9, నవంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 730

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి

10 కామెంట్‌లు:

  1. అదరక బెదరక పట్టును
    వదలక పోరిన విజయము వశమగుననుచున్
    చెదరని విశ్వాసముతో
    నెదిరించెను ముప్పునిచట నెలుకయె గనుమా

    రిప్లయితొలగించండి
  2. ఎలుకల బోనది చూడుమ!
    యె లుకొక్కటి వచ్చె నిపుడు నెర నట గనుచు
    న్వ లదా ? యే గగ నిప్పుడు
    నల జూడుము బోర్డు మీది యక్షర పంక్తిన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    నేటి ఎలుక - యిక కులుకు :

    01)
    ___________________________

    కోటి విద్య లన్ని - కూటి కోసమె గదా
    విశ్వ మందు జూడ ! - విజయ మంద
    నెరను పట్ట గోరి - యేతెంచె నెలుకయె
    శీర్షకమును తొడిగి - శిరసు నందు !
    ___________________________

    రిప్లయితొలగించండి
  4. ఎలుక మనస్సు లో మాటగా ......

    పెద్ద తెలివి గలిగి పెట్రేగి బోకుమా
    మొద్దు నైన కాని మొండి మతిని
    బుద్ధి పెట్టి చూసి బోనునే గాననా
    వద్దు నేను మళ్ళి వశము జూసి

    రిప్లయితొలగించండి
  5. NEVER GIVE UP!

    శ్రమయె పడగనీ కన్నియు సాధ నౌను
    క్రమము యుండగ జేయగ కాని దేది
    భద్రమే ముఖ్యమవు నీకు బలము కాదు
    ఎలుక నీతి యెరుగునీవు ఎరలు బెట్ట

    రిప్లయితొలగించండి
  6. తలపెట్టెను ముక్కనుదిన
    తల ఫట్టున బోనున బడు తలపే గలుగన్
    తలబెట్టెను హెల్మెట్నే
    తల బట్టుకు నెలుక మనసు తటపట లాడెన్.

    రిప్లయితొలగించండి
  7. ధీరత జూపి శిరస్త్రము
    ధారణ జేసినది యెలుకు తప్పనిసరియై
    మారిన జీవన విధమని
    పోరాటము జేసి భుక్తి బొందగ నెంచెన్

    రిప్లయితొలగించండి
  8. ఉచ్చు బిగించఁ దలచిరా?
    సచ్చుఁ బడుచు నేగు పిచ్చి సన్యాసిన? నే
    బెచ్చుగ హెల్మెట్టెట్టుకు
    తచ్చాడుతు తిండిఁ దినెదఁ దండ్లాడకనే!

    రిప్లయితొలగించండి
  9. మున్ను పిల్లి బాధ బుచ్చంగ నెలుకలు
    మెడను గంట గట్టె మేలు గాను
    నేటి ఎరను బట్టి నేర్చుచు రక్షణ
    నెత్తి మీద బెట్టె నిండు కుండ
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కృతులు...
    భద్రాచలం, పాపికొండల యాత్ర ముగించుకొని తిరిగివచ్చాను.
    నిన్నటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు....
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    సుబ్బారావు గారికి,
    వసంత కిశోర్ గారికి,
    బి.యస్.యస్. ప్రసాద్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి