23, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 110 (ప్రహేళిక)

కం.
అంచిత చతుర్థజాతుఁడు
పంచమమార్గమున నేఁగి ప్రథమతనూజన్
గాంచి, తృతీయం బప్పురి
నించి, ద్వితీయంబు దాఁటి, నృపు కడ కరిగెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఎవరికైనా సమాధానం తెలుసా?
తెలిస్తే క్రింది చిరునామాకు మెయిల్ పెట్టండి.
shankarkandi@gmail.com

4 కామెంట్‌లు:

  1. మందాకిని గారి సమాధానం ....

    భూమి,నీరు,అగ్ని,వాయువు, ఆకాశం - పంచభూతములు.

    చతుర్థజాతుఁడు - వాయుపుత్రుఁడు
    పంచమమార్గమున నేఁగి- ఆకాశమార్గమున నేఁగి
    ప్రథమతనూజన్ గాంచి, --భూసుత - సీతను గాంచి,
    తృతీయం బప్పురి నించి -- అగ్ని నించి - కాల్చి
    ద్వితీయంబు దాఁటి, ----నీరు - కడలి దాఁటి
    నృపు కడ కరిగెన్.----రాముని చేరెను.

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానము ...

    పృథ్వి,నీరు,అగ్ని,వాయువు, ఆకాశము పంచ భూతములు

    చతుర్థ జాతుడు = వాయు నందనుడు ( ఆంజనేయుడు )
    పంచమ మార్గమున = ఆకాశ మార్గమున , యేగి
    ప్రథమ తనూజన్ = అవనిజను ( సీతను ) గాంచి
    తృతీయము = అగ్నిని, ఆ పురి నుంచి
    ద్వితీయము = నీటిని ( సముద్రమును )దాటి
    నృపు కడ కరిగెన్ = రాముని వద్దకు చేరెను .

    రిప్లయితొలగించండి
  3. ఊకదంపుడు గారి సమాధానం ...

    వాయుపుత్రుడు ఆకాశమార్గముననేగి - భూమిసుతను చూసి - లంకలో నిప్పుపెట్టి - నీళ్లను దాటి రాముని చేరెను

    రిప్లయితొలగించండి
  4. మందాకిని గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఊకదంపుడు గారూ,
    మీ అందరి సమాధానాలూ సరైనవే. అభినందనలు.

    రిప్లయితొలగించండి