గళ్ళ నుడి కట్టు
అందరికి వందనాలు. నిన్న నా బ్లాగులో కామెంట్స్ మాడరేషన్ పెట్టాను. నా మెయిల్ కు వచ్చిన వ్యాఖ్యలను బ్లాగులో ప్రచురించబోతే "ఎర్రర్" వచ్చింది. మాడరేషన్ తొలగించి నా మెయిల్ లోని వ్యాఖ్యలను కాపీ చేసి బ్లాగులో పేస్ట్ చేయబోతే బ్లాగులో వ్యాఖ్యలు కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఆ తరువాత చూస్తే కొన్ని వ్యాఖ్యలు రిపీట్ అయ్యాయి. కొన్ని అసలే కనిపించ లేదు. అంతా గందరగోళ పరిస్థితి. దాంతో ఎవ్వరికీ సమాధానాలు ఇవ్వలేక పోయాను. తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేక ఇబ్బంది పడ్డాను. ఈ తికమకలో కొత్త గడి సిద్ధం చేయలేదు. అందుకే ఈ రోజు "గళ్ళ నుడి కట్టు" లేదు. వీలయితే రేపు కొత్త గడి పోస్ట్ చేస్తాను. నన్ను క్షమించండి.
గురువు గారు,
రిప్లయితొలగించండివ్యాఖ్యలను గోప్యంగా ఉంచమన్న నా సూచన వల్ల ఈ తికిమకలు వచ్చినట్టున్నాయి. ఇన్ని చిక్కులు కలుగుతున్నట్లైతే, మీరు పూర్వపు పంథాలోనే వ్యాఖ్యామోదరాహిత్యాన్ని పాటించండి.
గురువు గారు,
రిప్లయితొలగించండిబ్లాగర్ లో ఏదో సమస్య ఉన్నట్టుందండి. నిన్న సుమిత్ర గారు నా బ్లాగు లో రాసిన వ్యాఖ్యని ప్రచురించబోతే ఎర్రర్ వచ్చింది. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు మరి. గిరి గారన్నట్టు మీరు మోడరేషన్ తీసివేయండి .