tag:blogger.com,1999:blog-6769183920316093900.post590305698021034297..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 552కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86914975195499768502014-03-31T23:07:25.422+05:302014-03-31T23:07:25.422+05:30నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసిన మిత్రులకు ధన్యవ...నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసిన మిత్రులకు ధన్యవాదాలు.

ఈరోజంతా పండుగ హడావుడి. మధ్యమధ్య అవకాశం దొరికినప్పుడు ‘ఉగాది కవితల’ పోస్ట్ అప్డేట్ చేస్తూ వచ్చాను. పండుగపూట పద్యాలలో దోషాలను వెదికే పని పెట్టుకోలేదు.
చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు.....
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
శైలజ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
మంద పీతాంబర్ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
మిస్సన్న గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54272040653077847952014-03-31T21:01:23.099+05:302014-03-31T21:01:23.099+05:30విభజన పాల్జేయగ నే
యభయమ్మును నమ్మ లేక యాతన పడగా
శుభ...విభజన పాల్జేయగ నే
యభయమ్మును నమ్మ లేక యాతన పడగా
శుభమై 'జయ' రావమ్మా!
యుభయుల కభివృద్ధి నీయ నూతము కమ్మా!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10782394662496835952014-03-31T18:37:08.409+05:302014-03-31T18:37:08.409+05:30 జయనామ సంవత్సర శుభా కాం క్షలు
ఇందు మొదటగా గురువుల... జయనామ సంవత్సర శుభా కాం క్షలు

ఇందు మొదటగా గురువులు కంది శంక
రయ్య ,నేమాని ,గోలివారాది కవిగ
ణంబుల కిడుచు ననిశము నతుల శతము
నందు కొనుడని బ్రార్ధింతు నాదరమున

జయము కలిగించి గావుత ! జయ మనబడు
వత్సర మెపుడు శంకరా భరణ గణపు
సోదరీ మణులు మఱియు సోదరులను
నెల్ల వేళల దప్పక చల్ల గాను
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69262953252805464522014-03-31T18:27:14.644+05:302014-03-31T18:27:14.644+05:30వేపపూవును మఱియును బెల్లము దగు
నరటి పండును మామిడి చ...వేపపూవును మఱియును బెల్లము దగు
నరటి పండును మామిడి చెరకు ముక్క
లాది గకలిపి యీదిన మార్య !చేయు
దురట పచ్చడి సుఖము బొం దుకొఱకునిల subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83582005032200312942014-03-31T18:06:40.814+05:302014-03-31T18:06:40.814+05:30భేష్ హనుమచ్చాస్త్రి గారూ! అదిరింది మీ పచ్చడి!భేష్ హనుమచ్చాస్త్రి గారూ! అదిరింది మీ పచ్చడి!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14459503890065076292014-03-31T18:03:11.807+05:302014-03-31T18:03:11.807+05:30మంచి మంచి కవితలతో నలరించిన మిత్రులందరికి శుభాకాంక్...మంచి మంచి కవితలతో నలరించిన మిత్రులందరికి శుభాకాంక్షలు.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26378418585403880932014-03-31T17:40:52.012+05:302014-03-31T17:40:52.012+05:30"చిత్తములలోన 'జయ'నామ కొత్త సాలు
సిరు..."చిత్తములలోన 'జయ'నామ కొత్త సాలు
సిరుల వెలుగులు సంతోష పరిమళాలు
నిండుగా నింపి కోర్కెలు నిశ్చయముగ
తీరుచునని నే మనసార కోరుచుంటి ." గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64211140905437755422014-03-31T17:25:06.885+05:302014-03-31T17:25:06.885+05:30జయ జయ జయవత్సరమా!
జయములనీయుము జగతికి జాగృతి తోడన్...జయ జయ జయవత్సరమా!
జయములనీయుము జగతికి జాగృతి తోడన్
జయమనె కోకిల రవములు
జయమంచు పలికె నుగాది జయ జయ జయహే!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46652497215852234932014-03-31T15:20:05.320+05:302014-03-31T15:20:05.320+05:30మిస్సన్నగారూ ! మీ ఉగాది పచ్చడి మహ రుచిగా నున్నది.....మిస్సన్నగారూ ! మీ ఉగాది పచ్చడి మహ రుచిగా నున్నది...మాది కూడా రుచిచూడండి...

చింతపండు తడిపి కొంత పులుసు జేసి
క్రొత్త బెల్లము తోడు కొసరి వేసి
వగరు మామిడి పిందె వ్రక్కలనే జేర్చి
మిరియాల పొడికొంత మేర గలిపి
గండ్రుప్పు నెక్కువ కాకుండగా రాల్పి
వేపపూతను దెచ్చి వేసి త్రిప్ప
పచ్చడగును గాద పండుగేయగు గాద
నారు రుచుల లేహ్య మారగింప

జీవితమ్మునందు చేరు సంఘటనలు
తీపి చేదు పులుపు తీరుగాను
కారముప్పు వగరు కలబోతలని దల్చ
పండుగగును గాదె ప్రతి దినమ్ము.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51478972998656828412014-03-31T15:19:33.146+05:302014-03-31T15:19:33.146+05:30పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి, కందిశంకరయ్య ...పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి, కందిశంకరయ్య గారికి, యితర కవిమిత్రులకు శ్రీ జయనామ సంవత్సర శుభాకంక్షలు.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44317747765707542642014-03-31T15:13:11.545+05:302014-03-31T15:13:11.545+05:30 వచ్చు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున
నాది పండుగ... వచ్చు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున
నాది పండుగౌ యుగాది మనకు
చెట్టు చేమలన్ని చిగురించి పుష్పించు
పచ్చ పైరులన్ని యిచ్చు ఫలము

తెల్లని పూవులు పూచెను
మల్లియ తీవియకుఁ, గాచె మామిడి కాయల్
పెల్లున కోయిల గళములు
నల్లన వినిపించియొసగె మెండగు ముదమున్

అన్నివనరు లున్న ఆంధ్రుల రాష్ట్రాన్ని
వేరు జేసి నావు విజయ నీవు
చిన్న రాష్ట్రములను చెన్నుగా నొనరించి
జయము గలుగ జేయు జయ యుగాది

వేపపువ్వులోన బెల్లపు తురుమును
చింతపండు మరియు చెరుకు రసము
అరటి పండు, ఉప్పు,మిరియము, మామిడి
నరసి జేర్చి ఉదయ మందుగొనుడు

దుఃఖ మాశ్చర్య నీరసాదులను మరియు
సంతస, భయ క్రోధములను సంతతంబు
నోర్పు నేర్పుతో దాటుచూ నుండవలయు
నని యుగాది పచ్చడి చెప్పు ననవరతము
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78932444312472084182014-03-31T15:11:18.789+05:302014-03-31T15:11:18.789+05:30మిత్రులారా!
జయ నూతన సంవత్సర శుభాగమన సందర్భముగా అంద...మిత్రులారా!
జయ నూతన సంవత్సర శుభాగమన సందర్భముగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42517027710637471712014-03-31T13:56:18.329+05:302014-03-31T13:56:18.329+05:30
గురువర్యులకు కవిమిత్రులకు శ్రీ జయనామ సంవత్సర శుభ...
గురువర్యులకు కవిమిత్రులకు శ్రీ జయనామ సంవత్సర శుభాకాంక్షలు.

జయ ! రా ! స్వాగతమమ్మా
జయ రావము బల్కుచుండె సరి కోయిలలే
జయహే ! హేజయ ! జయ ! జయ !
జయమగు నిన్ దల్చు వారి సత్కార్యములే. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4314082167372836882014-03-31T13:43:04.250+05:302014-03-31T13:43:04.250+05:30వగరు వాసనలతో పొగరైన నింబపు
...........చినిచిన్ని...వగరు వాసనలతో పొగరైన నింబపు

...........చినిచిన్ని పువ్వుల చెలగ దెచ్చి

జీడి వాసన లూరు చిట్టి మామిడి పిందె

...........ముక్కల దగిలించి మోదమలర

చెరకు గడను దెచ్చి చెక్కును తొలగించి

...........సన్నని ముక్కల కొన్ని జేర్చి

క్రొత్తగా పండిన కొమరైన తింత్రిణీ

...........ఫలవిశేషము కాస్త పదిలపరచి

క్రొత్త బెల్లపు తీపిని కొంత గలపి

యుప్పు చిలికించి మెదిపిన గొప్ప రుచులు

చేదు తీపియు పులుపును చెంత వగరు

శుభ యుగాదిని పచ్చడి విభవ మలరు!
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78744353763702618592014-03-31T13:09:34.934+05:302014-03-31T13:09:34.934+05:30గురువులు శ్రీకందిశంకరయ్యగారికి, శ్రీనేమానిపండితవర్...గురువులు శ్రీకందిశంకరయ్యగారికి, శ్రీనేమానిపండితవర్యులకు మరియునితర కవిమిత్రులకు శ్రీజయనామ సంవత్సర శుభాకాంక్షలు.

"జయముఘటించుగాత " ఘనశౌర్యవివేకములుండుగాత సం
దియముతొలంగుగాత బలతేజములున్ జెలువొందుగాత దు
ర్నయములడంగుగాత రఘురాముని రాజ్యము నిల్చుగాత ని
ర్భయముగ ధర్మకార్యచయ పావనమై ధరకాంతులీనగాన్.

కమనీయకవితావికాసమ్మువెలయించి
......... జనులు విద్యాప్రౌఢఖనులుగాగ
ధర్మైకనిష్టావిధానాదిరూఢులై
......... యార్షధర్మవ్యాప్తకర్షకులుగ
సిరిసంపదలదూగిసేవానిధానులై
......... బీదజనార్తి నిర్భేదులవఁగ
కారుణ్యగుణబుధాకారులై జంతు జీ
......... వాది తిర్యక్జీవ కాశ్రితులుగ

సకలశాస్త్రాదివిద్యావిశారదులుగ
దివ్యమణిమయభాసదేదీప్యమాన
శోభితంబుగ గూర్చు యశోవిభవము
స్వాగతమ్మిదె జయనామ వత్సరమ్మ.

తేజములుల్లసిల్ల సముదీర్ణ సుభావము పెంపువొంద వి
భ్రాజిత కీర్తి భాసిత శుభంబుల సర్వజనాళి వెల్గ మా
యాజనితార్థభావముల మాయలుదొల్గగ నిత్యసౌఖ్యమై
శ్రీజయనామవత్సరమశేషశుభంబులనిచ్చుగావుతన్.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48181616252793014142014-03-31T12:45:28.357+05:302014-03-31T12:45:28.357+05:30ఆకు రాలిన చెట్ల కాలంబనమ్ముగ మోసులెత్తు చిగురు మోదమ...ఆకు రాలిన చెట్ల కాలంబనమ్ముగ మోసులెత్తు చిగురు మోదమిచ్చు
కొమ్మల మధ్యన గుబురుగా పెరిగిన విరుల నెత్తావులు మరులు గొలుపు
కోకిలమ్మల పాట వేకువ జామున హృదయమ్ము మీటును హృద్యముగను
ఫల పుష్పములతోడ పాదపములు నిండి యుండగా శోభతో పండుగాయె

వెచ్చ వెచ్చని గాలులు వీచుచుండ
పచ్చ పచ్చని చిగురులు పల్లవించె
వచ్చి చేరెను వాసంత వైభవమ్ము
నిచ్చగించుము సహజంపు పచ్చదనము బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25034103876437060122014-03-31T11:58:43.738+05:302014-03-31T11:58:43.738+05:30జయ నామ వత్సరమ్మున
భయమేల మనకు విజయము ప్రాప్తించునుగ...జయ నామ వత్సరమ్మున
భయమేల మనకు విజయము ప్రాప్తించునుగా
రయమున సంపద లిచ్చును
స్వయముగ నీ వత్సరమ్ము సకల జనులకున్!

నూతన సంవత్సరమున
యాతనలన్నియును దొలగి ఐశ్వర్యంబుల్
ప్రీతిగ సమకూర గలవు
నీతిని వీడక బ్రతుకుట నేర్వుము మిత్రా!

వత్సరాది మనకు వరములు గుప్పించు
చైత్రమాసమందు సంతసమున
పచ్చడి నిడి మనకు నిచ్చు నారోగ్యమ్ము
నెండకాలమందు నెలమిగాను.
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45275102555509885712014-03-31T10:37:13.087+05:302014-03-31T10:37:13.087+05:30జయమౌ వెలుగుల తెలుగుకు
జయమౌ భారత జననికి జయమౌ ప్రజక...జయమౌ వెలుగుల తెలుగుకు
జయమౌ భారత జననికి జయమౌ ప్రజకున్
జయనామ వత్సరమ్మున
జయమౌ విశ్వానికెల్ల జయమౌ శుభమౌ !!!

కవిమిత్రు లందరకు జయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు....మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71536939847448284162014-03-31T09:04:50.682+05:302014-03-31T09:04:50.682+05:30కవిమిత్రు లందరకు జయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.....కవిమిత్రు లందరకు జయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు....Anonymoushttps://www.blogger.com/profile/03824909637764178343noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67094245313742448292014-03-31T08:03:08.610+05:302014-03-31T08:03:08.610+05:30తెల్లని మల్లెల నవ్వులు
పుల్లని మామిళ్ళు జూడ పులకరమ...తెల్లని మల్లెల నవ్వులు
పుల్లని మామిళ్ళు జూడ పులకరమొందన్
యెల్లరకు జయములీయగ
యుల్లము రంజిలగనేడు యుగాది వచ్చెన్

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2244926891113149332014-03-31T07:32:50.745+05:302014-03-31T07:32:50.745+05:30ఆరు రుచుల పర్వ మత్యంత సౌఖ్యంబు
కూర్చు గాత భువిని క...ఆరు రుచుల పర్వ మత్యంత సౌఖ్యంబు
కూర్చు గాత భువిని కూర్మిమీర
సకల గతుల జనులు సానంద చిత్తులై
హాయి నందవలయు ననుపమముగ.
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48621193466348341162014-03-31T07:07:13.288+05:302014-03-31T07:07:13.288+05:30శ్రీ జ య నా మ సం వత్స ర (ఉగాది) శు భ కా మ న లు
శ్...శ్రీ జ య నా మ సం వత్స ర (ఉగాది) శు భ కా మ న లు

శ్రీకరమై జయవత్సర
మాకరమై శాంతి కతుల హర్షాత్మకమై
చేకూర్చు గాత, శుభములు
ప్రాకటముగ యశములొసగి బహుసుఖదంబై 1.

జయములు కలుగంగావలె
భయమంతయు తొలగిపోయి ప్రజలందరకున్
జయవత్సరకాలంబున
క్షయమై కల్మషము, సుఖము సమకూరవలెన్ 2.

యతనములు సాగగావలె
క్షితిపయి సత్యంబు నిలుప, సిరులందవలెన్
క్షితిజముల పెంపకంబున
శతశాతము హాయికలిగి జయవర్షమునన్ 3.

నానావిధసత్క్రతువులు
దానాదులు జరుగవలయు ధర్మము గావన్
మానవులు సత్యసమరపు
సైనికులై నిలువవలయు జయవర్షమునన్. 4.

మతభేదము నశియించుట
కతులిత యత్నంబు జరిగి యత్యద్భుతమౌ
వ్రతదీక్ష బూనగావలె
క్షితిపయి జయహాయనాన క్షేమముగలుగన్. 5.

సంపదలకు నిలయంబై
సంపూర్ణవికాసమంది జగమంతటిలో
నింపైన యశములాంధ్రము
సంపాదించంగ వలయు జయకాలమునన్. 6.

వత్సరమంతయు భువిపై
సత్సౌఖ్యము లందవలయు, జయహాయనమం
దుత్సాహవర్ధనంబయి
సత్సంగతి కలుగవలయు జనులందరకున్ 7.

రమణీయాద్భుతభావం
బమరగ జయకాలమందు హర్షాన్వితులై
సముచితవర్తనతో జను
లమలిన యశమందవలయు నాంధ్రావనిలోన్. 8.

శుభకరమై జయవర్షము
ప్రభవాదుల మేటియౌచు బహువిధములుగా
ప్రభవింపజేయు జయములు,
విభవంబులు భారతాన విస్తృతరీతిన్. 9.

భరతావని కీయబ్దము
వరమై సత్ప్రభుత నొసగి వరుసజయాలన్
నిరతము గూర్చుచు ప్రజలకు
సిరిసంపద లొసగవలయు శ్రీమంతంబై. 10.

కాలోచిత సద్వృష్టియు,
మేలౌ సస్యంబులంది మేదినిలోనన్
పాలకులకు జయవత్సర
కాలంబున స్వాంతశుద్ధి కలుగంగవలెన్. 11.

మనములలో సద్భావము
జనులందరిలోన కలిగి సద్వైభవమీ
ఘనతరజయవర్షంబున
ననుపమగతి గలుగవలయు నాంధ్రావనిలోన్. 12.

నవ్యంబౌ రాష్ట్రంబున
సవ్యాలోచనముచేత సత్సౌఖ్యంబుల్
దీవ్యజ్జయవత్సరమున
భవ్యంబుగ నందవలయు ప్రజలందరకున్. 13.

లుప్తంబై యన్యాయము
వ్యాప్తిం జెందంగ సత్య మాంధ్రావనిలో
ప్రాప్తములౌ సచ్ఛుభ సం
దీప్తులు జయవత్సరాన స్థిరభావముతోన్. 14.

ఈ జయనామసంవత్సరం
అందరికీ సుఖసంతోషాల నందిచాలని ఆకాంక్షిస్తూ,
హ.వేం.స.నా.మూర్తి.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60946540811757371252014-03-31T06:57:34.432+05:302014-03-31T06:57:34.432+05:30కవిమిత్రు లందరకు జయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
...కవిమిత్రు లందరకు జయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈనాటి పద్యరచన శీర్షికను ఉదయం 12-02 గం.లకు షెడ్యూల్ చేశాను. ఎందుకో సమయానికి ప్రకటింపబడలేదు..కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com