tag:blogger.com,1999:blog-6769183920316093900.post3973716807858989730..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: 316 సమస్యలుకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40404768610308006302011-04-24T21:43:15.797+05:302011-04-24T21:43:15.797+05:30శంకరార్యా! ధన్యవాదములు.
కిశోర్ గారూ! గతంలో జరిగిన ...శంకరార్యా! ధన్యవాదములు.
కిశోర్ గారూ! గతంలో జరిగిన మార్పులు నాకు తెలియదు.మధ్యలో బడిలో చేరాను.అనుభవజ్ఞులదే తుది నిర్ణయం.వీలైనంత యెక్కువమంది పాల్గొనాలన్నదే నాకోరిక.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-285289914056630392011-04-24T19:03:07.036+05:302011-04-24T19:03:07.036+05:30వసంత్ కిశోర్ గారూ,
"మాడరేషన్" పెట్టడం లే...వసంత్ కిశోర్ గారూ,
"మాడరేషన్" పెట్టడం లేదు. ఒకసారి అనుభవం అయింది కదా!
ఇక సమస్యాపూరణలను ముద్రించే ఆలోచన ఇప్పట్లో లేదు. పి.డి.ఎఫ్. రూపంలో ప్రకటించే ప్రయత్నం కొనసాగుతున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34414508748054026862011-04-24T10:38:34.337+05:302011-04-24T10:38:34.337+05:30శంకరార్యా !
ఎవరి పదాలు వారివి !
ఎవరి నేర్పు ,కూర్ప...శంకరార్యా !
ఎవరి పదాలు వారివి !
ఎవరి నేర్పు ,కూర్పు వారిది !

దారి మంచిదై నపుడు అనుసరించినా
అనుకరించినా తప్పు కాదు !
మాడరేషన్ మాత్రం పెట్టవద్దు !

ముందు PDF version తయారు చెయ్యండి !
ముద్రణకు అవసరమైతే నావంతు
ఉడతాసాయం నేనూ చెయ్య గలను !

శాస్త్రిగారూ !
మరునాటి వరకూ మిత్రుల పూరణలు
చూడకుండా ఉండడం సాధ్యం కాదు !
ఒకసారి ఇలాగే మాడరేషన్ పెడితే
పిచ్చెక్కినట్టు అయింది అందరికీ !
మాడరేషన్ తీసెయ్యమని వినతులు వెల్లువెత్తాయి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76058095150159220432011-04-24T07:59:30.561+05:302011-04-24T07:59:30.561+05:30శంకరార్యా!మీ ఆలోచన సాహిత్య సేవలో మరో ముందడుగు.కవిమ...శంకరార్యా!మీ ఆలోచన సాహిత్య సేవలో మరో ముందడుగు.కవిమిత్రుల మందరం కలిస్తే కానిదేముంది.నావంతు (సహాయం కాదు) బాధ్యతను మీ నిర్ణయం మేరకు నిర్వర్తించగలనని తెలుపుచున్నాను.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88055462427341873032011-04-24T05:19:45.226+05:302011-04-24T05:19:45.226+05:30డా.ఆచార్య ఫణీంద్ర గారూ,
కోడీహళ్ళి మురళీ మోహన్ గార...డా.ఆచార్య ఫణీంద్ర గారూ,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
ధన్యవాదాలు.
మీ సూచన బాగుంది. కాని ఇది డబ్బుతో ముడిపడ్డ సమస్య. కంపోజింగ్ (డి.టి.పి/పేజ్ మేకర్) వరకు నేను చేసికొని ఆ కర్చు తగ్గించుకోగలను. అనూ ఫాంట్స్ (ఫోనెటిక్/ఆపిల్)లో నాకు మంచి స్పీడ్ ఉంది. ఇప్పటికే కొందరి పుస్తకాలకు జాబ్‌వర్క్ చేసిపెట్టాను కూడ. కాని ముద్రణతోనే ఇబ్బంది.
సమస్యాపూరణలను పి.డి.ఎఫ్. లో ఇ-బుక్ గా చేయాలనే ఆలోచన ఉంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38881488264495591542011-04-24T05:07:37.654+05:302011-04-24T05:07:37.654+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
మీరు చెప్పిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
మీరు చెప్పినట్లే గతంలో గళ్ళనుడికట్టు, ప్రహేళిక శీర్షికలను క్రమంగా ప్రకటించినప్పుడు వ్యఖ్యలను "మాడరేషన్"లో పెట్టాను. కాని మిత్రుల కోరిక మేరకు దానిని తొలగించాను.
మిగతా వాళ్ళ విషయం ఎందుకు? నేనే ఎన్నో సార్లు పూరణలు సిద్ధం చేసి, అలాంటి భావంతోనే మిత్రుల పూరణలు రావడంతో ప్రకటించడం మనుకున్నాను.
మిత్రులు సరేనంటే మళ్ళీ "మాడరేషన్" పెడతాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18280619561223416082011-04-24T04:59:33.162+05:302011-04-24T04:59:33.162+05:30ఫణి ప్రసన్న కుమార్ గారూ,
వసంత్ కిశోర్ గారూ,
రవి గ...ఫణి ప్రసన్న కుమార్ గారూ,
వసంత్ కిశోర్ గారూ,
రవి గారూ,
చంద్రశేఖర్ గారూ,
మందాకిని గారూ,
మిస్సన్న గారూ,
ధన్యవాదాలు. మీ అందరి సహకారం ఇలాగే నిరాటంకంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఎప్పటికప్పుడు మీకు తోచిన, మీరు సిద్ధం చేసిన, మీరు విన్న కొత్త సమస్యలను పంపిస్తూ బ్లాగును సుసంపన్నం చేయవలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76806679099726265542011-04-23T23:03:28.345+05:302011-04-23T23:03:28.345+05:30శంకరయ్య గారు!
ఆచార్య ఫణీంద్రగారి సలహాను నేను బలపరు...శంకరయ్య గారు!
ఆచార్య ఫణీంద్రగారి సలహాను నేను బలపరుస్తున్నాను. ప్రతి సమస్యకు రెండు(కనిష్టం) నుండి అయిదు(గరిష్టం) పూరణలు ఎంపిక చేసి ఒక గ్రంథాన్ని సంకలనం చేయండి. ఇంతవరకు మీ సమస్యలను పూరించిన అందరి పద్యాలలో సాధ్యపడినంత వరకూ కనీసం ఒక్కొక్కరివి ఒక్కటైనా వచ్చేలా ప్రయత్నం చేయండి. ఇక గ్రంథముద్రణ మంటారా ఇంతమంది పూరకులున్నాం. తలా ఒక చెయ్యి వేస్తే సరి.mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51427941915263656222011-04-23T20:50:12.448+05:302011-04-23T20:50:12.448+05:30గురువుగారూ!ఎందఱో మహానుభావులు. అందులో మీరొకరు.గురువుగారూ!ఎందఱో మహానుభావులు. అందులో మీరొకరు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70551914440088037882011-04-23T18:35:41.734+05:302011-04-23T18:35:41.734+05:30శంకరయ్య గారు!
ముందుగా మీకు అభినందనలు! ఒక ఉచిత సలహా...శంకరయ్య గారు!
ముందుగా మీకు అభినందనలు! ఒక ఉచిత సలహా -
చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా 365 సమస్యలు పూర్తయ్యాక, ప్రతి సమస్యకు వచ్చిన పూరణలలో ఉత్తమోత్తమమైనవి ఒకటి లేక రెండు ఏరి చేర్చి, మీరు సంకలన కర్తగా ఒక గ్రంథాన్ని ముద్రిస్తే, ఆ గ్రంథం పద్య ప్రేమికులకు ఒక కర దీపికగా తెలుగు సాహిత్య రంగంలో ( ముద్దు కృష్ణ గారి "వైతాళికులు" లాగా, లేదా వేటూరి ప్రభాకర శాస్త్రి గారి "చాటు పద్య మణి మంజరి" లాగా ) శాశ్వతంగా నిలిచిపోతుందని నా భావన. గ్రంథ ముద్రణకు ఎవరైనా దాత ముందుకు వస్తే ... అందుకు ప్రయత్నించండి.డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87219169767037210832011-04-23T18:12:43.944+05:302011-04-23T18:12:43.944+05:30శంకరం మాస్టరు గారూ!నమస్కారములు.
మాకంటె పెద్ద స...శంకరం మాస్టరు గారూ!నమస్కారములు.

మాకంటె పెద్ద సమస్యనే మీరు ప్రతి రోజూ యెదుర్కొంటారనుకుంటాను.రోజుకొక్క సమస్యను వదలకుండా ఇవ్వడమే పెద్ద సమస్య అని నాఉద్దెశ్యం.కాని మీరు అనితర సాధ్యంగా అధిగమిస్తున్నారు.
నా సూచన యెమిటంటే.. ఒక సమస్యను ఒకరిద్దరు పూరించగానే మిగిలిన కవి మిత్రులు పూరించినవాటిని కూడ అనుసరణ అనుకరణ అనుకుంటారేమోనని పంపలేక పోవుచున్నారు.అందరూ పాల్గొనాలంటే ఒక మార్పు చేస్తే బాగుంటుంది.ఈ రోజు ఇచ్చిన సమస్యల పూరణలు మీరు మరుసటి రోజు క్రొత్త సమస్యను ఇస్తూ మాత్రమే వీక్షణకు వుంచాలి.మీ పరిష్కారములు కవి మిత్రుల పరస్పర వ్యాఖ్యలు కూడా ఆరోజే కొనసాగుతాయి.
ఇది సూచన మాత్రమే. సాధ్యాసాధ్యములను,వీలును బట్టి నిర్ణయించగలరు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87823414550904645812011-04-23T17:50:05.669+05:302011-04-23T17:50:05.669+05:30శంకరం మాస్టరు గారూ!నమస్కారములు.
ఆ.వె. ...శంకరం మాస్టరు గారూ!నమస్కారములు.

ఆ.వె. కోరి తెచ్చు కొనును క్రొత్త సమస్యలు
దినము దినము విడని దీక్ష తోడ!
ఉంచ బోక వాటి పంచు నందరకును
శక్తి జూపి విప్ప, శంకరార్య!

మాబోటి పద్య రచనయందాసక్తి ఉన్న ఉత్సాహవంతులకు యెంతో ప్రోత్సాహాన్నందించి తప్పొప్పులను సవరించుచూ ఉచితరీతిని మీరు చేయుచున్న సాహిత్య సేవకు మా నమోవాకములు.ఈ యజ్ఞము ఇలాగే కొనసాగాలని మా ఆకాంక్ష.
ఇంకా యెందరో ఉత్సాహవంతులు పాలు పంచుకొని ఈ శంకరాభరణాన్ని సుసంపన్నం చేయాలి.వీక్షకులు కూడా వ్యాఖ్యలు చేసి అదనపు శొభ చేకుర్చాలని నా అభిలాష.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19107317859977196632011-04-23T10:35:23.128+05:302011-04-23T10:35:23.128+05:30గురువుగారూ! అభినందనలు.
అంతరాయాలను మీ పట్టుదలతో, మి...గురువుగారూ! అభినందనలు.
అంతరాయాలను మీ పట్టుదలతో, మిత్రగణ ప్రీతి పూర్వక సహాయ సహాకారాలతో ఛేదించుకుంటూ కొనసాగుతున్న మీకు జేజేలు.
నేను వారిలో ఒకరిని కానందుకు చింతిస్తున్నాను.

ఉడుతా సాయంగా సమస్యల (భావరూపం మాత్రం) ను అందజేయగలిగినందుకు సంతోషంగా ఉంది.
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు.
నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్.
నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.
తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్.
ఖరమె మన కొసంగు ఘనసుఖములు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63474967730016244982011-04-23T10:02:14.399+05:302011-04-23T10:02:14.399+05:30శంకరయ్య మాస్టారూ, మనం 365 సమస్యలు పూరించి వార్షికో...శంకరయ్య మాస్టారూ, మనం 365 సమస్యలు పూరించి వార్షికోత్సవం జరుపుకోవాలని యెన్నో సార్లు అనుకోవటం, మీకు ఈమెయిలు వ్రాయటం జరిగింది "రోజుకో సమస్య" అంటూ. ఇంకొక 49 సమస్యలు ఇస్తే (పూరిస్తే) మనకి పండగే! అందరి సమిష్టి కృషి అని మీరు మెచ్చుకోవటం మాకు ఆనందం అయినా మీరు భీష్మ ప్రతిజ్ఞ లాగా నిర్వహించటం ముదావాహము.
ఈశ్వర స్సదా త్వాంచ రక్షతు|
జీవనం తవ భవతు సార్థక:||చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13889882781723130792011-04-23T09:48:16.293+05:302011-04-23T09:48:16.293+05:30బావుందండి. మీరు అలా ప్రచురించినప్పటికీ, దీనివెనుక ...బావుందండి. మీరు అలా ప్రచురించినప్పటికీ, దీనివెనుక ఎంత శ్రమ ఉందో సహృదయులు గ్రహిస్తారు. నావి ఓ నాలుగు సమిధలు ఉన్నాయండి.

అత్తకు కన్ను గీటె నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్.
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.
వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్.

చందమామను ముద్దాడసాగె చీమ
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ

పై ఆరు సమస్యలలో మొదటి నాలుగు నా ఊహలోనివి. మిగిలిన రెండు పుస్తకాలలో చూసి నేను సూచించినవి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88590451054542103152011-04-23T08:18:06.480+05:302011-04-23T08:18:06.480+05:30శంకరార్యా !
ఇదొక అద్భుతం !
దీనిద్వారా గిన్నిస్ లే...శంకరార్యా !
ఇదొక అద్భుతం !
దీనిద్వారా గిన్నిస్ లేదా లిమ్కా
రికార్డు సాధించ వచ్చునేమో !

ప్రయత్నించండి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55337746608973252742011-04-23T07:45:19.321+05:302011-04-23T07:45:19.321+05:30బాగుందండీ. అవధానాల్లో సమస్యలనిచ్చే పృచ్ఛకులకు ఇదో ...బాగుందండీ. అవధానాల్లో సమస్యలనిచ్చే పృచ్ఛకులకు ఇదో మంచి రిఫరెన్స్. అభినందనలు.ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.com