tag:blogger.com,1999:blog-6769183920316093900.post4563724593583142724..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణ - 1760 (రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90075199579000075282015-08-15T05:36:40.573+05:302015-08-15T05:36:40.573+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46760289070977762002015-08-14T22:55:27.566+05:302015-08-14T22:55:27.566+05:30ముద్దు మోము జూడ మునులు దమ్ము మరచి
మోహపారవశ్య మొనర...ముద్దు మోము జూడ మునులు దమ్ము మరచి
మోహపారవశ్య మొనరగా వి
వశులగు విధమరయ వైకుంఠపతి రఘు
రాముఁ డుండుచోటఁ గాముఁ డుండుSumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10024281385306890962015-08-14T22:41:08.298+05:302015-08-14T22:41:08.298+05:30 ఆ.వె:రాముడనెడి వాడు కాముడనెడివాడు
... ఆ.వె:రాముడనెడి వాడు కాముడనెడివాడు
మంచి స్నేహితులట మహిని;కాముఁ
గూర్చి యడుగ పల్కె గూఢముగ నొకడు
రాము డుండు చోట కాము డుండు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31959541975298911062015-08-14T22:09:08.479+05:302015-08-14T22:09:08.479+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి....మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండుపూరణాలలో ‘గాము-డుండు’ అని పదచ్ఛేదం చేసారు. ‘డుండు’ అర్థరహితమౌతున్నది కదా!

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మంథా శ్యామల గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35282319172352699912015-08-14T20:46:28.708+05:302015-08-14T20:46:28.708+05:30"శరము లెక్కుపెట్టు శాస్త్ర పారీణుడు
మదను బాణమ...
"శరము లెక్కుపెట్టు శాస్త్ర పారీణుడు
మదను బాణములకు మరులు గోనగ
సీతతోడ గలసి ఏకాంతమందుండ
రాముడుండుచోట కాముడుండు"Anonymoushttps://www.blogger.com/profile/09430520581915556715noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7698397853545794922015-08-14T20:29:33.256+05:302015-08-14T20:29:33.256+05:30సీత భర్త యగును సేమంపు శ్రీకర
రాము,డుండు చోట కాముడు...సీత భర్త యగును సేమంపు శ్రీకర
రాము,డుండు చోట కాముడుండు.
సోముడుండు చోటు శోభనకరమౌను
దీనికింత యేల?తెగని చర్చ.Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17774863833484498432015-08-14T19:56:54.728+05:302015-08-14T19:56:54.728+05:30
కామవాంచ రేపు కాంతల చందమ్ము
అర్ధ నగ్న రీతి నతిశయి...
కామవాంచ రేపు కాంతల చందమ్ము
అర్ధ నగ్న రీతి నతిశయించి
వేల్వరించి జూపు వీడుల మదనాభి
రాముడుండు చోట కాముడుండు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29572243760069198282015-08-14T19:42:08.632+05:302015-08-14T19:42:08.632+05:30ధర్మరూపుడతడు తారకరాముడు
సీతయందె తానుచెందుకోర్కె,
న...ధర్మరూపుడతడు తారకరాముడు
సీతయందె తానుచెందుకోర్కె,
నడవియైనగాని,యామెతో కలసియు
రాముడుండు చోట గాముడుండు

విష్ణువతడు తలప వే సీత భర్తయే
కనగనతని సుతుడె కాముడెలమి
ఒకతె పత్నియనుచు నొప్పెడు సీతతో
రాముడుండు చోట గాముడుండు

సీత రావణుండు జేకొని పోవగా
రాముడామె కొరకు రాజితముగ
కుములుచుండ,నామెకొరకటు వెదికెడి
రాముడుండు చోట గాముడుండు

గాము=తాపము

రావణుండు తాను రాముని భార్యను
తస్కరింపగాను,తాపమందె
రామ తాపమదియె రావణుజంపెగా
రాముడుండుచోట గాముడుండు

గాము=తాపముAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22957492569910470082015-08-14T18:28:47.475+05:302015-08-14T18:28:47.475+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘వంచన+ఉండు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘జతగ+ఉండు= జతగనుండు’ అవుతుంది. ‘చింతలు+ఉన్నట్లు, బలము+ఉన్న, మనసు+ఉన్న’ అన్నచోటుల్లో సంధి నిత్యం. యడాగమం వస్తుంది. ‘నిష్ఠురము’ సరియైన శబ్దం.

కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61437380406217619682015-08-14T18:19:15.402+05:302015-08-14T18:19:15.402+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రంభ మేనకలకు ప్...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

రంభ మేనకలకు ప్రముఖత గల్పించి
తాపసులిల కామ దాసులవగ
పదవి నిలుపు కొనుచు భయముతో బ్రతుకు సు
త్రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు.Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82993246223376412352015-08-14T15:03:02.658+05:302015-08-14T15:03:02.658+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
కవి ...శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
కవి పండితులందరికీ ముందుగా స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు..

అనవరతము భక్త హనుమంతుడు నిలచు
రాముఁ డుండు చోటఁ, గాముఁ డుండు
ఖలుల నిలయ మైన కలియుగమందున
రాజ్యమేలు చుండు రక్కసి వలె! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89730539582355671562015-08-14T13:55:26.633+05:302015-08-14T13:55:26.633+05:3014.8.15.ప్రేమలెక్కువైన?పెత్తనమున్నట్లు
మంచియున్న చ...14.8.15.ప్రేమలెక్కువైన?పెత్తనమున్నట్లు
మంచియున్న చోట?వంచనుండు|
ధర్మ మున్నచో?నధర్మముజతగుండు
రాముడుండుచోట గాముడుండు|
2.సిరులు మెండుగున్న?చింతలు యున్నట్లు
కండబలముయున్న?కలతలట్లు
నిండుమనసుయున్న?నిష్టూర మున్నట్లు
రాముడుండు చోట?గాముడుండు|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75437330056556346052015-08-14T13:52:23.698+05:302015-08-14T13:52:23.698+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృంద...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

మనసు మనసు కలిసె! మనువాడ మనసయ్యెఁ!
బెద్ద లనుమతింపఁ బ్రేమతోడి
విరులుఁ గురిసె! నట్టి ప్రేయసీ హృదయాఽభి
రాముఁ డుండు చోటఁ, గాముఁ డుండు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40286603694199712952015-08-14T13:47:15.805+05:302015-08-14T13:47:15.805+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-541643001164283972015-08-14T13:44:45.433+05:302015-08-14T13:44:45.433+05:30చూచి రామవిభుని శూర్పణఖ తలచె
నేమి సొగసు వీని దేమి ఠ...చూచి రామవిభుని శూర్పణఖ తలచె
నేమి సొగసు వీని దేమి ఠీవి!
వలచి వీని నిపుడె వలపించుకొందును
రాముడుండుచోటఁ గాముడుండు. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27150327104049250742015-08-14T13:43:46.730+05:302015-08-14T13:43:46.730+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14676642318219659222015-08-14T13:35:39.419+05:302015-08-14T13:35:39.419+05:30శ్రీగురుభ్యోనమ:
నూత్న యవ్వనమున నూనూగు మీసాల
సోయగమ...శ్రీగురుభ్యోనమ:

నూత్న యవ్వనమున నూనూగు మీసాల
సోయగములు గలిగి సుందరుండు
శివుని ధనువు విరచి సీతను జేరిన
రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77417671206744202062015-08-14T13:30:09.426+05:302015-08-14T13:30:09.426+05:30బూసారపు నర్సయ్య గారూ,
మీ రెండవ పూరణ వేమన పద్యాన్న...బూసారపు నర్సయ్య గారూ,
మీ రెండవ పూరణ వేమన పద్యాన్ని తలపించింది. పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49249723526011072592015-08-14T12:15:31.562+05:302015-08-14T12:15:31.562+05:30మఘవుడు సతతమ్ము మదను పాలి బడుచు
తిరుగుచుండునెపుడు త...మఘవుడు సతతమ్ము మదను పాలి బడుచు
తిరుగుచుండునెపుడు తరుణి వెంట
కరము తృష్ణ తోడ, కాన సురపతి సు
త్రాముఁడుండుచోటఁగాముఁడుండుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63908737335773598272015-08-14T11:25:49.699+05:302015-08-14T11:25:49.699+05:30బూసారపు నర్సయ్య గారి రెండవ పూరణ........
కాముఁ డుం...బూసారపు నర్సయ్య గారి రెండవ పూరణ........

కాముఁ డుండకున్న రాముఁ డెట్లుండును?
రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు;
మొదలులేని చివర మొదటనే లేదయా
మొదలు చివర కలియ మోక్షమౌను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9574072014243082442015-08-14T10:37:21.057+05:302015-08-14T10:37:21.057+05:30బుసారపు నర్సయ్య గారూ (నిజానికి “నర్సన్నా” అనాలి......బుసారపు నర్సయ్య గారూ (నిజానికి “నర్సన్నా” అనాలి... కాని తప్పదు!),
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-666625895209882842015-08-14T10:35:52.328+05:302015-08-14T10:35:52.328+05:30బూసారపు నర్సయ్య గారి పూరణ.......
ఆత్మయందు లోక మావ...బూసారపు నర్సయ్య గారి పూరణ.......

ఆత్మయందు లోక మావిర్భవించెను
చిత్ర మేమి లేదు చిన్మయంబె
యఖిలలోక మనఁగ నంద ఱుందురు గదా
రాముఁ డుండుచోటఁ గాముఁ డుండు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47649056420209882272015-08-14T10:21:40.552+05:302015-08-14T10:21:40.552+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కవి రామమునిరెడ్డి (రామా మునిరెడ్డి?) గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3293011874811066822015-08-14T10:08:48.963+05:302015-08-14T10:08:48.963+05:30
దశరథాత్మ జుండు ధరణిజ సోముండు; పతిత పావనుండు భద...
దశరథాత్మ జుండు ధరణిజ సోముండు; పతిత పావనుండు భద్రమూర్తి;కామితార్థ దుండు;కల్ప తరు సముడు; రాముడుండు చోట గాముడుండు . poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68129440306788553362015-08-14T10:08:47.362+05:302015-08-14T10:08:47.362+05:30
దశరథాత్మ జుండు ధరణిజ సోముండు; పతిత పావనుండు భద...
దశరథాత్మ జుండు ధరణిజ సోముండు; పతిత పావనుండు భద్రమూర్తి;కామితార్థ దుండు;కల్ప తరు సముడు; రాముడుండు చోట గాముడుండు . poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.com