14, ఆగస్టు 2010, శనివారం
గళ్ళ నుడికట్టు - 40
అడ్డం
1. విండ్ మిల్. మలిగారను సవరించు (4)
3. పదకొండవ తిథి (4)
7. ఒక కాలమానం, జంట (2)
8. ఎలుగుబంటి (3)
9. ఈ రాయుళ్ళు చెంచాగిరీ చేస్తారు (2)
12. రుద్రుని కంటి నుండి పుట్టిందట ఈ పూస (2)
13. ప్రయాణ సాధనం (3)
17. సూత్రం, తంతు. మందారంలో (2)
18. తమిళనాడులోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం (3)
19. తోక తెగిన సముద్రం అచ్చ తెలుగులో (2)
22. సొంత పేరు సంస్కృతంలో (4)
23. వనంలో నివసించే ఆశ్రమం. బ్రహ్మచర్యం మొదలైన వాటి లోనిది (4)
నిలువు
1. విశ్వామిత్రుడు. గాధి కొడుకు (4)
2. కళంకం. మచ్చరం తెచ్చేదా? (2)
4. పార్వతి రూపాల్లో ఒకటి. ప్రసిద్ధ సంస్కృత కవి ఈమె దాసుడా? (2)
5. తమిళనాడులోని ఈ నగరం అగ్గిపెట్టెల, మతాబుల పరిశ్రమకు ప్రసిద్ధం (4)
6. విక్రమ సింహపురం. ఇఫ్ఫటి పేరు (3)
10. నిద్రలో ఉన్నట్టిది (3)
11. తెగువ. " ......... చేయరా డింభకా!" అన్నాడు పాతాళ భైరవి మాంత్రికుడు (3)
14. మెరుపు. హిందీ బేరం + ఇంగ్లీషు సూక్ష్మం (4)
15. భార్య. కళకు పాత్రం (3)
16. ధర్మరాజు రాజధాని (4)
20. వర్షాన్ని పులువు (2)
21. బిడ్డ. "కూప నటత్"లో వెదుకు
అడ్డం: 1.గాలిమర, 3.ఏకాదశి,7.యుగం,8.భల్లూకం,9.కాకా, 12.రుద్రాక్ష, 13.వాహనం, 17.దారం, 18.పళని, 19.సంద్ర,22.నిజనామం, 23.వానప్రస్థం
రిప్లయితొలగించండినిలువు:1.గాధేయుడు, 2.మచ్చ, 4.కాళి,5.శివకాశి, 6.నెల్లూరు, 10.నిద్రాణం, 11.సాహసం, 14.సౌదామిని, 16.ఇంద్రప్రస్థం, 20.వానా, 21.కూన
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిఆల్ కరెక్ట్. అభినందనలు.
అడ్డం
రిప్లయితొలగించండి1.గాలిమర 3.ఏకాదశి 7.యుగం 8.భల్లూకం 9.కాకా 12.రుద్రాక్ష 13.వాహనం 17.దారం 18.పళని 19.సంద్ర 20.మమనామం 23.వనప్రస్థం
నిలువు
1.గాధేయుడు 2.మచ్చ 3.కాళి 5.శివకాశి 6.నెల్లూరు 10.నిద్రాణం 11.సాహసం 14. ------15.కళత్రం 16.ఇంద్రప్రస్థం 20.వానా 21.కూన
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 20, నిలువు 14 సరైన సమాధానాల కోసం కోడీహళ్ళి మురళీమోహన్ గారి పరిష్కారాన్ని చూడండి.