tag:blogger.com,1999:blog-6769183920316093900.post3760387545266995179..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 67 (రారా తమ్ముఁడ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-74978852757227949472011-06-08T06:18:13.358+05:302011-06-08T06:18:13.358+05:30మందాకిని గారూ,
ఏ ఛందస్సులో నైనా ప్రశ్నోత్తరరూపమైన ...మందాకిని గారూ,
ఏ ఛందస్సులో నైనా ప్రశ్నోత్తరరూపమైన పూరణ నిరభ్యంతరంగా చేయవచ్చు. వివరణకు ధన్యవాదాలు. పూరణ బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఇప్పుడు చక్కగా సరిపోయింది. బాగుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36867768093107219962011-06-07T21:21:46.510+05:302011-06-07T21:21:46.510+05:30శంకరార్యా ! ధన్యవాదములు.తోడ్కొని రండు అని వ్రాయుటక...శంకరార్యా ! ధన్యవాదములు.తోడ్కొని రండు అని వ్రాయుటకు గాను "తోడ్కు" రండు అని వ్రాశాను. దోషమైతే ...రమ్మనుండు..అంటే సరిపోతుందా ? సూచించగలరు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72783080979966576502011-06-07T15:32:09.683+05:302011-06-07T15:32:09.683+05:30గురువుగారూ,
మన్నించాలి. సుభద్రను, గణగణనకై సుభద్రాణ...గురువుగారూ,
మన్నించాలి. సుభద్రను, గణగణనకై సుభద్రాణి అన్నాను. తప్పైతే మన్నించాలి. సుభద్రాణి దేవేరియే స్వయంగా తన బావగారైన ధర్మరాజుతో తన వివాహం ఎలా జరిగిందో ఆ వేడుక చెప్తోంది.
అర్జునుని చూపుతూ , "వీరే , (మీ తమ్ముడే) చూడండి బావగారూ, మున్నొకనాడు యతివలే వేషము వేసి యా రీతిలో మనువాడినారు" అనుచూ విరిబొమ్మలాంటి యా సుభద్రాణి దేవేరియే బావగారితో ఆ వేడుకలు చెప్పగా, వలచి, వలపింపబడి మనువాడిన తమ్ముని(ఆ రాజకుమారి ప్రాణేశ్వరుని) సంభ్రమంగా చూసి ధర్మరాజు రారా తమ్ముడా అని ప్రేమతో పిలిచారు ,

ఏరా, తమ్ముడనేమనంచు పిలిచేవీవిచ్చకంబుట్టగాన్?
కారే పాల్ సిరిబుగ్గలుండు చిరుసింగారిప్డు నిన్నేమనెన్?
మారాముల్ సరిపొమ్మనంచు నెవరే, మాటాడిరిచ్చోటనే?
రారా తమ్ముడ రార, యన్న యనె, (న్+ఆ) రాజాస్య ప్రాణేశ్వరున్

శార్దూలాన్ని ప్రశ్నోత్తర రూపంలో పూరించవచ్చో లేదో తెలీదు. చెప్పవలసినది. పిలిచేవీవు+ఇచ్చకం+పుట్టగాన్, చిరుసింగారి+ఇప్పుడు = చిన్న అమ్మాయి (పాలుగారే చిన్న పాప ఇప్పుడు నిన్నేమని పిలిచింది) , మారాము చాలని ఎవరు ఎవరితో మాట్లాడినారు అనే ప్రశ్నలకు, సమాధానాలకు అన్వయం కుదిరిందనే అనుకుంటున్నాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45757880722140534002011-06-07T14:17:05.634+05:302011-06-07T14:17:05.634+05:30మందాకిని గారూ,
శార్దూలం నిర్దోషంగా బాగుంది. కాని ...మందాకిని గారూ,
శార్దూలం నిర్దోషంగా బాగుంది. కాని పూరణ భావం సందిగ్ధంగా ఉంది. వివరణ ఇస్తే బాగుండు. "సుభద్రాణి దేవేరే" ... ?

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పూరణ బాగుంది. అభినందనలు.
"తోడ్కు" .. ?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77851680213693741012011-06-06T22:20:28.866+05:302011-06-06T22:20:28.866+05:30చేరన్ పార్థుడు, కృష్ణ యొక్క వనమున్; శ్రీకృష్ణుడే...చేరన్ పార్థుడు, కృష్ణ యొక్క వనమున్; శ్రీకృష్ణుడే వచ్చెగా
మీరాక్రీ డిని తోడ్కు రండు యనగా, మీ యాజ్ఞ చిత్తంబనెన్
చేరన్ బిల్చెను భీముడున్నకులుడున్ చే జూపి నావైపుకున్
"రారా తమ్ముఁడ! రార యన్న" యనె; నా రాజాస్య ప్రాణేశ్వరున్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92117816880158757712011-06-06T17:29:14.545+05:302011-06-06T17:29:14.545+05:30వీరే, మున్ కపటమ్ముచే యతివలే వేషంబులే వేసి మ
మ్మా ర...వీరే, మున్ కపటమ్ముచే యతివలే వేషంబులే వేసి మ
మ్మా రీతిన్ మనువాడిరంచు విరిబొమ్మా,యా సుభద్రాణి దే
వేరే, చెప్పెను బావగారినెడఁనావేడ్కల్; హర్షాన "రా!
రారా! తమ్ముఁడ, రార!" యన్న యనె, నా రాజాస్య ప్రాణేశ్వరున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25316679304223400152011-06-06T14:55:33.667+05:302011-06-06T14:55:33.667+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com