4, అక్టోబర్ 2010, సోమవారం
గళ్ళ నుడి కట్టు - 58
అడ్డం
1. రావణుడిదా ఈ సైన్యం (3)
4. ఈజీగా దొరుకుతుంది. మూడాసుల లాభంతో (3)
6. చివరికి ఆమడ దూరం వెళ్ళినా లాభం లేదు (5)
7. సున్నా లేని బ్రతుకు. రాజశేఖర్ పై తలంబ్రాలు పోసింది (3)
9. కదం తొక్కిన యుద్ధం తికమక పడింది (3)
11. పరవశం, ఉపేక్ష, ఏమరుపాటు. "..... చేసే వేల? సమయము కాదు" అన్నాడు త్యాగయ్య (3)
13. పసివాణ్ణి ఇలా ముద్దుగా పిలిస్తే రౌడీ వచ్చాడేం? (2)
14. సంభావనం కావాలని అతని అభిప్రాయం (2)
15. శంకరుడు. మధ్య రెండక్షరాలు మారాలి (3)
16. చివర ఏనుగున్న పుకారు (3)
18. క్షణకాలం ఉండేది (3)
20. విరహాల మాత్రయా ఈ ఎక్స్ కర్షన్? (5)
22. శంకరుడే. త్రిపుర వైరి (3)
23. ఏ ఉపాయమైనా కథ పండదు (3)
నిలువు
1. చక్రవర్తుల రాజగోపాలాచారి (3)
2. అవని తలంలో స్త్రీ (3)
3. చీకట్లో కాలికి తగిలేది .....? రప్పో? (2)
4. శకుంతలా దుష్యంతుల కోడలు. భరతుని మనసు ఆనంద పరచేది (3)
5. శుభం ఉండదనం. ఇది యుద్ధం (3)
8. గనులకు భూకేటాయింపు ఇలా వాదప్రతివాదాలకు నెలవు అవుతున్నది (5)
10. మధురంగా మాట్లాడేది ఎవరో కళాపూర్ణోదయంలో చూడండి (5)
11. గ్రామీణుల జలుబు (3)
12. భూమికి కొడుకీ గ్రహం (3)
16. పులవ బెట్టిన ప్రేమ (3)
17. ప్రయత్నించి ఇసుమున తైలం తీయవచ్చు (3)
18. తలాతోకా లేని నక్షత్రపథం. (3)
19. కంచు కంఠం కలవాడు వేసుకున్న చొక్కా
21. రథమెక్కి యుద్ధం చేసేవాడు (2)
అడ్డము:
రిప్లయితొలగించండి1)రాణువ,4)సులభం,6)నిష్ప్రయోజనం,7)జీవిత,9)దకనం,11)పరాకు,13)దాదా,14)భావం,15)శంభుడు,16)వదంతి,18)క్షణికం,20)విహారయాత్ర,22)పురారి,23)పధకం.
నిలువు:
1)రాజాజీ,2)వనిత,3)రాయో,4)సునంద,5)భండనం,8)వివాదస్పదం,11)పడిశం,12)కుజుడు,16)వలపు,17)తిమిరి,18)క్షత్రప,19)కంచుకం.
నిలువు 10, 21 ఆధారాలు యివ్వలేదు.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండినిలువు 17 మధ్య అక్షరం తప్ప మిగిలినవన్నీ సరైన సమాధానాలే. అభినందనలు.
మీరు చెప్పినట్టు నిలువు 10, 21 ఆధారాలు ఇవ్వలేదు. మన్నించండి. ఇప్పుడు చేర్చాను.
నిలువు:
రిప్లయితొలగించండి10) కళభాషిణి, 21)రధి.