tag:blogger.com,1999:blog-6769183920316093900.post3747279310876256175..comments2024-03-28T11:41:35.727+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1363 (గరళకంఠునిఁ బూజింప)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-65276472117446434282014-03-26T21:20:56.051+05:302014-03-26T21:20:56.051+05:30శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
మీ సవరించ...శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
మీ సవరించిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42792774542191266482014-03-26T21:19:22.832+05:302014-03-26T21:19:22.832+05:30శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
ఆ పద్యము ...శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
ఆ పద్యము సెమినార్ మధ్యలో వ్రాసినాను గురువుగారు!
నేను ఒక సెమినార్ కు వెళ్ళి ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చి యుంటిని గురువుగారు!
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41575881202307153652014-03-26T18:49:23.775+05:302014-03-26T18:49:23.775+05:30శ్రీ అన్నపరెడ్డి సత్యనారయణ రెడ్డి గారు: శుభాశీస్సు...శ్రీ అన్నపరెడ్డి సత్యనారయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. అన్వయము ఇంకనూ సులభముగా నుండుటకు ప్రయత్నించండి.

స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23286554530234116312014-03-26T16:03:39.584+05:302014-03-26T16:03:39.584+05:30మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాడు అందరి పూరణలును అలర...మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాడు అందరి పూరణలును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.

Sri HVSN Moorti Garu
మంచి విరుపుతో పద్యమును చెప్పేరు - సంతోష వైభవమును ఇచ్చే శివుని గూర్చి. పద్యము బాగుగ నున్నది.

శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
మంచి విరుపుతో పద్యమును చెప్పేరు. అపవాదులను బాపెడి స్వామి గురించి. పద్యము బాగుగ నున్నది.

శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
గరళమిచ్చు బాధను హరించే హరుని గూర్చి చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.

శ్రీ సుబ్బా రావు గారు:
మంచి విరుపుతో చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.

Sri Psr moorti garu
పాప చింతనకు పాపులకు గరళమిచ్చే స్వామి గురించి చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.

శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు
కైలాస వాసుని గుణ వర్ణనలతో కోట్లకొలది కథలున్నవని చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.

శ్రీ కందుల వర ప్రసాద్ గారు:
మంచి విరుపుతో హిత బోధ చేయుచు పద్యము చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.

శ్రీ సహదేవుడు గారు:
ఒడలి నిండా మనస్సు నిండా గరళము గల వారికి గరళమిచ్చును స్వామి అని సమర్థించేరు - బాగుగ నున్నది పద్యము. కొన్ని టైపు పొరపాట్లు కలవు - కత్తు లెట్టుకు అని వ్యావహారికమును వాడేరు.

శ్రీమతి శైలజ గారు:
గరళ మిచ్చు ననుచు గేలి చేయుచో శివుడు కూడా మురియును అని సెలవిచ్చేరు. పద్యము బాగుగ నున్నది. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31494696864161340262014-03-26T15:57:12.103+05:302014-03-26T15:57:12.103+05:30మోక్ష మార్గము దొరకును ముదముతోడ
గరళకంఠుని బూజింప, గ...మోక్ష మార్గము దొరకును ముదముతోడ
గరళకంఠుని బూజింప, గరళమిచ్చు
కలుష మానవున్ సేవింప, కొలువ వలయు
వారిజాక్షుని జేకుఱ పరమ పదము

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89795054367128770992014-03-26T15:39:18.685+05:302014-03-26T15:39:18.685+05:30చిత్త శాంతిని గల్గించి చింత దీర్చు
గరళ కంఠుని బూజి...చిత్త శాంతిని గల్గించి చింత దీర్చు
గరళ కంఠుని బూజింప,గరళ మిచ్చు
ననుచు గేలిడు వారిని గనుచు మురియు
భక్త వరదుడౌ శూలికి వందనములుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58329373446913161152014-03-26T15:25:23.125+05:302014-03-26T15:25:23.125+05:30కాయ మంతయు నింపుకు గరళ మెల్ల
కత్తు లెట్టుకు ప్రెమతో...కాయ మంతయు నింపుకు గరళ మెల్ల
కత్తు లెట్టుకు ప్రెమతో కొగిలించి
తోటి వారల కెప్పుడు చేటు జేసి
గరళకంఠుని బూజింప గరళమిచ్చుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42122536523529669382014-03-26T14:09:24.122+05:302014-03-26T14:09:24.122+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.

కష్టముల నెల్ల దొలగించు కరుణ తోడ
గరళకంఠునిఁ బూజింప,గరళ మిచ్చు
సుతులకున్, వైరులకు,రాక్షసులననిశము,
జేర వలదు మీరు ఖలుల జెంత భువిని!
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44385883640222352692014-03-26T11:24:31.539+05:302014-03-26T11:24:31.539+05:30గరళకంఠునిఁ బూజింప గరళ మిచ్చు
ననుట విన మేకథనమందు; న...గరళకంఠునిఁ బూజింప గరళ మిచ్చు
ననుట విన మేకథనమందు; నార్తి గొలువ
మెచ్చి కోరిన వరముల నిచ్చెననుచు
కలవు కైలాస నాధుని కథలు కోట్లు.Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8909980579899223132014-03-26T09:51:08.974+05:302014-03-26T09:51:08.974+05:30ఫాలనేత్రుని నర్చింప ఫలము గలుగు
సకల కళ్యాణములతోడ శా...ఫాలనేత్రుని నర్చింప ఫలము గలుగు
సకల కళ్యాణములతోడ శాంతి గలుగు.
గరళకంఠునిఁ బూజింప గరళ మిచ్చు
పాప చింతనకు మరియు పాపులకునుDr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49782297455582885002014-03-26T09:44:15.045+05:302014-03-26T09:44:15.045+05:30సకల సంపద లిచ్చును సర్వులకును
గరళ కం ఠుని బూజింప, గ...సకల సంపద లిచ్చును సర్వులకును
గరళ కం ఠుని బూజింప, గరళ మిచ్చు
పాము శిరమును గట్టిగా బట్టు కొనుచు
పిండ మొదలిడ ,కక్కుచు దండి గాను
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61677707959696300312014-03-26T09:27:00.577+05:302014-03-26T09:27:00.577+05:30సాగరమథనమందున సరసరనుచు
నుబికి వచ్చిన గరళము నోర్వలేక...సాగరమథనమందున సరసరనుచు
నుబికి వచ్చిన గరళము నోర్వలేక
గరళకంఠునిఁ బూజింప గరళ మిచ్చు
బాధ, గాచుమనగ- మ్రింగె; పరిహరించె.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24027418163494061382014-03-26T09:17:15.953+05:302014-03-26T09:17:15.953+05:30గురువుగారు,
బయల్దేరిపోయినారా? అక్కడ నాంపల్లి లో ఉన...గురువుగారు,
బయల్దేరిపోయినారా? అక్కడ నాంపల్లి లో ఉన్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో అరవైఏళ్ళ నుంచీ ప్రచురించిన పుస్తకాల ప్రదర్శన మరియు అమ్మకం, యాభై శాతం రాయితీ తో పెట్టినారు. మీకు కావలసిన పుస్తకం దొరకవచ్చు. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42747525482116452892014-03-26T07:49:46.666+05:302014-03-26T07:49:46.666+05:30భక్తిభావంబు మెరయ సద్భావమందు
గరళకంఠునిఁ బూజింప, గర...భక్తిభావంబు మెరయ సద్భావమందు
గరళకంఠునిఁ బూజింప, గరళమిచ్చు
నట్టి యపవాదులను బాపి యనవరతము
శాంతిసౌఖ్యంబులను గూర్చు చల్లగాను. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23199952051387047962014-03-26T07:00:19.149+05:302014-03-26T07:00:19.149+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
హైదరాబాద్ వెళ్తున్నాను. త...కవిమిత్రులకు నమస్కృతులు.
హైదరాబాద్ వెళ్తున్నాను. తిరిగివచ్చేసరికి ఏరాత్రి అవుతుందో.. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35246685510906471122014-03-26T04:38:55.462+05:302014-03-26T04:38:55.462+05:30నిత్యకల్యాణములు గూర్చు నిష్ఠతోడ
గరళకంఠుని బూజింప, ...నిత్యకల్యాణములు గూర్చు నిష్ఠతోడ
గరళకంఠుని బూజింప, గరళమిచ్చు
వారలకుగూడ సంతోషవైభవంబు
నందజేసిన పరమాత్ము డభవుడతడు.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48905040268763347762014-03-26T00:55:24.139+05:302014-03-26T00:55:24.139+05:30గరళకంఠుని బూజింప గరళమిచ్చు
విఘ్ననాథుని సేవింప విఘ్...గరళకంఠుని బూజింప గరళమిచ్చు
విఘ్ననాథుని సేవింప విఘ్నమొదవు
ననుటయు వినోదవల్లరు లనుచు బొంగి
దీవెనల గూర్చు నా యాదిదేవుడు కద!
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com