7, ఆగస్టు 2010, శనివారం
గళ్ళ నుడి కట్టు - 33
అడ్డం
1. మొదటి వాన. తొలగించు నొకరి బాధ (4)
3. ఇంద్రుడు. బలుడనే రాక్షసుని భేదించినవాడు (4)
7. విరోధం. చంప గలిగేదా? (2)
8. ఏనుగు. కావవే! దండం పడతానంది (3)
9. అమ్మ, పార్వతి, కాశీరాజు పెద్ద కూతురు (2)
12. ఒక సుగంధద్రవ్యం. జాజి పత్రిక (3)
13. తర్వాత. పద పిలుస్తాలో ఇట్నుంచి (3)
17. వ్యర్థం. సరిత్తటంలో (2)
18. సంచరించడం. సంతగాళ్ళ ఆచారం (3)
19. పొలిమేర, హద్దు. ఎల్లప్పుడు ఉండేదా? (2)
22. పెరుగన్నం. గుళ్ళో ప్రసాదం (4)
23. విష్ణువు. అడవి పూల దండను ధరించేవాడు (4)
నిలువు
1. మున్నుడి, ముందుమాట (4)
2. భేకం. వెంకప్పను చూడండి (2)
4. దెబ్బ. వ్యాపారంలో ఇది కొడితే నష్టం (2)
5. దిక్కులే వస్త్రంగా గల స్త్రీ (4)
6. విల్లు. అయ్యా! నీకో దండం (3)
10. తాపసి (3)
11. యుద్ధం. కరుకుదనం ఉండాలి (3)
14. గురిజ. తన నలుపు ఎరుగనిది (4)
15. సింహం. ఐదు ముఖాలు గలదా? (3)
16. మంద మారుతం. పిల్లలకీ గాలి ఇష్టమా? (4)
20. ఒక ఆయుధం. భీముని చేతిలోనిది గదా? (2)
21. ఆజ్ఞ, ఒట్టు
అడ్డం: 1.తొలకరి, 3.బలభేది, 7.పగ, 8.వేదండం,9.అంబ,12.జాపత్రి, 13.పిదప, 17.రిత్త, 18.సంచారం,19.ఎల్ల,22.దధ్యోదనం,23.వనమాలి
రిప్లయితొలగించండినిలువు:1.తొలిపల్కు, 2.కప్ప, 4.లత్త,5.దిగంబరి,6.కోదండం, 10.తపసి/తపస్వి, 11.కదనం, 14.గురివింద, 15.పంచాస్యం, 16.పిల్లగాలి, 20.గద, 21.ఆన
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. ఆల్ కరెక్ట్.
అడ్డం
రిప్లయితొలగించండి1.తొలకరి3.బలభేది 7.పగ8. వేదండం 9.అంబ 12.జాపత్రి 13.పిదప 17.రిత్తం 18.సంచారం 19.ఎల్ల 22.దధ్యోదనం23.వనమాలి
నిలువు
1.తొలిపల్కు 2.కప్ప4. లవం 5.దిగంబరి 6.కోదండం 10.తపస్వి 11.కదనం 14.గురివింద 15.పంచాస్యం16.పిల్లగాలి 20.గద 21.ఆన
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. అన్నీ కరెక్టే. కాకపోతే అడ్డం 17 సున్న ఎక్కువగా పెట్టారు.
అడ్డము:
రిప్లయితొలగించండి1)తొలకరి,3)బలాభేది,7)పగ,8)వేదండం,9)అంబ,12)జాపత్రి,13)పిదప,17)రిత్త,18)సంచారం,19)ఎల్ల,22)జనందద్దో,23)వనమాలి.
నిలువు:
1)తొలిపల్కు,2)కప్ప,4)లాసు,5)దిగంబరి,6)కోదండం,10)తపస్వి,11)కదనం,14)గురిగింజ,15)పంచాస్యం,16)చల్లగాలి,20)గద,21)ఆన.
సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిరెండు, మూడు తప్పులున్నాయి.
కోడీహళ్ళి మురళీమోహన్ గారి సమాధానాలను చూడండి. వారి సమాధానాలు 100% కరెక్ట్. అందువల్ల ప్రత్యేకంగా సమాధానాలు ఇవ్వడం లేదు.