tag:blogger.com,1999:blog-6769183920316093900.post2387093680849335608..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4362కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4290519205122046822023-03-11T15:45:59.779+05:302023-03-11T15:45:59.779+05:30క్షణికావేశము లేని వాడను సదా కర్తవ్య సౌముఖ్యుడన్
ప్...క్షణికావేశము లేని వాడను సదా కర్తవ్య సౌముఖ్యుడన్
ప్రణతుల్ సల్పెద భక్తితోడ సభలో పాల్గొన్న జంజానిరీ
క్షణకున్ న్యాయమొనర్చు కౌతుకముతో సంపూర్ణమౌ పద్యతో
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55259655358678786582023-03-11T15:20:49.103+05:302023-03-11T15:20:49.103+05:30తే॥ రమ్యమైన పద్యములను వ్రాయనెంచి
కఠిన సాధన యొనరించ...తే॥ రమ్యమైన పద్యములను వ్రాయనెంచి
కఠిన సాధన యొనరించి కంద పద్య
ములను వ్రాయఁగ మెచ్చకఁ బోయిరనుచు
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల

మ॥ గణముల్ గూర్చితిఁ బద్యమాలలను వాగౌచిత్య ధారామృత
మ్మణుమాత్రంబుగ నైనఁ దగ్గకను వ్రాయంగన్ బ్రయత్నించితిన్
గణయత్యాదుల తప్పులెంచఁగను నాకావ్యంబునన్ బండితుల్
రణముల్ సేయఁగ వచ్చినాడను విచిత్రంబౌ వచోవృత్తితోరామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64592287146939437172023-03-11T13:49:10.873+05:302023-03-11T13:49:10.873+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72346275379416525622023-03-11T11:21:34.597+05:302023-03-11T11:21:34.597+05:30సంతసము పిక్కటిల్లఁగ సుంత యేని
నోహటిల్లకయుఁ బర మోత...సంతసము పిక్కటిల్లఁగ సుంత యేని
నోహటిల్లకయుఁ బర మోత్సాహమున వి
నంగ వచ్చిన వారి మానసము లపహ
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల

తృణ మాత్రమ్మును స్వీయ డెందముల సందేహింపకే యొడ్డఁగా
ఫణ మొక్కింత వరావధాన సభలన్ స్వాంతమ్ము హర్షింపఁ బ్రాం
గణ మందున్న మహానుభావు లెదలం గంపింప నుత్సాహినై
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54292411402554626692023-03-11T08:08:10.384+05:302023-03-11T08:08:10.384+05:30తేటగీతి
వృత్తి వేరైన పద్యమ్ము వేడ్కనాకు
గురువర! తమ...తేటగీతి
వృత్తి వేరైన పద్యమ్ము వేడ్కనాకు
గురువర! తమ దయను మెలకువలెఱుంగ
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల
తెలియ జెప్పుచు మన్నించి దిద్దుడయ్య

మత్తేభవిక్రీడితము
మణులన్ బోలిన మాటలన్ మలచ సంభావించి ధీమూర్తిగన్
ప్రణతుల్ గూర్తును, పద్యవిద్య నొగి నేర్వన్దల్చి వేడన్ క్షమా
గుణసంపన్నత నేర్పుమా! గురువరా! కొంగ్రొత్తదౌ వృత్తినిన్
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితోగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-532453969287662512023-03-11T06:14:14.232+05:302023-03-11T06:14:14.232+05:30చెణకుల్ చిమ్ముచు పండితోత్తములు విశ్లేషించుచున్ మెచ...చెణకుల్ చిమ్ముచు పండితోత్తములు విశ్లేషించుచున్ మెచ్చి ప్రే
రణమున్ గల్గగ చేయుచుండ కడు సారమ్మైన పద్యమ్ములన్
ఘనమౌ యీయవధానమున్ దలసి సంగ్రామమ్ముగా, మించు పూ
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32846134788006714832023-03-11T05:06:31.964+05:302023-03-11T05:06:31.964+05:30అనయంబున్ కవితాలలామపద సేవాసక్తియే ధ్యేయమై
వినయంబున్...అనయంబున్ కవితాలలామపద సేవాసక్తియే ధ్యేయమై
వినయంబున్ పొలుపారదాల్చి మదిలో విజ్ఞానులౌ నొజ్జలన్
దినమున్ రాతిరి సేవచేసి కొనుచున్ దీక్షన్ ప్రశస్తంపు పూ
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితోఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74426358578470233742023-03-11T04:51:35.087+05:302023-03-11T04:51:35.087+05:30క్షణమున్ వీడక జ్ఞాన శాస్త్రములు నే గష్టించి
సాధి...క్షణమున్ వీడక జ్ఞాన శాస్త్రములు నే గష్టించి
సాధించి స
ద్గుణసంపన్నుల తోడ బండితలతో గూలంక
షంగాను వా
గ్రణముల్ సేయగ వచ్చినాడ విచిత్రంబౌ
వచో వృత్తిచే
గణుతిన్ గాంచిన జ్ఞానవేత్తలువినంగావచ్చి
యోడించుడీ.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27757408330263240582023-03-11T02:46:51.597+05:302023-03-11T02:46:51.597+05:30కంది శంకరు డొ సగిన కమ్మ నైన
హృద్య. పాదపు పూరణ ...కంది శంకరు డొ సగిన కమ్మ నైన
హృద్య. పాదపు పూరణ పద్య ములను
పొత్త. ముగ జేయు కోర్కె తో బూనియు ప్రచు
రణము సేయ వచ్చితి విచిత్ర o పు నుడుల కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21462496547123672012023-03-11T01:23:10.944+05:302023-03-11T01:23:10.944+05:30భాగ్య నగరమునందు నేర్పరచబడిన
ధారణాబ్రహ్మదౌ యవధానమంద...భాగ్య నగరమునందు నేర్పరచబడిన
ధారణాబ్రహ్మదౌ యవధానమందు
రణము సేయ వచ్చితివి చిత్రంపు నుడుల
పృచ్ఛకులకు సాధ్యమగునా రెచ్చిపోవ
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71664524581790619772023-03-10T23:41:11.736+05:302023-03-10T23:41:11.736+05:30పద్యమును వ్రాయ , దానిని ప్రజ్ఞుడు గని
యెరుకబరచె ద...పద్యమును వ్రాయ , దానిని ప్రజ్ఞుడు గని
యెరుకబరచె దప్పుల , వాటి నెంచి సవ
రణము సేయ వచ్చితి ; విచిత్రంపు నుడుల
దీసివేయ మొదలిడితి దీరుబడిగsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86281482121335718922023-03-10T22:48:31.786+05:302023-03-10T22:48:31.786+05:30కవులు పండితు లెందరో గాంచునట్టి
సభను జేరి వధానము జర...కవులు పండితు లెందరో గాంచునట్టి
సభను జేరి వధానము జరుపు వేళ
నలుపెరుగక చక్కని పద్యములను రువ్వి
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల.

ప్రణతుల్ శాబ్ది విశాలనేత్రికనుచున్ బ్రార్థించి యాపైని ధి
గణులైనట్టి బుధానవర్యులకు నే కైదండలన్ మోడ్చి స
ద్గుణులౌ ప్రేక్షకులెల్ల మెచ్చువిధినిన్ దోషమ్ము లేకుండ బూ
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8795654223804115252023-03-10T22:45:28.906+05:302023-03-10T22:45:28.906+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42175600414567390362023-03-10T22:42:48.005+05:302023-03-10T22:42:48.005+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53990028009952433352023-03-10T22:37:22.800+05:302023-03-10T22:37:22.800+05:30దినమునకొక పద్యమయిన తనివితీర
వ్రాయకున్నను మనసుకు హా...దినమునకొక పద్యమయిన తనివితీర
వ్రాయకున్నను మనసుకు హాయి రాదు
ప్రొద్దు పొడవక మున్ముందు పూరణమను
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడులఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21077130952475796932023-03-10T22:30:03.649+05:302023-03-10T22:30:03.649+05:30మ.
మణిగా వెల్గెడు ముద్దు రాజ కవి ప్రామాణ్యమ్ము ...మ.

మణిగా వెల్గెడు ముద్దు రాజ కవి ప్రామాణ్యమ్ము క్షిప్రమ్ముగా
కణుపుల్ మాదిరి పద్యమల్ల గల సాకారుండు మెచ్చంగ నే
ప్రణతుల్ సేయగ భాగ్యమే తెలుగులో పాండిత్యమౌ నంకపూ
*రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో.*Subbarao Ayyalasomayajulahttps://www.blogger.com/profile/13260694691729135591noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7060672756608459832023-03-10T22:29:57.775+05:302023-03-10T22:29:57.775+05:30వణకెన్హంసయురాజుమోముగనితావారింపలేకన్దమిన్
పుణికెన్న...వణకెన్హంసయురాజుమోముగనితావారింపలేకన్దమిన్
పుణికెన్నైషధరాజుముద్దుగనునాపుంభావనైర్మల్యమున్
అణచన్తాపముపల్కెనిట్టులనుతాహర్షాతిరేకంబునన్
రణమున్సేయగవచ్చినాడనువిచిత్రంబౌవచోవృత్తితోBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22358758059080559342023-03-10T21:51:39.109+05:302023-03-10T21:51:39.109+05:30రాజ్యభాగమీకనురాజురహినిదప్ప
దౌత్యకార్యంబుకొఱకునైతాల...రాజ్యభాగమీకనురాజురహినిదప్ప
దౌత్యకార్యంబుకొఱకునైతాల్మితోడ
రాయబారిగనేడుగారాగమొలుక
రణముసేయవచ్చితివిచిత్రంపునుడులBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12712420775061741372023-03-10T21:51:00.481+05:302023-03-10T21:51:00.481+05:30పాండవులు కోరు భంగి భూభాగములను
నీయగా కుదరదు నవనీతచో...పాండవులు కోరు భంగి భూభాగములను
నీయగా కుదరదు నవనీతచోర!
సకలమెరిగియు నేల నీ సాకులు "వివ
రణము" సేయ వచ్చితివి చిత్రంపు నుడులతట్టా శ్రీరామ్https://www.blogger.com/profile/10840289688343357288noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5598626811164945862023-03-10T21:27:06.787+05:302023-03-10T21:27:06.787+05:30పలు విధముల నారోపణ పలుకులు విని
నిజము ను దెలిసి ...పలు విధముల నారోపణ పలుకులు విని
నిజము ను దెలిసి కొనియును నిశ్చ యముగ
జరిగిన ది పొర పాటని సరియగు సవ
రణము. సేయ వచ్చి తి వి చిత్రంపు నుడుల కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.com