tag:blogger.com,1999:blog-6769183920316093900.post6926799381215954941..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 40కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-64337826859871718192012-07-05T08:42:07.533+05:302012-07-05T08:42:07.533+05:30చంద్రశేఖర్ గారూ,
చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు...చంద్రశేఖర్ గారూ,
చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
‘ఒద్దు’ అనవద్దని ఇంతకు ముందు కూడా చెప్పినట్లు గుర్తు! :-)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28013393589415573612012-07-05T07:52:30.475+05:302012-07-05T07:52:30.475+05:30భగత సింహ! మరల పుట్టి భరత భూమి
బాగు చేయరార! పరుల ప...భగత సింహ! మరల పుట్టి భరత భూమి
బాగు చేయరార! పరుల పాలనొద్దు
మనకు,ఇంటపుట్టిన వారి మంచి చాలు
స్విస్సు బ్యాంకులోన ధనము చేరవేయు
వారి నడ్డి మరలి తెచ్చువాడు లేడు
లేచిరార తుపాకితో లేచి రార!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79898799039251280822012-07-04T22:00:38.759+05:302012-07-04T22:00:38.759+05:30గుండు మధుసూదన్ గారి పూరణ....
వంశమ్మేది, మతమ్మునేద...గుండు మధుసూదన్ గారి పూరణ....

వంశమ్మేది, మతమ్మునేది, ఘనసంపద్యోగవిద్యాదిమా
నాంశమ్మును విడనాడి, వీరయువకుం డంతర్విచారుండు ద్వా
వింశత్యబ్దసుశోభితుండు నెటులీ శ్వేతాభిపాలుండ్రఁ బూ
ర్ణాంశార్తిం బడఁజేసి తాను వెసఁ బాఱంద్రోలఁగాఁ బూనెనో!

పూవు పుట్టగానె పొందును బరిమళం
బనెడి మాట నిజము! భగతు సింహుఁ
డింటఁ జిన్ననాఁట నెంతలేసి పనులు
చేసినాఁడొ ప్రజల స్వేచ్ఛ కొఱకు.

తాత గధరు విప్లవసంస్థకై తమిగొన
మేనమామయుఁ జేరంగఁ దానుఁ జేరి
తెల్లదొరలును వణకుచుఁ దల్లడిల్ల
నుల్లసిల్లెను నుల్లమ్ము పల్లవింప!

కంపితులై శ్వేతముఖులు
తెంపరియౌ మాతులు నురి దీయంగను, రో
దింపక, నుగ్రుండయి కనుఁ
గెంపులు నిప్పుకలు రాల్చఁ గెరలె యముండై.

అగ్గింప నెగసిన యగ్నికీలను బోలి
శుక్లాననులఁ జేసె విక్లబులుగ;
సితవక్త్రులు వణంక సింహనాదముఁ జేసె
భూనభోంతరములు బొబ్బరిలఁగ;
ధరియించి శస్త్రముల్ ధవళాస్యులకు గర్వ
భంగమ్ముఁ జేసె విభ్రాంతి సెలఁగ;
పాండురవదనులఁ బాఱిపోవఁగఁ జేసె
వీరత్వమును జూపె భీతిలంగ
రకరకమ్ముల విలసిల్లి రంగు మీఱి
భగతుసింహుని శౌర్యమ్ము వఱలుచుండుఁ,
గినుకఁ బూని రాంగ్లేయులు గనలుచుండి
యగ్గిపై వేయ నెగసెడి గుగ్గిల మయి.

భారతీయులపయి ఘోరకృత్యము సల్పి
పగను దీర్చుకొనిరి పాలకు లటు;
లంత భగతు సింగు డాగ్రహోదగ్రుఁడై
బాంబు విసరి తుదకుఁ బట్టుబడెను!

ఉరిశిక్ష వేనినంతట
స్థిరమగు నానంద మెలమి ధీరత నిడగన్
వరయుతుఁ డగు నా వీరుఁడు
భరతాంబకు జే యటంచుఁ బాసె నసువులన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17205759736961517732012-07-04T21:52:36.824+05:302012-07-04T21:52:36.824+05:30దేశ దాస్యము తొలగించ దీక్ష బూని
ఉరికి సైతము వెఱవని...దేశ దాస్యము తొలగించ దీక్ష బూని
ఉరికి సైతము వెఱవని ధీరు డతడు
భగత సింగను పుత్రుడు భాగ్య మనగ
భువన మంతట గరువంపు ముద్దు బిడ్డ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55154430131447349082012-07-04T21:41:14.503+05:302012-07-04T21:41:14.503+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91980510615574767912012-07-04T18:18:18.891+05:302012-07-04T18:18:18.891+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
భగత్ సింగ్ సమగ్ర వ్యక్తిత...సత్యనారాయణ మూర్తి గారూ,
భగత్ సింగ్ సమగ్ర వ్యక్తిత్వాన్ని చిత్రించిన మీ ఖండిక ఉత్తమంగా ఉంది. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

పండిత నేమాని గారూ,
మహాశయుడైన భగత్ సింగ్‌కు అంజలించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39609529390936979122012-07-04T16:30:04.658+05:302012-07-04T16:30:04.658+05:30ఒక దేశభక్తు డత్యుత్సాహము జెలంగ
తేజంబుతో దృఢ దీ...ఒక దేశభక్తు డత్యుత్సాహము జెలంగ
తేజంబుతో దృఢ దీక్ష గొనెను
ఒక వీరసింహ మత్యుచ్చస్వరంబుతో
గర్జించి యుద్ధరంగమున దుమికె
ఒక మహాధీశాలి యోధాధియోధుల
నెదిరించి వారల యెదల నిలిచె
ఒక పరాక్రమ నిధి యుగ్రుడై రుద్రుడై
తెల్లవారల గుండెలెల్ల డుల్చె
తల్లి దాస్యంబు ద్రోచు యత్నంబునందు
సమరమును సల్పి చివరకు సమసె నకట!
ఆతడే భగత్ సింగు మహాయశుండు
సాదరమ్మున నాతని కంజలింతుPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64494567833573071242012-07-04T14:23:34.075+05:302012-07-04T14:23:34.075+05:30గురువు గారికి ధన్యవాదములు
దేశ మాత దాస్యము ద్రుంచ ...గురువు గారికి ధన్యవాదములు

దేశ మాత దాస్యము ద్రుంచ దిశను దెలుప

సమర శంఖము పూరించె, శరము తోడ

తెల్ల దొరల తోలువలుచ తెగువ జూపి

యమరుడయ్యె భగత్ సింగు యవని లోనకందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3923595467003073002012-07-04T13:29:33.654+05:302012-07-04T13:29:33.654+05:30స్వాతంత్ర్యోద్యమమందు దేశమునకున్ భక్తాగ్రగణ్యుండుగా...స్వాతంత్ర్యోద్యమమందు దేశమునకున్ భక్తాగ్రగణ్యుండుగా
నేతృత్వంబు వహించి మ్లేచ్ఛకృతముల్ నిందించి దేశీయులం
దాతండందరికిందు ధైర్యవిభవం బందించె వీరుండుగా
ఖ్యాతింబొందిన భక్తసింహునకు నేనర్పింతు జోహారులన్.

భగతసింహ! వీర! భారతావనియందు
స్వేచ్ఛ నందజేసి సిరులు బంచు
కొరకు నీవు చేయు నిరతయత్నముఁ జూడ
నిరుపమాన మౌర! నీకు నతులు.

దేశహితముఁ గోరి ధీరత్వమును బూని
యుద్యమించి ముందు కురికి తుదకు
పరమభాగ్య మనుచు ప్రాణంబులనుసైత
మర్పణంబు చేతు వనఘ! నీవు.

నిష్ఠ బూని చేయు నీబలిదానంబు
మరువరాని దెపుడు మహితచరిత!
సతము భరతభువిని సంస్మరణీయమై
ప్రణతులందుచుండు భగతసింహ!

భారతీయులౌచు స్వాతంత్ర్యజీవన
వరము నంది యున్న వారి కెల్ల
నీదు దివ్యచరిత మాదర్శ మైయొప్పు
వందనంబు లయ్య! భగతసింహ!హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.com