tag:blogger.com,1999:blog-6769183920316093900.post1636315429331406214..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4023కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1712112238633771212022-03-18T11:46:30.346+05:302022-03-18T11:46:30.346+05:30ప్రకృతి జనియించు నట్టి శబ్దమ్ము లెల్ల
జనుల చెవులఁ...ప్రకృతి జనియించు నట్టి శబ్దమ్ము లెల్ల
జనుల చెవులఁ బడ్డఁ కలుగు సంతసమ్ము
నేను వచియించు చుండఁగ నీకు సంశ
యమ మహిష ఘంటికానాద మది ప్రియంబు

కాలుని దర్శనం బయినఁ గానఁగ నోపరు వారు లోకులం
గాలునిఁ గాన కున్న మఱి కాలుని దున్నఁ గనంగ శక్యమే
యేల వచింప నీ పగిది నేరు నెఱుంగని యట్టి మాటలం
గాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89364738558632697322022-03-18T07:58:14.867+05:302022-03-18T07:58:14.867+05:30మూలుగు వానికిన్ ముదిమి పూర్తిగ నిండియు రోగబాధచే
కా...మూలుగు వానికిన్ ముదిమి పూర్తిగ నిండియు రోగబాధచే
కాలముతోడ నిత్యమును ఘర్షణ జేసెడు
వృద్ధ జీవికిన్
చాలనిపించి జీవితము సత్వర మంతము
కోరువారికిన్
కాలుని దున్నపోతు మెడగంటలు మిక్కిలి
శ్రావ్యమౌ గదా గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2038054963948966502022-03-18T05:58:55.082+05:302022-03-18T05:58:55.082+05:30వేలకువేలు రూప్యములు వెజ్జునకర్పణజేసి యాశతో
కాలము వ...వేలకువేలు రూప్యములు వెజ్జునకర్పణజేసి యాశతో
కాలము వెళ్ళబుచ్చినను గానక స్వస్థత యించుకేనియున్
చాలును జీవితమ్మనుచు శాశ్వతనిద్రను గోరు రోగికిన్
కాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75816871907056027092022-03-18T03:31:07.293+05:302022-03-18T03:31:07.293+05:30కాలును చాచి కూర్చునెను కాటికి చూపుచు రోగగ్రస్థుడై
...కాలును చాచి కూర్చునెను కాటికి చూపుచు రోగగ్రస్థుడై
కాలము శేష మించుకయె కాన్సరు రోగ మడంచె నాయువున్
కూలెను జీవితేచ్ఛ యిక క్షోభ భరింపగజాల డిప్పుడా
కాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా||
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73004253265420781722022-03-18T00:13:17.696+05:302022-03-18T00:13:17.696+05:30ఒడలు వార్ధక్యమువలన వడలిపోయి
బక్క చిక్కిన దేహంబు భా...ఒడలు వార్ధక్యమువలన వడలిపోయి
బక్క చిక్కిన దేహంబు భారమవగ
కాటికేగు విరక్తుని కర్ణములకు
యమ మహిష ఘంటికానాద మది ప్రియంబు
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84157877067735903132022-03-17T22:53:51.975+05:302022-03-17T22:53:51.975+05:30చరమదశయందు మ్రగ్గుచు శయ్యమీద
బ్రతుకుపైనాశ యడుగంటి వ...చరమదశయందు మ్రగ్గుచు శయ్యమీద
బ్రతుకుపైనాశ యడుగంటి వ్యాధితుండు
మరణయాతన పడుతున్న తరుణమందు
యమమహిష ఘంటికానాదమది ప్రియంబుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74412870259393689562022-03-17T22:50:25.580+05:302022-03-17T22:50:25.580+05:30వైద్యులకవగతము గాక వత్సరముల
బ్రక్కనగల వారినిగూడ బా...వైద్యులకవగతము గాక వత్సరముల
బ్రక్కనగల వారినిగూడ బాధవెట్టి
వేల తగ్గక జావుకు వేచి యుండ
యమమహిష ఘంటికానాద మది ప్రియంబుsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6766619545869957162022-03-17T22:25:11.497+05:302022-03-17T22:25:11.497+05:30పాడు జీవిత మును రోసి బాధ పడుచు
నెదురు చూచుచు ...పాడు జీవిత మును రోసి బాధ పడుచు
నెదురు చూచుచు నుండె గా నిష్ఠ పడుచు
చావు కొఱకు దా నెపు డ ది జరుగునన గ
యమ మహిష ఘంటి కా నాద మది ప్రియంబు కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64133918257981513452022-03-17T22:08:52.928+05:302022-03-17T22:08:52.928+05:30
చాలిక జీవితమ్మనుచు శాంతనవుండట యంపశయ్యపై
కేలుల మ...
చాలిక జీవితమ్మనుచు శాంతనవుండట యంపశయ్యపై

కేలుల మోడ్చి మొక్కి ఘన కృష్ణుని గాంచి వచించెనిట్లు నా

లోలువ తీరె నేనిక ఫలోదయ మేగెద నాలకింపగన్

గాలుని దున్నపోతు మెడ గంటల సవ్వడి శ్రావ్యమౌ గదావిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34367186635604714182022-03-17T22:08:14.162+05:302022-03-17T22:08:14.162+05:30చేలములూడ్చికౌరవులుచేడియద్రౌపదిభంగపర్చిరే
వాలమునిప్...చేలములూడ్చికౌరవులుచేడియద్రౌపదిభంగపర్చిరే
వాలమునిప్పుపెట్టియటరావణుడెంచెనధర్మమార్గమున్
కాలముదాపురింపనరకాధముడంతటవిఱ్ఱవీగెనే
కాలునిదున్నపోతుమెడగంటలసవ్వడిశ్రావ్యమౌనుగాBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37663639735534111962022-03-17T21:48:52.217+05:302022-03-17T21:48:52.217+05:30వంకదారులయానంబుపాలబడగ
నరునిబ్రతుకుునతుకులనావయయ్యె
ప...వంకదారులయానంబుపాలబడగ
నరునిబ్రతుకుునతుకులనావయయ్యె
పుణ్యపాపంబులెంచకపూనికనగ
యమమహిషఘంటికానాదమదిప్రియంబుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84099970827202385382022-03-17T21:48:22.592+05:302022-03-17T21:48:22.592+05:30తేటగీతి
రాజరాజు ,కృష్ణుని మాట ,రాయ బార
ము పెడచెవిన...తేటగీతి
రాజరాజు ,కృష్ణుని మాట ,రాయ బార
ము పెడచెవిన బెట్టి బవరమునకు బోయె
వంశ నాశన కారక వ్యక్తి మదికి
యమ మహిష ఘంటికా నాదమది ప్రియంబు.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79098464079944526872022-03-17T21:43:26.572+05:302022-03-17T21:43:26.572+05:30తేటగీతి
దేవదేవుండు సంధికై తెలుప వినక
తగ్గబోమంచు రా...తేటగీతి
దేవదేవుండు సంధికై తెలుప వినక
తగ్గబోమంచు రారాజె యెగ్గులొలికె
దాపురించగ పోగాలమీ పగిదిని
యమమహిష ఘంటికానాద మది ప్రియంబు

ఉత్పలమాల
ఆలమునందు పాండవుల నార్కులునే పదివేలురైనయున్
గూలుపఁ జాలరంచుఁ దగఁ గోపకిశోరుఁడు సంధిఁజూపఁ బో
గాలము దాపురించెనన కౌరవులొప్పిరె? కానికాలమై
కాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5193992688136107272022-03-17T21:28:48.031+05:302022-03-17T21:28:48.031+05:30
సకల శాస్త్రాలనెఱగిన శాస్త్రి యతడు
చావు పుట్టుకలను...
సకల శాస్త్రాలనెఱగిన శాస్త్రి యతడు
చావు పుట్టుకలనునవి సహజ మనుచు
నమ్మినట్టి స్థితప్రజ్ఞున కిల గాంచ
యమమహిష ఘంటికానాద మది ప్రియంబు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com