29, సెప్టెంబర్ 2010, బుధవారం
గళ్ళ నుడికట్టు - 56
అడ్డం
1. వేడిమి యొక్క తీవ్రత. కనిష్ట గరిష్టాలుగా వార్తల చివర చెప్పేది (4)
3. పొడుపు కథ. దీనిలోంచే హిందీ పహేలీ పుట్టింది (4)
7. వ్రణం నుండి రసికుడు కార్చే చీము (2)
8. విక్రయం. అమ్మతో మొదలు (3)
9. శిల్పి చేతిలోని దీని అలికిడికి శిలలు ఉలిక్కి పడతాయా? (2)
12. సహజీవనం కోసం కావాలి ఓర్పు (3)
13. వలదన్నా మనం అద్దంలో చూసే ముఖం (3)
17. సేవకుడు. దీని రీతి కొలువు కోరాడు త్యాగరాజు (2)
18. మావారు అంతంత కిటికీలు పెట్టారు .. ఇది బాగా రావాలని (3)
19. కూసింత ఆగు. మేత మేసే గాడిదను చెడగొట్టకు (2)
22. నగలు ఏవైనా కోరి వేసుకుంటాడీ పర్వతాల శత్రువు (4)
23. ఎరుక. ఉపరిచర వసువు సాయం తీసుకో (4)
నిలువు
1. ఉచ్చరించడం (4)
2. ఆగ్రహం చూపొద్దు. అది ప్లానెట్టే (2)
4. నీచం, అధమం (2)
5. కల్లోలపడే నది (4)
6. వింత, విడ్డూరం. మత్తు కలిగినట్టిది (3)
10. తెగింపు. ఇది చేస్తే రాకుమారి దక్కుతుందేమో? (3)
11. ఆమె దడుసుకునేలా ఆలోచిస్తుంది. మస్తిష్కం (3)
14. కట్టుబాటు, హిందీ వ్యాసంతో మొదలు (4)
15. సమయం, యౌవనం. తరుణికి చెందిందా? (3)
16. తెల్ల గుఱ్ఱం. ఇంద్రుని ఉచ్చైశ్రవం (4)
20. కోయంబత్తూరు. ఇదే ఇంటి పేరైన సరళ సినీ హాస్య నటి (2)
21. ఇంద్రుడైనా, సింహమైనా, కోతి ఐనా, చివరాఖరుకు దొంగైనా ఆ రెండక్షరాలు పాతకాలను హరిస్తాయన్నాడు పోతన (2)
అడ్డం: 1.ఉష్ణోగ్రత, 3.ప్రహేళిక, 7.రసి, 8.అమ్మకం, 9.ఉలి, 12.సహనం, 13.వదనం, 17.బంటు, 18.మారుతం,19.కూత,22.నగవైరి, 23.పరిచయం
రిప్లయితొలగించండినిలువు: 1.ఉచ్చారణ, 2.గ్రహం,4.హేయం, 5.కల్లోలిని, 6.గమ్మత్తు, 10.సాహసం, 11.మెదడు, 14.నిబంధన, 15.తరుణం, 16.శ్వేతహయం, 20.కోవై, 21.హరి
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిఇంత త్వరగా, అన్నీ సరైన సమాధానాలతో గడిని పరిష్కరించినందుకు అభినందనలు, ధన్యవాదాలు.
ఈసారి కోడీహళ్ళి మురళీమోహన్ గారు మాత్రమే గడిని నింపి పంపారు. వారికి అభినందనలు.
రిప్లయితొలగించండి