23, జులై 2010, శుక్రవారం
గళ్ళ నుడి కట్టు - 18
అడ్డం
1. అనుమానము వద్దు. మోసం ఈ దేహము, వలపు లేదు (7)
6. రాత్రి. నిశాచర జనితమా? (3)
7. ఒక నది. అస్తవ్యస్తమయింది. వెటకారివే (3)
9. భార్య. ఎంతదయినా తిరుగబడింది (3)
10. బాధ. అయాచితపు నస (3)
11. ఏమిటి (1)
12. కలయిక. కె.విశ్వనాథ్ చిత్రంలో సెకండ్ హాఫ్ (3)
13. కూల్ గా. అస్తవ్యస్తమయింది (3)
15. సముద్రం. ఒక ఓడ బలి (3)
17. శూన్యమయినది. ముక్తసరిలో సలోపము (3)
18. "మేక తోకకు మేక" పద్యం ఉన్న ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్ ల చిత్రం (7)
నిలువు
2. పట్టపు రాణి. దేవారి అంటే రాక్షసుడు సుమా (3)
3. స్త్రీ. అవని తలమున గొప్పది (3)
4. కండూతి. బురద రాస్తే పోతుందా? (3)
5. వీడు పిల్లి తల కొరిగాడట! (7)
7. కాశీకి పోవడమంటే కాటికి పోవడమని నమ్మే కాలంలో ఏనుగుల వీరాస్వామి అక్కడికి వెళ్ళి వచ్చి రాసిన ట్రావెలాగ్ (7)
8. బాధ. అవే మదన బాధలు (3)
12. తక్కువలో తక్కువ క్రిందినుండి (3)
13. స్పష్టము. అయినా అస్తవ్యస్తమయింది. ఉల్లము తెల్లనిదా? (3)
14. హిందీలో ఒక పువ్వు. కరీనా కపూర్ వేశ్యగా నటించిన చిత్రం (3)
16. నేను కృష్ణుడనంటూ తడబడ్డాడు
శంకరయ్య గారూ, మీ గళ్ళ నుడికట్టు గురించి నా సూచనలు.
రిప్లయితొలగించండి* సమాధానాలు పంపటానికి గడువు ప్రకటించి, ఆలోపు వచ్చిన సమాధానాలు ప్రచురించకుండా కామెంట్ మోడరేషన్ పెట్టండి.
* పైన వ్యాఖ్యల రూపంలో సమాధానాలు కనపడుతుంటే (అవి సరైనవైనా, కాకపోయినా) నుడికట్టు ప్రయత్నించే ఉత్సాహం పోతోంది.
* పూర్తి చేసి పంపేలోపే ఒకటో రెండో వ్యాఖ్యలు వచ్చెయ్యటం కూడా నిరాశగా అనిపిస్తోంది.
* మీరు ‘కీ’ ఇవ్వటం బావుంది కానీ; విజేతలెవరో, ఒక తప్పుతో రాసిందెవరో కూడా ప్రకటించే బాధ్యత తీసుకుంటే బావుంటుంది.
శంకరయ్య గారూ, 17 వ అంకె మిస్సయింది, చూడండి:)
రిప్లయితొలగించండిఅడ్డం:
1.సందేహము వలదు 6.రజని 7. కారివే 9.తయిద 10. యాతన 12. సంగమం 13. ల్లగాచ 15. కడలి 17. రిక్తము 18. తెనాలి రామకృష్ణ
నిలువు:
2. దేవేరి 3. వనిత 4. దురద 5. పనిలేని మంగలి 7. కాశీయాత్ర చరిత్ర 8.వేదన 12. సంనీక 13. ల్లముతె 14. చమేలి 16. డష్ణుకృ
వేణు గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
మొన్నటి వరకు నేను వ్యాఖ్యలను మాడరేషన్ లోనే పెట్టి మరుసటి రోజు ప్రచురించే వాణ్ణి. అయితే సమస్యా పూరణకు, గళ్ళ నుడి కట్టుకు వ్యాఖ్యలను పంపిన వారు అవి వెంటనే బ్లాగులో కనిపించక ఏవో సాంకేతిక కారణాల వల్ల అవి నాకు చేరలేదని భావించి మళ్ళీ, మళ్ళీ పోస్ట్ చేయడం, అవన్నీ నా మెయిల్ ఇన్ బాక్స్ లో నిండి కొద్దిగా తికమక పడే పరిస్థితి వచ్చింది. అందుకని నిన్ననే మాడరేషన్ తొలగించాను. కాని గళ్ళ నుడి కట్టు జవాబులు వెంటనే బ్లాగులో కనిపించడం సరి కాదని ఈరోజు పొద్దున్నే భావించాను. ఈలోగా మీ సూచన అందింది. ఇప్పుడే వ్యాఖ్యలను మళ్ళీ మాడరేషన్ లో పెట్టాను.
మీరు చెప్పినట్లుగా ఇకనుండి విజేతల పేర్లు, ఒకటి, రెండు తప్పులతో రాసిందెవరో ప్రకటిస్తాను.
మీరు ఇలాగే సలహాలను, సూచనలను ఇస్తూ నన్ను ప్రొత్సహించ వలసిందిగా మనవి.
అడ్డం
రిప్లయితొలగించండి1.సందేహమువలదు 6.రజని7.కారివే 9.తయిద 10.యాతన 12.సంగమం13. ల్లగాచ ( చల్లగా అస్తవ్యస్తమైంది)15.కడలి 17.రిక్తము 18.తెనాలిరామకృష్ణ
నిలువు
2.దేవేరి 3.వనిత 4.దురద 5.పనిలేనిమంగలి 7.కాశీయాత్రచరిత్ర 8.వేదన 12.సమ్నీక (కనీసం తిరగబడింది) 13.ల్లముతె ( తెల్లము అస్తవ్యస్తమైంది)14.చమేలి 16.డష్ణకృ
వేణు గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే. మీరన్నట్లు 17 టైప్ కాలేదు. అడ్డం 11 ఆధారం ఇవ్వడం మరిచాను. ఇప్పుడు చేరుస్తున్నాను. ధన్యవాదాలు.
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండి16 నిలువు సమాధానంలో చిన్న అక్షరదోషం తప్ప మిగిలినవన్నీ సరిగా ఉన్నాయి. అభినందనలు.
అడ్డము:
రిప్లయితొలగించండి1)సందేహమువలదు, 6)రజని,7)కావేరి,9)దయిత,10)యాతన,11)కిం,12)సంగమం,13)ల్లగాచ(చల్లగా),15)కడలి,17)రిక్తము,18)తెనాలిరామకృష్ణ.
నిలువు:
2)దేవేరి,3)వనిత,4)దురద,5)పనిలేనిమంగలి,7)కాశీయాత్రదర్సిని,8)వేదన,12)కనీసం,13)తెల్లము,14)చమేలి,16)డష్ణుకృ(కృష్ణుడ)
అడ్డం: 1.సందేహము వలదు,6.రజని,7.కారివే,9.తయిద,10.యాతన,11.ఏం?,12.సంగమం,13.ల్లగాచ,15.కడలి,17.రిక్తము,18.తెనాలిరామకృష్ణ
రిప్లయితొలగించండినిలువు: 2.దేవేరి,3.వనిత, 4.దురద, 5.పనిలేని మంగలి, 7.కాశీయాత్రాచరిత్ర, 8.వేదన, 12.సంనీక,13.ల్లముతె, 14.చమేలి,16.డష్ణుకృ
వేణు, ప్రసీద, కోడీహళ్ళి మురళీమోహన్ గారలు ఆల్ కరెక్ట్ గా పూరించిన వారు.
రిప్లయితొలగించండిభమిడిపాటి సూర్యలక్ష్మి గారు కాశీయాత్ర చరిత్రను దర్శిని అన్నారు. మరో మూడు సమాధానాలలో అక్షర క్రమం తప్పింది.
అందరికీ అభినందనలు.
గళ్ళ్ నుడి కట్టు - 18 సమాధానాలు.
అడ్డం -
1.సందేహము వలదు; 6.రజని; 7.కారివే; 9.తయిద; 10.యాతన; 11.ఏం; 12.సంగమం; 13.ల్లగాచ; 15.కడలి; 17.రిక్తము; 18.తెనాలి రామకృష్ణ;
నిలువు -
2.దేవేరి; 3.వనిత; 4.దురద; 5.పనిలేని మంగలి; 7.కాశీయాత్ర చరిత్ర; 8.వేదన; 12.సంనీక; 13.ల్లముతె; 14.చమేలి; 16.డష్ణుకృ.