tag:blogger.com,1999:blog-6769183920316093900.post5396084841840523284..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1180 (శిష్టజనాళి మెచ్చెదరె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34250914804544507752019-09-13T15:21:14.671+05:302019-09-13T15:21:14.671+05:30స్పష్టపు మంత్రరాజముల సంస్కృత భాషను నేర్వకుండయే
తు...స్పష్టపు మంత్రరాజముల సంస్కృత భాషను నేర్వకుండయే
తుష్టియు తృప్తి లేక వడి తోకలు కోయుచు తంత్రమందునన్
పుష్టిగ రూకలందుకొని పూజలు చేయగ మందిరమ్ములన్
శిష్ట జనాళి మెచ్చెదరె? శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
సుష్టుగ కొల్వుమోరి నిజ సుందర మందిర హృత్తునందునన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31846358659238563662013-09-21T09:50:46.177+05:302013-09-21T09:50:46.177+05:30శ్రీ పండిత నేమాని గారికి నమస్కారము , మరియు ధన్యవాద...శ్రీ పండిత నేమాని గారికి నమస్కారము , మరియు ధన్యవాదాలు మీ సూచనల పాటించి సవరించిన పూరణ

అష్టమ గర్భమందు సురలందరు మెచ్చగ పుణ్య శీలికిన్
దుష్టుల మట్టుబెట్ట మును తోయజనేత్రుడు బుట్టెనంద్రు, ప
ల్కష్టము లన్నిదీర్చి మము కావగ బుట్టుము వెండి ,లేనిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీ రమణీహృదయేశు నచ్యుతున్!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27567674643678504192013-09-21T00:16:15.365+05:302013-09-21T00:16:15.365+05:30నమస్కారములు
అన్వయమును సరిజేయుట నాకు సరిగా చేత కాల...నమస్కారములు
అన్వయమును సరిజేయుట నాకు సరిగా చేత కాలేదు గురువులు మన్నించ గలరు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20513826724857900592013-09-20T23:43:01.532+05:302013-09-20T23:43:01.532+05:30గురువుగారూ,
మీకు అనేకానేక ధన్యవాదాలండి.గురువుగారూ,
మీకు అనేకానేక ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47265801144915665062013-09-20T23:07:43.033+05:302013-09-20T23:07:43.033+05:30లక్ష్మీదేవి గారూ,
సవరించిన మీ పూరణ చాలా బాగుంది. ...లక్ష్మీదేవి గారూ,
సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14268347037892648672013-09-20T22:46:41.743+05:302013-09-20T22:46:41.743+05:30హృష్టి భజింప అని గమనించవలసినది.
హృష్టి భజింప అని గమనించవలసినది.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78929853193707194692013-09-20T22:44:54.675+05:302013-09-20T22:44:54.675+05:30గురువు గారు, ధన్యవాదములు.
పెద్దవారి సూచించిన యతిమ...గురువు గారు, ధన్యవాదములు.

పెద్దవారి సూచించిన యతిమైత్రి దోషమును గమనించి, భావము కూడా సిరిని , హరిని అధిక్షేపించినట్లు కాకుండా వేరొక పూరణ చేసినాను.

దుష్టులు దీనులన్ మిగుల ధూర్తత తోడను బాధవెట్టుచున్
కష్టపు కాలమందు కడకంటి కటాక్షము కోర వచ్చినన్
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ? హృదయేశు నచ్యుతున్
హృష్టిని దల్ప సత్త్వసిరి హృత్పదమందున నిల్చు నెప్పుడున్.
శిష్ట జనాళి మెచ్చగను శిష్టత నిల్పుము నామనమ్మునన్.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85676918506020451562013-09-20T22:33:15.776+05:302013-09-20T22:33:15.776+05:30తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పూరణ బాగుంది...తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘నిర్దిష్ట’ సాధురూపం. ‘భ్రష్టుల’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23366551856740297412013-09-20T22:23:52.629+05:302013-09-20T22:23:52.629+05:30నిజమే గురువుగారూ!!
తప్పిదమే. పొరబడ్డాను. సవరించిన...నిజమే గురువుగారూ!!

తప్పిదమే. పొరబడ్డాను. సవరించినందులకు ధన్యవాదములు.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22418452752360719462013-09-20T21:44:27.515+05:302013-09-20T21:44:27.515+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
దుష్టచతుష్...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

దుష్టచతుష్టయం బకట! దుష్టపు కార్యము లెన్నొసల్పి ని
ర్దుష్ట ప్రణాళికన్ సభకు దూతగ వచ్చిన వాని దూరుటల్
శిష్ట జనాళి మెచ్చెదరె? శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
భ్రష్టుల పోయె కాలమిక వచ్చె ననెన్ కురు భీష్ముడంతటన్
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87746147582882063492013-09-20T21:41:22.930+05:302013-09-20T21:41:22.930+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60355437041367427952013-09-20T21:07:14.938+05:302013-09-20T21:07:14.938+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభిన...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సంతస మందుదురు’... ‘సంతస మందురు’ అయింది. ‘సంతస మందెద రీ ధరాస్థలిన్’ అందామా?

గుండు మధుసూదన్ గారూ,
పూరణలో ‘మెచ్చెదరె’ తర్వాత ప్రశ్నార్థకం ఉండడంవల్ల ఆ విధంగా పొరపాటు జరగడానికి అవకాశం కలిగింది. ప్రశ్నార్థకంతో వ్యాక్యం పూర్తయి, తరువాత చెప్పిన అంశము మరో వాక్యం అనుకున్నాను.
మీ వివరణ యుక్తంగా, సమర్థనీయంగా ఉంది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48349897143898738432013-09-20T17:31:54.051+05:302013-09-20T17:31:54.051+05:30తప్పిదిము జరిగినది సవరణతో...................
కష్ట...తప్పిదిము జరిగినది సవరణతో...................

కష్టము లెక్కువై ప్రజలు గమ్యము తోచక భారమైన యీ
భ్రష్టపు జీవితమ్ములను బాగుగ జేయుట యెట్టులంచు నా
యిష్టపు దేవునిన్ గొలువ యిమ్మగ విష్ణువు కావకుండినన్
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్ బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21316725520030570342013-09-20T17:13:33.204+05:302013-09-20T17:13:33.204+05:30మిత్రులు కంది శంకరయ్యగారికి నమస్కారములు. నా భావన ఏ...మిత్రులు కంది శంకరయ్యగారికి నమస్కారములు. నా భావన ఏమనఁగా...

"శిష్టజనాళి
అచ్యుతుని మనమున నిల్పి,
భజించి,
కొల్చి,
సంతుష్టునిఁ జేయు వస్తుతతిని నిడి,
మెచ్చ్చునట్లుగా...
రావణుని మెచ్చెదరా?" అని!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19792641614927095392013-09-20T17:07:36.632+05:302013-09-20T17:07:36.632+05:30దుష్టకృతంబులన్ పరులదూరుట సజ్జనమానవాళికిన్
కష్టము క...దుష్టకృతంబులన్ పరులదూరుట సజ్జనమానవాళికిన్
కష్టము కల్గఁజేయుటలకారణవైరములాత్మసంస్తుతుల్
శిష్టజనాళి మెచ్చెదరె, శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
స్రష్టసుపూజితున్ గొలిచి సంతసమందురు గాదె నిద్ధరన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17774826616235522382013-09-20T15:52:08.924+05:302013-09-20T15:52:08.924+05:30అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవిగారూ! శుభాశీస్సులు.
మ...అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవిగారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన: 4వ పాదములో యతి మైత్రిని మీరు పాటించినట్లు లేదు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30684065844216206542013-09-20T15:47:58.845+05:302013-09-20T15:47:58.845+05:30శ్రీ కంది శంకరయ్య గారూ!
ఈ నాటి సమస్య "శిష్ట జ...శ్రీ కంది శంకరయ్య గారూ!
ఈ నాటి సమస్య "శిష్ట జనాళి మెచ్చెదరె" అను దానిని అదే అర్థములో (ప్రశ్నార్థకముగా)నుంచుట సనాతన ధర్మ పరాయణులమైన మనకు భావ్యము కాదు. శ్రీహరి సంకల్పములను కాని, చేష్టలను కాని మెచ్చక యెవరమైన ఆ స్వామి పట్ల కృతజ్ఞతలేని భావముతో ఉండగలమా. ఎందుకో నాకు మిత్రుల పూరణలను చూచిన తరువాత మనస్సులో కొంత వెలితి గోచరించుచున్నది. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23661056021033313442013-09-20T15:41:00.326+05:302013-09-20T15:41:00.326+05:30శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ ...శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సూచనలు:
1. 1వ పాదములో యతి మైత్రి మీరు పాటించలేదు.
2. 2వ పాదములో "తోయదళాక్షుడు" అనుట సరికాదు. తోయజదళాక్షుడు అనుట సాధువు. గణముల కొరకు "తోయజనేత్రుడు" అనండి.
3. 3వ పాదములో మళ్ళికి బదులుగా "వెండి" అనండి.
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64008279314999945712013-09-20T15:05:18.969+05:302013-09-20T15:05:18.969+05:30మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82768820707057626432013-09-20T14:50:11.484+05:302013-09-20T14:50:11.484+05:30అష్టమ గర్భమందు చెర సాలన దేవకి పుణ్య శీలికిన్
దుష్ట...అష్టమ గర్భమందు చెర సాలన దేవకి పుణ్య శీలికిన్
దుష్టుల మట్టుబెట్ట మును తోయదళాక్షుడు బుట్టెనంద్రు, ప
ల్కష్టము లన్నిదీర్చి మము కావగ బుట్టుము మళ్ళి ,లేనిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీ రమణీహృదయేశు నచ్యుతున్మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91411110517226455382013-09-20T14:49:56.907+05:302013-09-20T14:49:56.907+05:30గుండు మధుసూదన్ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పార...గుండు మధుసూదన్ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
‘సంతుష్టునిఁ జేతు’ అంటే బాగుంటుందేమో?

రాజేశ్వరి అక్కయ్యా,
మంచి ప్రయత్నం చేసారు. మీ పూరణలో అన్వయం లోపించినట్లుంది. ఒకసారి పరిశీలించండి.

వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
‘దేవకికి నష్టమ..’, ‘సాధ్విని నొంటిదాని..’, ‘భయదోజ్వల..’ అనండి.

పండిత నేమాని వారూ,
నిశ్చయార్థంగా మీరు వ్రాసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
వైవిద్యమైన విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందలు.

చింతా రామకృష్ణారావు గారూ,
కాలానుగుణమైన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘దినం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘రాజ్యములోన నిప్పుడే’ అందామా?

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘భ్రష్టము’ సాధురూపం.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85059933971251502292013-09-20T13:26:31.668+05:302013-09-20T13:26:31.668+05:30దుష్టుల సంహరించెదను దూరముజేసెద కష్టనష్టముల్
శిష్...దుష్టుల సంహరించెదను దూరముజేసెద కష్టనష్టముల్
శిష్టుల రక్ష జేతునని చెప్పెను గీతను చూడ నీధరన్
కష్టము లెక్కువాయె మరి గావగ నాతడు చేర రానిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26284858202296179312013-09-20T13:18:00.440+05:302013-09-20T13:18:00.440+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24692580714527719912013-09-20T13:14:21.203+05:302013-09-20T13:14:21.203+05:30
పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
దుష్టుల...
పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

దుష్టులు ప్రాణ మానములు దోచుచుధర్మమతిక్రమింపగా
శిష్ట జనాళి మెచ్చెదెరె ?శ్రీ రమణీ హృదయేశునచ్యుతున్
కష్టములన్ని దీర్చగను కాపురుషాళి వధించి చెచ్చెరన్
శిష్టుల బ్రోచి ధర్మమును స్త్రీలను రక్షణ సేయగోరరే

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33585292961012545332013-09-20T12:27:09.990+05:302013-09-20T12:27:09.990+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.com