tag:blogger.com,1999:blog-6769183920316093900.post1682884466902728560..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 292 (కామ దహనము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88174041661043626922013-03-27T09:31:03.476+05:302013-03-27T09:31:03.476+05:30ఏల్చూరివారితో యేకీభవిస్తున్నాను. నా చిన్నప్పుడే మా...ఏల్చూరివారితో యేకీభవిస్తున్నాను. నా చిన్నప్పుడే మా నాన్నగారు శ్రీకాళహస్తీశ్వరశతకం కొని యిచ్చారు. దానిలో నన్ను వెంటనే ఆకట్టుకున్న పద్యాల్లో ఒకటి:

అంతా మిథ్య తలంచి చూచిన నరుడట్లౌ టెరింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిఁ జెంది చరించుఁ గాని పరమార్థంబైన నీ యందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళహస్తీశ్వరా!

అయిన నేను 'అంతా' అన్న మాట సాధువా అని అనుమాన పడ్డానే! చలా చిత్రంగా ఉంది.
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50861662372990174962013-03-27T09:06:13.803+05:302013-03-27T09:06:13.803+05:30‘కామదహనము’ శీర్షికపై చక్కని పద్యాలను రచించిన కవిమి...‘కామదహనము’ శీర్షికపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
సహదేవుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
మిస్సన్న గారికి,
శ్యామల రావు గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.

శ్యామలరావు గారూ,
పోలికవడిని గురించిన పాఠాలను ‘ఛందస్సు’ శీర్షికలో గతంలో ప్రకటించాను. చూడండి.

ఏల్చూరి మురళీధర రావు గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78355890781628391252013-03-27T00:42:21.111+05:302013-03-27T00:42:21.111+05:30శ్రీ శ్యామలరావు గారికి
నమస్కృతులతో,
ఏదో ఒక తీరున ...శ్రీ శ్యామలరావు గారికి
నమస్కృతులతో,

ఏదో ఒక తీరున యతి లేని తెలుగు పద్యం ఉండదు. కుసుమ షట్పదలో యతి లేదు కాని, తేటగీత్యాటవెలదులలో వలె ప్రాసయతి నియతం అన్నమాట. అందువల్ల మూడవ, ఆఱవ పాదాలలో చివఱను వచ్చే 5 + 2 మాత్రల స్థానంలోనూ ప్రాసయతి ఉండటమే సమంజసం.

మీ పద్యాన్ని ఈ విధంగా చూపితే సలక్షణంగా ఉంటుంది:

గిరికన్యకా తపము + నెరవేర్చు మనినిన్ను
పురిగొల్ప మన్మధుడు + పొరసేనయా
విరిబాణములు వేయ + పరమోగ్రమూర్తివై
అరసినంతనె మారు + డొరిగేనయా.

లక్షణోదాహరణకు మాత్రమే చూపాను కాని, నేను మార్చిన చోట్ల మీరు ఇంకా మెఱుగైన పదాలను కూర్పవచ్చును.

తక్కిన పాదాలూ ఈ విధంగానే ఉండాలి.

కేవలం లక్షణ నిరూపణకు మాత్రమే చూపాను, సహృదయంతో స్వీకరింపగలరన్న నమ్మకంతో.

భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు ఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22452209586887198372013-03-27T00:34:20.822+05:302013-03-27T00:34:20.822+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
తారకాసుర బాధ...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

తారకాసుర బాధలంతట తాళలేక సురాదులా
మారునిన్ ప్రియమార వేడ నుమాపతీ వివహంబుకై
మారుడూన శరంబు శంభుని మానసంబు కదల్పగన్
మారుడా నయనానలంబున మాడె చండుని రాకకై.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74074966723364271132013-03-27T00:02:38.606+05:302013-03-27T00:02:38.606+05:30మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి,
ఈ క్రింది ప్రయోగా...మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి,
ఈ క్రింది ప్రయోగాలను చూడండి:

ధూర్జటి కాళహస్తీశ్వర శతకము నుండి
అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరార్జితమె మేనంతా భయభ్రాంతమే
యంతా నాంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
చింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా!

కోట శివరామకవి సానందోపాఖ్యానము
నానాదానవితానముల్ గొనఁ బరాన్నప్రీతుఁడై నిత్యక
ర్మానుష్ఠానము మాని రేవగళు లన్యాయార్జిత ద్రవ్యసం
తానుండై పరమార్థమైన నెలవింతా లేక పడ్డప్పులి
చ్చే నీచుండది పోవ దుఃఖపడ దా నిట్లయ్యె వేయేటికిన్.

భద్రాచల రామదాసు:
అంతా రామమయం జగమంతా రామమయం ...
కవిప్రయోగాలు ఇంకా అనేకం ఉన్నాయి.
“అంతా” తప్పు కాదు. కవులు కావ్యాలలో వాడినదే.

పు – ము యతి విషయం:

పొడిచియు వివిధాస్త్రశస్త్ర + ముల నుద్ధతులై - నన్నయ ఆది (5-58)
భువనబీజంబు కైవల్య + మోక్షదాయి - శ్రీనాథుడు భీమఖండము

భవదీయుడు,
ఏల్చూరిమురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75272550149978796722013-03-26T23:18:22.230+05:302013-03-26T23:18:22.230+05:30శ్యామలరావు గారు,
పు-ము ల యతి, ఏకవచనము సరిచేసినాను....శ్యామలరావు గారు,
పు-ము ల యతి, ఏకవచనము సరిచేసినాను. సాధనము గణభంగమైతుంది. సాధనమ్ము సరియైనదని అనుకుంటున్నాను.
ధన్యవాదాలు.

ధర్మము పాటించు కామము- దారిఁ జూప
మోక్షసాధనమ్ముకలుగు; ముక్తి దారి
పూలబాటయా కాదది;పుడమి జనులు
గమ్యమును మఱచుచునుంద్రు, కామమందు

మునిగి యుందురర్థ మోహము విడువరు.
మూడుదారులెల్ల ముళ్ళతోడ
నిండియుండు; ముడుల నేర్పుతోడ విడగ
జేయగలరె? యేరి చేతనౌను? లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17629443818307501952013-03-26T22:31:35.842+05:302013-03-26T22:31:35.842+05:30కుసుమషట్పదలు
గిరికన్యకా తపము
నెరవేర్చు మనినిన్ను
...కుసుమషట్పదలు

గిరికన్యకా తపము
నెరవేర్చు మనినిన్ను
పురిగొల్ప మన్మధుడు వచ్చేనయా
విరిబాణములు వేయ
పరమోగ్రమూర్తివై
అరసినంతనె మారు డణగేనయా

దేవుడా నీపైన
పూవులే విసరితే
నీ వేల నిప్పులే విసిరావయా
నీ వాలకము జూడ
నే వేళ శాంతమా
భావజుని పైనింత కోపమేలా

దేవకార్యము మీద
తా వచ్చె నేగాని
భావజుని తప్పేమి లేదు సామీ
కావవయ్యా పుత్ర
భావంబు గైకొని
నీవు కారుణ్యమూర్తివి శంకరా

(షట్పదలకు యతి అవసరము లేదు. తెలుగులో యతిలేని పద్యము ఇది ఒక్కటే ననుకుంటాను. ఈ కుస్మషట్పద పద్యం లక్షణం ౧,౨,౪,౫ పాదాలకు ౫+౫ మాత్రలుగా రెండు ఇంద్రగణాలు. ౩,౬ పాదాలకు ౫+౫+౫+౨ మాత్రలుగా మూడు ఇంద్రగణాలపైన రెందు మాత్రలు. ప్రస ఉన్నది. ౨,౪ పాదాలలో ప్రాస ఐఛ్ఛికము!)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53321971461856220902013-03-26T21:55:37.014+05:302013-03-26T21:55:37.014+05:30కామము గాల్చి వేయుటన కాదది తేలిక యెంత వారికిన్
నీ...కామము గాల్చి వేయుటన కాదది తేలిక యెంత వారికిన్
నీమము దప్పినప్పు డగు నీకది శత్రువు గాన కోర్కెకున్
వేమరు యత్నముల్ సలిపి వేయుము పగ్గ మధర్మ మైనచో
నీమది లోనె, పొందెదవు నిత్య సుఖమ్ముల నమ్ము మిత్రమా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50830105497031707262013-03-26T21:40:05.047+05:302013-03-26T21:40:05.047+05:30శ్రీ శ్యామల రావు గార్! శుభశీస్సులు.
మీ దర్శనము చాల...శ్రీ శ్యామల రావు గార్! శుభశీస్సులు.
మీ దర్శనము చాల కాలము తరువాత కనుక ఆనందము గూర్చినది. మీ పద్యములు బ్లాగులో ఈ రోజు కనుబడుట లేదే. మాకు ఆ విందును కూడా కలిగించండి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39533915062182033702013-03-26T21:07:46.374+05:302013-03-26T21:07:46.374+05:30>మనుమఛ్ఛాస్త్రిగారూ, "అంతా" అని వాడార...>మనుమఛ్ఛాస్త్రిగారూ, "అంతా" అని వాడారు గాని అది కావ్యభాషలో వాడరు.

>లక్ష్మీదేవిగారు 'అర్థకామము' అని యేకవచనం చేసారు. సరిగాదేమో. సాధనమ్ము బదులు సాధనము అంటే కాని గణం కుదరదు. పూ-ము లకు యతి చేయటంలో బిందుపుర్వకం కావాలనే నియమం ఒకటుందనుకుంటాను. బహుశః చాలా మంది పాటించటం లేదేమో నేడు.

>సహదేవుడుగారూ, "తిరుగుట మేలా" అంటే బాగుంటుందేమో? అలాగేచివరి పాదం "కూరును సౌఖ్యమ్ము హోళిగుర్తుగ మారున్" అంటే బాగుంటుంది. కాని "కూరును" సరియైన పదమేనా? నిఘంటువుల ప్రకారం సరియే మరి. "కూడును" అని ఉంటే బాగుంటుంది కాని ప్రాస చెడుతుంది.

>రాజేశ్వరిగారూ, మీపద్యంలో "హోలిక హత మణచి" బదులు "హోలిక మద మణచి" అంటే బాగుంటుంది. "హోలిక యుత్సవము" అని యడాగమం రాదండీ "హోలికోత్సవం" అవుతుంది గుణసంధితో. అదీగాక మీ పద్యం నాకు సరిగా అన్వయం కావటం లేదు.

> రామలక్ష్మిగారూ, "కూడలందు" అనేది సరైన ప్రయోగం కాదనుకుంటాను. "కూడలి యందు" "కూడళ్ళందు" అనేవి సాదువులుగాని మీకుపయోగించవేమో. అల్లఘె "ఇకిలించుచూ పల్కి" బదులు "ఇకిలించుచును బల్కి" అనవలసి ఉంటుందండీ.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46437348692599370322013-03-26T21:03:08.963+05:302013-03-26T21:03:08.963+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86918760270633270712013-03-26T20:31:42.494+05:302013-03-26T20:31:42.494+05:30గోమయమ్ముతోడ గోడముద్దలు చేసి
కూడలందు పెద్ద గుట్ట పో...గోమయమ్ముతోడ గోడముద్దలు చేసి
కూడలందు పెద్ద గుట్ట పోసి
ఇచ్చకంపుమాటలికిలించుచూపల్కి
నిప్పుపెట్టి చూడ నిలుతురంత.Anonymoushttps://www.blogger.com/profile/14362414968395997693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46355831590268939882013-03-26T20:24:02.537+05:302013-03-26T20:24:02.537+05:30హోలిక రక్కసి గావున
హోలిక హత మణచి నంత హోళీ జరుపన్ ...హోలిక రక్కసి గావున
హోలిక హత మణచి నంత హోళీ జరుపన్ !
హోలిక శిశువుల మ్రింగగ
హోలిక యుత్సవము జేసి డోలీ నూపన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82873023513063024392013-03-26T15:52:43.771+05:302013-03-26T15:52:43.771+05:30కోరికలుఁ దీర లేదని
తీరని వేదనల బడుచు తిరుగగ మేలా?(...కోరికలుఁ దీర లేదని
తీరని వేదనల బడుచు తిరుగగ మేలా?(నేలా?)
కోరికలఁ గాల్చి వేసిన
కూరును సౌఖ్యమది 'హోళి' గుర్తుగ మారన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11553414143334029102013-03-26T11:45:35.822+05:302013-03-26T11:45:35.822+05:30ధర్మముగ నర్థకామము దారిఁ జూప
మోక్షసాధనమ్ముకలుగు; మ...ధర్మముగ నర్థకామము దారిఁ జూప
మోక్షసాధనమ్ముకలుగు; ముక్తి దారి
పూలబాటకాదు కఠినము; జనులెల్ల
గమ్యమును మఱచెదరేల కామమందు

మునిగి యుందురర్థ మోహము విడువరు.
మూడుదారులెల్ల ముళ్ళతోడ
నిండియుండు; ముడుల నేర్పుతోడ విడగ
జేయగలరె? యేరి చేతనౌను?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58778113273810618802013-03-26T11:09:45.442+05:302013-03-26T11:09:45.442+05:30కామము వినాశ హేతువు
కామము మఱి లొంగ దీ యు కర్క ...కామము వినాశ హేతువు
కామము మఱి లొంగ దీ యు కర్క శ ముం గాన్
కాముని దహి యించెను గద !
కామారియె కోప గించి కంతుని నరుడా !
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47483460019349604982013-03-26T09:59:59.069+05:302013-03-26T09:59:59.069+05:30రంగుల జల్లుచును పలు తె
రంగులనీ పండుగనల రారుదురంత...రంగుల జల్లుచును పలు తె
రంగులనీ పండుగనల రారుదురంతా
రంగులు మంచివి వాడుడు
రంగుల "ఘోరంగు" లున్న 'రంగు పడుద్దీ!'
ఘోరంగులు = ఘోరమైన , కల్తీ రంగులు ( సరదాగా పెట్టిన పదం )
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54028295199217032192013-03-26T09:45:24.887+05:302013-03-26T09:45:24.887+05:30కామమె జన్మ మృత్యు భయ కారణమౌట ముముక్షు బృందముల్
కామ...కామమె జన్మ మృత్యు భయ కారణమౌట ముముక్షు బృందముల్
కాముని జేరనీరు, సురకార్యము బూని స్మరుండు శూలిపై
ప్రేమను జిమ్ము శస్త్రముల వేయ మహేశ్వరుడా సుమాస్త్రు న
య్యో మసిజేసె జ్ఞాన నయనోదిత భీకర వహ్ని కీలలన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com