15, ఆగస్టు 2010, ఆదివారం
గళ్ళ నుడికట్టు - 41
అడ్డం
1. వృథా దూషణం. చవితి చంద్రుణ్ణి చూస్తే వచ్చేది (4)
3. ముక్తి. వాని శ్రేయస్సు కోసం వెదుకు (4)
7. గృధ్రం (2)
8. మంచానికి మనవారు అల్లుతారు (3)
9. గడ్డ. ఈ పద్యం చూడ్డానికి చిన్నది, లక్షణమేమో పెద్దది (2)
12. సమ్కిప్తం, కూడబెట్టడం (3)
13. కావ్య పరిచ్చేదం (3)
17. ఊపిరి (2)
18. పరదేశంలో ఉన్నవాడు (3)
19. మూలం, అన్యం (2)
22. మది గానం చేస్తే అందులో కృష్ణా జిల్లాలోని ఒక ఊరు (4)
23. సరస్సు (4)
నిలువు
1. దయ. వాణిశ్రీతో శ్యాం బెనెగల్ తీసిన తెలుగు సినిమా (4)
2. ఆకాశం (2)
4. ప్రశస్తం (2)
5. ఆర్జనం. సంపాదకుడు చేసేదా? (4)
6. పెండ్లి (3)
10. మొదటివాడు, శ్రేష్ఠుడు (3)
11. నమ్మకం (3)
14. ఓదార్పు. ఆ అశ్వాన్ని ఆసనం చేసుకో ... తెలుస్తుంది (4)
15. కిటికీ (3)
16. బృహస్పతివారం (4)
20. తలపై పెట్టుకునేది, కోటలో వేసేది (2)
21. జుగుప్స తిరగబడింది. వింత రోగంలో చూడండి
గళ్ళ నుడికట్టు - 41 సమాధానాలు.
రిప్లయితొలగించండిచిత్రం! ఈ సారి ఒక్కరుకూడ ప్రయత్నించలేదు. ఎందుకో?
అడ్డం -
1.అపనింద; 3.నిశ్రేయసం; 7.గద్ద; 8.నవారు; 9.కంద; 12.సంగ్రహం; 13.ఆశ్వాసం; 17.శ్వాస; 18.ప్రవాసి; 19.వేరు; 22.నందిగామ; 23.సరోవరం.
నిలువు -
1.అనుగ్రహం; 2.నింగి; 4.శ్రేష్ఠం; 5.సంపాదన; 6.వివాహం; 10.అగ్రణి; 11.విశ్వాసం; 14.ఆశ్వాసనం; 15.గవాక్షం; 16.గురువారం; 20.పాగా; 21.తరో.