22, నవంబర్ 2017, బుధవారం

మహా నాగ బంధము

సీస బంధ దేవి స్తుతి 

సీ.
చాముండ, చల, యుమ, సతి, భవ్య, శాంభవి,
          మాత, యమున, శివ, మారి, సౌమ్య, 
మాలిని, ఆర్యాణి, మాధవి, గిరిజ, నా
          రాయణి, భార్గవి, రామ, సత్య, 
చండ, కాత్యాయని, చండిక, హీర, యా
          నంద భైరవి, రమ్య, నందయంతి,
నగనందిని, నగజ, భగవతి, నగజాత,
          దాక్షాయణీ, తల్లితల్లి, జలధి
జ, నటరాజసతి, భంజ, నికుంభిల, విజయ,
          చలిమల పట్టి, చపల, శివాని,
శాకంబరి, భవాని, శ్యామల, సావిత్రి,
          శాంతి, యిందిర, లంబ,  శాకిని, సిరి,
శాక్రి, సనాతని, సని, రమ, శాంకరి,
          కాళిక, శైలజ, కాళి, పాత్రి,
సంపద, పార్వతి, శైలేయి, మాతంగి,
          సాత్వికి, మాతృక, షష్టి, వాణి,
తే.గీ.
బాణ, గీర్దేవి, వాగ్దేవి, బాస, విద్య
దాత, లక్కిమి, పద్మిని, సీత, లక్ష్మి,
దాక్షి,  శ్యామ, లలన, దక్ష తనయ, రామ,
కరుణ తోడ మమ్ము సతము గాచ వలయు.

రచన :- పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

8 కామెంట్‌లు:

  1. సూర్యకుమారుగారికి నమస్కారములు
    మీనాగబంధ సీసపద్య దేవిస్తుతి బాగుంది
    జలధిజ అంటె లక్ష్మీదేవి కదా
    శర్వాణి పేరు చేరిస్తే బాగుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు తల్లి ముగ్గురు అమ్మలా ప్రార్ధన గదా అందువల్ జలదిజ వాడవలసి వచ్చినది

      తొలగించండి
    2. అక్కడ శార్వాణి పదము సరిపోదు గదా తల్లి

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. అష్టోత్తరనామంబులు
    బుష్టిగరచియించితీవపూర్వపువలెనే
    మృష్టాన్నమ్మునుబెట్టుమ
    యిష్టముగాదిందురార్య!యిప్పుడువారల్

    రిప్లయితొలగించండి

  4. సూర్య కుమార్ మీ దేవీత్రయ స్తోత్రము చాలా బాగుంది.
    చల, యుమ (చలోమ?); మాలిని, (యా)ఆర్యాణి (మాలిన్యార్యాణి?); భవాని (ని – గురువు?), శ్యామల; దాక్షి, (క్షి-గురువు?)శ్యామ: వీటిలో వ్యాకరణ సంశయము.

    రిప్లయితొలగించండి
  5. కామేశ్వర రాగు గారికి నమస్కారములు ధన్యవాదములు. మా తెలుగు మాస్టారు శ్రీ మిన్నిగంతి గురునాధ శర్మ గారు నా చిన్న తనములో చందస్సు నేర్పుతున్నప్పుడు సంభోద్నాలకు సంధి నయమము లేదని సెలవు ఇచ్చినట్లు గుర్తు. సOదేహ నివృత్తి చేయ గలరు.

    రిప్లయితొలగించండి