4-7-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి”(లేదా...)“చంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్”
క్రొవ్విడి వెంకట రాజారావు: మధువు నధికముగా గొని మత్తు జెందిగడబిడగ మాటలాడుచు కఱటి యొకడు చెప్పె నిటు తూలి దిరుగుచు తప్పిదముగ చంపెను విభీషణుని రామచంద్రు డలిగి.
కంపరమొందు చర్యలను కాముకుడైన దశాస్యుడాత్రతన్లంపటుడౌచు జానకిని లంకను బందిని జేయగా యనిన్చంపెను రాఘవుండు, తన సఖ్యముగోరు విభీషణున్ ,గృధన్,ఇంపుగ రాజుగా నిలిపె నిచ్చినమాటను నిల్పుచున్భళా!
డు-భయంకరాకారుడు
కాఱుమేఘంబువోలెనుకానిపించుభీకరాకారునెదిరించిభీతిఁగోలుపుఖరునితమ్మునిదూషణుఖండితముగచంపెనువిభీషణునిరామచంద్రుడలిగిభయంకరాకారుడు దూషణుడు
మధువు గ్రోలిన మనుజుడు మత్తు నందు మున్గి తూలుచుండియు తాను పొల్లు గాను పల్కె మిత్రుని గని వింటి వయ్య దీని చంపెను విభీషణుని రామ చంద్రు డలిగి
దురితుడు పర స్త్రీ మోహమందుండు వాడుశత్రువులకు భయంకర సముడసురుడు సీతనపహరించిన వేళ చేరి లంకచంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి...భారతీనాథ్ చెన్నంశెట్టి...( విభీషణుని … శత్రు భయంకరుని )
తేటగీతిరావణాసురుఁ గూల్చియు రమణిఁ బొందితనకు పట్టమ్ము గట్టియు, తరుణినెంచిచితి పరీక్షఁ గోరుచు మానసికముగానుచంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగిఉత్పలమాలరంపపు కోతకున్ వగచి రాగిణి సీతను బొంద రావణున్రొంపినిఁ ద్రొక్క పంపి పరలోకము, పట్టముఁ గట్టి లంకకున్గంపరమొంద నగ్నికిడి కాంతను మానసికమ్ముగన్నహో!చంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రమ్యమగుకల గాంచెను రావణుండుసోదరుండనియైనను చూడకుండనింటి గుట్టును రచ్చకు నీడ్చు కతనచంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి
పంపెనుదూషణాదులనుచాలగరాక్షసమూకలన్వనిన్పంపెనుమారుతీసుతునిపావనిసీతమజాడఁజూడగాపెంపునకార్యసాధకుడుభేదములెంచకశత్రుభావమున్చంపెనురాఘవుండు, తనసఖ్యముఁగోరువిభీషణున్గ్రుధన్
క్రొవ్విడి వెంకట రాజారావు: పెంపగు కావరమ్ముగల వెంబర రావణు డాజి నేమయెన్?ఇంపుగ రాముడెవ్వరిని నిష్టముగా పిలిపించె చెంతకున్? సొంపగు చుప్పనాతిగని చూచె నెటుల్ రఘురాముడావనిన్?చంపెను రాఘవుండు, తన సఖ్యముగోరు విభీషణున్ ,గృధన్,
అచ్చుతప్పుబడెనె యదియె జదువంగ"చంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి”తప్పుదెలుసుకొని జదివె వొప్పుగాను"చంపెను దశకంఠుని రామచంద్రుఁ డలిగి”
పంపగ రావణాసురుడు బాహుబలాఢ్యుల వీరులందరిన్జంపెను రాఘవుండు; దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్త్రెంపుచు నంత్రబంధమును ధిక్క్రియ తోడుత పాఱనొత్తగానంపఱ వైచిజంపె కమలాక్షుడు రావణు నాజినుగ్రుడై.అంపఱ-బాణముధిక్క్రియ-ధిక్కారంపాఱనొత్తు-పారద్రోలు
రావణాసురునికి, చని పోయిన తరువాత విభీషణుడు అంత్యక్రియలు చేయనంటే, చనిపోయిన వారితో వైర మేమిటని రాముడు కోపంగా చెప్పటమే విభీషణుడిని చంపుట అనే భావంతో ప్రయత్నము: ఉ: అంపగ నొప్పుకోడె దన యన్నగు రావణు డంత్య కర్మకైబంపెను శీఘ్రమై యటుల భావ్యము గాదని మందలింపుగాతెంపరి వౌదుగాక కడతేరిన పిమ్మట వైర మేటనన్చంపెను రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణున్ గ్రుధన్అంపు=ఆజ్ఞాపించు.వై. చంద్రశేఖర్
ఇంద్రుడు మరి వృత్రాసురు నేమిజేసె?సఖుడవనె గదా! రాముడు శత్రు వొకని,సాగరా!నిడు దారని శరము నెత్తె,చంపెను, విభీషణుని, రామచంద్రుఁ డలిగి.
జగడమందు రావణుని దశరధసుతుడుజంపెను ; విభీషణుని రామచంద్రుఁ డలిగియతడు వలదనినను గూడనధిభువునిగజేసె లంక జనులకది శ్రేయమనుచు
భీషణాకారుడై కడు భీతిగొల్పుకుంభ కర్ణుడు యుధ్ధాన కుంటగించివానరతతిని మిగులరాపాడుచుండచంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి*విభీషణుడు = మిక్కిలి భయంకరుడు
సమస్య :చంపెను రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణున్ గ్రుధన్ ( కుత్తుకబంటిగా మద్యం తాగిన మత్తెక్కిన త్రాగుబోతు ఒళ్లుతెలియని వాగుడు )" వంపర మిత్రమా ! మధువు పాత్రకు నిండుగ పొర్లిపోవగా ;కంపర మందె జిహ్వ " యని కంఠము దాకను త్రాగినట్టి యా తెంపరిగాడు చిందులను తిక్కగ వేయుచు వాగుచుండెడిన్ " జంపెను రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణున్ గ్రుధన్ . "
పంపిన వానరేశుడట లంకను జానకి జాడ కాంచగన్సొంపుగ కట్టి సేతువును గండరగండడు రావణాధమున్చంపెను రాఘవుండు , దన సఖ్యముఁ గోరు విభీషణున్, గ్రుధన్, సంపద తెచ్చు గర్వమున భంగము చేసిన కామ బంధునిన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
పెంపగు శౌర్యసాహసము భీకర సంగరమందు జూపుచున్జొంపపు బాణ ఘాతముల సొక్కగజేయుచు రావణాసురున్చంపెను రాఘవుండు, దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్ఇంపుగజేసెలంకపురినేలగ నెల్లరు సంతసించగన్
గుంపుగ వచ్చురాక్షసుల కొల్లగ రాముడు యుద్ధమందునన్,నింపుగ రాముడున్ తనను నేతను జేసెను లంకకున్ గదా ?తుంపెను దుస్సశేనుడను ద్రోహిని భీముడు యుద్ధమందునన్చంపెను, రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్, గ్రుధన్.
క్రుధన్ = కోపముతో
పంపగ నాల్గు దిక్కులకు వానర ముఖ్యుల, గాంచె సీత దాపెంపున లంక జేరి కపి వీరుడు, దానట రాక్షసాళినిన్చంపెను; రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్జంపిన వాడవీవనుచు సమ్మతి దెల్పి సమాశ్రయంబిడెన్
రామ చంద్రుడ యెవరిని రణమునందుచంపెననిబ్రశ్నింప పలికె జట్టు నిటులచంపెను విభీషణుని రామచంద్రుడలిగియేమి చదువులు నేర్తురొ?యేమొ వీరు
సొంపుగ బాలకుల్ తెలివి జూపుచు సాధన చేయు వేళలోచింపిరి జుట్టువాడుమరి చెప్పిన నేర్వని మూర్ఖుడొక్కడున్నింపుగ వ్రాసెవాక్యముల నిట్టుల తిక్క తనంబుచేత నేచంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్
శరణు గోరినఁ గరుణించు శత్రు నైన రఘు వరేణ్యుఁడు సత్య పరాక్రముండు హరి నిభుఁడు సేరఁదీసి, దశానను ననిఁ జంపెను, విభీషణుని రామచంద్రుఁ డలిగి అంప విఘాత మంది యనె నంతట వాలి రఘుప్రవీరుతో నింపుగ నేన సఖ్యమును నెంచిన సాయము సేయ నోపనే పంపిన నుంతు దైత్యుఁ దవ పాదము చెంతనె యన్న దుష్టునిం జంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణుం గ్రుధన్ [విభీషణుఁడు = మిక్కిలి భయంకరుఁడు, యిచట వాలి; సుగ్రీవునకు మున్న తన్నడిగిన రాముని సఖ్యము కోరువాఁడ నని వాలి చనిపోవుచుఁ బలికెను.]
~~~~~~~~~~~~~~~~~~~~~~'తెంపరి రావణాసురుడ! త్రిమ్మరిసీతను వీడకుండినన్బంపెద గాలు సన్నిధికి భండనమందున మూర్ఖ చిత్తడా!వెంపర మాని నన్ శరణు వేడు,మటంచును నీవు దెల్పు మంచంపెను రాఘవుండు తన సఖ్యము గోరు విభీషణున్ గృదన్~~~~~~~~~~~~~~~~~~~~~
ఏమి చేసె పావని సింహికను? బ్రోచెరాముడే దనుజానుజున్ బ్రేమతోడ?రావణునిసంహరించెనెవ్వాడదేల?చంపెను, విభీషణుని, రామచంద్రు డలిగి.
అంపము లెన్నినాటినను యాతువు చావక కోనత్రిమ్మరుల్ తుంపరఁ గూల్చుచుండగని దుష్టుని మృత్యు రహస్యమొక్కటిన్ దంపిన చెప్ప వానినిక దండధరుండను జేయ రావణున్ జంపెను, రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణున్, గృధన్.
ఇంపగు మాటలన్ పలుక వెప్పుడు కల్మషమైన బుద్ధితోసొంపగు స్నేహమున్ సలిపె సూర్యకులాన్వయు డుల్లసమ్ముతోనంపఱలన్ వధించెనని నాదశ కంఠుని, వాగకివ్విధిన్ “చంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరువిభీషనున్ గ్రుధన్”
ఉత్పలమాల:తెంపగ పూనుటెట్లు మహదేవుని భక్తుని బ్రాహ్మణోత్తమున్ తెంపరిచేష్టగా దలతు దివ్యపునీతను సీతచోరతన్!చంపగలేను రావణుని,శాంతి కుదుర్చగ నీవె పోవటంచంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గృధన్ --కటకం వేంకటరామశర్మ
కుదర్చగ*పొమ్మటం*
చంపెను రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణునున్ గ్రుధన్ నింపగు లంకనున్ గెలిచి యిచ్చెవిభీషణుగైవశంబుగాచంపుట రాఘవుండకట సాధ్యమె చెప్పుమ నీవయిత్తఱిన్ బెంపును జూడు రామునిట భీకర మాటలు న్యాయమే రమా!
సంగరమున శరములతోశత్రువులనునభయమునొసగి రక్షించె నాదరమునపడతి నపహరించినయట్టి వాని నణచెచంపెను,విభీషణుని,రామచంద్రుడలిగి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమధువు నధికముగా గొని మత్తు జెంది
గడబిడగ మాటలాడుచు కఱటి యొకడు
చెప్పె నిటు తూలి దిరుగుచు తప్పిదముగ
చంపెను విభీషణుని రామచంద్రు డలిగి.
కంపరమొందు చర్యలను కాముకుడైన దశాస్యుడాత్రతన్
రిప్లయితొలగించండిలంపటుడౌచు జానకిని లంకను బందిని జేయగా యనిన్
చంపెను రాఘవుండు, తన సఖ్యముగోరు విభీషణున్ ,గృధన్,
ఇంపుగ రాజుగా నిలిపె నిచ్చినమాటను నిల్పుచున్
భళా!
డు-భయంకరాకారుడు
రిప్లయితొలగించండికాఱుమేఘంబువోలెనుకానిపించు
రిప్లయితొలగించండిభీకరాకారునెదిరించిభీతిఁగోలుపు
ఖరునితమ్మునిదూషణుఖండితముగ
చంపెనువిభీషణునిరామచంద్రుడలిగి
భయంకరాకారుడు దూషణుడు
మధువు గ్రోలిన మనుజుడు మత్తు నందు
రిప్లయితొలగించండిమున్గి తూలుచుండియు తాను పొల్లు గాను
పల్కె మిత్రుని గని వింటి వయ్య దీని
చంపెను విభీషణుని రామ చంద్రు డలిగి
దురితుడు పర స్త్రీ మోహమందుండు వాడు
రిప్లయితొలగించండిశత్రువులకు భయంకర సముడసురుడు
సీతనపహరించిన వేళ చేరి లంక
చంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
( విభీషణుని … శత్రు భయంకరుని )
తేటగీతి
రిప్లయితొలగించండిరావణాసురుఁ గూల్చియు రమణిఁ బొంది
తనకు పట్టమ్ము గట్టియు, తరుణినెంచి
చితి పరీక్షఁ గోరుచు మానసికముగాను
చంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి
ఉత్పలమాల
రంపపు కోతకున్ వగచి రాగిణి సీతను బొంద రావణున్
రొంపినిఁ ద్రొక్క పంపి పరలోకము, పట్టముఁ గట్టి లంకకున్
గంపరమొంద నగ్నికిడి కాంతను మానసికమ్ముగన్నహో!
చంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్
🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరమ్యమగుకల గాంచెను రావణుండు
రిప్లయితొలగించండిసోదరుండనియైనను చూడకుండ
నింటి గుట్టును రచ్చకు నీడ్చు కతన
చంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి
పంపెనుదూషణాదులనుచాలగరాక్షసమూకలన్వనిన్
రిప్లయితొలగించండిపంపెనుమారుతీసుతునిపావనిసీతమజాడఁజూడగా
పెంపునకార్యసాధకుడుభేదములెంచకశత్రుభావమున్
చంపెనురాఘవుండు, తనసఖ్యముఁగోరువిభీషణున్గ్రుధన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపెంపగు కావరమ్ముగల వెంబర రావణు డాజి నేమయెన్?
ఇంపుగ రాముడెవ్వరిని నిష్టముగా పిలిపించె చెంతకున్?
సొంపగు చుప్పనాతిగని చూచె నెటుల్ రఘురాముడావనిన్?
చంపెను రాఘవుండు, తన సఖ్యముగోరు విభీషణున్ ,గృధన్,
అచ్చుతప్పుబడెనె యదియె జదువంగ
రిప్లయితొలగించండి"చంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి”
తప్పుదెలుసుకొని జదివె వొప్పుగాను
"చంపెను దశకంఠుని రామచంద్రుఁ డలిగి”
పంపగ రావణాసురుడు బాహుబలాఢ్యుల వీరులందరిన్
రిప్లయితొలగించండిజంపెను రాఘవుండు; దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్
త్రెంపుచు నంత్రబంధమును ధిక్క్రియ తోడుత పాఱనొత్తగా
నంపఱ వైచిజంపె కమలాక్షుడు రావణు నాజినుగ్రుడై.
అంపఱ-బాణము
ధిక్క్రియ-ధిక్కారం
పాఱనొత్తు-పారద్రోలు
రావణాసురునికి, చని పోయిన తరువాత విభీషణుడు అంత్యక్రియలు చేయనంటే, చనిపోయిన వారితో వైర మేమిటని రాముడు కోపంగా చెప్పటమే విభీషణుడిని చంపుట అనే భావంతో ప్రయత్నము:
రిప్లయితొలగించండిఉ:
అంపగ నొప్పుకోడె దన యన్నగు రావణు డంత్య కర్మకై
బంపెను శీఘ్రమై యటుల భావ్యము గాదని మందలింపుగా
తెంపరి వౌదుగాక కడతేరిన పిమ్మట వైర మేటనన్
చంపెను రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణున్ గ్రుధన్
అంపు=ఆజ్ఞాపించు.
వై. చంద్రశేఖర్
ఇంద్రుడు మరి వృత్రాసురు నేమిజేసె?
రిప్లయితొలగించండిసఖుడవనె గదా! రాముడు శత్రు వొకని,
సాగరా!నిడు దారని శరము నెత్తె,
చంపెను, విభీషణుని, రామచంద్రుఁ డలిగి.
జగడమందు రావణుని దశరధసుతుడు
రిప్లయితొలగించండిజంపెను ; విభీషణుని రామచంద్రుఁ డలిగి
యతడు వలదనినను గూడ
నధిభువునిగ
జేసె లంక జనులకది శ్రేయమనుచు
భీషణాకారుడై కడు భీతిగొల్పు
రిప్లయితొలగించండికుంభ కర్ణుడు యుధ్ధాన కుంటగించి
వానరతతిని మిగులరాపాడుచుండ
చంపెను విభీషణుని రామచంద్రుఁ డలిగి
*విభీషణుడు = మిక్కిలి భయంకరుడు
సమస్య :
రిప్లయితొలగించండిచంపెను రాఘవుండు దన
సఖ్యము గోరు విభీషణున్ గ్రుధన్
( కుత్తుకబంటిగా మద్యం తాగిన మత్తెక్కిన త్రాగుబోతు ఒళ్లుతెలియని వాగుడు )
" వంపర మిత్రమా ! మధువు
పాత్రకు నిండుగ పొర్లిపోవగా ;
కంపర మందె జిహ్వ " యని
కంఠము దాకను త్రాగినట్టి యా
తెంపరిగాడు చిందులను
తిక్కగ వేయుచు వాగుచుండెడిన్
" జంపెను రాఘవుండు దన
సఖ్యము గోరు విభీషణున్ గ్రుధన్ . "
పంపిన వానరేశుడట లంకను జానకి జాడ కాంచగన్
రిప్లయితొలగించండిసొంపుగ కట్టి సేతువును గండరగండడు రావణాధమున్
చంపెను రాఘవుండు , దన సఖ్యముఁ గోరు విభీషణున్, గ్రుధన్,
సంపద తెచ్చు గర్వమున భంగము చేసిన కామ బంధునిన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
పెంపగు శౌర్యసాహసము భీకర సంగరమందు జూపుచున్
రిప్లయితొలగించండిజొంపపు బాణ ఘాతముల సొక్కగజేయుచు రావణాసురున్
చంపెను రాఘవుండు, దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్
ఇంపుగజేసెలంకపురినేలగ నెల్లరు సంతసించగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుంపుగ వచ్చురాక్షసుల కొల్లగ రాముడు యుద్ధమందునన్,
రిప్లయితొలగించండినింపుగ రాముడున్ తనను నేతను జేసెను లంకకున్ గదా ?
తుంపెను దుస్సశేనుడను ద్రోహిని భీముడు యుద్ధమందునన్
చంపెను, రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్, గ్రుధన్.
క్రుధన్ = కోపముతో
తొలగించండిపంపగ నాల్గు దిక్కులకు వానర ముఖ్యుల, గాంచె సీత దా
రిప్లయితొలగించండిపెంపున లంక జేరి కపి వీరుడు, దానట రాక్షసాళినిన్
చంపెను; రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్
జంపిన వాడవీవనుచు సమ్మతి దెల్పి సమాశ్రయంబిడెన్
రామ చంద్రుడ యెవరిని రణమునందు
రిప్లయితొలగించండిచంపెననిబ్రశ్నింప పలికె జట్టు నిటుల
చంపెను విభీషణుని రామచంద్రుడలిగి
యేమి చదువులు నేర్తురొ?యేమొ వీరు
సొంపుగ బాలకుల్ తెలివి జూపుచు సాధన చేయు వేళలో
రిప్లయితొలగించండిచింపిరి జుట్టువాడుమరి చెప్పిన నేర్వని మూర్ఖుడొక్కడున్
నింపుగ వ్రాసెవాక్యముల నిట్టుల తిక్క తనంబుచేత నే
చంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గ్రుధన్
శరణు గోరినఁ గరుణించు శత్రు నైన
రిప్లయితొలగించండిరఘు వరేణ్యుఁడు సత్య పరాక్రముండు
హరి నిభుఁడు సేరఁదీసి, దశానను ననిఁ
జంపెను, విభీషణుని రామచంద్రుఁ డలిగి
అంప విఘాత మంది యనె నంతట వాలి రఘుప్రవీరుతో
నింపుగ నేన సఖ్యమును నెంచిన సాయము సేయ నోపనే
పంపిన నుంతు దైత్యుఁ దవ పాదము చెంతనె యన్న దుష్టునిం
జంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణుం గ్రుధన్
[విభీషణుఁడు = మిక్కిలి భయంకరుఁడు, యిచట వాలి;
సుగ్రీవునకు మున్న తన్నడిగిన రాముని సఖ్యము కోరువాఁడ నని వాలి చనిపోవుచుఁ బలికెను.]
~~~~~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండి'తెంపరి రావణాసురుడ! త్రిమ్మరి
సీతను వీడకుండినన్
బంపెద గాలు సన్నిధికి భండన
మందున మూర్ఖ చిత్తడా!
వెంపర మాని నన్ శరణు వేడు,
మటంచును నీవు దెల్పు మం
చంపెను రాఘవుండు తన సఖ్య
ము గోరు విభీషణున్ గృదన్
~~~~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండిఏమి చేసె పావని సింహికను? బ్రోచె
రాముడే దనుజానుజున్ బ్రేమతోడ?
రావణునిసంహరించెనెవ్వాడదేల?
చంపెను, విభీషణుని, రామచంద్రు డలిగి.
రిప్లయితొలగించండిఅంపము లెన్నినాటినను యాతువు చావక కోనత్రిమ్మరుల్
తుంపరఁ గూల్చుచుండగని దుష్టుని మృత్యు రహస్యమొక్కటిన్
దంపిన చెప్ప వానినిక దండధరుండను జేయ రావణున్
జంపెను, రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణున్, గృధన్.
ఇంపగు మాటలన్ పలుక వెప్పుడు కల్మషమైన బుద్ధితో
రిప్లయితొలగించండిసొంపగు స్నేహమున్ సలిపె సూర్యకులాన్వయు డుల్లసమ్ముతో
నంపఱలన్ వధించెనని నాదశ కంఠుని, వాగకివ్విధిన్
“చంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరువిభీషనున్ గ్రుధన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండితెంపగ పూనుటెట్లు మహదేవుని భక్తుని బ్రాహ్మణోత్తమున్
తెంపరిచేష్టగా దలతు దివ్యపునీతను సీతచోరతన్!
చంపగలేను రావణుని,శాంతి కుదుర్చగ నీవె పోవటం
చంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణున్ గృధన్
--కటకం వేంకటరామశర్మ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుదర్చగ*
తొలగించండిపొమ్మటం*
చంపెను రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణునున్ గ్రుధన్
రిప్లయితొలగించండినింపగు లంకనున్ గెలిచి యిచ్చెవిభీషణుగైవశంబుగా
చంపుట రాఘవుండకట సాధ్యమె చెప్పుమ నీవయిత్తఱిన్
బెంపును జూడు రామునిట భీకర మాటలు న్యాయమే రమా!
సంగరమున శరములతోశత్రువులను
రిప్లయితొలగించండినభయమునొసగి రక్షించె నాదరమున
పడతి నపహరించినయట్టి వాని నణచె
చంపెను,విభీషణుని,రామచంద్రుడలిగి