.759+05:30ఫణిప్రసన్న కుమార్ గారూ,
వావ్ ... ఇంత స్పీడా? చక్కన...ఫణిప్రసన్న కుమార్ గారూ,
వావ్ ... ఇంత స్పీడా? చక్కని ధారాశుద్దితో, మంచి పద విన్యాసంతో సమస్యను పూరించారు. "నా తరమా నుతింప"?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77333967106535888142010-06-19T09:12:55.375+05:302010-06-19T09:12:55.375+05:30నా తరమా నుతింప యని నారదు డచ్చెరు వొందు రీతిగా
భూతల...నా తరమా నుతింప యని నారదు డచ్చెరు వొందు రీతిగా
భూతలమంత పీటగ నభోతలమంతయు పెండ్లి పందిరై
శీతల వీక్షణుండు హరి శ్రీ రఘు రాముడు ధర్మ రక్షకై
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్.ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.com