3-8-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?”(లేదా...)“తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో”(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు."మానసమ్మునన్" అంటే బాగుంటుంది కదా?
వట్టివి మాటల బేరిచిబిట్టగు సుకవిత్వమంచు బీరములేలా?పట్టగు భావముతో మదిదట్టెడు పద్యమ్ముచాలు తట్టెడవేలా?
చక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
అట్టుడుకుమనసుగెలువగపట్టినబాధలుమరలగభావమునిండన్గట్టిగనిద్రదివిడివడతట్టెడుపద్యమ్ముచాలుతట్టెడవేలా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: మట్టుగ మనుషుల వెన్నును తట్టెడు పద్యమ్ము చాలు; తట్టెడవేలా బెట్టును వీడుచు పరగెడి అట్టుడుకు గుణముల తోడ నడరెడి కైతల్.
కందంపట్టువలువ భారతికిన్గట్టినటుల వెలుగు వెలిగి కమనీయముగన్మొట్టమొదట మది తలుపున్దట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
ఉత్పలమాలకట్టగ పట్టుపుట్టములుఁ గన్నుల నిండుగ వాణి రూపమేయెట్టెదుటన్ మనోజ్ఞమన నేర్పడి మానసవీణమీటుచున్బుట్టనుపుట్టు తేనెరుచి ముచ్చట పంచిన రీతి భావమున్దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
దిట్ట కవీంద్రులు మెచ్చ ని వట్టి గణంబులను గూర్చి వ్యర్థ పదాలన్ బుట్టక రసాత్మ భావన తట్టెడు పద్మమ్ము చాలు :తట్టె డ వేలా?
కట్టినతాళపత్రమునకమ్మనిపద్యమువ్రాసెభారవేపట్టినవైశ్యుడంతటనుభావమునారసిలోనకుందెనేపట్టుగనున్నక్రౌర్యమునుబాయుచుసౌఖ్యము నోందెనయ్యెడన్తట్టెడుపద్యమోక్కటిగదామురిపించునుతట్టెడేలనో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'భారవి+ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
భారవిన్
విరించి.రట్టడి వ్రాతలు గుట్టలగుట్టలు గనువ్రాయనేమి కుకవుల్ కనగన్ జిట్టీ! పరమై గుండెను తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
రట్టడి కాదె వాసి కనరానివి రాశిని చూపనెంచుచున్ కట్టలకొద్ది పద్యముల కాకవి యొక్కడు వ్రాయనెందుకో చిట్టి, రసజ్ఞులైన జన చిత్తము దోచుచు వారి గుండెనున్ దట్టెడు పద్యమొక్కటెకదా మురిపించును తట్టెడేలనో.
సమస్య :తట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును తట్టె డేలొకో ( "భరతఖండంబు చక్కని పాడియావు ;హిందువులు లేగదూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి"అన్న చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారి ఒక్క పద్యం లక్షలకొలది తెలుగు వారిని స్వాతంత్ర్యసంగ్రామోన్ముఖు లను కావించింది . )అట్టడుగందు నున్న జను లందర నొక్కట చేరదీయుచున్ కట్టలు దాట యోచనలు కట్టుచు కైతల ; దేశభక్తితో మెట్టుకు మెట్టు నున్నతపు మేలిమి సౌధము నెక్కజేయగన్ దట్టెడు పద్యమొక్కటె కదా ! మురిపించును ; తట్టె డేలొకో ?
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: మట్టుగ వెల్గుచున్ సతము మానవులందరి మానసమ్ములన్ తట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును తట్టెడేలనో! తిట్టెడి తత్త్వ మెంచుచును తీరును వీడిన లక్షణమ్ములన్ అట్టిటుజేయు భావములు వ్యాప్తిని జేసెడి పద్యగేయముల్.
ఉ:కొట్టుచు బుజ్జగించుచును కోపము మాటున విద్య నేర్పగన్సొట్టలు లేని పోకడయు చొక్కపు బంగరు వన్నె దేరగన్చుట్టము లందు మెచ్చుగతి సూరులునొప్పెడు ప్రాకృతమ్ముగన్తట్టెడు పద్యమొక్కటి కదా మురిపించును తట్టెడేలనోసూరులు=పండితులుప్రాకృతము=సహజమువై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
పట్టుగ విద్యలన్ బడసి పండిత వర్యుల చెంత నిష్ఠతోగట్టి పదమ్ములన్ బొదిగి కమ్మగ వ్రాయగ, మానసమ్ములన్తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును, తట్టె డేలనోమట్టిని బోలు కైతలవి మాన్యుల మెప్పును పొందకున్నచోఅసనారె
పుట్టెడు రంగురాళ్ళయిన మోహము బుట్టునె రత్నమున్గనన్?కట్టెలు మోపెడైనను నిఖార్సగు గంధపు చెక్క సాటియా?గుట్టల కొద్ది రాతలవి గూర్చునె గౌరవ భావనల్?.....హృదిన్దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో!
పట్టిన పట్టు వీడకను బద్యములెన్నియొ వ్రాయుచుంద్రుగాబుట్టలవేయు పద్యములు పొందిక లేనివి యెన్ని వ్రాసినన్ముట్టరు వాటి నెవ్వరును, మోదము నిచ్చుచు నంత రాత్మకున్దట్టెడు పద్య మొక్కెటె గదా మురిపించును తట్టెడేలకో
ఎట్టివిధంబగు స్పందనబుట్టని పద్యంబులేల పుడమి జనులకున్నెట్టన హృదయ కవాటముతట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
మట్టుగ మదికిని తోచినయట్టుల పద్యమును వ్రాయ హాయిగ నుండున్తిట్టుచు నితరుల నిరతముతట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
బెట్టుగ వలదు మదితలుపుదట్టెడు పద్యమ్ము చాలు , తట్టెడవేలా?గట్టిగ యత్నము జేసినపుట్టును నీదు మదియందె ముదము నొసగుచున్
అట్టడుగు వర్గముల వెనుతట్టెడు పద్యమ్ము చాలు; తట్టెడవేలాతిట్టులతో యువతను జెడగొట్టెడి నైరాశ్యపు పలుకుల పద్యంబుల్
పుట్టెడు బట్టలా! కలరు పోంతనకుద్రక తోడ్గలేములేచట్టములెన్నియున్నమరిసాక్ష్యములేనిదె తీర్పురాదులేగట్టిగ తెల్గుబాలచిరు కంఠముమ్రోగగపాడయుక్తమైతట్టెడు పద్యమొక్కటికదా మురిపించును తట్టెడేలనో ...తోకల...
బుట్టలుతట్టలుగా పలుగుట్టలుగా వ్రాయనేల కోరిన రసమేపుట్టగ పాఠక హృదయముతట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
గుట్టల కొమరిత పెనిమిటి చిట్టెలుకనుయెక్కి తిరుగు జేజకు నబ్బన్ గట్టిగ నుతించి నాతని “తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?”
మీ పూరణ బాగున్నది. అభినందనలు."చిట్టెలుకను నెక్కి... నుతించి యాతని..." అనండి.
ఇక్కడే చిక్కు....సరిచేస్తానండీ. ధన్యవాదములు 🙏
తట్టెడు కైతలల్లుమన తట్టదు నీమది కెన్నడైననున్బెట్టుగ వ్రాయు కక్కసము పెద్దగ బాటిలదెంచి జూడగన్పుట్టును నీ మనంబుననె ముద్దుగ నన్యుల మానసంబునున్దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో
గుట్టలు గుట్టలు వ్రాసినమట్టికి పరిచయము లేని మాటల వేలా?గట్టిగ రైతుల గుండెన్తట్టెడు పద్యమ్ము చాలు, తట్టెడవేలా?
గుట్టలు గుట్టలట్లు పదగుంభనఁ గూరిచి నీరసమ్ములౌపట్టులు లేని పద్యములు, వాడిన తావియె లేని పూవులైయెట్టుల తుష్టిఁ గూర్చు నవి? యెందులకో మరి! మానసమ్ములన్తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో.కంజర్ల రామాచార్య
గుట్టును విప్పక మదిలోతట్టెడు భావముల తోడ తజ్ఞులు మెచ్చన్బిట్టుగఁ జదువరి వెన్నునుతట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?కంజర్ల రామాచార్య.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
బిట్టుగ బెక్కుపద్యములు భేషజమొప్పగ జెప్పనొప్పునాపట్టిహృదంతరాళమును భవ్యతమంబగు రీతి స్పందనన్బుట్టగ చేయునట్టిదియు పోడిమి గూర్చుచు మానసంబునున్తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో
పట్టిన దారము కొలదిగమట్టముగా గాలిపటము మంచిగ నెగురున్తిట్టిన సాగదు,సుకవీ!తట్టెడు పద్యమ్ము చాలు, తట్టెడవేలా?
ఇట్టుల రోజుకో రకము నింపును గూర్చుచు శంకరార్యులేపెట్టెడు కైపదమ్ములటు పెక్కగు రీతుల పూరణమ్ముకైపట్టున బూని నిత్యమగు భాగవతంబును జద్వజాలినన్దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో.
గట్టున జేర్చగాదగిన కామునితండ్రి పదాంబుజంబులన్గట్టిగనూని దాసగతి గ్రమ్మిన భక్తిని దన్మయండునైపట్టుచు పాణినిన్ గలము పంకజనాభుని హృద్క వాటమున్ దట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును, తట్టెడేలకోతిట్టు కవిత్వమంచు పలుతీరుల నీల్గుచు వ్రాయపద్యముల్
చట్టున నర్ధము నగుచునుబిట్టగు భావంబు గలిగి భేషుగ దనరన్ బట్టును గల్గుచు నికమదితట్టెడు పద్యమ్ము చాలుతట్టెడవేలా?
గట్టిద దొక్కటె యైనను చుట్టముగా హితమొనర్చ జూచుచు వెన్నున్జుట్టి సుషుప్తిని విడగా తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
పట్టీ వినుమా ముట్టఁగ గట్టును బంతమ్ము పట్టు గట్టిగ నీ విప్పట్టున నెట్టన నీ కెదఁదట్టెడు పద్యమ్ము చాలు తట్టె డవేలా? [తట్టెడు = తోఁచెడు]రాట్టులఁ బట్టి దట్టముగ రంగుల నెట్టెము చుట్టి యుండఁగాకట్టెదుటం బొగడ్తలను గ్రమ్మఁగఁ జేయఁగ మోక్ష మెట్టులౌ ముట్ట నెడంద హత్తుకొని మోక్షము చూపెడు, వాక్కు లేలనోతట్టెడు, పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో
పట్టును లేనివెన్న్నయిన భావము మంచిగ లేనిచో మదిన్ తట్టెడుపద్య మొక్కటికదా మురిపించును తట్టెడేలనో కట్టడి జేయగా దగును కబ్బములెన్నియొ వ్రాయుకంటె దాపట్టును గల్గుపద్యములు వ్రాయగనుండువిధంబుగానికన్
గట్టిగ ధ్వనితోడ కనికట్టును జేయుచు పాఠకుల్ జే కొట్టగ తట్టగన్ వివిధ గుంభన భావన లందులోన నెబ్బెట్టుగ లేనిహాస్యమును పేర్చిన కూర్చిన దైన,గుండియన్తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును, తట్టె డేలనో
గట్టిగ ధ్వనితోడ కనికట్టును జేయుచు పాఠకాళి జేకొట్టగ తట్టగన్ వివిధ గుంభన భావన లందులోన నెబ్బెట్టుగ లేనిహాస్యమును పేర్చిన కూర్చిన దైన,గుండియన్తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును, తట్టె డేలనో
దిట్టము గల్గినట్టి పద దీప్తుల నిండియు భావ రంజితాపుట్టము గట్టి యాధునిక పుంతలు తొక్కుచు మాధురీ రసావట్టము గల్గనీయకును వాక్సుధలిచ్చుచు మెల్లగా మదిన్తట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును తట్టెడేలనో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"మానసమ్మునన్" అంటే బాగుంటుంది కదా?
వట్టివి మాటల బేరిచి
రిప్లయితొలగించండిబిట్టగు సుకవిత్వమంచు బీరములేలా?
పట్టగు భావముతో మది
దట్టెడు పద్యమ్ముచాలు తట్టెడవేలా?
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిఅట్టుడుకుమనసుగెలువగ
రిప్లయితొలగించండిపట్టినబాధలుమరలగభావమునిండన్
గట్టిగనిద్రదివిడివడ
తట్టెడుపద్యమ్ముచాలుతట్టెడవేలా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమట్టుగ మనుషుల వెన్నును
తట్టెడు పద్యమ్ము చాలు; తట్టెడవేలా
బెట్టును వీడుచు పరగెడి
అట్టుడుకు గుణముల తోడ నడరెడి కైతల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిపట్టువలువ భారతికిన్
గట్టినటుల వెలుగు వెలిగి కమనీయముగన్
మొట్టమొదట మది తలుపున్
దట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
ఉత్పలమాల
తొలగించండికట్టగ పట్టుపుట్టములుఁ గన్నుల నిండుగ వాణి రూపమే
యెట్టెదుటన్ మనోజ్ఞమన నేర్పడి మానసవీణమీటుచున్
బుట్టనుపుట్టు తేనెరుచి ముచ్చట పంచిన రీతి భావమున్
దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిదిట్ట కవీంద్రులు మెచ్చ ని
రిప్లయితొలగించండివట్టి గణంబులను గూర్చి వ్యర్థ పదాలన్
బుట్టక రసాత్మ భావన
తట్టెడు పద్మమ్ము చాలు :తట్టె డ వేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికట్టినతాళపత్రమునకమ్మనిపద్యమువ్రాసెభారవే
రిప్లయితొలగించండిపట్టినవైశ్యుడంతటనుభావమునారసిలోనకుందెనే
పట్టుగనున్నక్రౌర్యమునుబాయుచుసౌఖ్యము నోందెనయ్యెడన్
తట్టెడుపద్యమోక్కటిగదామురిపించునుతట్టెడేలనో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భారవి+ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
భారవిన్
తొలగించండివిరించి.
రిప్లయితొలగించండిరట్టడి వ్రాతలు గుట్టల
గుట్టలు గనువ్రాయనేమి కుకవుల్ కనగన్
జిట్టీ! పరమై గుండెను
తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిరట్టడి కాదె వాసి కనరానివి రాశిని చూపనెంచుచున్
కట్టలకొద్ది పద్యముల కాకవి యొక్కడు వ్రాయనెందుకో
చిట్టి, రసజ్ఞులైన జన చిత్తము దోచుచు వారి గుండెనున్
దట్టెడు పద్యమొక్కటెకదా మురిపించును తట్టెడేలనో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండితట్టెడు పద్యమొక్కటె క
దా మురిపించును తట్టె డేలొకో
( "భరతఖండంబు చక్కని పాడియావు ;
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి"
అన్న చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారి ఒక్క పద్యం లక్షలకొలది తెలుగు వారిని స్వాతంత్ర్యసంగ్రామోన్ముఖు
లను కావించింది . )
అట్టడుగందు నున్న జను
లందర నొక్కట చేరదీయుచున్
కట్టలు దాట యోచనలు
కట్టుచు కైతల ; దేశభక్తితో
మెట్టుకు మెట్టు నున్నతపు
మేలిమి సౌధము నెక్కజేయగన్
దట్టెడు పద్యమొక్కటె క
దా ! మురిపించును ; తట్టె డేలొకో ?
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమట్టుగ వెల్గుచున్ సతము మానవులందరి మానసమ్ములన్
తట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును తట్టెడేలనో!
తిట్టెడి తత్త్వ మెంచుచును తీరును వీడిన లక్షణమ్ములన్
అట్టిటుజేయు భావములు వ్యాప్తిని జేసెడి పద్యగేయముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:
తొలగించండికొట్టుచు బుజ్జగించుచును కోపము మాటున విద్య నేర్పగన్
సొట్టలు లేని పోకడయు చొక్కపు బంగరు వన్నె దేరగన్
చుట్టము లందు మెచ్చుగతి సూరులునొప్పెడు ప్రాకృతమ్ముగన్
తట్టెడు పద్యమొక్కటి కదా మురిపించును తట్టెడేలనో
సూరులు=పండితులు
ప్రాకృతము=సహజము
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపట్టుగ విద్యలన్ బడసి పండిత వర్యుల చెంత నిష్ఠతో
తొలగించండిగట్టి పదమ్ములన్ బొదిగి కమ్మగ వ్రాయగ, మానసమ్ములన్
తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును, తట్టె డేలనో
మట్టిని బోలు కైతలవి మాన్యుల మెప్పును పొందకున్నచో
అసనారె
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపుట్టెడు రంగురాళ్ళయిన మోహము బుట్టునె రత్నమున్గనన్?
రిప్లయితొలగించండికట్టెలు మోపెడైనను నిఖార్సగు గంధపు చెక్క సాటియా?
గుట్టల కొద్ది రాతలవి గూర్చునె గౌరవ భావనల్?.....హృదిన్
దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపట్టిన పట్టు వీడకను బద్యము
రిప్లయితొలగించండిలెన్నియొ వ్రాయుచుంద్రుగా
బుట్టలవేయు పద్యములు పొందిక లేనివి యెన్ని వ్రాసినన్
ముట్టరు వాటి నెవ్వరును, మోద
ము నిచ్చుచు నంత రాత్మకున్
దట్టెడు పద్య మొక్కెటె గదా
మురిపించును తట్టెడేలకో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఎట్టివిధంబగు స్పందన
రిప్లయితొలగించండిబుట్టని పద్యంబులేల పుడమి జనులకున్
నెట్టన హృదయ కవాటము
తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమట్టుగ మదికిని తోచిన
రిప్లయితొలగించండియట్టుల పద్యమును వ్రాయ హాయిగ నుండున్
తిట్టుచు నితరుల నిరతము
తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబెట్టుగ వలదు మదితలుపు
రిప్లయితొలగించండిదట్టెడు పద్యమ్ము చాలు , తట్టెడవేలా?
గట్టిగ యత్నము జేసిన
పుట్టును నీదు మదియందె ముదము నొసగుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅట్టడుగు వర్గముల వెను
రిప్లయితొలగించండితట్టెడు పద్యమ్ము చాలు; తట్టెడవేలా
తిట్టులతో యువతను జెడ
గొట్టెడి నైరాశ్యపు పలుకుల పద్యంబుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుట్టెడు బట్టలా! కలరు
రిప్లయితొలగించండిపోంతనకుద్రక తోడ్గలేములే
చట్టములెన్నియున్నమరి
సాక్ష్యములేనిదె తీర్పురాదులే
గట్టిగ తెల్గుబాలచిరు
కంఠముమ్రోగగపాడయుక్తమై
తట్టెడు పద్యమొక్కటి
కదా మురిపించును తట్టెడేలనో
...తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబుట్టలుతట్టలుగా పలు
రిప్లయితొలగించండిగుట్టలుగా వ్రాయనేల కోరిన రసమే
పుట్టగ పాఠక హృదయము
తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగుట్టల కొమరిత పెనిమిటి
రిప్లయితొలగించండిచిట్టెలుకనుయెక్కి తిరుగు జేజకు నబ్బన్
గట్టిగ నుతించి నాతని
“తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చిట్టెలుకను నెక్కి... నుతించి యాతని..." అనండి.
ఇక్కడే చిక్కు....సరిచేస్తానండీ. ధన్యవాదములు 🙏
తొలగించండితట్టెడు కైతలల్లుమన తట్టదు నీమది కెన్నడైననున్
రిప్లయితొలగించండిబెట్టుగ వ్రాయు కక్కసము పెద్దగ బాటిలదెంచి జూడగన్
పుట్టును నీ మనంబుననె ముద్దుగ నన్యుల మానసంబునున్
దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగుట్టలు గుట్టలు వ్రాసిన
రిప్లయితొలగించండిమట్టికి పరిచయము లేని మాటల వేలా?
గట్టిగ రైతుల గుండెన్
తట్టెడు పద్యమ్ము చాలు, తట్టెడవేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగుట్టలు గుట్టలట్లు పదగుంభనఁ గూరిచి నీరసమ్ములౌ
రిప్లయితొలగించండిపట్టులు లేని పద్యములు, వాడిన తావియె లేని పూవులై
యెట్టుల తుష్టిఁ గూర్చు నవి? యెందులకో మరి! మానసమ్ములన్
తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో.
కంజర్ల రామాచార్య
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగుట్టును విప్పక మదిలో
తొలగించండితట్టెడు భావముల తోడ తజ్ఞులు మెచ్చన్
బిట్టుగఁ జదువరి వెన్నును
తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
కంజర్ల రామాచార్య.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిబిట్టుగ బెక్కుపద్యములు భేషజమొప్పగ జెప్పనొప్పునా
రిప్లయితొలగించండిపట్టిహృదంతరాళమును భవ్యతమంబగు రీతి స్పందనన్
బుట్టగ చేయునట్టిదియు పోడిమి గూర్చుచు మానసంబునున్
తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపట్టిన దారము కొలదిగ
రిప్లయితొలగించండిమట్టముగా గాలిపటము మంచిగ నెగురున్
తిట్టిన సాగదు,సుకవీ!
తట్టెడు పద్యమ్ము చాలు, తట్టెడవేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇట్టుల రోజుకో రకము నింపును గూర్చుచు శంకరార్యులే
రిప్లయితొలగించండిపెట్టెడు కైపదమ్ములటు పెక్కగు రీతుల పూరణమ్ముకై
పట్టున బూని నిత్యమగు భాగవతంబును జద్వజాలినన్
దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో.
గట్టున జేర్చగాదగిన కామునితండ్రి పదాంబుజంబులన్
రిప్లయితొలగించండిగట్టిగనూని దాసగతి గ్రమ్మిన భక్తిని దన్మయండునై
పట్టుచు పాణినిన్ గలము పంకజనాభుని హృద్క వాటమున్
దట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును, తట్టెడేలకో
తిట్టు కవిత్వమంచు పలుతీరుల నీల్గుచు వ్రాయపద్యముల్
చట్టున నర్ధము నగుచును
రిప్లయితొలగించండిబిట్టగు భావంబు గలిగి భేషుగ దనరన్
బట్టును గల్గుచు నికమది
తట్టెడు పద్యమ్ము చాలుతట్టెడవేలా?
గట్టిద దొక్కటె యైనను
రిప్లయితొలగించండిచుట్టముగా హితమొనర్చ జూచుచు వెన్నున్
జుట్టి సుషుప్తిని విడగా
తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?
పట్టీ వినుమా ముట్టఁగ
రిప్లయితొలగించండిగట్టును బంతమ్ము పట్టు గట్టిగ నీ వి
ప్పట్టున నెట్టన నీ కెదఁ
దట్టెడు పద్యమ్ము చాలు తట్టె డవేలా?
[తట్టెడు = తోఁచెడు]
రాట్టులఁ బట్టి దట్టముగ రంగుల నెట్టెము చుట్టి యుండఁగా
కట్టెదుటం బొగడ్తలను గ్రమ్మఁగఁ జేయఁగ మోక్ష మెట్టులౌ
ముట్ట నెడంద హత్తుకొని మోక్షము చూపెడు, వాక్కు లేలనో
తట్టెడు, పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో
పట్టును లేనివెన్న్నయిన భావము మంచిగ లేనిచో మదిన్
రిప్లయితొలగించండితట్టెడుపద్య మొక్కటికదా మురిపించును తట్టెడేలనో
కట్టడి జేయగా దగును కబ్బములెన్నియొ వ్రాయుకంటె దా
పట్టును గల్గుపద్యములు వ్రాయగనుండువిధంబుగానికన్
గట్టిగ ధ్వనితోడ కనికట్టును జేయుచు పాఠకుల్ జే
రిప్లయితొలగించండికొట్టగ తట్టగన్ వివిధ గుంభన భావన లందులోన నె
బ్బెట్టుగ లేనిహాస్యమును పేర్చిన కూర్చిన దైన,
గుండియన్
తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును, తట్టె డేలనో
గట్టిగ ధ్వనితోడ కనికట్టును జేయుచు పాఠకాళి జే
తొలగించండికొట్టగ తట్టగన్ వివిధ గుంభన భావన లందులోన నె
బ్బెట్టుగ లేనిహాస్యమును పేర్చిన కూర్చిన దైన,
గుండియన్
తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును, తట్టె డేలనో
దిట్టము గల్గినట్టి పద దీప్తుల నిండియు భావ రంజితా
రిప్లయితొలగించండిపుట్టము గట్టి యాధునిక పుంతలు తొక్కుచు మాధురీ రసా
వట్టము గల్గనీయకును వాక్సుధలిచ్చుచు మెల్లగా మదిన్
తట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును తట్టెడేలనో