tag:blogger.com,1999:blog-6769183920316093900.post596354405533824766..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 132కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2028233483720312732012-10-05T08:28:08.992+05:302012-10-05T08:28:08.992+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
మళ్ళీ నిన్నటి నుండి అస్వస...కవిమిత్రులకు నమస్కృతులు.
మళ్ళీ నిన్నటి నుండి అస్వస్థత. జ్వరం, ఒంటి నొప్పులు (ముఖ్యంగా నడుము నొప్పి). అందువల్ల మీ పూరణలను, పద్యాలను విడివిడిగా ప్రస్తావించి వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించండి.
కాశీక్షేత్ర వైశిష్ట్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరిస్తూ మనోహరంగా వైవిధ్యంగా పద్యాలు రచించిన.....
పండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి (బహుకాల దర్శనం!)
రాజేశ్వరి అక్కయ్యకు,
కళ్యాణ్ గారికి (స్వాగతం పలుకుతూ...)
కమనీయం గారికి,
లక్ష్మీదేవి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89683715904517285452012-10-04T23:23:32.435+05:302012-10-04T23:23:32.435+05:30సభకు నమస్కారములు.
దేవా! గరళము మ్రింగిన
నీవిక మా ...సభకు నమస్కారములు.

దేవా! గరళము మ్రింగిన
నీవిక మా పాతకముల నిర్వీర్యముగా
పోవగ జేయగలేవో,
భావన లో కరుణజూపు పావనమూర్తీ!

వారాణసీ పురపతిని
నోరారగ కీర్తనముల నుడువుచు భజనల్
ధారాళముగా జేసిన
వారలకెల్లను నుతులను పలుకుదు నేనే!
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29924848059561781922012-10-04T21:21:30.206+05:302012-10-04T21:21:30.206+05:30
పాప వారణక్షేత్రమ్ము వారణాసి
ఘన పవిత్ర గంగాజల ...

పాప వారణక్షేత్రమ్ము వారణాసి
ఘన పవిత్ర గంగాజల పావనమ్ము
విశ్వనాథుని సదనమ్ము వెలయు నిచట
అన్నపూర్ణమాతా నిలయమ్ము ,వినుత
భారతీయ సంస్కృతికిది పట్టుగొమ్మ.
కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27229476821423683282012-10-04T20:47:13.289+05:302012-10-04T20:47:13.289+05:30శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
.సవరణ తో...
కాశి...శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
.సవరణ తో...

కాశి యనిన భువిని కైలాసమే గాద
వారణాసి కరుగు వారి కెపుడు
అన్నపూర్ణ కరిగి యన్ని కోర్కెలు దీర్చు
జంగ మయ్య గొలువ గంగ మునిగి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13951054770954555582012-10-04T20:22:01.068+05:302012-10-04T20:22:01.068+05:30శ్రీగురుభ్యోనమః
చివరి పాద సవరణ:
అయ్య అమ్మలు తోడుండ...శ్రీగురుభ్యోనమః
చివరి పాద సవరణ:
అయ్య అమ్మలు తోడుండెడాశ్రయమ్ముగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79536272659489409402012-10-04T20:13:04.912+05:302012-10-04T20:13:04.912+05:30శివకైలాసము ధాత్రిపై వెలసె కాశీక్షేత్రమై దేవమా
నవ జ...శివకైలాసము ధాత్రిపై వెలసె కాశీక్షేత్రమై దేవమా
నవ జీవాదులు మోక్షమున్ బడయనా నాకంబు నే యుర్విపై
భవుడే తా సృజియించి యిచ్చె ,ధరణిన్ భాగ్యాధివాసంబు య
మ్మ విశాలాక్షి పురంబు మోక్ష సమమా మందాకినీ తీరమేన్Kalyanhttp://alochiste.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58164761755876745162012-10-04T19:25:22.663+05:302012-10-04T19:25:22.663+05:30భవుని కింపైన కాశికా పట్టణమ్ము
విశ్వ మంతయు లయమైన వ...భవుని కింపైన కాశికా పట్టణమ్ము
విశ్వ మంతయు లయమైన వెలయు చుండు
కాల భైరవు నిరతము కాచి యుండ
కాశి విశ్వేశు దరిరాడు కాలు డైన !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16074283925822042042012-10-04T18:01:21.816+05:302012-10-04T18:01:21.816+05:30విశ్వనాథుని ధామమై విస్తృతమగు
నఘములను బాపి లోకుల నన...విశ్వనాథుని ధామమై విస్తృతమగు
నఘములను బాపి లోకుల ననవరతము
కాచుచుండును పుణ్యాలగని యనంగ
వైభవంబుల రాశి యీ వారణాసి.

ఆర్షవిద్యల నర్థించి యనుపమమగు
శ్రద్ధ బూనుచు నేతెంచు ఛాత్రతతికి
జ్ఞాన మందించు, గూర్చు సన్మాన మెపుడు
వైభవంబుల రాశి యీ వారణాసి.

మోక్షమును గోరి సత్కార్య దీక్షితులయి
చెంత జేరెడు జనులకు శీఘ్రముగను
శాశ్వతానందమును జూపు సర్వగతుల
వైభవంబుల రాశి యీ వారణాసి.

అన్నపూర్ణయు, ధర్మాని కాటపట్టు,
సాధుజనులకు నిలయంబు, శాంతమునకు,
సత్యదీప్తికి సాక్ష్య మీజగతిలోన
వైభవంబుల రాశి యీ వారణాసి.

కలుషహారిణియై యొప్పు గంగతోడ
సఖ్యమొనరించి, తనుజేరు జనుల కెపుడు
సచ్చిదానందమందించు, సత్వమొసగు
వైభవంబుల రాశి యీ వారణాసి.

హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6013483798469201192012-10-04T16:37:51.412+05:302012-10-04T16:37:51.412+05:30శివుడుఁగావగ వెలసె కాశీపు రాన
కరుణఁజూపు విశాలాక్షి...శివుడుఁగావగ వెలసె కాశీపు రాన
కరుణఁజూపు విశాలాక్షి శరణువేడ
యన్నమందించునెల్లరకన్నపూర్ణ
పాప ప్రక్షాళ నంబుకై పారు గంగ
నయ్య లమ్మలు బ్రోచెడు నాశ్రయమ్ము!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31120874876025845242012-10-04T10:35:43.575+05:302012-10-04T10:35:43.575+05:30అయ్యా శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ ప...అయ్యా శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము 2వ పాదములో యతి మైత్రి లేదు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46360990611621748502012-10-04T10:26:17.825+05:302012-10-04T10:26:17.825+05:30కాశి యనిన భువిని కైలాసమే గాద
వారణాసి కరుగ మనసు కర...కాశి యనిన భువిని కైలాసమే గాద
వారణాసి కరుగ మనసు కరిగి
అన్నపూర్ణ యొసగు నన్నింటి నడుగక
అయ్య వారి జూచు నతిథు లకును. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36278194382632618662012-10-04T09:26:35.778+05:302012-10-04T09:26:35.778+05:30కాశి కాపురమున గనిపించు నాలయ
ములను గనుల గాంచ మ...కాశి కాపురమున గనిపించు నాలయ
ములను గనుల గాంచ మోక్ష మరయ
సంభ వించు నయ్య ! సత్య ము సుమ్మిది
శివుని జూ డ వేరె చెప్ప నేల ?
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63708732130640434762012-10-04T07:30:57.689+05:302012-10-04T07:30:57.689+05:30అమరప్రవాహిని యమలరూపమ్ముతో
....పావనమ్మొనరించు ప్రాం...అమరప్రవాహిని యమలరూపమ్ముతో
....పావనమ్మొనరించు ప్రాంతమందు
శ్రీమహాదేవుండు ప్రేమసుధామయి
....యగు విశాలాక్షితో నలరు సీమ
అన్నపూర్ణాదేవి యఖిల ప్రజాళికి
....నోగిరమ్మును గూర్చుచుండు పురము
వేదవేదాంతాది విజ్ఞాన బోధల
....కాశ్రయమై యలరారు నగరి
అపర కైలాసమనగ ప్రఖ్యాతి గన్న
వారణాసీ పురాద్భుత వైభవమ్ము
తరమె వర్ణన సేయ యథాతథముగ
ధాతకేనియు నవ్వాని తాతకేని Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com