వేసెను రంగులున్ ముఖము వేలుపు గుర్తుకు వచ్చు రీతినిన్ బాసను మార్చి మార్చి తన భక్తుల దీవెన లందజేయగన్ దోసిలినొగ్గి తోడు గొన తొందర జేరగ మండపానికై మాసిన చీర గట్టి యొక మానిని వచ్చెను పెండ్లి జూడగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కొన్ని దోషాలున్నవి. 'చేసిరిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. నాల్గవ పాదంలో ప్రాస తప్పింది. '...బోయె నా యతివ.. జడను... యేదనన్..' అని ఉండాలి.
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
వాసిగ కంచి చీర బహు భారపుటంచుది వేగ కట్టుచున్
కాసుల దండదాల్చి జడ గట్టిగ నల్లుచు పారిజాతముల్
దోసిలు నిండ దోపుచును తొందరలో ముది యత్తగారికిన్
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్
అత్తకు మాసిన చీర కట్టిందా? మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దోసిలి నిండ' అనండి.
🙏
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండి*కం||*
కానగ గౌరవ మొందగ
మేనుకు నిండుగ నెపుడును మెచ్చగ జనులే
మానము కాపాడుగొనుచు
*"మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙇♂️🙏🙇♂️🙏
అందరికీ నమస్సులు 🙏
తొలగించండి*కం||*
నానిన బట్టల నొదిలి, క
రోనా ధాటికి నుతగక రోజూ జేతుల్
మేనియు నొప్పిని తాళక
*"మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😊🙏
తొలగించండి"కొరోన" బ్రాండ్ పట్టుచీరలు వచ్చినా రావచ్చు :)
జిలేబి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'కాపాడుకొనుచు, బట్టల వదలి' అనండి. 'రోజూ' అన్నది వ్యావహారికం.
గురువులకు శతాధిక నమస్సులు 🙏🙏
తొలగించండి*సవరణతో*
నానిన *బట్టల వదలి*, కొ
రోనా ధాటికి నుతగక *రొప్పుచు*, జేతుల్
మేనియు నొప్పిని తాళక
*"మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్"*
🙏🙏
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కాసుల దండకై మగడు కమ్మలు గజ్జెలు కంకణాలకున్
వీసపు బంగరున్ కొనక; విందులకై కడు కర్చు జేయుచున్
వాసిగ నాడబిడ్డకిక భారపు రీతిని పెండ్లిచేయగా
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్
తన నిరసనను అలా తెలియజెసిందన్న మాట! బాగుంది మీ ఆటవిడుపు పూరణ. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి(మంగళగిరి నరసింహస్వామి కల్యాణానికి వచ్చిన వనితామణికి
రిప్లయితొలగించండిభక్తజనసమ్మర్డంలో కలిగిన అసౌకర్యం )
మోసులువారు భక్తి కను
మోడ్చుచు మల్లెలదండ దెచ్చుచున్
వాసిగ మంగళాద్రిపయి
వాసమొనర్చెడి స్వామి జూడగా
నాసలు మోసులెత్త జను
లందరు సల్పిన త్రోపులందునన్
మాసిన ;చీర గట్టి యొక
మానిని వచ్చెను పెండ్లి చూడగన్ .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమేనుమరపించు సేలను
మానిని పెండ్లికి ధరించె, మాసిన చీరన్
జానువడుచుచు విడుచుచున్
చానలు చేయంగ మురిసి సందడి తోడై
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జానువడుచుచు'?
ఈనాడు గాంచితినచట ,
రిప్లయితొలగించండిమానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్
దానికి కారణమడుగగ
దానంతకు మించి లేనిదాన ననియనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబాసను చేసె చిన్నపుడు "భారతి నెచ్చెలి! వత్తు తప్పకన్
క్రోసుల దూరమైనను నిరోధము దాటుచు నీదు యూఢికిన్"
కాసుల కూడబెట్టుకొని కానుక గైకొని దూరభారమై
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను, పెండ్లిఁ జూడఁగన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమానక రమ్మని పిలిచిరి
రిప్లయితొలగించండిపోను వెదక నొక్క చీర యుతికిన దేదీ
కానదు కంటికి, సరియని
"మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఏదీ' అనడం వ్యావహారికం.
ప్రాణము బోయిన ముదితకు
రిప్లయితొలగించండిఆనలుగురుజేరియచట హంగులుదిద్దన్,
మానక పద్దతు లనయ
మ్మానిని పెండ్లికిధరించె మాసిన చీరెన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికోసిన మావి ముక్కలను కొల్చి., సమమ్ముగ నూనెఁ గారమున్
బోసి.,యదే గతిన్ లవణమున్ మరి చేర్చుచు నావపిండితో
చేసినదావకాయను! రుచింగని, వాసన నిల్ప., కుండకున్
మాసిన చీరఁ గట్టి., యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఆవకాయ జాడీకి పాతగుడ్డను చుట్టే దృశ్యంతో మా అమ్మను గుర్తుకు తెచ్చారు.
తొలగించండిఅద్భుతంగా ఉంది మైలవరపు వారి పూరణ.
చేసిన బాసలన్ మరిచి ., చెప్పిన యూసుల విస్మరించి., పే...
తొలగించండిరాస మరొక్క భామినికి నమ్ముడు బోవగ ప్రేమికుండు., స...
న్నాసిని పెండ్లిపీటపయి నల్వురి ముందర తూలనాడగా
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మేనత్త సుతుని పెండ్లికి
రిప్లయితొలగించండిపూణే లోజరుగునంచు ప్రోడ వెడల నా
పైనమున సంచి పోవగ
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబట్టల సంచి పోతే ఇక అంతే కదా!
శంకరాభరణం
రిప్లయితొలగించండిఆదివారం.....05/04/2020
సమస్య:
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్
నా పూరణ. ఉ.మా
**** **** **
"చేసియు లాభమేమి గృహసీమని చాకిరి...,పట్టుచీరలున్,
వీసపు హేమమున్ గొనడు ..,వీడొక నాథుడె ?..'యంచు మిక్కిలిన్
గాసిలి... యల్గుచున్...మొఖము కందగ రోషముతోడ... పాతదౌ
మాసిన చీర గట్టి యొక మానిని వచ్చెను పెండ్లి జూడగన్
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేనికి సొబగగు తొడవులు
రిప్లయితొలగించండిమానిని బెండ్లికి ధరించె : మాసిన చీర న్
దీనపు యాచకు రాలికి
దానము గా నొస గి తా నుదారము చాటె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసేనలుఁబట్టెను తుద కవ
రిప్లయితొలగించండిమానిని;పెండ్లికి ధరించె మాసిన చీరన్
తానొక నీచుని సతినని
మౌనముగా వగచి మారు మాటలు లేకన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిమానుగ పీతాంబరమును
రిప్లయితొలగించండిమానిని పెండ్లికి ధరించె;మాసిన చీరన్
దానవరాజ వనంబున
దీనత ధరియించె సీత దీక్షారతియై
పాసిన భక్ష్యముల్ దినగ ప్రాణముబాసిన బంధువున్ గనన్
మాసిన చీరగట్టి యొకమానిని వచ్చెను;పెండ్లి జూడగన్
భాసిలు పట్టుపుట్టమును బారెడు మల్లెలు వజ్రహారముల్
ఈసును గల్గజేయుచును నింతియె దాల్చుచు నేగెఠీవిగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికం//
రిప్లయితొలగించండిచానా కాలము క్రిందట
కూనగ నున్నట్టి పిల్ల కూడిక కొరకున్ !
కానలలోకి జని బిలువ
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజిలేబి గారికి నమస్సులతో 🙏🙏
రిప్లయితొలగించండిసరదాగా...😀😀
*కం||*
మౌనము కోపము వలదు, కొ
రోనా చీరలు దొరికిన రోజున దెత్తున్
మానకు రమ్మని యడుగగ
*"మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి శంకరార్యా 🙏🙏🙇🙇
తొలగించండితాను వలచిన పురుషు డభి
రిప్లయితొలగించండిమానము విడిధనమున కయి మరొక వనితకున్
బానిసయై పిలువ కసిగ
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికైశిక మందు గన్నెరులు కన్నుల కాటుక మట్టి గాజులున్
రిప్లయితొలగించండిబూసల దండ వేసుకుని మోమున నవ్వులు మాయనీయకన్
గోసెదఁ గూరగాయలని కూలికి పిల్చిరటంచు నిన్ననే
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియానములో దుస్తుల సం
రిప్లయితొలగించండిచీని మతిమరపున వదలి చిన్నది వచ్చెన్ |
దీనత వలువల కొరతన
"మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదాసుడనంచు వెంటపడి తద్దయు ప్రీతిని మాటలాడుచున్
రిప్లయితొలగించండికాసుల కోసమై మరొక కన్యను చేకొన నిశ్చయించి యా
వేసరి పిల్వనంపగను పెండ్లికి రమ్మని, యక్కసమ్ముతో
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితానొకరిని వరియించెను
రిప్లయితొలగించండికానిమరొకరిని మనువుకు ఖాయముజేయన్
తానలిగియు పెద్దలపై
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేనును గప్పగ వస్త్రము
రిప్లయితొలగించండిలేనిదనుచు ముదుసలి గని క్లేశము దోడన్
తానిడె దన చీరల నిక
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం//
రిప్లయితొలగించండిభానుమతి పెండ్లికి వెడలు
సోనావర్ణపు పడతికి సోకులు జేయన్ !
చీనాంబరములు లేకయు
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఆననము నుండి మొదలుగ
చానల కాలి కొనగోరు సైతము సోకుల్
రాణించ దీర్చ నిల నే
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితానొకసాదాసీదా
రిప్లయితొలగించండికనకాంగియగుటవలువలుగానగలేకన్
మేనునుగప్పుటకొఱకై
మానినిపెండ్లికిధరించెమాసినచీరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం లఘువుతో ప్రారంభమయింది. సవరించండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండికాసులు వెచ్చపెట్టి కొనఁగా, ధరియింపక, చీనివస్త్రముల్
వీసములంతలైనఁ గనుపింపక యుంటకు, ’దృష్టి తాఁక రా,
దీసునుఁ బుట్టరా’ దనుచు, దీనముఖోదితలోభియై, కడున్
మాసిన చీరఁ గట్టి, యొక మానిని వచ్చెను, పెండ్లిఁ జూడఁగన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిఉత్పలమాల
పోసిన బియ్యమే యుడకఁ బోవట కోడలి కత్త మధ్యనన్
వాసిగ పట్టుచీరఁ గొనఁ బల్కఁగ మాసిన చీరఁ బోలెనన్
గాసిలు మాటలన్, మెరయఁగాఁగన నందరు నత్త దృష్టిలో
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీనుల విందుగఁ జెప్పఁగ
రిప్లయితొలగించండినాన లిడి వరు గుణగణము లానందముగన్
లోన ననుమాన మెల్లయు,
మానిని పెండ్లికి ధరించె, మాసిన, చీరన్
[చీర = పెండ్లి చీర]
సేసలు చల్లు కాలమునఁ జిన్నది యాత్రము మిక్కుటమ్ముగా
భాసిలు చుండఁ జిత్తమునఁ బర్వులు వెట్టుచు వింతగొల్పుచుం
గాసెకుఁ జాల నట్టి నును కాంతుల వెల్గెడు పట్టుబట్టనే
మా సిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్
[మా సిన = మా చిన్న; మేమిచ్చిన చిన్న చీర ]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్యగారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండివేసిరి చిందులెన్నొ, బహు వేడ్కగఁ పెండ్లికుమారు నశ్వ మం
రిప్లయితొలగించండిదాసనమున్ ఒనర్చి, సరదాలకు రంగులఁ పూసి చల్లి వా
రేసరరేగిరంట, యరెరే యని పట్టుది వీడి తీసె తాఁ
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆసనమున్ ఒనర్చి' అని విసంధిగా వ్రాయరాదు కదా!
ఉ:
రిప్లయితొలగించండివేసెను రంగులున్ ముఖము వేలుపు గుర్తుకు వచ్చు రీతినిన్
బాసను మార్చి మార్చి తన భక్తుల దీవెన లందజేయగన్
దోసిలినొగ్గి తోడు గొన తొందర జేరగ మండపానికై
మాసిన చీర గట్టి యొక మానిని వచ్చెను పెండ్లి జూడగన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమౌనముతోడనుండుచునుమోమునచిన్నతనంబుగన్పడన్
రిప్లయితొలగించండిమాసినచీరకట్టియొకమానినివచ్చెనుపెండ్లిజూడగన్
లేనితనంబునామెయెడలీలగగన్పడుచుండెనత్తఱిన్
బానముభోజనంబులనువడ్డనజేయుడునామెకున్ రమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరో పూరణ ప్రయత్నం 🙏🙏
రిప్లయితొలగించండి*కం||*
దానము జేసెడి గుణమును
మానక యా తల్లి నెపుడు మంచిగ నిలలో
మానమె ముఖ్యముగ దలచి
*"మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితానొకసాదాసీదా
రిప్లయితొలగించండికన్నులకలికినివలువలుగానగలేకన్
మేనునుగప్పుటకొఱకై
మానినిపెండ్లికిధరించెమాసినచీరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅన్నిటికీ కరోనా యే మూల కారణము
చైనా కరోన కారణ
మై నాట దుకాణములు సమస్తము బందై
చేనేత పొడయు దొరకక
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూరణ
రిప్లయితొలగించండి(పెండ్లి ఇష్టములేక విచారంతో నిరసన తెలిపిందని నా పురాణ)
కం.
మానిని వలచె నొకరినిన్
మానిని తల్లి పరజనుని మనువాడమనెన్
కాన విచారము కలిగిన
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు కృతజ్ఞతలండి గురువు గారు 🙏🏼
తొలగించండికం:1
రిప్లయితొలగించండిప్రాణంగాప్రేమించిన
మేనత్త కొడుకు నికాక మేంచెప్పినవా
డేనీమొగుడని చెప్పగ
మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్.
కం:2
రాణుల మించిన చీరను
మానిని బెండ్లికి ధరించె : మాసిన చీరన్
మేనత్తకొసగె వధువుది
మేనుపసిడిఛాయకనుక మెరిసెను చీరన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'ప్రాణంగా, మేం..' వ్యావహారికాలు. "ప్రాణముగా... మేమెంచినావా।డే..." అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూసినకూతలన్నియును, కూటమిగట్టగ నెచ్చెలింటిలో
రిప్లయితొలగించండివాసనలేనిపూవువలె ,వన్నెలుచిన్నెలు వట్టిబోవగా
దూసినయెండుకొమ్మవలె ,దుర్బలయైనరుదెంచె నమ్మయో
మాసినచీరగట్టుకుని,మానినివచ్చెనుపెండ్లిజూడగన్
++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నెచ్చెలి+ఇంటిలో' అన్నపుడు సంధి లేదు. "దుర్బలయై యరుదెంచె" అని ఉండాలి.
కూసినకూతలన్నియును, కూటమిగట్టగ నొక్కవేటునన్
తొలగించండివాసనలేనిపూవువలె ,వన్నెలుచిన్నెలు వట్టిబోయెలే
దూసినయెండుకొమ్మవలె ,దుర్బలయైయరుదెంచె నంతలో
మాసినచీరగట్టుకుని,మానినివచ్చెనుపెండ్లిజూడగన్
++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
వేసిరి దూరదర్శనపు వేదిక బెండ్లను నస్థిర చిత్రరాజమున్
రిప్లయితొలగించండివాసిని గాంచె నయ్యది సెబా సని ప్రేక్షక లోక మందునన్
పూసల నమ్ముకొంచు నట బోవుచు జిత్రపు పాట సవ్వడిన్
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
కాసులె ముఖ్య మంచు తన కాంతకు జీరను కొన్న పెట్టెలో
రిప్లయితొలగించండిరాసులు చిక్కి పోవునని రాక మగండు వహింప బింకమున్
బోసి గళమ్మునన్ బసుపు పూసిన త్రాడును దాల్చి దీనయై
మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాసికి చెందినట్టిదని వంశము జూపిరి పెండ్లి జేసిరిన్
రిప్లయితొలగించండిచేసిన తిండి మెక్కి పని జేయక శుంఠగ నేర్చె తాగుడున్
కూసిన కూతలన్ మరల కూయక తిట్టెడి భర్త వాడటం
చున్ సినబోయె యా యతివ చుక్కలు కంటను నేల రాలగా
పూసిన పువ్వులన్ జడన పొందిక జేసిన రోజు యేదనిన్
రాసిన రాతలన్ తలచి; రమ్మని తమ్ముడు బిల్వ వేదనన్
*మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్*
*నాయుడు గారి జయన్న*, గద్వాల
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొన్ని దోషాలున్నవి. 'చేసిరిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. నాల్గవ పాదంలో ప్రాస తప్పింది. '...బోయె నా యతివ.. జడను... యేదనన్..' అని ఉండాలి.
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిఒహొహో! యెంతటి పాండితీ గరిమమీరుత్కృష్టులంచున్ దొలిన్
మహనీయుండ వధాని నొక్కనిని సంభావించి, తా నంతయై
స్పృహనే వీడుచుఁ బిల్వఁ బేరిడి సభన్ బింకమ్మునే జూపుచున్
నహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్