tag:blogger.com,1999:blog-6769183920316093900.post739824843528874882..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 516 (ననుఁ బూజించిన వారె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger52125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71634961711245739832019-05-31T21:53:35.696+05:302019-05-31T21:53:35.696+05:30శంకర ఉవాచ:
చనుచున్ కైలస పర్వతాగ్రమునకున్ శాస్త్రీ...శంకర ఉవాచ:

చనుచున్ కైలస పర్వతాగ్రమునకున్ శాస్త్రీయ మార్గమ్మునన్
కొనుచున్ కొబ్బరి కాయలన్ విరివిగా కొట్టించి లింగమ్ముకున్
వినరా! రాహులు! మందబుద్ధి ఘనుడా! వీక్షించి ధ్యానమ్మునన్
ననుఁ బూజించిన వారె పొందుదు రనం
తంబైన సత్సంపదల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11419546554444091622011-11-08T22:10:50.316+05:302011-11-08T22:10:50.316+05:30గురువుగారూ ఒక్కొక్క సమస్యకూ ౫౦ కి పైగా పూరణలూ/వ్యా...గురువుగారూ ఒక్కొక్క సమస్యకూ ౫౦ కి పైగా పూరణలూ/వ్యాఖ్యలూ వస్తున్నాయంటే చూడ ముచ్చటగా ఉంటోంది. విద్వత్కవివర్యులు కూడా
శంకరాభరణం లో పాలుపంచు కోవడం యెంతటి మహద్భాగ్యం!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82889618658565224272011-11-08T19:07:48.857+05:302011-11-08T19:07:48.857+05:30గురువుగారు,
ధన్యవాదాలు.
నను అపర్ణను చేయకూడదన్నారు....గురువుగారు,
ధన్యవాదాలు.
నను అపర్ణను చేయకూడదన్నారు. అందుకే నేను సవరించలేదు. కొత్త పూరణ చేశాను. :-)లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86329233610418167102011-11-08T18:08:55.001+05:302011-11-08T18:08:55.001+05:30**************************************************...**********************************************************************
మందాకిని గారూ,
మిస్సన్న గారూ,
సవరించిన మీ పూరణలు ఇప్పుడు సర్వలక్షణశోభితాలై అలరిస్తూ ఉన్నాయి. అభినందనలు.

కళ్యాణ్ గారూ,
పౌండ్రకవాసుదేవుని వృత్తాంతాన్ని పూరణకు ఎన్నుకొనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
తృతీయపాదాంతంలోని ‘లోకమున్’ అన్వయించడం లేదు. అక్కడ ‘సౌఖ్యమున్’ అంటే సరి!
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22831119895219526792011-11-08T16:37:07.664+05:302011-11-08T16:37:07.664+05:30అందరికీ నమస్కారం !
ఇది నా పూరణ
వినుడోపౌండ్రక వాస...అందరికీ నమస్కారం !
ఇది నా పూరణ

వినుడోపౌండ్రక వాసుదేవుడఘుడై ప్రేలెన్ సభా ప్రాంగణం
బున నీరీతి 'మురారి మించు యనఘున్ పుణ్యాత్ముడన్ నేను నా
ఘనతన్ కీర్తనలాడనిచ్చెద మహా కళ్యాణముల్, లోకమున్
ననుఁ బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్ 'కళ్యాణ్http://www.alochiste.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14694238114005635472011-11-08T07:52:35.065+05:302011-11-08T07:52:35.065+05:30శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
విష్ణునంద...శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
విష్ణునందనులవారి విష్ణు పూజ
మీరు సలిపిన గజానన పూజ
మిత్రులందరి పూజలూ ముచ్చటగా నున్నవి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6998544153316602572011-11-08T07:52:22.446+05:302011-11-08T07:52:22.446+05:30మిత్రమా ధన్యవాదాలు. స్టెథస్కోపు తో పరీక్షించే అవస...మిత్రమా ధన్యవాదాలు. స్టెథస్కోపు తో పరీక్షించే అవసరం ఏముంది? మావన్నీ మైక్రోస్కోపు తో చేసే పరీక్షలు!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34210376415972489632011-11-08T07:34:27.385+05:302011-11-08T07:34:27.385+05:30మిస్సన్న గారూ ,
వైద్యులకు కూడా అప్పుడప్పుడు...మిస్సన్న గారూ ,
వైద్యులకు కూడా అప్పుడప్పుడు పరీక్ష లవసరమే !ఈ సారి మీ యెలమంచిలి వచ్చినప్పుడు మీకు ఓ స్టెథస్కోపు బహూకరిస్తాను. మీ దయ వలన నాకు చిర కాలంగా ఉన్న సందేహము తీరింది. నేను యేమీ అనుకోను, నా పద్యాలలో మీకు ( మిత్రు లెవరికైనా సరే ) దోషాలు కనిపిస్తే తప్పక చూపించండి. గురువు గారు మాత్రము యెంత కన్న అన్ని తప్పులూ చూడగలరు ?గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74362977428866602552011-11-08T07:15:17.515+05:302011-11-08T07:15:17.515+05:30అందరికీ వందనములతో సవరించిన నా పూరణ:
నను గూళ్ళల్లి...అందరికీ వందనములతో సవరించిన నా పూరణ:

నను గూళ్ళల్లి భజించు సాలె పురుగున్, నన్గొల్చు నాగేంద్రమున్,
ఫణినిన్ చేకొని బ్రోవనే ముదము గూర్పన్, కార్తికంబందు నన్
తినకైనన్ తినియైన బ్రోవుమని యార్తిన్, భక్తి నెవ్వారలై
ననుఁ బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62504459973218789012011-11-08T06:48:54.711+05:302011-11-08T06:48:54.711+05:30గురువుగారూ ధన్యవాదాలు. ఇప్పుడు రెండు విషయాలు తెలుస...గురువుగారూ ధన్యవాదాలు. ఇప్పుడు రెండు విషయాలు తెలుసుకొన్నాను. ౧. భక్తాళురై అన్న ప్రయోగం తప్పు అని.
౨. మిడిమిడి జ్ఞానంతో శల్య పరీక్ష చెయ్య కూడదు అని.
మీ పూరణ అద్భుతంగా ఉంది. మేమందరం ఒకరినే పూజిస్తే మీరు ఒకే పూరణలో ముగ్గుర్ని పూజించారు.
అయితే మీ తర్వాతి పాఠం సరళాదేశ, గసడదవాదేశ సంధుల మీద చెప్పండి.
మూర్తి మిత్రమా మన్నించాలి. మీ పూరణ నిర్దోషమని తేలింది.

విష్ణు నందను గారూ ధన్యవాదాలు. శల్య పరీక్ష అంటే ఎముకలను బాగున్నాయో లేదో అని పరీక్షించడం అనుకొనే వాడిని. ఇప్పుడర్థం అయ్యింది.

మందాకినీ గారు మీ సందేహం నిజమని తేలింది. నా పూరణను సవరించడానికి ప్రయత్నిస్తాను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16284136644808137342011-11-07T23:00:42.232+05:302011-11-07T23:00:42.232+05:30విష్ణునందన్ గారు, గురువు గారు,
కృతజ్ఞురాలను. అయెన్...విష్ణునందన్ గారు, గురువు గారు,
కృతజ్ఞురాలను. అయెన్ తప్పు ప్రయోగమని మరచి ప్రయోగించినందుకు మన్నించండి.
అపర్ణను అంటే నను వస్తుందని అనుకున్నాను. మన్నించండి.

మరో పూరణ.
కనకమ్మన్నను మోజుగల్గి, సుఖ సౌఖ్యాలెల్ల కాంక్షించుచున్,
ధనధాన్యాదులఁ, పాడిపంటలను, బాధాముక్త సంసారముల్
గన నాశించిన; భక్తి భావన లతో కామాక్షి పాదంబులై
నను పూజించినవారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35702299141662553892011-11-07T22:14:38.231+05:302011-11-07T22:14:38.231+05:30డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు. మీ సూచన (సవరణ క...డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు. మీ సూచన (సవరణ కాదన్నారు మరి!) నా పూరణకు అలంకారమే.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62574396200331230722011-11-07T21:51:38.427+05:302011-11-07T21:51:38.427+05:30గురువు గారూ, నమస్సులు. మీ వివరణకు ధన్యవాదములు.గురువు గారూ, నమస్సులు. మీ వివరణకు ధన్యవాదములు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67201033453305646052011-11-07T21:42:50.210+05:302011-11-07T21:42:50.210+05:30డా.విష్ణునందన్ వారి వివరణకు కృతజ్ఞతలు. వైద్యవృత్తి...డా.విష్ణునందన్ వారి వివరణకు కృతజ్ఞతలు. వైద్యవృత్తిలో ఉండి యింత విజ్ఞానము సంపాదించిన మిమ్ములను చూస్తే ఆశ్చర్యము ఆనందము కలుగక తప్పవు. మీకు మరోసారి అభినందనలు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56936854810266541832011-11-07T21:39:31.667+05:302011-11-07T21:39:31.667+05:30**************************************************...**********************************************************************
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘కనగా నోచరు నెవ్వరైన’ ... ‘నోచరెవ్వరైన’ కావాలి. అక్కడ ‘కనగా నోచరిదెవ్వరైన’ అంటే సరి!
‘ఉత్పత్తి + ఇక’ అన్నప్పుడు సంధి లేదు. ‘పునరుత్పత్తియె యుండబోదు’ అందాం.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
గీతాచార్యుని వాక్యంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

మందాకిని గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ‘నను’ను అప‘ర్ణను’ చేయడం సరికాదు.
‘ఘనమౌ యద్రికి’ అన్నదాన్ని ‘ఘనశీతాద్రికి’ ఆంటే ఇంకా బాగుంటుంది కదా!

డా. విష్ణునందన్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
‘కంబుకంఠి యయి’ అన్నది ‘కంబుకంఠుఁడయి’ అంటే బాగుంటుందేమో!

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. (సవరించారు కదా!)
మందాకిని గారి సందేహం అర్థవంతమే. భక్త + ఆళి(లి) = వరుస, సమూహం;
మీరన్నట్టు భక్తాళికి, శ్రద్ధాళువుకు సంబంధం లేదు. శ్రద్ధాళువు (ఏ. వ.) = విశ్వసించేవాడు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
‘ఎన్నను’ అంటూ సాయినాథునిపై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘విషమున్ గల్పింతు’ అన్నది సరియైనదే. విషమున్ తో వాక్యం పూర్తయినా కాకున్నా అక్కడ సరళాదేశం తప్పక జరుగుతుంది. ఇక హాలహలము అంటే ఒక విధమైన విషం. అరటిపండు అన్నప్పుడు అరటి అంటే పండు అనే అర్థం కాదు కదా.. ఇదీ అంతే!
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71002166225641828912011-11-07T21:35:56.668+05:302011-11-07T21:35:56.668+05:30మిస్సన్న గారికి , డా. గన్నవరపు నరసింహ మూర్తి గారిక...మిస్సన్న గారికి , డా. గన్నవరపు నరసింహ మూర్తి గారికి - ప్రత్యేకాభివందనాలు !!!డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22870564669713945772011-11-07T21:33:36.413+05:302011-11-07T21:33:36.413+05:30శంకరయ్య గారూ మధురమైన పూరణ . మనలో మన మాట , ఇదే పద్య...శంకరయ్య గారూ మధురమైన పూరణ . మనలో మన మాట , ఇదే పద్యంలో నేనైతే ' లోక స్తుత్య నామున్ ' బదులుగా ' విఘ్న ధ్వంసకుండౌ ' అని వ్రాసి ఉండేవాడినేమో ... ( సవరణ ఎంత మాత్రమూ కాదు ... మన్నించాలి ! ) ఎందుకో చదివేటప్పుడే అలా స్ఫురించింది మరి ! అభివాద పరశ్శతం .డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29652032503150012102011-11-07T21:27:48.188+05:302011-11-07T21:27:48.188+05:30మందాకిని గారూ , అక్కడ ' ఇల్లాలయెన్ ' కూడదు...మందాకిని గారూ , అక్కడ ' ఇల్లాలయెన్ ' కూడదు . ఒకసారి చెప్పిన జ్ఞాపకం ఏమంటే ' అయెన్ ' అనే శబ్దమే లేదు . తెలుగు గ్రాధిక రూపాల్లో - అయ్యెన్ , ఆయెన్ అనేవే ఉన్నప్పుడు అసలీ ' అయెన్ ' శబ్దం ఎలా వచ్చిందో తెలీడం లేదు . ఏదేమైనా ఇదేదో వ్యాకరణానికి సంబంధించిన విషయం కంటే , అసలు తెలుగు లో లేని పదాన్ని ప్రయోగించడమే అవుతుంది .

" అపి మాషం మషం కుర్యాత్ ఛందో భంగం న కారయేత్ " అన్నట్టుంటుంది !!!డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23571531237739284922011-11-07T21:19:54.105+05:302011-11-07T21:19:54.105+05:30శల్య సారథ్యం అనేది ఒకటి ఉంది . అంటే మన వెన్నంటే ఉం...శల్య సారథ్యం అనేది ఒకటి ఉంది . అంటే మన వెన్నంటే ఉంటూ మనని అనునిత్యం సూటిపోటి మాటలతో వేధిస్తూ , చులకన గా మాట్లాడుతూ లోపాయకారిగా మన ప్రత్యర్థికి మేలు చేయడం .
ఇక పోతే మరొకటి - స్తన శల్య పరీక్ష . కేవలం కండరాలతో కూడి , ఎముకే లేని ప్రదేశం లో ఎముక కోసం వెదకడమంటే , ఏమైనా దొరుకుతుందేమో అని నిశితంగా పరీక్ష చేయడమన్న మాట . అదిన్నూ విపరీతార్థంలో . అనవసరంగా తప్పులు వెదకడాన్ని స్తన శల్య పరీక్ష అంటారన్న మాట . దీన్ని శల్య పరీక్ష అనడం కంటే ' స్తన శల్య పరీక్ష ' అనడమే మంచిది ! రెండు ఒకే రకమైన పదాల వల్ల వచ్చిన సందిగ్ధ పరిస్థితి ఇది . అక్కడ 'శల్యుడు ' = మాద్రీయుడైన రాజు . ఇక్కడ శల్యము= ఎముక . అదీ తేడా !డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53540585494336601102011-11-07T20:39:30.731+05:302011-11-07T20:39:30.731+05:30గురువు గారి పూరణ అద్భుతము !గురువు గారి పూరణ అద్భుతము !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70591086058118767202011-11-07T20:15:29.095+05:302011-11-07T20:15:29.095+05:30నా పూరణ .....
వినుఁడో భక్తవరేణ్యులార యిది! హృద్వీ...నా పూరణ .....

వినుఁడో భక్తవరేణ్యులార యిది! హృద్వీధిన్ తిరంబైన భ
క్తిని గీలించి సదైకచిత్తమున సంకీర్తించి పంచాననున్
ఘనుఁడైనట్టి షడానన్ గొలిచి లోకస్తుత్యనామున్ గజా
నను పూజించినవారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4459887447944663972011-11-07T20:07:04.129+05:302011-11-07T20:07:04.129+05:30మిస్సన్న గారూ, శల్య పరీక్ష అంటే , కర్ణుడినే కదా శల...మిస్సన్న గారూ, శల్య పరీక్ష అంటే , కర్ణుడినే కదా శల్యుడు పరీక్షించినది. అర్జునిని పొగుడుతూ కర్ణునిలో లోపాలు యెత్తి చూపిస్తూ కర్ణుని ఆత్మవిశ్వాసానికి తూట్లు పొడుస్తాడు.అంతేనా,ఇంకేమైనా విశేషము ఉంటే చెప్పండి, భారతములో నిపుణులు మీరు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67825544168635815762011-11-07T19:50:31.177+05:302011-11-07T19:50:31.177+05:30నిజమే మిస్సన్న గారూ, ధన్యవాదములు. కల్పించినివి సౌఖ...నిజమే మిస్సన్న గారూ, ధన్యవాదములు. కల్పించినివి సౌఖ్యములు,విషము గాదు. చిక్కు, శ్యామలీయము గారు శలవిచ్చినట్లు పద్యాలలో చుక్కలు కామాలు ఉండవు.అందు వలన వ్యాఖ్య కొత్త అయినా అది కొత్త వాక్యము గాదు.అందుచే సంధి చెయ్యాలా,అక్కఱ లేదా అని అనుమానము. మీరు చెప్పినట్లు సవరించాను. గురువు గారు ఏమి చెబుతారో చూద్దాము.

వినరే విశ్వము సృష్టి చేసి పిదపన్ విశ్వంభరత్వమ్మునన్
గనగా లోకములెల్ల గాచితినిగా కంఠంబులో నిల్పుచున్
ఘన హాలాహల ఘోరమైన విషమున్, కల్పింతు నే సౌఖ్యముల్
నను పూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59097033265876168982011-11-07T19:09:35.318+05:302011-11-07T19:09:35.318+05:30మూర్తి మిత్రమా ఇంకా శల్య పరీక్ష పూర్తీ కాలేదు. ఇంత...మూర్తి మిత్రమా ఇంకా శల్య పరీక్ష పూర్తీ కాలేదు. ఇంతకీ విషమున్ అన్న పదంతో ఆ వాక్యం పూర్తయిందని మీరే అన్నారుగా. మరి క్రొత్త వాక్యానికి ఆదిలో సరళం ఎందుకు వస్తుంది?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64091001656880852562011-11-07T14:46:23.258+05:302011-11-07T14:46:23.258+05:30ప్రథమ మీది పరుషములకు గసడదవలగు అన్న సూత్రం ప్రకారం...ప్రథమ మీది పరుషములకు గసడదవలగు అన్న సూత్రం ప్రకారం విషము గల్పించి అవుతుందని నా అభిప్రాయం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com