tag:blogger.com,1999:blog-6769183920316093900.post3022403168329837544..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1155 (వేశ్య కౌఁగిలింతను గోరి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23840259921885004452013-08-27T05:21:32.195+05:302013-08-27T05:21:32.195+05:30మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి సమస్యకు మంచి మంచి ...మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి సమస్యకు మంచి మంచి పూరణలు వచ్చినవి. ముందుగా అందరికీ అభినందనలు.

శ్రీమతి రాజేశ్వరి గారు బమ్మకైన పుట్టు రిమ్మ తెగులు అనే సామెతను సమర్థించేరు. బాగుగ నున్నది.

శ్రీ గుండు మధుసూదన్ గారు: 1. యోగి స్వర్గమును చేరి అక్కడ దేవవేశ్యల పొందు కోరునని సెలవిచ్చేరు. 2. తిరుపతి వేంకట కవుల సంస్కృత శ్లోకమునకు తెలుగు అనువాదము చేసేరు. చాలా బాగుగ నున్నవి.

శ్రీ తిమ్మాజీ రావు గారు: కశ్యపుని తీరు వర్ణించేరు - బాగుగ నున్నది.

శ్రీ కంది శంకరయ్య గారు మంచి విరుపుతో ధర్మపత్నిపై అలిగిన ఒక కుటుంబీకుని ప్రవర్తనను వర్ణించేరు. చాల బాగుగ నున్నది.

శ్రీమతి శైలజ గారు ఇంకా పద్య రచన ప్రయత్నములలోనే ఉన్నారు కాషాయమును కట్టినా కాముడు వీడునా అనే సత్యము ఉట్టంకించినారు. 1వ పాదములో యతిమైత్రి లేదు. 2, 3 పాదములలో గణభంగము. భావము బాగుగనున్నది.

శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు విప్రనారాయణ కథను తెలిపేరు. బాగుగ నున్నది.

శ్రీ సుబ్బారావు గారు వేమన శతక రచన గురించి మంచి విరుపుతో వర్ణించేరు. చాల బాగుగ నున్నది.

శ్రీ బొడ్డు శంకరయ్య గారు నేటి మోసకారులైన యోగుల తీరు వర్ణించేరు. చాల బాగుగ నున్నది.

శ్రీ వరప్రసాద్ గారు ఒక యోగి అనే అజ్ఞాని గురించి సెలవిచ్చేరు. చాల బాగుగ నున్నది. స్వస్తి.

Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81921757053323922742013-08-26T22:41:43.108+05:302013-08-26T22:41:43.108+05:30కవిమిత్రులకు వందనములు.
ఉదయంనుండి వివిధ కార్యక్రమాల...కవిమిత్రులకు వందనములు.
ఉదయంనుండి వివిధ కార్యక్రమాల్లో వ్యస్తుడనై ఇప్పుడే ఇల్లు చేరాను.
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన మిత్రులు...
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గుండు మధుసూదన్ గారికి,
కెంబాయి తిమ్మాజీరావు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
శైలజ గారికి,
సుబ్బారావు గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
వరప్రసాద్ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
బాగా అలసి ఉన్నందున ఒక్కొక్కరి పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66588821622406726702013-08-26T20:03:02.964+05:302013-08-26T20:03:02.964+05:30ఆది శంకరు డైనను మోద మందె
కాంత కనకము లన్నను కలుగు ...ఆది శంకరు డైనను మోద మందె
కాంత కనకము లన్నను కలుగు బ్రాంతి
వేశ్య కౌగిలింతను గోరి వెడలె యోగి
బ్రహ్మ కైనను దిరుగును రిమ్మ తెగులురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84661819488827674152013-08-26T19:38:29.679+05:302013-08-26T19:38:29.679+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
మీరు సూచించ...శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
మీరు సూచించిన విధముగా సవరణతో...

వేశ్య కౌగిలింతను బొంది కశ్యపు డొక
నాడు సకల జగతి గని నాడని విని
వేశ్య కౌగిలింతను గోరి వెడలె,యోగి
యనెడు జ్ఞానహీనుండొకం డాశ తోడకందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72360210447781235832013-08-26T15:51:47.147+05:302013-08-26T15:51:47.147+05:30శ్రీ నేమాని గురు దేవులకు నమస్కారములు, మీరు సూచించి...శ్రీ నేమాని గురు దేవులకు నమస్కారములు, మీరు సూచించిన విధముగా సవరణతో...........

నేటి కాలపు మనుజుండు నీతి దప్పి
యోగి ననిజెప్పి శిష్యుల బ్రోగు జేసి
కామ లాలసుడై తన కడకు వచ్చు
సుదుతు లందున నత్యంత సుందరి యగు
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40988646713255143682013-08-26T15:49:06.827+05:302013-08-26T15:49:06.827+05:30శ్రీ వరప్రసాద్ గారి పద్యము బాగుగ నున్నది. దానిలోన...శ్రీ వరప్రసాద్ గారి పద్యము బాగుగ నున్నది. దానిలోని ఆఖరి పాదమును ఇలాగ మార్చితే బాగుంటుంది:
"యనెడు జ్ఞానహీనుం డొకం డాశ తోడ"
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56521714500591921182013-08-26T15:24:04.600+05:302013-08-26T15:24:04.600+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వ...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

వేశ్య కౌగిలింతను బొంది కశ్యపు డొక
నాడు సకల జగతి గని నాడని విని
వేశ్య కౌగిలింతను గోరి వెడలె,యోగి
యనెడి జ్ఞాన హీనుడు కడు ఆశ తోడ!కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44076973007625741662013-08-26T15:16:03.870+05:302013-08-26T15:16:03.870+05:30అయ్యా! బొడ్డు శంకరయ్యా గారూ! శుభాశీస్సులు.
మీ పద్య...అయ్యా! బొడ్డు శంకరయ్యా గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అందులో "అత్యంత అందమైన" అనే రీతిగా సమాసమును చేయరాదు. ఈ విధముగా ఆ పాదమును మార్చుదాము:
"సుదతు లందున నత్యంత సుందరి యగు" స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23567315368940494122013-08-26T15:08:50.990+05:302013-08-26T15:08:50.990+05:30నేటి కాలపు మనుజుండు నీతి దప్పి
యోగి ననిజెప్పి శిష్...నేటి కాలపు మనుజుండు నీతి దప్పి
యోగి ననిజెప్పి శిష్యుల బ్రోగు జేసి
కామ లాలసుడై తన కడకు వచ్చు
నతివ లందున నత్యంత యందమైన
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి. బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29222049465756922542013-08-26T12:32:44.760+05:302013-08-26T12:32:44.760+05:30శ్రీ కంది శంకరయ్య గారు! శుభాశీస్సులు.
మా కోరికను మ...శ్రీ కంది శంకరయ్య గారు! శుభాశీస్సులు.
మా కోరికను మన్నించి తమ పూరణను కూడా ప్రకటించినందులకు సంతోషము. చాల బాగుగనున్నది - మంచి విరుపుతో వ్రాసేరు. అభినందనలు. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33296945293116768972013-08-26T10:30:13.416+05:302013-08-26T10:30:13.416+05:30సాని కొంపకు రయమున సత్తి బాబు
వేశ్య కౌగిలింతను గోర...సాని కొంపకు రయమున సత్తి బాబు
వేశ్య కౌగిలింతను గోరి వెడలె, యోగి
వేమన శతకము వ్రాసె వినుర వేమ
అనెడు మకుటాన పద్యము లద్భుతముగ
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34568718681900927392013-08-26T08:46:24.465+05:302013-08-26T08:46:24.465+05:30విప్ర నారాయణుండపుడు పిచ్చివాని
వలెను పడిపోయె నాడు...విప్ర నారాయణుండపుడు పిచ్చివాని
వలెను పడిపోయె నాడు తా వలను జిక్కి
వారకాంతయె వేయగా పంతమూని
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17770140125821537832013-08-26T08:46:13.166+05:302013-08-26T08:46:13.166+05:30వన్నె చిన్నెల వలపు వయ్యారములకు
వశ్యమగునునెంతటి వార...వన్నె చిన్నెల వలపు వయ్యారములకు
వశ్యమగునునెంతటి వారలైన
కాషాయములుగట్టినా కాముడొదులున
వేశ్యకౌగిలింతను గోరివెడలెయోగిsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83949623954351752242013-08-26T08:38:43.022+05:302013-08-26T08:38:43.022+05:30నిన్నటి సమస్యకు నా పూరణ...
చకచక ఛాయా చిత్రము
లిక ...నిన్నటి సమస్యకు నా పూరణ...

చకచక ఛాయా చిత్రము
లిక జూడుము నచ్చె నాకు నీరెండు సఖా !
యొకకాలిపైన నిలచిన
బకము న్వడి మ్రింగు చున్న బల్లిన్ గనుమా ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37324594800586016332013-08-26T08:34:22.792+05:302013-08-26T08:34:22.792+05:30నా రెండవ పూరణమున... 1వ పాదము..."అటవి నివసించు...నా రెండవ పూరణమున... 1వ పాదము..."అటవి నివసించు మౌనీంద్రు ఋష్యశృంగు"లో యతిమైత్రి తప్పినది. దానిని "ఋషి వనస్థిత మౌనీంద్రు ఋష్యశృంగు" నని సవరించితిని.

ఋషి వనస్థిత మౌనీంద్రు ఋష్యశృంగు
స్వీయ నగర ప్రవిష్టుని జేయ నెంచి,
తనదు వారాంగనలఁ బంపఁ దాఁ దెలియక
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74352188271927729282013-08-26T08:33:13.853+05:302013-08-26T08:33:13.853+05:30ధర్మపత్ని నుపేక్షించఁ దలఁచి యొకఁడు
వేశ్య కౌఁగిలింత...ధర్మపత్ని నుపేక్షించఁ దలఁచి యొకఁడు
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె; యోగి
యొక్కఁ డతని దుర్వర్తన నుడుగు మనుచు
సదుపదేశ మొసఁగ విని చక్కఁబడియె. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86176742668687754102013-08-26T07:50:48.351+05:302013-08-26T07:50:48.351+05:30పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారముల...పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు .

వశ్య మొనరింప బ్రహ్మము కశ్యపుడను
వృద్ధ యోగి తపమ్ము గావింప నచట
దృశ్యమాయెను యూర్వశి దీక్ష మరచి
వేశ్య కౌగిలింతను గోరి వెడలె యోగి
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16954234313769297092013-08-26T07:49:38.376+05:302013-08-26T07:49:38.376+05:30మిత్రులు కంది శంకరయ్యగారికి, పూజ్యులు నేమానివారికి...మిత్రులు కంది శంకరయ్యగారికి, పూజ్యులు నేమానివారికి, సాహితీ మిత్రులకు నమస్కారములు.

తిరుపతి వేంకటకవుల సంస్కృత పూరణమున కనుసరణము.

(రోమపాదుఁడు ఋష్యశృంగుని దన నగరమునకు రప్పించిన సందర్భము...)

అటవి నివసించు మౌనీంద్రు ఋష్యశృంగు
స్వీయ నగర ప్రవిష్టుని జేయ నెంచి,
తనదు వారాంగనలఁ బంపఁ దాఁ దెలియక
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి!

(వేశ్య కౌఁగిలింతను గోరె వృద్ధ యోగి!!)

నాలుగవ పాదమును బూజ్యులు నేమానివారి స్ఫూర్తితో మార్చితిని.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73494255858058262772013-08-26T07:08:56.379+05:302013-08-26T07:08:56.379+05:30సమస్యను కందము నుండి తేటగీతికి మార్చినందులకు మిత్రు...సమస్యను కందము నుండి తేటగీతికి మార్చినందులకు మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు.

పృథ్విపైనున్న దినములు వేద పఠన,
పాఠన, తపో విశేష, సద్బ్రహ్మచర్య
దీక్షఁ గడచె! దివికినేగి, స్థిరత దేవ
వేశ్య కౌఁగిలింతను గోరె వృద్ధ యోగి!!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52228892429052057402013-08-26T07:02:11.786+05:302013-08-26T07:02:11.786+05:30అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
మాకు వారూ వీరూ ...అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
మాకు వారూ వీరూ ఇచ్చిన పూరణలు వ్రాయుట కంటే - మీ పూరణలు ఇచ్చి మమ్ము ఆనందింపజేయ గలరు. స్వస్తి.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58575791158040818292013-08-26T06:59:43.251+05:302013-08-26T06:59:43.251+05:30ఆది శంకరు డైనను మోద మలరె
బ్రహ్మ కైనను దిరుగును రి...ఆది శంకరు డైనను మోద మలరె
బ్రహ్మ కైనను దిరుగును రిమ్మ తెగులు
కాంత కనకము లన్నను కలత బడగ
వేశ్య కౌఁ గిలింతను గోరె వృద్ధ యోగి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32302282611772050262013-08-26T06:57:54.436+05:302013-08-26T06:57:54.436+05:30నా పూరణలో ఆఖరి పాదమును సమస్య పాదముగా "వేశ్య క...నా పూరణలో ఆఖరి పాదమును సమస్య పాదముగా "వేశ్య కౌగిలింతను గోరి వెడలె యోగి" అని మార్చి చదువుకొనెదము. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24493621589465832512013-08-26T06:53:01.287+05:302013-08-26T06:53:01.287+05:30ముక్తి కాంత సమీపించె ముదముమీర
వేశ్య వేషమ్ము నూని, ...ముక్తి కాంత సమీపించె ముదముమీర
వేశ్య వేషమ్ము నూని, యా విధము దెలిసి
ఆదరము మీర ప్రణతుల నాచరించి
వేశ్య కౌగిలింతను గోరె వృద్ధ యోగి Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79597570013472539032013-08-26T06:46:21.029+05:302013-08-26T06:46:21.029+05:30అమలాపురం శతావధానంలో ఇచ్చిన సంస్కృత సమస్య....
“అభిల...అమలాపురం శతావధానంలో ఇచ్చిన సంస్కృత సమస్య....
“అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ”
తిరుపతి వేంకట కవుల పూరణ....

విపిన మధివసంతం మౌనిరాడృశ్యశృంగం
స్వనగర ముపనేతుం తద్గతా వారయోషాః |
వర మతియతిబుద్ధ్యా సస్త్రియా అజ్ఞతాయా
అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ ||కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91350594265688811782013-08-26T06:34:21.744+05:302013-08-26T06:34:21.744+05:30పండిత నేమాని వారూ,
శుభోదయం!
మీ సూచన ననుసరించి సమస...పండిత నేమాని వారూ,
శుభోదయం!
మీ సూచన ననుసరించి సమస్యవు తేటగీతి పాదంగా మార్చి ఇస్తున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com