24, ఆగస్టు 2010, మంగళవారం
గళ్ళ నుడికట్టు - 46
అడ్డం
1. తక్షకుడు కాటు వేసిన పాండవ వారసుడు. పరీక్షలో చిత్తవుతాడా? (4)
3. హనుమాన్ చలీసా రాసిన హిందీ కవి (4)
7. ఒక వంటపాత్ర. గిన్నియ రూపాంతరం (2)
8. సన్యాసి, బిచ్చగాడు (3)
9. పోతారా అంటే ఉహూఁ అంటారు (2)
12. కూర్చడం, జతచేయడం, సంధించడం (3)
13. విశేషంగా ద్రోహం చేసేవాడు (3)
17. అశ్వత్థం. రాచకొండ విశ్వనాథ (2)
18. కొట్టడం, తాడించడం (3)
19. నూరు (2)
22. ఉన్నదున్నట్లు అట్నుంచి (4)
23. తొట్రుపాటు. బడతడు సవరించు (4)
నిలువు
1. ఇతరుల అభిప్రాయం. పతంగి ఎగిరేందుకు కావాలా? (4)
2. శీఘ్రం, వేగవంతం. ప్రదక్షిణలో (2)
4. బహిర్గతం. గుట్టు చివర కయ్యేది (2)
5. కుచేలుడు. మంచి ఇల్లు గలవాడా?
6. ముక్కంటి (3)
10. విధం. చెప్పడం వృధా, వినం (3)
11. గుండెజబ్బు (3)
14. ఆకాశం. చుక్కల దారి (4)
15. బాధ, ఒత్తిడి (3)
16. వేదం చదివినవాడు, ఛందస్సు తెలిసినవాడు, చాదస్తం కలవాడు (4)
20. బెల్ట్ బాంబు ధరించిన రాజీవ్ గాంధీ హంతకురాలు క్రిందినుండి (2)
21. కుడ్యం
అడ్డం: 1.పరీక్షిత్తు,3.సూరదాసు(?) 7.గిన్నె, 8.భిక్షువు, 9.పోము,12.సంధానం, 13.విద్రోహి, 17.రావి, 18.తాడనం, 19.వంద, 22.థంతథాయ, 23.తడబడు
రిప్లయితొలగించండినిలువు: 1.పఏంగితం, 2.క్షిప్ర(?), 4.రట్టు, 5.సుధాముడు, 6.త్ర్యక్షుడు, 10.విధానం, 11.హృద్రోగం, 14.తారాపథం, 15.పీడనం, 16.ఛాందసుడు,20.నుథా, 21.గోడ
శంకరయ్యగారూ, ఆధారాలు అడ్డం 3. "హనుమాన్ చాలీసా రాసిన హిందీ కవి" అని ఇచ్చారు- హనుమాన్ చాలీసాను రాసింది తులసీదాసు.. అయితే ఇతర ఆధారాల ప్రకారం "సూరదాసు" అని వస్తున్నట్లున్నది..?
రిప్లయితొలగించండిఅడ్డము:
రిప్లయితొలగించండి1)పరిక్షితు,3)సూరదాసు,7)గిన్నె,8)భివుక్షు,9)పోము,12)కలుపు,13)విద్రోహం,17)రావి,18)తాడనం,19)వంద,22)ధంతధయ,23)తడబడు.
నిలువు:
1)పరాంగితం,2)క్షిప్రం,4)రట్టు,5)సుధాముమ(సుధామము)6)శివుడు,10)తెలుపు,11)హృద్రోగం,14)తారాపధం,15)పీడనం,16)ఛాందసుడు,20)నంధ(ధనం)21)గోడ.
(హనుమాన్ చాలిసా వ్రాసినది తులసీదాసు. గడిలో కుదిరిందికదా అని సూరదాసు వ్రాసాను.)
మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండినిజమే. పొరపాటే. ఆధారం మార్చాలి. నా తప్పును తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1. పరీక్షిత్తు
రిప్లయితొలగించండి3.
7. గిన్నె
9.పోము
13.విద్రోహి
17.రావి
18.తాడనం
19.వంద
20.తథాయథం
23.తడబడు
4.రట్టు
21.గోడ
11.హృద్రోగం
14.తారాపధం
15.పీడనం
20. నుథ
మీ అందరి సమాధానాలను రేపు ప్రకటించాలి. కాని పొరపాటును "ప్రచురించు" క్లిక్ చేసాను.
రిప్లయితొలగించండిఇక అందరూ చెప్పినట్లుగా అడ్డం 3 విషయంలో ఘోరమైన తప్పు చేసాను. ఏ మూడ్ లో ఉన్నానో ఏమో? సవరించడానికి అవకాశం దొరకలేదు. ఇందుకు నన్ను అందరూ మన్నించాలి.
గళ్ళ నుడికట్టు - 46 ను పూరించిన
రిప్లయితొలగించండికోడీహళ్ళి మురళీమోహన్, భమిడిపాటి సూర్యలక్ష్మి, ఊకదంపుడు గారలకు అభినందనలు.
మా అబ్బాయికి జ్వరం. నిన్న హాస్పిటల్ తీసుకుపోవడం, మరికొన్ని పనుల్లో వ్యస్తుణ్ణి కావడం వల్ల గళ్ళ నుడికట్టు -47 సిద్ధం కాలేదు. రేపు ప్రచురిస్తాను.
గళ్ళ నుడికట్టు - 46 సమాధానాలు
రిప్లయితొలగించండిఅడ్డం:
1.పరీక్షిత్తు, 3.సూరదాసు(ఇచ్చిన ఆధారం తప్పైనా గడిలో ఉన్నది ఇదే) 7.గిన్నె, 8.భిక్షువు, 9.పోము, 12.సంధానం, 13.విద్రోహి, 17.రావి, 18.తాడనం, 19.వంద, 22.థంతథాయ, 23.తడబడు.
నిలువు:
1.పరేంగితం, 2.క్షిప్రం, 4.రట్టు, 5.సుధాముడు, 6.త్ర్యక్షుడు, 10.విధానం, 11.హృద్రోగం, 14.తారాపథం, 15.పీడనం, 16.ఛాందసుడు,20.నుథా, 21.గోడ.