21, డిసెంబర్ 2020, సోమవారం

సమస్య - 3581

22-12-2020 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్”

(లేదా…)

“పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్”

75 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    స్థిరమౌ రీతిని వీధులన్ వెదకుచున్ తీండ్రించగన్ కామమే
    పరువుల్ పెట్టుచు భామలన్ తరుముచున్ బంగారు సంకెళ్ళలో
    కరముల్ మోడ్చుచు పూజలన్ సలుపుచున్ గయ్యాళులన్ చేరగన్
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్...

    రిప్లయితొలగించండి
  2. మర మనుషుల వలె నుంటిమి
    యెరుగరు మాబాధలెంతయేని యెటులనో
    కరుణించరె మా మాటల
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్!!

    రిప్లయితొలగించండి
  3. తరుణిన్ దూరుచు మద్య మాంసముల విస్తారంబుగా వాడుచున్
    బొరుగిండ్ల న్జరియించె బోడులకు సమ్మోదంబు నామోదమున్
    ద్వరగా నిచ్చెడు భార్య చాటు విభులున్భార్యాప్రబోధాత్మ కా
    *“పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్”*

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వరముల్ పెక్కులు పొందుచున్ మురియుచున్ వాదోడు చేదోడుగా
    ధరణిన్ మేలుగ నేలుచున్ ముగురినిన్ దారామణుల్ ముద్దులన్
    చెఱనున్ బట్టగ రోజురోజు విడకే సీతమ్మవోల్ మాతలన్
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్...

    http://gpsastry.blogspot.com/2013/09/raavans-third-wife.html?m=0

    రిప్లయితొలగించండి
  5. పరమార్థంబిసుమంతనేరకమహాభాగ్యంబుభామామణీ
    సరసాలాపములేజగద్దితములౌసంసారసారామృతం
    బరయన్మోక్షమదెక్కడోదెలియకేపాషండులైమ్రోడులౌ
    *“పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్”*

    రిప్లయితొలగించండి
  6. విరిబోణివన్నెచిన్నెలు
    సరిగమపదములుఁదెలియమిషండులుకాగన్
    మరిమరిమనసునుతెలియరు
    పురుషులుమూర్ఖులుకుజనులుపుణ్యవిదూరుల్

    రిప్లయితొలగించండి
  7. పరులకు హాని నొనర్చుచు
    దురితములను సతము జేయు దుర్మార్గులు గా
    వరలుచు నుండెడి యా కా
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్య విదూరుల్

    రిప్లయితొలగించండి


  8. అరె! నా బ్లాగు చదువరే
    పురుషులు! మూర్ఖులు! కుజనులు! పుణ్యవిదూరుల్
    మరి లేరెవ్వరిల జిలే
    బి! రారు రారు చదువంగ విధిరాత యిదే!



    ఓ బ్లాగు బడుగు జీవి‌ ఆర్త నాదం


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అమ్మా! నేను అప్పుడప్పుడు మీ బ్లాగు చూస్తూనే ఉన్నాను కనుక పై నిందలు నాకు వర్తించవు.

      తొలగించండి


    2. అబ్బే ఆ బడుగు జీవి‌ నేను కాదండోయ్ :)


      నారదా
      జిలేబి

      తొలగించండి
  9. తరుణుల వంచించుచు నన
    వరతము ద్యూతమ్ము మద్య పానము వేశ్యా
    శరణమె శరణమనెడు కా
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    రిప్లయితొలగించండి

  10. బోనసు సరదా పూరణ:

    కరవై యుండగ పౌరుషమ్ము మదినిన్ గారాబుగా కొల్చుచున్
    పరమార్థమ్మును కోరుచున్ త్వరితమున్ వయ్యారియౌ భామకున్
    దరువుల్ కొట్టుచు వేడుకన్ తనరగా ధన్యాత్ములై రోముకున్
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్...

    రిప్లయితొలగించండి

  11. మైలవరపు వారి పూరణ


    నిరతమ్మున్ గృహకార్యముల్ సలిపి శ్రాంతింబొందు., సంసారదు..
    ర్భరమౌ బాధ్యత మోయు బిడ్డల గనున్ భార్యామణుల్., చేకొనన్
    వరకట్నమ్మునుగోరువారినిలలో వర్ణింతురీరీతిగా
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. హరినామంబుజపింపకుండ నిరతమ్మా కేశవున్ దూరుచున్
    సురభిన్ గ్రోలుచునక్షతత్వమున క్రచ్చున్ గల్గి వర్తించి బం
    దురపొందొక్కటె లోకమంచు దలచే దుర్మార్గు లౌనీచ కా
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
  13. కందం
    ధరణిజఁ గొని రావణుఁడున్
    దురపిల్లిరి కృష్ణ యేడ్వ దుర్యోధనులున్
    పరిమార్చబడిన రాక్షస
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    మత్తేభవిక్రీడితము
    వరగర్వంబున సీతఁ బట్టి యొరిగెన్ బౌలస్త్యుఁడున్ మోహియై
    పరదారన్ సభకీడ్చి కూలిరి మహాపాపాత్ములై కౌరవుల్
    తరుణుల్ స్రుక్కఁగ జూచు వారలుగ దుర్మార్గంపు దుశ్చింతనన్
    బురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్

     

    రిప్లయితొలగించండి
  14. భరతుం డేలిన రాజ్యమందునను సంప్రాప్తించి రాజన్యులే
    చిరకాలంబుగ దేవతార్చనల దూషింపన్ ప్రవర్తిల్లగా
    కరుణామూర్తుల మంచు తా బలికి లోకమ్మందు నీరీతులౌ
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్.

    రిప్లయితొలగించండి
  15. అరచుచు నింటన భార్యను
    తరచుగ తన్నుచు నెపుడును తాగుచు కొట్టున్
    ధరణిన నుండెడి ధూర్తులు
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "అరచుచు నింటను... ధరణిని..." అనండి.

      తొలగించండి
  16. సరసత లోపించంగా
    దురుసుగ మాటాడి కఠిన దూషణలొప్పన్
    పరిణతి పొందని బల్ కా
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్య విదూరుల్

    రిప్లయితొలగించండి
  17. శరణము కోరక దేవుని
    మరణము తధ్యమని దెలిసి మారణ హోమమ్
    తరచుగ జేయుస్త్రీలును,
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హోమమ్' అని హలంతంగా ప్రయోగించరాదు. 'చేయు స్త్రీలును' అన్నపుడు 'యు' గురువు కాదు. కనుక గణభంగం. "...జేసెడి స్త్రీలును" అనవచ్చు.

      తొలగించండి
  18. పరమత సహనము కలిగిన
    తరువిది నామాతృభూమి ధరణిని జూడన్
    ఎఱ జూపి మతము మార్చెడి
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధరణిని గనగా ।నెఱ జూపి..." అనండి.

      తొలగించండి
  19. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    *“పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్”*
    (లేదా…)
    *“పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్”*

    నా పూరణ

    కందము

    పరకాంతల నాశించుచు
    వెఱపే లేకుండగ తెగ వెంబడి పడుచున్
    తరుణుల హింసించెడి కా
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    మత్తేభము

    పురుషుల్ జూడగఁ బుణ్యులే ఘనముగాఁ బోషింతు రెల్లప్పుడున్
    పరిశీలించగ భార్యకున్ సుతునకున్ బ్రాణంబు లిచ్చుంగదా
    కరుణాహీనులు కొందరుందురు సదా కాఠిన్య దుశ్శీలతన్
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడగన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  20. దొరకరు చట్టవిరోధులు
    పరధనమును తమదిగా నపహరించదరే
    పరదేశముల మఱుగు కా
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    రిప్లయితొలగించండి


  21. వరుసల్ గట్టుచు నాల్గు పాదముల జబ్బల్దట్టి కిట్టింపగా
    సరిలేరెవ్వరు మీకటంచు గడనల్! స్వామిన్ ప్రశంసింపగా
    నరరే! వీక్షకు లేరి! లేరె చదువంగానాదు బ్లాగ్వ్రాతలన్!
    పురుషుల్ మూర్ఖులు! పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్!


    నారాయణ!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. సమస్య :
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్
    మ్రుచ్చుల్ గదా చూడగన్

    ( వెంటబడుతున్న రాజుగారి బావమరది శకారుని గూర్చి వసంతసేన చారుదత్తునితో )

    పురుషోత్తంసులు మీరు ! చారుహృదయుల్ ;
    పుణ్యాత్మకుల్ ; సత్వధీ
    వరులున్ ; ధర్మనిబద్ధబుద్ధులు ; బ్రియా
    వాల్లభ్యమూర్తుల్ ; దయా
    శరధుల్ ; మిమ్ముల జేరితిన్ నదిగ ; రా
    జస్యాలకుం బోలు కా
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్
    మ్రుచ్చుల్ గదా ! చూడగన్ .
    (స్యాలకుడు - బావమరది ; శరధి - సముద్రము )

    రిప్లయితొలగించండి
  23. లాలనఁ జేతురా కరవిలాసమునన్ బిగిఁ గౌగిలింతు రే
    జాలియొ చాటిరా మురిసి చాలగ నిత్తు రదేది కోరినన్
    గ్రాలగఁ జూతురా యపరకాళికలౌదరు పోరు సల్పిరా
    కాలుని దూతలౌదు, రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  24. అరెరే లేరె మహానుభావులు శిబిత్యాగమ్ము చింతించవే?
    పరకాంతామణులందు మాతృసమభావుల్ లేరొ పుణ్యాత్ములై
    పరధర్మాచరణుల్ వినీతహృదయుల్ భాసించ, నేకొందరో
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. "మాతృసమభావశ్రేష్ఠు లున్నారు త ।త్పరధర్మాచరణుల్..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  25. పరులనెపుడు నిందింతురు
    నిరతము దుర్జనులగూడి నీచపు వృత్తిన్
    పరమును తలబోయని కా
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    రిప్లయితొలగించండి
  26. పర వనితల వెంటపడుచు
    కరుణను వీడుచు మృగముల కైవడి ధరలో
    తరుణము దొరికిన పైబడు
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    రిప్లయితొలగించండి
  27. పరుషంబుగ వర్తించుచు
    విరసంబున బెనగికొనుచు ప్రేమయెలేకన్
    అరుసము విలువలు దెలియని
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రేమను విడి తా । మరుసపు విలువలు.." అంటే బాగుంటుందని సూచన.

      తొలగించండి
  28. నిరతమ్మున్ మది కామ చింతనముపై నిల్వంగ గర్వాంధులై
    పరకాంతామణులందు మోహమడరన్ వంచించుచున్ పత్నులన్
    ధరణిన్ నిత్యము తల్లితండ్రులకు సంతాపమ్ము కల్గించు నా
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
  29. అరయగ సామీ కొందఱు
    పురుషులుమూర్ఖులుకుజనులుపుణ్యవిదూరుల్
    మరికొందరుండ్రునిజముగ
    పురమునుదాబాగుజేయ బుట్టితిమనుచున్

    రిప్లయితొలగించండి
  30. మ:

    వరముల్ సిద్ధులు బొందినారలనుచున్ భావింప లోకంబునన్
    పరతత్వంబులు వల్లవేయుచు నహో వాగ్ధాటిగా కల్లలున్
    పరయన్నుల్నెర వేయు సాధువుల నిర్వాకంబు వర్ణింప నా
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. కరములతో పూజింపక
    నిరతము కీర్తన పలుకక నొవ్వగ నోరున్
    హరియే పరమార్థ మనని
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    రిప్లయితొలగించండి
  32. పరులన్ దూషణజేయుచున్ సతతమున్ బాధించుపాపాత్ములౌ
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులుఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడగన్
    గరమున్ శాంతమునొందుచున్ పరులుసౌఖ్యంబొందు చందంబుగా
    నిరతిన్ జింతనజేయుచున్ సుమతిదానీడేర్చుసత్సంపదల్

    రిప్లయితొలగించండి
  33. వర పుణ్యాత్ములు మది న
    బ్బుర మేల సమస్త జనులు పూజింతు రిలం
    దిరుమల నాథుని స్త్రీలును
    బురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్


    పర కాంతా ధన ధాన్య కాంక్ష నవి సంపాదించు నీచాత్ములన్
    ధరలోఁ గొందఱఁ గాంతు మల్పులను నిత్యం బౌర సద్దేవ తా
    పర పూజా రత కార్య సంజనిత విధ్వం సేష్ట చిత్తైక కా
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
  34. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పెరిగిన మత్సర గుణమున
    నిరతము పాండవులకు చెడు నిల్పెడి నడతన్
    దొరలిన కౌరవ వర్గపు
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్.

    నిరతమ్మంతయు కక్షపూరితమునౌ నీర్ష్యన్ ప్రవర్తించుచున్
    పొరపొచ్చెములు పెంపుజేసుకొనుచున్ పోరాట భావమ్మునన్
    దొరలౌ పాండవులన్ దగాపఱచినా దుర్యోధనుండాది కా
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
  35. పరదారా ధనతతులను
    వెఱవక సాధింపగోరి వెతలం బడునా
    పరలోక భయవిహీనులు
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్

    ఇరవై కామము క్రోధలోభములకు
    న్నీర్ష్యాళులై కౌరవుల్
    కురువంశంబున జిచ్చుబెట్టితిరయో
    కూలంగ బాంధవ్యముల్
    బరువౌ భూమికి నిట్టివారలె! సదా
    వైరంబులే గోరెడిన్
    పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు
    ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడగన్

    రిప్లయితొలగించండి
  36. గురువు గారికి నమస్కారం ప్రయత్నం మాత్రమే

    పర వనితల వెంటపడుతు
    నిరతము నీతులను చెప్పు నిర్గుణ వరులన్
    పరమ విలాసాపేక్షుల్
    పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్య విదూరుల్

    రిప్లయితొలగించండి
  37. పూరణ
    ----------------------------------------------------
    *కం.*
    తరమా ! పాండవుల గెలువ
    అరివీర భయంకరులగు అన్నల్ దమ్ముల్
    ధరలో కపటులు కౌరవ
    *పురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్*
    -----------------------------------------------------
    *- గానుగుల*
    22-12-2020

    రిప్లయితొలగించండి