tag:blogger.com,1999:blog-6769183920316093900.post6764253553319878365..comments2024-03-28T22:45:37.413+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 742 (దశరథుడే వనులకేగె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-78797415464304207942017-07-11T16:52:42.627+05:302017-07-11T16:52:42.627+05:30శశిధరుడు వనుల కేగును;
దశకంఠుడు వనుల కేగె దండము త...శశిధరుడు వనుల కేగును;
దశకంఠుడు వనుల కేగె దండము తోడన్
కుశలముగ దొంగ భిక్షుగ;
దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28253843211055116792012-06-22T07:49:44.625+05:302012-06-22T07:49:44.625+05:30శంకరార్యా! ధన్యవాదములు.శంకరార్యా! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18312194594998359512012-06-22T07:23:59.990+05:302012-06-22T07:23:59.990+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఆలస్యమైనా ఆహ్లాదకరమైన ప...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఆలస్యమైనా ఆహ్లాదకరమైన పూరణ నిచ్చారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85248646623354297622012-06-22T07:19:03.044+05:302012-06-22T07:19:03.044+05:30దశదిశల ఖ్యాతిగాంచిన
యశమును గన్నట్టి పుత్రు డారఘు ...దశదిశల ఖ్యాతిగాంచిన
యశమును గన్నట్టి పుత్రు డారఘు రామున్
కుశలము నెంచక చెప్పగ
దశరథుఁడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56110166879556991632012-06-22T05:59:31.634+05:302012-06-22T05:59:31.634+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
OK..OK... :-)

చంద్రశేఖర్...శ్రీపతి శాస్త్రి గారూ,
OK..OK... :-)

చంద్రశేఖర్ గారూ,
నేను అది ‘కార్య’మనుకున్నా. మరి ఇంతకూ ‘ఆర్యతముడు’ అంటే?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58504593303672192042012-06-22T02:06:44.096+05:302012-06-22T02:06:44.096+05:30మాస్టారూ,
యజ్ఞరక్షకు + ఆర్యతముడు = యజ్ఞరక్షకార్యతమ...మాస్టారూ,
యజ్ఞరక్షకు + ఆర్యతముడు = యజ్ఞరక్షకార్యతముడు లో 'ఆ' కు పాదం మొదటి అక్షరమైన 'య' కు యతి వేశాను. సరియేనా?మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17966333370839879142012-06-22T00:35:19.798+05:302012-06-22T00:35:19.798+05:30గురువుగారూ ధన్యవాదములు.
దశరథమహారాజు శ్రవణకుమారుని...గురువుగారూ ధన్యవాదములు.

దశరథమహారాజు శ్రవణకుమారుని మరణమునకు కారణమై మహాపాపము చేసితినని చింతింపగా వశిష్టమహర్షులవారు ఆయనకు ఉపశమనము కలిగించుచూ అది దైవికమని, మానసిక ప్రశాంతతకొరకు నగరానికి దూరముగా వనములలో[తోటలు] కొన్నాళ్ళు శివపూజలు చేయమని చెప్పినట్లుగా భావించి వ్రాసినాను. యింత భావమును కందములో వ్రాయ నశక్తుడను కనుక కొంచము adjust చేసికోండి సార్ please.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34903425907527766742012-06-21T21:34:30.873+05:302012-06-21T21:34:30.873+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
మంచి విరుపుతో చక్కని పూరణ...సత్యనారాయణ మూర్తి గారూ,
మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
ప్రశ్నార్థకమైన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
‘దశరథ’ శబ్దానికి మాకు తెలియని అర్థాన్ని తెలియజేసిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ పద్యం బాగుంది. అభినందనలు.
కానీ... దశరథుడు ఎప్పుడూ తపస్సు చేయలేదు కదా!

సహదేవుడు గారూ,
‘విచలిత దశరథుడు’ అనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
చివరిపాదంలో యతి తప్పింది. ‘యశము వడసె యజ్ఞరక్ష యందు నిపుణుడై’ అందామా?

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45363768901381887492012-06-21T20:09:41.274+05:302012-06-21T20:09:41.274+05:30నశియింప తాటకాదులు
యశమును గడియించె రాముడసురారిగ! త...నశియింప తాటకాదులు
యశమును గడియించె రాముడసురారిగ! తా
వశుడై సతికిన్ పంపగ
దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9429122833581640302012-06-21T19:43:09.075+05:302012-06-21T19:43:09.075+05:30శశిధరుని లీల యనుకొని
వశుడయ్యెను భార్య కిడిన వరమౌ...శశిధరుని లీల యనుకొని
వశుడయ్యెను భార్య కిడిన వరమౌ గానన్ !
యశమును గోరిన రాజగు
దశరధుడే వనుల కేగె దపసులు మెచ్చన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14632403360265762082012-06-21T19:04:02.897+05:302012-06-21T19:04:02.897+05:30దశదప్పికొమరుఁ బంపెను
దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ...దశదప్పికొమరుఁ బంపెను
దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్
వశవర్తి రాముడటుపై
యశము వడసె యజ్ఞరక్ష కార్యతముడై!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45071403875267688512012-06-21T18:55:07.527+05:302012-06-21T18:55:07.527+05:30వశుడై కౌశికు తోడన్
కుశలురనగ తమ్ము రాము గూడి వనముద...వశుడై కౌశికు తోడన్
కుశలురనగ తమ్ము రాము గూడి వనముదౌ
దిశ(బంపనెంచ విచలిత
దశరథు(డే ,పనులకేగె(దపసులు మెచ్చన్.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74340802204423487472012-06-21T17:41:44.805+05:302012-06-21T17:41:44.805+05:30అయ్యా ,
అవును. సుమిత్రాదేవి చెప్పిన మాటలు సుప్రసి...అయ్యా ,
అవును. సుమిత్రాదేవి చెప్పిన మాటలు సుప్రసిద్ధములు.
ఈ రోజు మీనుండి మంచి విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదములండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39928232431431559392012-06-21T14:31:24.379+05:302012-06-21T14:31:24.379+05:30అమ్మా! శ్రీమతి లక్ష్మీదేవి గారూ! దశరథునికి సంబంధిం...అమ్మా! శ్రీమతి లక్ష్మీదేవి గారూ! దశరథునికి సంబంధించిన అర్థములో దశ రథుడు అంటే దశ దిశలా పోవు రథము గలవాడని అర్థము అని నేను చిన్నప్పుడు విన్నాను. (8 దిక్కులు, ఊర్ధ్వ అథో దిశలు).

రామాయణములో ఒక ప్రసిద్ధమైన శ్లోకము ఉన్నది. సీతారాములతో లక్ష్మణుడు అడవులకు పోవునపుడు సుమిత్ర లక్ష్మణునికి చేసిన బోధ అది.

రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజా
అయోధ్యా మటవీం విద్ధి
గఛ్ఛ! తాత! యథా సుఖం

భావము: ఓ నాయనా! రాముని తండ్రితో సమముగా చూచుకొనుము (లేక విష్ణువుగ భావింపుము); సీతను నన్నుగా భావింపుము (లేక లక్ష్మీదేవిగా భావింపుము), అయోధ్యగా అడవులను భావింఫుము (లేక యోధులు చొరశక్యము కాని వైకుంఠముగా భావింపుము), అడవులలో కూడా ఎప్పటివలె సుఖముగా జీవింపుము అని సంతోషముతో వీడ్కోలు వాక్యములు పల్కెను.
ఈ పద్యము శ్లేషాలంకారముతో పరమార్థ వైభవముతో భాసిల్లుచున్నది.

స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80488596080150306092012-06-21T14:12:07.896+05:302012-06-21T14:12:07.896+05:30శ్రీగురుభ్యోనమ:
విశదముగ తెలియజేసిన
వశిష్టుని పలు...శ్రీగురుభ్యోనమ:

విశదముగ తెలియజేసిన
వశిష్టుని పలుకులను విని వ్యథలే తొలగన్
పశుపతి పూజలు జేయగ
దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23125551461235631752012-06-21T13:43:54.196+05:302012-06-21T13:43:54.196+05:30దశకంఠుడు అంటే పది తలలు ఉంటాయి కదా, మరి దశరథుడు అంట...దశకంఠుడు అంటే పది తలలు ఉంటాయి కదా, మరి దశరథుడు అంటే పది రథాలున్నవాడా ఒక సారి మా అబ్బాయి అడిగినపుడు నేనూ వెతికి పట్టుకుని మరీ చెప్పానండీ ఈ అర్థము.
దశరథుడు అంటే పక్షి వాహనంగా కలిగినవాడని. కానీ ఎక్కడ చూశానో ఇప్పుడు గుర్తు రావడం లేదు. అంతవరకూ దశ అంటే పక్షి అనీ నాకు తెలీదు, ఆ పదాన్ని, అర్థాన్ని గురించి ఆలోచించనూ లేదు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70594967149912960322012-06-21T11:54:23.895+05:302012-06-21T11:54:23.895+05:30నేమాని వారి పద్యం హృద్యంగా ఉంది.
దశ అనగా పక్షి, పక...నేమాని వారి పద్యం హృద్యంగా ఉంది.
దశ అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు అని దశరథ శబ్దానికి వ్యుత్పత్తి సాథించటం బాగుంది.

అయితే దశ అనగా పక్షి అనే అర్థం ఒకటుందని నాకింతవరకూ తెలియదు!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51480830376553931122012-06-21T09:38:14.541+05:302012-06-21T09:38:14.541+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59860196038832902492012-06-21T09:25:52.025+05:302012-06-21T09:25:52.025+05:30వశుడ య్యె ను గద కైకకు
దశ రధు డే , వనుల కే గె ...వశుడ య్యె ను గద కైకకు
దశ రధు డే , వనుల కే గె దపసులు మెచ్చన్
దశరధ నందను డ య్యె డ
కుశలము నే గోరు కైక కోరిక మీదన్ .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35298477354145104502012-06-21T08:05:44.684+05:302012-06-21T08:05:44.684+05:30దశరథుడన శ్రీహరి కద
దశరథసుతుడగుచు వెలసె ధర రాముండై
...దశరథుడన శ్రీహరి కద
దశరథసుతుడగుచు వెలసె ధర రాముండై
దశకంఠు దునుమగా నా
దశరథుడే వనులకేగె దపసులు మెచ్చన్

(వివరణ: దశ అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు)

దశరథుడన శ్రీహరి కద
దశరథసుతుడగుచు వెలసె ధర రాముండై
దశకంఠు దునుమగా నా
దశరథుడే వనులకేగె దపసులు మెచ్చన్

(వివరణ: దశ అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు)

దశరథుడన శ్రీహరి కద
దశరథసుతుడగుచు వెలసె ధర రాముండై
దశకంఠు దునుమగా నా
దశరథుడే వనులకేగె దపసులు మెచ్చన్

(వివరణ: దశ అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు)

దశరథుడన శ్రీహరి కద
దశరథసుతుడగుచు వెలసె ధర రాముండై
దశకంఠు దునుమగా నా
దశరథుడే వనులకేగె దపసులు మెచ్చన్

(వివరణ: దశ అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు)

దశరథుడన శ్రీహరి కద
దశరథసుతుడగుచు వెలసె ధర రాముండై
దశకంఠు దునుమగా నా
దశరథుడే వనులకేగె దపసులు మెచ్చన్

(వివరణ: దశ అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు)

దశరథుడన శ్రీహరి కద
దశరథసుతుడగుచు వెలసె ధర రాముండై
దశకంఠు దునుమగా నా
దశరథుడే వనులకేగె దపసులు మెచ్చన్

(వివరణ: దశ అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు)

దశరథుడన శ్రీహరి కద
దశరథసుతుడగుచు వెలసె ధర రాముండై
దశకంఠు దునుమగా నా
దశరథుడే వనులకేగె దపసులు మెచ్చన్

(వివరణ: దశ అనగా పక్షి, పక్షి వాహనముగా గలవాడు శ్రీ మహావిష్ణువు)Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26336107574377974352012-06-21T07:56:17.151+05:302012-06-21T07:56:17.151+05:30గుండు మధుసూదన్ గారి పూరణ.....
అశుభములఁ దొలఁగఁ జేస...గుండు మధుసూదన్ గారి పూరణ.....

అశుభములఁ దొలఁగఁ జేసెడి
కుశలుఁడు రాముండు - కౌశికునితోఁ బోవన్
దిశ నట నిర్దేశించెను
దశరథుఁడే - వనుల కేగెఁ దపసులు మెచ్చన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51481688730974843862012-06-21T07:24:31.167+05:302012-06-21T07:24:31.167+05:30శశివదనా! మఱి యెప్పుడు
దశరథుఁడే వనులకేగెఁ? దపసులు మ...శశివదనా! మఱి యెప్పుడు
దశరథుఁడే వనులకేగెఁ? దపసులు మెచ్చన్
కుశలముగా పరిపాలన
దశదిశలను కీర్తి గలుగ దానే జేసెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61509222739088031772012-06-21T07:18:43.798+05:302012-06-21T07:18:43.798+05:30వశుడై యుండెను కైకకు
దశరథుడే, వనులకేగెఁ దపసులు మెచ్...వశుడై యుండెను కైకకు
దశరథుడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్
భృశమానందము చెందుచు
దశకంఠుని గూల్చువాడు దాశరథియికన్.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.com