tag:blogger.com,1999:blog-6769183920316093900.post5444192639336999610..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1556 (ఛీత్కరించఁ దగును)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20146225624745311982014-11-30T21:38:13.489+05:302014-11-30T21:38:13.489+05:30కిశోర్ జీ ! బాగానే ఉన్నాను. మీరు బాగున్నారా ? పని ...కిశోర్ జీ ! బాగానే ఉన్నాను. మీరు బాగున్నారా ? పని హెచ్చి తీరిక తగ్గింది . తీరిక దొరికితే కొద్దిగా చదువుకుంటున్నాను. మిత్రుల పూరణ లద్భుతము.

బి.ఎస్.ఎస్. ప్రసాద్ గారూ ! నమస్సులు. " తస్కరించ స్వామి ధనము సిగ్గునొదలి " ని " తస్కరించ స్వామి ధనము సిగ్గు వదలి " అందాము.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1285757135937772432014-11-30T18:45:54.466+05:302014-11-30T18:45:54.466+05:30శ్రీ వసంత కిశోర్ గారికి నమస్సులు.
విద్యాలయంలో బాధ...శ్రీ వసంత కిశోర్ గారికి నమస్సులు.
విద్యాలయంలో బాధ్యతలు పెరిగాయి. Vice Principal గా ప్రమోట్ అవటం వల్ల పని వత్తిడి ఎక్కువగా ఉండి పద్య రచన కొంచెం కుంటు పడింది. మరియు ప్రస్తుతం నా శతక రచన పని ఒక కొలిక్కి రాబోతున్నది. అందువల్ల, శంకరాభరణం బ్లాగ్ రోజూ చూస్తూ ఉన్నప్పటికీ పద్య రచన మాత్రం జరగటం లేదు. మీరు నేర్పిన ఛందస్సు పాఠాలు నాకు ఇంకా గుర్తుకు ఉన్నాయి.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27515387015545726892014-11-30T18:25:13.453+05:302014-11-30T18:25:13.453+05:30శ్రీగురుభ్యోనమ:
ఛీత్కరించ దగును శిష్ఠ జనుల ననుచు
...శ్రీగురుభ్యోనమ:

ఛీత్కరించ దగును శిష్ఠ జనుల ననుచు
నసురులెల్ల కలసి ముసురుకొనుచు
మునుల జనుల సురుల దునుమాడు చుండగా
నవతరించె విష్ణు వాదుకొనుచు శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9413132411135710682014-11-30T17:43:35.974+05:302014-11-30T17:43:35.974+05:30"ఛీత్కరింపదగును ;శిష్ట జనుల" మని
తమకు తా..."ఛీత్కరింపదగును ;శిష్ట జనుల" మని
తమకు తామె తలచి,తక్కు వారి
నధము లనుచు తిట్టు నధమాధముల నెల్ల
పూజ సేయవలయు పుణ్యమతుల

సత్య,శౌచ,ధర్మ చరులు కాకున్నచో
ఛీత్కరింపదగును;శిష్ట జనుల
నెల్ల గౌరవింప నెల్లరు ధరణిలో,
సంఘ మపుడు నుండు చల్లగాను

దయయు లేక వారు దారుణంబే జేయ
ఛీత్కరింప దగును శిష్టజనుల;
మ్లేచ్ఛులైన గాని మెచ్చగ దగునుగా
దయయు సత్యమవియు తాము పొందAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48043312883729826472014-11-30T17:05:18.429+05:302014-11-30T17:05:18.429+05:30కె.ఈశ్వరప్ప గారి పూరణ
చదువు కొన్న గాని సంస్కార హ...కె.ఈశ్వరప్ప గారి పూరణ

చదువు కొన్న గాని సంస్కార హీనుని
లంచ వంచనాల లాభ పరుని
ఛీత్కరించ దగును, శిష్ట జనుల
హితమె లోక రక్ష గతము నేడు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32715026800234644592014-11-30T15:54:08.407+05:302014-11-30T15:54:08.407+05:30చెడ్డ వారు తెల్పు శ్రీరంగ నీతులు
ఛీత్కరించ దగును, ...చెడ్డ వారు తెల్పు శ్రీరంగ నీతులు
ఛీత్కరించ దగును, శిష్ట జనుల
మార్గ మందు నడువ మన్ననలు కలిగి
జయము గల్గు చుండు జగతి లోన
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86593995115170716192014-11-30T15:32:34.433+05:302014-11-30T15:32:34.433+05:30కె .యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
కష్టము లొనగూ...కె .యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ

కష్టము లొనగూర్చు దుష్టజనుల నెల్ల
ఛీత్కరించఁ దగును. శిష్టజనుల !
సథ్కరి౦ఛ దగును.సంచరించు నెపుడు
మంచి చెడుల నెరుగు మనసు తోడ

నవంబర్ 30, 2014 3:29 PM
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2246943809753487982014-11-30T12:52:06.623+05:302014-11-30T12:52:06.623+05:30 సేవఁ జేయఁ జేరి శిష్టుల మంచును
దైవ ధనము బుక్కు యావ... సేవఁ జేయఁ జేరి శిష్టుల మంచును
దైవ ధనము బుక్కు యావ పెరిగి
మాయ దారి పనుల మర్మంబుగా జేయ
ఛీత్కరించఁ దగును శిష్టజనుల !
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67786909982824627322014-11-30T12:08:29.940+05:302014-11-30T12:08:29.940+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

మనవారైనా పెరవారైనా - ధనికులైనా రాజులైనా - శిష్టులైనా భ్రష్టులైనా - శిక్షించ వలెనుగా :

01)

తస్కరణయు హత్య ♦ తరుణుల పీడించు
తప్పు జేయు వారి ♦ నొప్ప వలదు
తప్పు జేయువారు ♦ ధనికులౌ రాజులౌ
ఛీత్కరించఁ దగును ♦ శిష్టజనుల !
____________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12589114799478639682014-11-30T12:01:57.640+05:302014-11-30T12:01:57.640+05:30మూర్తీజీ ! బహుకాల దర్శనం ! బావున్నారా !
వామనకుమార...మూర్తీజీ ! బహుకాల దర్శనం ! బావున్నారా !

వామనకుమార్ గారూ మీరు కూడా చాలా రోజు లైనది కనుపించి ! బావున్నారా !
వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59098150687950158562014-11-30T11:09:08.343+05:302014-11-30T11:09:08.343+05:30సత్య దూరులనటు నిత్యంబు సేవించి
వారి సేవ లోన వరుస ...సత్య దూరులనటు నిత్యంబు సేవించి
వారి సేవ లోన వరుస గాను ,
చేయ రాని పనులు చేవగా చేయంగ
ఛీత్కరించ c దగును శిష్ట జనుల
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33065800772333511842014-11-30T11:09:07.352+05:302014-11-30T11:09:07.352+05:30సత్య దూరులనటు నిత్యంబు సేవించి
వారి సేవ లోన వరుస ...సత్య దూరులనటు నిత్యంబు సేవించి
వారి సేవ లోన వరుస గాను ,
చేయ రాని పనులు చేవగా చేయంగ
ఛీత్కరించ c దగును శిష్ట జనుల
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15579155610372724342014-11-30T11:05:54.379+05:302014-11-30T11:05:54.379+05:30దుష్ట జనుల కెపుడు దూరమ్ము గా నుండి
ఛీత్క రించ దగున...దుష్ట జనుల కెపుడు దూరమ్ము గా నుండి
ఛీత్క రించ దగును, శిష్ట జనుల
నెపుడు చూడ వలయు నింపగు పేర్మితో
మంచి పెంచు కొరకు మహిని సతముA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36428659334298204352014-11-30T10:28:42.981+05:302014-11-30T10:28:42.981+05:30దుష్ప్రవర్తులైన దుష్టుల సంగతి
నెంచగాను ఛీత్కరించదగ...దుష్ప్రవర్తులైన దుష్టుల సంగతి
నెంచగాను ఛీత్కరించదగును
శిష్ట జనుల ఘనము సేవించుచుండిన
జనులు మెత్రు జన్మ ధన్యమగునుమారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13512704699197088842014-11-30T10:18:33.436+05:302014-11-30T10:18:33.436+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
జనుల ...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

జనుల బాధ పెట్టు శాసనముల జేయ
ఛీత్కరించ దగును. శిష్ట జనుల
మాట వేదవాక్య మనుచు భావించుచు
గౌరవి౦ఛ దగును తోరముగను
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-111089840538778032014-11-30T10:10:06.730+05:302014-11-30T10:10:06.730+05:30సత్కరించ వలయు సత్కార్య ములయందు
విబుధ జనుల నంత వేడ్...సత్కరించ వలయు సత్కార్య ములయందు
విబుధ జనుల నంత వేడ్క తోడ ,
సత్య దూరులనటు నిత్యంబు సేవించ
ఛీ త్క రించ c దగును శిష్ట జనుల
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50372917572075738342014-11-30T08:29:14.719+05:302014-11-30T08:29:14.719+05:30గురువులకు మిత్రులకు వందనములు !
ధర్మపథముఁ దప్పి దా...గురువులకు మిత్రులకు వందనములు !

ధర్మపథముఁ దప్పి దాక్షిణ్యమును వీడి
సభకు నింతి దెచ్చి రభస జేయ,
వాయి విప్పి ఖలుల వారింప బూనరే !
ఛీత్కరించ దగును శిష్టజనుల !!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58184046883292220362014-11-30T08:24:34.351+05:302014-11-30T08:24:34.351+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24366156777647163812014-11-30T08:22:32.397+05:302014-11-30T08:22:32.397+05:30మంచి చేయువారు వంచకులైనను
వారిగొప్పయెరిగి పాడవలయు
చ...మంచి చేయువారు వంచకులైనను
వారిగొప్పయెరిగి పాడవలయు
చెడ్డపనులు చేయ చేటుకలుగు నంచు
ఛీత్కరింపదగును శిష్టజనులAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55614563378944036042014-11-30T07:44:04.927+05:302014-11-30T07:44:04.927+05:30తస్క రించ స్వామి ధనము సిగ్గునొదలి
ఛీత్కరించఁ దగున...తస్క రించ స్వామి ధనము సిగ్గునొదలి
ఛీత్కరించఁ దగును శిష్టజనుల
ధిక్క రింపు వలయు దేశ ప్రగతికోరి
నిగ్గు తేల్చ గలరు నిజము బల్కిభళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18245940832115444052014-11-30T07:25:28.659+05:302014-11-30T07:25:28.659+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
***...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

చందమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5991445312139271902014-11-30T07:24:33.304+05:302014-11-30T07:24:33.304+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
హైదరాబాదు వెళ్తున్న కారణం...కవిమిత్రులకు నమస్కృతులు.
హైదరాబాదు వెళ్తున్న కారణంగా ఈరోజు పూరణల, పద్యాల సమీక్ష చేయలేనేమో? దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81672342718035969222014-11-30T03:52:36.903+05:302014-11-30T03:52:36.903+05:30దుష్టులైనవారి దురితకార్యములను
ఛీత్కరించఁ దగును - ...దుష్టులైనవారి దురితకార్యములను
ఛీత్కరించఁ దగును - శిష్టజనుల
మంచిపనులకెపుడు కించితైనసహాయ
మందజేయ వలయునదియెహితము చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23891226989957745172014-11-30T01:19:07.480+05:302014-11-30T01:19:07.480+05:30దుష్ట జనము చేయు దుర్మార్గములిలను
చీ త్కరించ దగును,...దుష్ట జనము చేయు దుర్మార్గములిలను
చీ త్కరించ దగును, శిష్ట జనుల
బోధనల నెపుడును బూర్ణ మనసు తోడ
స్వాగ తించ వలయు సామి ! యెపుడు

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com