tag:blogger.com,1999:blog-6769183920316093900.post836168988543894483..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 262 (పోలేరమ్మను నుతింప)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25129393081212418572019-04-18T22:56:48.028+05:302019-04-18T22:56:48.028+05:30బాలకు కామెర్లవగా
మాలిన్యము ద్రోల గలుగు మందుల నిడక...బాలకు కామెర్లవగా
మాలిన్యము ద్రోల గలుగు మందుల నిడకే
కాలేయపు పుష్టి కొరకు
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురాG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6047179784343452922017-05-22T22:40:06.388+05:302017-05-22T22:40:06.388+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48602952208737124462017-05-22T05:22:46.532+05:302017-05-22T05:22:46.532+05:30కాలేయ మందు కేన్సరు
మేలౌనని రోజు రోజు మిక్కిలి వె...కాలేయ మందు కేన్సరు
మేలౌనని రోజు రోజు మిక్కిలి వెఱతో
పాలింపుము నీవేనని
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురాG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43358874102899545002011-03-22T07:44:19.044+05:302011-03-22T07:44:19.044+05:30శంకరార్యా! ధన్యవాదములు.శంకరార్యా! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54131233057013562692011-03-22T07:11:31.591+05:302011-03-22T07:11:31.591+05:30సత్యనారాయణ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు...సత్యనారాయణ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70897785646653973322011-03-22T00:45:09.672+05:302011-03-22T00:45:09.672+05:30చేల నడుమ చేఁబట్టుచు
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగ...చేల నడుమ చేఁబట్టుచు
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా!
కాలుని వంటి పహిల్వాన్
పోలేరమ్మకు పెనిమిటి, బొమికలు విఱుచున్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17872164011466716812011-03-21T23:12:02.971+05:302011-03-21T23:12:02.971+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభిన...హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

పీతాంబర్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
"మెప్పుల బొందే నేలికల" అన్నారు. "మెప్పుల బొందెడి + ఏలికల" కదా..
"మెప్పులఁ గను నా యేలికల" అని నా సవరణ.

అజ్ఞాత గారూ,
మో-పు లకు యతి మైత్రి వున్నది. సందేహ మావంతయు వలదు. నరసింహ మూర్తి గారి వివరణ చూడండి.

నరసింహ మూర్తి గారూ,
నిజమే! మూలకు కూర్చుని దేవిని నుతించినంత మాత్రాన కాలే కడుపు నిండుతుందా? మంచి పూరణ. అభినందనలు.
నా పక్షాన అజ్ఞాత గారికి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

వసంత్ కిశోర్ గారూ,
పాపాలు చేసి దైవస్తుతి చెసినంత మాత్రాన ముప్పుకలుగకుండా పోదు. చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45047665030069689322011-03-21T20:59:39.743+05:302011-03-21T20:59:39.743+05:30అప్పుడప్పుడు మన గురు దక్షిణలు గురువుగారికి శిక్షేమ...అప్పుడప్పుడు మన గురు దక్షిణలు గురువుగారికి శిక్షేమో, పాపము భరిస్తారు మన తప్పులని. అందుకే గురువులు పూజ్యనీయులు.

కిశోర్ జీ మీ పేలాలు బాగున్నాయి. అందులో వడియాలు పెట్టి వేయించి నట్లున్నాయి.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38357923834546690152011-03-21T20:31:36.136+05:302011-03-21T20:31:36.136+05:30అందరికీ వందనములు.
అందరి పూరణలూ
అలరించు చున్నవి.
...అందరికీ వందనములు.
అందరి పూరణలూ
అలరించు చున్నవి.

01)

వీలైన విధంబున, నతి
బేలల వలె బ్రతికెడు ,నిరు - పేదల వద్దే
పేలాలను లాగు కొనుచు
పోలేరమ్మను నుతింప - ముప్పు గలుగురా !
__________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51013816222568108152011-03-21T19:26:47.324+05:302011-03-21T19:26:47.324+05:30అజ్ఞాత గారూ పొ, ము , లకు యతి కుదిరినట్లే, గురువుగా...అజ్ఞాత గారూ పొ, ము , లకు యతి కుదిరినట్లే, గురువుగారు స్వపంచ పంచమాక్షరమగు మకారమునకు ఉత్వ,తన్మిత్ర స్వరములతో యతి కుదురుతుంది అని చెప్పారు కదా ! ఒకారము ఉకారమునకు మిత్ర స్వరము . మొ, పు లకు యతి కుదురుతుంది.

మరి ఒక పద్యము వ్రాయండి గురు దక్షిణగా !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6704717911974210012011-03-21T19:12:58.443+05:302011-03-21T19:12:58.443+05:30గురువు గారూ యడాగమము గురించి చెప్పి ఒక సందేహము నివృ...గురువు గారూ యడాగమము గురించి చెప్పి ఒక సందేహము నివృత్తి చేసారు.ధన్యవాదములు.

ప్రేలాపనలకు నేమిలె
కాలే కడుపులకుఁ దిండి గావలెఁ గానీ
మేలని మూలను గూర్చొని
పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78558039235860481642011-03-21T18:42:00.496+05:302011-03-21T18:42:00.496+05:30సవివరణకు ధన్యవాదాలు. అయితే ఇంకో సందేహం. పో-ము లు య...సవివరణకు ధన్యవాదాలు. అయితే ఇంకో సందేహం. పో-ము లు యతి కుదిరినట్లే, మో-పు లకు యతి మైత్రి వున్నదా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37083472036656114232011-03-21T17:33:04.395+05:302011-03-21T17:33:04.395+05:30కాలే కడుపులు నింపని
మేలేమియు జేయ లేని, మెప్పుల బొం...కాలే కడుపులు నింపని
మేలేమియు జేయ లేని, మెప్పుల బొందే
నేలికల నేమి జేయని
పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!manda pithamberhttp://pithambar.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76312843403798055692011-03-21T09:45:40.225+05:302011-03-21T09:45:40.225+05:30గోలి హనుమచ్ఛాస్త్రి.
శంకరార్యా! త్వరపడి సవరణ చేసి...గోలి హనుమచ్ఛాస్త్రి.

శంకరార్యా! త్వరపడి సవరణ చేసినందులకు క్షంతవ్యుణ్ణి.
సోదాహరణముగా వివరించినందులకు ధన్యవాదములు.నా సవరణలో యడాగమ పొరపాటు కూడా తెలుసుకున్నాను.మీమార్గములో నా పూరణ...

లేలే నారాజా,మరి
లేలేరా తిరగబడుము లెమ్మను,పాటల్
మేలేయని పేరడితో
పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27136598557350738972011-03-21T09:00:02.744+05:302011-03-21T09:00:02.744+05:30మందాకిని గారూ,
కచ్చితంగా వస్తుంది. నిజానికి పద్యంల...మందాకిని గారూ,
కచ్చితంగా వస్తుంది. నిజానికి పద్యంలో విసంధిగా, అచ్చులను ప్రయోగించడం సంప్రదాయం కాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38757012096577164342011-03-21T08:57:23.126+05:302011-03-21T08:57:23.126+05:30అజ్ఞాత గారూ,
"పో-ము"లకు యతి చక్కగా కుదుర...అజ్ఞాత గారూ,
"పో-ము"లకు యతి చక్కగా కుదురుతుంది. దానిని పోలికవడి అంటారు.
"అనంతుని ఛందోదర్పణము" లోని ఈ యతిభేదం చూడండి.
వెలసిన పుఫుబుభు వర్ణం
బులు పోలిక వడి ముకారముగ నిడఁ దగు ని
మ్ముల హరిచరణసరోరుహ
ములు నా హృత్సరసియందుఁ బొదలు ననంగన్. (ఇక్కడ ము-బొ లకు యతి)
పు-ఫు-బు-భు అను నాల్గు వర్ణములు స్వపంచమాక్షరమగు మకారము ఉత్వ, తన్మిత్ర స్వరములతో గూడినపుడు యతి కూర్చవచ్చును.
మీరు చెప్పినట్లు అనుస్వారంతో కూడిన ప-ఫ-బ-భ లు ఏ స్వరంతో ఉంటే తన్మిత్రస్వరాలతో ఉన్న మకారానికి యతి చెల్లుతుంది. ఉదా. 0ప-మ, 0ఫి-మి, 0బె-మె, 0భే-మే .... ఇది "అనుస్వార యతి" అనంతుని ఛందోదర్పణంలో ....
భువి ననుస్వారయతి బిందుపూర్వకముగ
ణాకు నిట నాల్గు చెల్లుఁ బాండవసహాయ
నాకు నిట నాల్గు చెల్లుఁ గందర్పజనక
మాకు నిట నాల్గు చెల్లు సంపదలరాజ.
అయ్యా! సందేహనివృత్తి జరిగిందా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41722400072390805402011-03-21T08:48:37.105+05:302011-03-21T08:48:37.105+05:30"నె అ" ఇక్కడ యడాగమం వస్తుందాండీ? (యఘముల..."నె అ" ఇక్కడ యడాగమం వస్తుందాండీ? (యఘముల్)లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54947026475629756802011-03-21T08:27:28.575+05:302011-03-21T08:27:28.575+05:30గోలి హనుమచ్ఛాస్త్రి.
(ఈ మధ్య కొన్ని భక్తి గీతాలు ...గోలి హనుమచ్ఛాస్త్రి.

(ఈ మధ్య కొన్ని భక్తి గీతాలు వింటుంటే మూలంలోని పాట గుర్తుకు వస్తుంది తప్ప భక్తి భావం గలుగదు.భక్తి లేని నుతులు ముప్పు అని నా భావం)
అజ్ఞాత గారు చెప్పినట్లు యతి మైత్రి లేదని భావించి చిన్న సవరణతో...

లేలే నారాజా,మరి
లేలేరా తిరగబడర లెమ్మను, పాటల్
మేలే యని పేరడితొ
పోలేరమ్మను నుతింప పోవునె అఘముల్?గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8340180844592249892011-03-21T08:12:38.294+05:302011-03-21T08:12:38.294+05:30"పో" కి "ము" యతి కలుస్తుందా ? ..."పో" కి "ము" యతి కలుస్తుందా ? "౦పు" కి "ము" కలుస్తుందని తెలుసు గానీ, ప వర్గకి మ కారానికి యతి మైత్రి లేదు కదా?Anonymousnoreply@blogger.com