tag:blogger.com,1999:blog-6769183920316093900.post7718838291348875959..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 977 (క్షణమె కోరుదు నిచ్చు నాకదె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-52466516960894063052019-08-19T21:54:47.779+05:302019-08-19T21:54:47.779+05:30సణుగుడొద్దుర! ప్రాణనాయిక! సగ్గు బియ్యము లేదనే
గొణ...సణుగుడొద్దుర! ప్రాణనాయిక! సగ్గు బియ్యము లేదనే
గొణగ బోకుర! పూరి గారెలు కొబ్బరన్నము లేవనే
పుణుకు చాలును భామ నాకిక బుగ్గ గిల్లెద! నీదు వీ
క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34011872332296290692013-02-27T17:39:39.213+05:302013-02-27T17:39:39.213+05:30నేమాని పండితార్యా ధన్యవాదములు.
వణకుచుంటిని భీతితో...నేమాని పండితార్యా ధన్యవాదములు.

వణకుచుంటిని భీతితో భవ వార్నిధింబడి యొంటినై
తృణము బోలిన దేహమెప్పుడు తేలునో యిట కట్టె యై
పణపు మోహము బాసి నీ పద పద్మ సన్నిధి నిల్తు నీ
క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50461342132986157132013-02-27T06:55:36.816+05:302013-02-27T06:55:36.816+05:30శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
మీ పద్యములో &quo...శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
మీ పద్యములో "దరిగానకన్" అన్నారు కదా. అది వ్యతిరేకాత్మకము - అందుచేత చివర ద్రుతము రాదు. కొంచెము చూచి మార్చండి. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84394306396638925452013-02-26T20:12:12.955+05:302013-02-26T20:12:12.955+05:30వణకుచుంటిని భీతితో భవ వార్నిధిన్ దరిగానకన్
తృణము ...వణకుచుంటిని భీతితో భవ వార్నిధిన్ దరిగానకన్
తృణము బోలిన దేహమెప్పుడు తేలునో యిట కట్టె యై
పణపు మోహము బాసి నీ పద పద్మ సన్నిధి నిల్తు నీ
క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79547481584324119922013-02-26T20:01:41.693+05:302013-02-26T20:01:41.693+05:30శ్రీ సహదేవుడు గారికి అభినందన మందారమాల!శ్రీ సహదేవుడు గారికి అభినందన మందారమాల!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13790372794325114082013-02-26T14:12:21.217+05:302013-02-26T14:12:21.217+05:30
గణుతి కెక్కిన యంత్రతంత్రము,కామభోగవిలాసమున్...

గణుతి కెక్కిన యంత్రతంత్రము,కామభోగవిలాసమున్
క్షణికమైన విమోహబంధము ,గర్వకారణ ధీకృతుల్
మణులు ,మాన్యము ,కావు ముక్తికి మాధవా,హరి ,నీదు ర
క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్.
కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86249781839091117762013-02-26T10:52:12.261+05:302013-02-26T10:52:12.261+05:30నూత్నచ్ఛందోవిధాత శ్రీ సహదేవుడు గారికి
హార్దికాభినం...నూత్నచ్ఛందోవిధాత శ్రీ సహదేవుడు గారికి
హార్దికాభినందనములతో,

మీరు కల్పించిన ఈ వృత్తం సంస్కృతాంధ్రాలలో ఎక్కడా లేనందువల్ల శ్రీ వావిళ్ళ వారికి నేను పరిష్కరిస్తున్న “అప్పకవీయము” పీఠికలో “ఆధునిక కాలమున నూతనప్రయోగములు” అన్న విభాగంలో సంతోషంగా చేర్చుకొంటున్నాను. దీనికి శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు “సహకారము” అని చేసిన నామకరణం మనోహరంగా ఉన్నది.

ఈ విధమైన చిత్రకల్పనలకు ఆలవాలమైన “శంకరాభరణం” కల్పయిత మాన్యులు శ్రీ శంకరయ్య గారికి కూడా అభినందనలు!

ఇహపరతారకపదసం
గ్రహమై వాణీపదాబ్జఘటితామరభూ
రుహనవపుష్పకమై మీ
సహకారము వ్యాప్తిఁజెందు సహదేవకవీ!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46793120157077245712013-02-26T09:42:44.067+05:302013-02-26T09:42:44.067+05:30పెద్దలందరికీ ధన్యవాదములు. మీరందరూ బలపరచిన 'సహక...పెద్దలందరికీ ధన్యవాదములు. మీరందరూ బలపరచిన 'సహకారము' అన్న నామమే ఆ పద్య ఛందానికి పెడుతున్నాను. స్వస్తి.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25150916273852193602013-02-26T07:20:12.747+05:302013-02-26T07:20:12.747+05:30సహదేవుడు గారూ,
సంతోషం.
మీ క్రొత్త ఛందం నేమాని వా...సహదేవుడు గారూ,
సంతోషం.
మీ క్రొత్త ఛందం నేమాని వారి ఆమోదం, గన్నవరపు వారి నామకరణం, డా. విష్ణునందనుల సమర్థన పొందింది. అదృష్టవంతులు మీరు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49735398762525753312013-02-26T07:16:08.297+05:302013-02-26T07:16:08.297+05:30ఈనాటి సమస్యకు మంచి పూరణ లిచ్చిన కవిమిత్రులు...
పండ...ఈనాటి సమస్యకు మంచి పూరణ లిచ్చిన కవిమిత్రులు...
పండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
సహదేవుడు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
పింగళి శశిధర్ గారికి,
గన్నవరపు నరసింహమూర్తి గారికి,
తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75858132332097760122013-02-26T06:29:03.620+05:302013-02-26T06:29:03.620+05:30ఈనాటి సమస్యకి మంచి మంచి పూరణలు వచ్చినవి. పూరించిన...ఈనాటి సమస్యకి మంచి మంచి పూరణలు వచ్చినవి. పూరించిన కవి మిత్రులందరికి శుభాభినందనలు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7010051296119867362013-02-26T00:58:33.683+05:302013-02-26T00:58:33.683+05:30క్షణములున్ దిన వర్షమాదిగ సాగిపోవుచునుండ నే
క్షణము...క్షణములున్ దిన వర్షమాదిగ సాగిపోవుచునుండ నే
క్షణమునన్ నిను నెమ్మనంబున గాంచనేరక పోయితే
రణము చేయగ జీవితంబున"రామ" నామము పల్కునా
క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖ శాంతులన్.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2710642535104395152013-02-25T23:26:28.269+05:302013-02-25T23:26:28.269+05:30యథాలాపంగా సహదేవుడు గారు రచించిన నూత్నచ్ఛందమ్మును చ...యథాలాపంగా సహదేవుడు గారు రచించిన నూత్నచ్ఛందమ్మును చూసి సంతోషపడితే , దానికి గన్నవరపు నరసింహ మూర్తిగారి వినూత్న నామకరణము రెట్టింపు ఆనందము కలుగజేసినది . నేనూ ఆ నామకరణాన్ని బలపరుస్తున్నాను .

సహకారమ్మను క్రొత్త ఛందమును సాక్షాచ్ఛారదా సత్కృపా
సహితంబైన కుశాగ్ర బుద్ధి సెలగన్ సంధించితే ? యిమ్మహిన్
రహియించున్ సుకవీ త్వదీయ రచనా ప్రావీణ్యముత్కృష్టమై
సహదేవా ! విజయోస్తు పద్య కవితా సంపత్కళా వైభవా !డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64129582046313315972013-02-25T23:25:29.697+05:302013-02-25T23:25:29.697+05:30గుణము రూపము లున్న లేకను గోప్యవర్తన భాసిలన్
గణ కణమ...గుణము రూపము లున్న లేకను గోప్యవర్తన భాసిలన్
గణ కణమ్ముల నిండియుండవె ! కన్నతండ్రి ! కృపాళువా !
ప్రణతులిచ్చెద బ్రహ్మమేలను భక్తి గూడగ నిశ్చలన్
క్షణమె కోరుదు, నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్.
గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33646947707842878272013-02-25T22:12:28.562+05:302013-02-25T22:12:28.562+05:30పూజ్యులు, గురుతుల్యులు నేమాని వారికి నమస్సుమాంజలుల...పూజ్యులు, గురుతుల్యులు నేమాని వారికి నమస్సుమాంజలులు.
నా చిన్ని ప్రయత్నం నచ్చినందుకు సంతోషం. మీసవరణ బాగుంది పునరుక్తి అనుకుంటాను.
ధన్యవాదాలు.Jaabilliraavehttps://www.blogger.com/profile/05368103538262699918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39498750173273964452013-02-25T21:17:11.571+05:302013-02-25T21:17:11.571+05:30శ్రీ సహదేవుల వారికి అభినందనలు ! మీ వృత్తానికి '...శ్రీ సహదేవుల వారికి అభినందనలు ! మీ వృత్తానికి ' సహకారము ' అని పేరు పెడదాము.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61958853292727108882013-02-25T21:13:09.827+05:302013-02-25T21:13:09.827+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17369935024693577022013-02-25T21:09:20.789+05:302013-02-25T21:09:20.789+05:30శ్రీ పింగళి శశిధర్ గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము చ...శ్రీ పింగళి శశిధర్ గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము చక్కని ధారాశుద్ధితో అలరారుచున్నది. అభినందనలు. 3వ పాదమునకు చిన్న సవరణ సూచించున్నాను:

"ఫణివిభూషణ! పన్నగేశ్వర!......"
కి బదులుగా
"ఫణివిభూషణ! పార్వతీశ్వర!......."
అంటే బాగుంటుంది అని నా భావన.

ఫణివిభూషణ మరియు పన్నగేశ్వర అనే సంబోధనలలో ఒకే అర్థము స్ఫురించుచున్నది కదా!. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38927571570266846282013-02-25T20:58:35.656+05:302013-02-25T20:58:35.656+05:30గురువర్యులకు ప్రణామములు.మొదటి పాదం వ్రాసుకుని మిగత...గురువర్యులకు ప్రణామములు.మొదటి పాదం వ్రాసుకుని మిగతా పాదాలన్ని అదే విధంగా వ్రాయడం వల్ల మొదటి పాదంలో యెక్కువగా వచ్చిన రెండక్షరాలు ప్రతి పాదంలో పునరా వృతంబై కొత్త వృత్తావిష్కరణమునకు మూలము కావడము మహదానందంగా వుంది. ధన్యవాదములు. ప్రతి పాదంలో 'న జ స జ భ గా' గణాలుండి 13వ అక్షరం యతి మైత్రిని గలిగి, ప్రాస నియమంతో ప్రాణం పోసుకుంది కాబట్టి వాటిని అలాగే పాటిస్తే బాగుంటుందని పిస్తుంది.పేరు ' భారతి కందం' అని ఆ వాగ్దేవి పేరుతో పెడితే యెలా వుంటుందో బుధజనులైన శంకరార్యులు,ఏల్చూరి వారలు,డా॥విష్ణునందన్ గారలు తదితర గురుతుల్యులందరూ మరి కవిమిత్రులెల్లరూ పరిశీలించ ప్రార్థన. స్వస్తి .గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4419109200741836942013-02-25T19:38:35.775+05:302013-02-25T19:38:35.775+05:30రణవిభూతుల బాంబుదాడుల రౌద్రులైచెల రేగుచున్
పణమువెట్...రణవిభూతుల బాంబుదాడుల రౌద్రులైచెల రేగుచున్
పణమువెట్టిరి మాదుప్రాణము పాడుమూకల ముష్కరుల్
ఫణివిభూషణ! పన్నగేశ్వర! పాహియంచును, నీకృపే
క్షణమెకోరుదు, నిచ్చునాకదె సర్వదా సుఖశాంతులన్.Jaabilliraavehttps://www.blogger.com/profile/05368103538262699918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42987483318178759772013-02-25T18:46:01.066+05:302013-02-25T18:46:01.066+05:30అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
శుభాశీస్సులు.
మీ ప్రయత్న...అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
శుభాశీస్సులు.
మీ ప్రయత్నము ప్రశంసనీయము. మీరు నేను చేసిన ప్రయోగము కంటె ప్రతి పాదములోను 2 అక్షరములు వేసేరు. అందుచేత మరొక క్రొత్త వృత్తము అవుతుంది. సెహబాస్. ఈ క్రొత్త వృత్తమునకు మీరే పేరు పెట్టుట సమంజసము. శుభం భూయాత్. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6497193463947705402013-02-25T18:03:16.998+05:302013-02-25T18:03:16.998+05:30
గణన జేయకు దాసు తప్పులు కైటబారి !పదే పదే
మణులు మా...
గణన జేయకు దాసు తప్పులు కైటబారి !పదే పదే
మణులు మాన్యము కోర నేనిక మాధవా !కరుణించు మీ
క్షణము నుండి నుతింతు నిత్యము శౌరినిన్ భవదీయ వీ
క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44979550247180281122013-02-25T17:56:00.279+05:302013-02-25T17:56:00.279+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29086276679320869572013-02-25T17:46:57.209+05:302013-02-25T17:46:57.209+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25671431741251513282013-02-25T17:38:46.836+05:302013-02-25T17:38:46.836+05:30శ్రీ నేమని గురువర్యులు కూర్చిన మధుర కంద ఛందస్సులో ...శ్రీ నేమని గురువర్యులు కూర్చిన మధుర కంద ఛందస్సులో నా ప్రయత్నం:

సులువుగ నూతన విధంపు పద్య సూత్రముఁ గూర్పన్
పులకితమానసుడనై కరంబు మోడ్చెద మీకున్
నలువ కళత్ర కరుణా రసంబు నాదెసఁ గుర్వన్
జెలువము, దీవెనలనీయ నాకు శ్రీగురు వర్యా!
(తప్పులు సరిదిద్ద ప్రార్థన)గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com