20, సెప్టెంబర్ 2010, సోమవారం
గళ్ళ నుడికట్టు - 54
అడ్డం
1. దొరతనం కల అతడు విధికాని పరిస్థితిలో ఉంటాడా? (4)
3. అందగాడు (4)
7. నీ వింతటి దానివే ... ఆశ్చర్యం (2)
8. తమరి మనస్సులో ఉంది చీకటి (3)
9. అంగదునికి కావాలి మ్రానిమొద్దు (2)
12. ప్రకాశించేది. పరాజితం కాదు (3)
13. చీటి కట్టి ఈ అంధకారంలో పడ్డావా? (3)
17. కాంతి, కిరణం. కాశ్మిరంలో చూడు (2)
18. సనక సనందుల గృహం (3)
19. నీడ, సూర్యుని భార్య (2)
22. తమిళనాడులో సరస్వతీ ప్రాచ్యలిఖిత భాండాగారం ఉన్న నగరం (4)
23. మానుము అనం. సందేహమా? (4)
నిలువు
1. అరవిరిసిన అందం ఈ పద్మానిది (4)
2. నల్లని ఇంగ్లీషు వాహనం (2)
4. బట్టలు కుట్టేవాడు దర్జాగా ఉంటాడా? (2)
5. తిరగబడ్డ శత్రువు. వాడు అహితుడు గద ... పద! (4)
6. ప్రాబ్లమే. పూరించమని నా బ్లాగులో రోజుకొకటి ఇస్తున్నది (3)
10. శివరంజినిలో వింటినారి (3)
11. నెంబర్ వన్ (3)
14. సాహిత్యం. సరస్వతీ సంబంధమైనది (4)
15. అందరూ లంఘిస్తే దీన్ని మోసేవారెవరు? (3)
16. కోర్టు (4)
20. ఎంతో పుణ్యం చేసుకున్న తోట (2)
21. మేలును కోరే శరీరం (2)
అడ్డం:1.అధికారి,3.సుందరుడు,7.వింత, 8.తమస్సు,9.దుంగ, 12.రాజితం, 13.చీకటి,17.రశ్మి, 18.సదనం,19.ఛాయ,22.తంజావూరు,23.అనుమానం
రిప్లయితొలగించండినిలువు:1.అరవిందం,2.కారు,4.దర్జీ,5.డుతుగప,6.సమస్య,10.శింజిని,11.ఒకటి, 14.సారస్వతం, 15.పల్లకి, 16.న్యాయస్థానం, 20.తోపు,21.మేను.
అడ్డము:
రిప్లయితొలగించండి1)అధికారం,3)సుందరుడు,7)వింత,8)తమస్సు,9)దుంగ,12)రాజితం,13)చీకటి,17)రశ్మి,18)సదనం,19)ఛ్చాయ,22)తంజావూరు,23)అనుమానం.
నిలువు:
1)అరవింద,2)కారు,4)దర్జీ,5)పగవాడు,6)సమస్య,10)శింజిని,11)మొదటి,14)సారస్వతం,15)అందలం,16)న్యాయలయం,20)తోపు(తోవూ)21)మేను.
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండినిలువు 15 తప్ప మిగిలినవన్నీ కరెక్ట్.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
అడ్డం 22 చివరి రెండు అక్షరాలు,
నిలువు 1 లో చివర సున్నా, 5 చివరి రెండు అక్షరాలు (తిరగేస్తే మొదటి రెండు అవుతాయి), 11 పూర్తిగా, 16 చివరి ముడక్షరాలు తప్పులు.
అడ్డం: 22) తంజాపురి
రిప్లయితొలగించండినిలువు: 1) అరవిందం,5) డువాగప, 11) ఒకటి,16) న్యాయస్థానం
( నా కళ్ళజోడు రిపేర్లకెళ్ళింది. దానివలన అన్ని తప్పులు వచ్చాయి!)
సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 22 చివరి అక్షరం నేననుకున్నది వేరైనా మీరూ కరెక్టే.
నిలువు 5 లో మొదటి రెండక్షరాలు మారాలి.
గడి 54.అడ్డం 1.అధికారి.3.అందగాడు.7.వింత.8.తిమిరం.9.దుంగ.12.రజతం.13.చీకటి.17.రశ్మి.18....19.ఛాయ .22.మదరాసు.23.అనుమానం.
రిప్లయితొలగించండినిలువు.అరవిందం.2.కారు.4. దర్జీ .5.డుతుగప [ పగతుడు ].6. సమస్య.10.రంజని.11.ఒకటి.14.తరలము [తరళము ] 15.నాగలి.16.న్యాయ స్థానము. 20.....21.మేను.
గళ్ళ నుడికట్టు - 54
రిప్లయితొలగించండికోడీహళ్ళి మురళిమోహన్ గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, నేదునూరి రాజేశ్వరి గారలకు అభినందనలు, ధన్యవాదాలు.
గళ్ళ నుడికట్టు - 54 సమాధానాలు
రిప్లయితొలగించండిఅడ్డం:
1.అధికారి, 3.సుందరుడు, 7.వింత, 8.తమస్సు, 9.దుంగ, 12.రాజితం, 13.చీకటి, 17.రశ్మి, 18.సదనం, 19.ఛాయ, 22.తంజాపురం, 23.అనుమానం
నిలువు:
1.అరవిందం, 2.కారు, 4.దర్జీ, 5.డుతుగప, 6.సమస్య, 10.శింజిని, 11.ఒకటి, 14.సారస్వతం, 15.అందలం, 16.న్యాయస్థానం, 20.తోపు, 21.మేను.