3-9-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రామా సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా” (ఛందోగోపనము)(లేదా...)“నీ కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా”(ఛందోగోపనము)
అద్దిర కోరికన్ దశరథాధిప! కోసల రాజపుత్రికన్ ముద్దుగఁ బెండ్లియాడి మఱి పొందితివీవు సుమిత్ర పత్నిగావద్దనకుండ కేకయ నృపాలుని బిడ్డను గోరినావు నీకిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా!
👌👏🙏💐💐💐💐💐
కామములేకనుమదిలోభూమినియేలగతలపడిపూజితుడౌగానీమముసీతయెముక్తియెరామాసతులిద్దరుగలుగమఱోకసతియేలనయా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంఅతులిత బాహుబలమ్మునక్షితిపతివై సీత నొంది కీరితి నొకతెన్జతఁగొంటివి శ్రీరామా!సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా?ఉత్పలమాలఅద్దరి విల్లు ద్రుంచి కొని యంబుజ లోచన జానకీ సతిన్,గద్దె నయోధ్యనెక్కి ప్రజఁ గాచు మహీపతివైన చాలదే?యిద్దరి ధర్మమూర్తి యన నింపుగ నేలుచుఁ గీర్తిఁ గొంటె! నీకిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా!
తద్దయుముక్తికాంతనటధార్మికబుద్ధినినీవుకోరగాఅద్దిరజానకీసతియునాదరమోప్పగనీకుభార్యనీకిద్దరుభార్యలున్ననువరించితెవేఱోకతెన్రఘూద్వహాపెద్దగరాజ్యలక్ష్మినటపేర్మినిజూడగపాలనంబునన్
సుతులు కలుగుట కొఱకు నై గతి లేక నిరువురి నొకడు కళ్యాణ మాడెన్ ధృతి మూడవ దా ! రామా !సతు లిద్దరు గలుగ మరొక సతి యేల నయా !
అతులితగుణ ధాముండవువితతంబగు కీర్తికాంత పెనిమిటివీవేసతిసీత తోడ రామాసతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా
క్షితిపతివై యొకతెను శ్రీమతిగా మైథిలిని గొనుట మరచితివా కీరితి కాంత గోర రామాసతులిద్దరు గలుగ మరొక సతియేల నయాహద్దులులేని మోహమిది యందము జిందు సుశీలలైన నీకిద్దరు భార్యలున్నను వరించితె వేరొకతెన్ రఘూద్వహా?ముద్దులు మూటగట్టెడు సుపుత్రులు లేరను లోపమేప నిషిద్ధము గాదుగా సతుల జేకొన పెక్కురు వంశవృద్ధికైదశరథ మిత్ర సంవాదము
సవరణతోహద్దులులేని మోహమిది యందము జిందు సుశీలలైన నీకిద్దరు భార్యలున్నను వరించితె వేరొకతెన్ రఘూద్వహా?ముద్దులు మూటగట్టెడు సుపుత్రులు లేరను లోపమేపగానొద్దిక బెండ్లియాడితిని యోషను నొక్కతె వంశవృద్ధికై
తద్దయు కీర్తికాంత నిను తావరియించగనయ్యె నీకిలన్పెద్ద యనుంగు నెచ్చెలిగ, పిమ్మట సీతను బెండ్లియాడగానిద్దరు భార్యలైరి, యిక నేలొకొ నీకిక రాజ్యలక్ష్మి? నీకిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా
పతి దశరథుండు పాణౌకృతినాడదలచె సుమిత్ర, కేకయ పుత్రిన్ మతిచెడెనేమో రామా!సతులిద్దఱు గలుగ మఱొకసతియేలనయా?
ముద్దియ యందగత్తెయని మోజును జూపుచు పెండ్లియాడగాపెద్దలనంపినావుగద విజ్ఞుడు కేకయ రాజు చెంతకున్ వద్దని చెప్పలేము ప్రభువా! తగదంటిని నా నుడులాలకించు నీకిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా.
(భరతుడు రాజ్యమప్పగించి భూపతిక జేయ వచ్చినపుడు రాముని యాత్మ)పితృవాక్య పాలన యొకతె ,సతతము నిను వీడకుండుజానకి యౌ భూసుత యొకతె యుండ ! రామా సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా!
సతితో పలువురు భర్తలుసతమతమైవగచుచుండ సజ్జనులకు సమ్మతమా! అయ్యోరామా! సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా
ముద్దుగ నొక్క మాట పయి ముచ్చట గొన్న విభుండ వైతివే ఒద్దిక గా శరంబొకటి యుర్విని రెండవ పత్నియై జనన్ సద్దొనరించకీ ధరణిజన్ దరి చేరగ పాడి యౌనె ! నీ కిద్దరు భార్యలున్న వరియించితె వేఱొకతెన్ రఘూద్వహా!
బీతియులేనట్టిజనమునీతినిదప్పిరివివాహనియమముమరువామతిదెల్పుము శ్రీరామా!సతులిద్దఱుగలుగ మరొకసతియేలనయా! ...తోకల...
సమస్య :( ఛందో గోపనము )నీకిద్దరు భార్యలున్నను వరించితె వేరొకతెన్ రఘూద్వహా ( పోతన మహాకవి రచించిన ఆంధ్రమహాభాగవత గ్రంథాన్ని అంకితమందుకొంటున్న శ్రీరామచంద్రునితో ఆంజనేయస్వామి )ఉత్పలమాల ...................ఒద్దిక మీరగన్ దలపు లొక్కటిగా నిను సేవ జేతురే హద్దు లెరుంగనట్టి హృద యమ్ముల సీతయు రాజ్యలక్ష్మియున్ ;ముద్దుగ వచ్చె నేడిటుల ముందుకు భాగవతాఖ్యదేవి ; నీకిద్దరు భార్యలున్నను వరించితె వేరొకతెన్ రఘూద్వహా !!
(మూడవ పెళ్లికి సిద్ధమైన భర్తను జూచి భంగపడిన యిల్లాలి యావేదన)కందము:సతతము తగవులహితమై సతమతమౌ మా వసతిన సవతి మరొకరా?మతిలేదు పతికి! రామా!సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా
పతిదశరధునకు రామా!సతులిద్దరు గలుగ మఱొకసతి యేలనయాసుతులుగ బుట్టిరిగదమీరతిసుందరరూపుతోడ నార్యా! చెపుమా
ముద్దులు మూటగట్టునటు మోములు గల్గిన వారుగాను నీకిద్దరు భార్యలున్నను వరించితెవేఱొకతెన్ రఘూద్వహా!యద్దిర రామునిన్ నడవికంపుట మూలము కైకపెండ్లియేతద్దయు ఘోరమే కమల!ధార్మికరూపుని బంపనిర్దయన్
వితతంపు ధన వ్యయమౌ కత కివ్విధిఁ జాలు నయ్య కమనీయముగా నుత నటు లీ పతి, రామా!, సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా అద్దిర రామ వింటి నట నబ్బుర మందఁగ విర్గఁ జేసి యెప్పొద్దును గాఁగ నీ కవని భూషలు పల్కులు గొప్ప చేతలేసుద్దులు సెల్గ సత్య సతి చొప్పడ ధర్మము నాఁగ నాతి నీకిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా
ఉ: హద్దులు గల్గు జీవితము నామడ దూరము పత్ను లెచ్చనన్ బుద్ధిగ నున్న నీకు కవి పుంగవు లెల్లరు చేర్చిరిద్దరున్ముద్దుగ మువ్వురంచు కడు ముప్పొనరింపగ , నిగ్గుదేల్చు! నీకిద్దరు భార్యలున్న? వరియించితె వేఱొకతెన్? రఘూద్వహా!
వద్దని చెప్పినన్ జనకు పాత్రకు దానె సమర్థుడంచునాపెద్ద వయస్సు వాని నిలబెట్టిరి నాటకమందు గానయోనిద్దుర మత్తులోనతడు నివ్వెరబోవగ బల్కెనిట్లు "నీకిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా"
కం//పతనముజేయకు, భవునకుగతి లేదంద్రు, భువిలోని కాంతకు వశమై !మతిపోయెన శ్రీరామా, !సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా !!
సతతము ప్రజచే మాదిరిక్షితిపతిగా ఖ్యాతు డైన సీతానాథాసతమతమగు మతి నడిగెద*సతులిద్దరు గలుగ మఱొక సతియేలనయా*మరొక పూరణముద్దుల శిష్యుడై మునికి మ్రొక్కుచు విల్లునునెక్కు పెట్టగన్హద్దులులేనిసంతసము హర్షము గూర్చగ సీతకచ్చటన్ముద్దుల భార్యగా ధరయు మోదముపెంచగనిర్వురొప్పగన్*న్నిద్దరు భార్యలున్న వరియించితె వేరొకతెన్ రఘూద్వహా*
అద్దిర కోరికన్ దశరథాధిప! కోసల రాజపుత్రికన్
రిప్లయితొలగించండిముద్దుగఁ బెండ్లియాడి మఱి పొందితివీవు సుమిత్ర పత్నిగా
వద్దనకుండ కేకయ నృపాలుని బిడ్డను గోరినావు నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా!
👌👏🙏💐💐💐💐💐
తొలగించండికామములేకనుమదిలో
రిప్లయితొలగించండిభూమినియేలగతలపడిపూజితుడౌగా
నీమముసీతయెముక్తియె
రామాసతులిద్దరుగలుగమఱోకసతియేలనయా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండికందం
అతులిత బాహుబలమ్మున
క్షితిపతివై సీత నొంది కీరితి నొకతెన్
జతఁగొంటివి శ్రీరామా!
సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా?
ఉత్పలమాల
అద్దరి విల్లు ద్రుంచి కొని యంబుజ లోచన జానకీ సతిన్,
గద్దె నయోధ్యనెక్కి ప్రజఁ గాచు మహీపతివైన చాలదే?
యిద్దరి ధర్మమూర్తి యన నింపుగ నేలుచుఁ గీర్తిఁ గొంటె! నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా!
తద్దయుముక్తికాంతనటధార్మికబుద్ధినినీవుకోరగా
రిప్లయితొలగించండిఅద్దిరజానకీసతియునాదరమోప్పగనీకుభార్యనీ
కిద్దరుభార్యలున్ననువరించితెవేఱోకతెన్రఘూద్వహా
పెద్దగరాజ్యలక్ష్మినటపేర్మినిజూడగపాలనంబునన్
సుతులు కలుగుట కొఱకు నై
రిప్లయితొలగించండిగతి లేక నిరువురి నొకడు కళ్యాణ మాడెన్
ధృతి మూడవ దా ! రామా !
సతు లిద్దరు గలుగ మరొక సతి యేల నయా !
అతులితగుణ ధాముండవు
రిప్లయితొలగించండివితతంబగు కీర్తికాంత పెనిమిటివీవే
సతిసీత తోడ రామా
సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా
క్షితిపతివై యొకతెను శ్రీ
రిప్లయితొలగించండిమతిగా మైథిలిని గొనుట మరచితివా కీ
రితి కాంత గోర రామా
సతులిద్దరు గలుగ మరొక సతియేల నయా
హద్దులులేని మోహమిది యందము జిందు సుశీలలైన నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేరొకతెన్ రఘూద్వహా?
ముద్దులు మూటగట్టెడు సుపుత్రులు లేరను లోపమేప ని
షిద్ధము గాదుగా సతుల జేకొన పెక్కురు వంశవృద్ధికై
దశరథ మిత్ర సంవాదము
సవరణతో
తొలగించండిహద్దులులేని మోహమిది యందము జిందు సుశీలలైన నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేరొకతెన్ రఘూద్వహా?
ముద్దులు మూటగట్టెడు సుపుత్రులు లేరను లోపమేపగా
నొద్దిక బెండ్లియాడితిని యోషను నొక్కతె వంశవృద్ధికై
తద్దయు కీర్తికాంత నిను తావరియించగనయ్యె నీకిలన్
రిప్లయితొలగించండిపెద్ద యనుంగు నెచ్చెలిగ, పిమ్మట సీతను బెండ్లియాడగా
నిద్దరు భార్యలైరి, యిక నేలొకొ నీకిక రాజ్యలక్ష్మి? నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా
రిప్లయితొలగించండిపతి దశరథుండు పాణౌ
కృతినాడదలచె సుమిత్ర, కేకయ పుత్రిన్
మతిచెడెనేమో రామా!
సతులిద్దఱు గలుగ మఱొకసతియేలనయా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిముద్దియ యందగత్తెయని మోజును జూపుచు పెండ్లియాడగా
పెద్దలనంపినావుగద విజ్ఞుడు కేకయ రాజు చెంతకున్
వద్దని చెప్పలేము ప్రభువా! తగదంటిని నా నుడులాలకించు నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా.
(భరతుడు రాజ్యమప్పగించి భూపతిక జేయ వచ్చినపుడు రాముని యాత్మ)
రిప్లయితొలగించండిపితృవాక్య పాలన యొకతె ,
సతతము నిను వీడకుండుజానకి యౌ భూ
సుత యొకతె యుండ ! రామా
సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా!
సతితో పలువురు భర్తలు
రిప్లయితొలగించండిసతమతమైవగచుచుండ సజ్జనులకు స
మ్మతమా! అయ్యోరామా!
సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా
ముద్దుగ నొక్క మాట పయి ముచ్చట గొన్న విభుండ వైతివే
రిప్లయితొలగించండిఒద్దిక గా శరంబొకటి యుర్విని రెండవ పత్నియై జనన్
సద్దొనరించకీ ధరణిజన్ దరి చేరగ పాడి యౌనె ! నీ
కిద్దరు భార్యలున్న వరియించితె వేఱొకతెన్ రఘూద్వహా!
బీతియులేనట్టిజనము
రిప్లయితొలగించండినీతినిదప్పిరివివాహనియమముమరువా
మతిదెల్పుము శ్రీరామా!
సతులిద్దఱుగలుగ మరొకసతియేలనయా!
...తోకల...
సమస్య :
రిప్లయితొలగించండి( ఛందో గోపనము )
నీ
కిద్దరు భార్యలున్నను వ
రించితె వేరొకతెన్ రఘూద్వహా
( పోతన మహాకవి రచించిన ఆంధ్రమహాభాగవత గ్రంథాన్ని అంకితమందుకొంటున్న శ్రీరామచంద్రునితో
ఆంజనేయస్వామి )
ఉత్పలమాల
...................
ఒద్దిక మీరగన్ దలపు
లొక్కటిగా నిను సేవ జేతురే
హద్దు లెరుంగనట్టి హృద
యమ్ముల సీతయు రాజ్యలక్ష్మియున్ ;
ముద్దుగ వచ్చె నేడిటుల
ముందుకు భాగవతాఖ్యదేవి ; నీ
కిద్దరు భార్యలున్నను వ
రించితె వేరొకతెన్ రఘూద్వహా !!
(మూడవ పెళ్లికి సిద్ధమైన భర్తను జూచి భంగపడిన యిల్లాలి యావేదన)
రిప్లయితొలగించండికందము:
సతతము తగవులహితమై
సతమతమౌ మా వసతిన సవతి మరొకరా?
మతిలేదు పతికి! రామా!
సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా
పతిదశరధునకు రామా!
రిప్లయితొలగించండిసతులిద్దరు గలుగ మఱొకసతి యేలనయా
సుతులుగ బుట్టిరిగదమీ
రతిసుందరరూపుతోడ నార్యా! చెపుమా
ముద్దులు మూటగట్టునటు మోములు గల్గిన వారుగాను నీ
రిప్లయితొలగించండికిద్దరు భార్యలున్నను వరించితెవేఱొకతెన్ రఘూద్వహా!
యద్దిర రామునిన్ నడవికంపుట మూలము కైకపెండ్లియే
తద్దయు ఘోరమే కమల!ధార్మికరూపుని బంపనిర్దయన్
వితతంపు ధన వ్యయమౌ
రిప్లయితొలగించండికత కివ్విధిఁ జాలు నయ్య కమనీయముగా
నుత నటు లీ పతి, రామా!,
సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా
అద్దిర రామ వింటి నట నబ్బుర మందఁగ విర్గఁ జేసి యె
ప్పొద్దును గాఁగ నీ కవని భూషలు పల్కులు గొప్ప చేతలే
సుద్దులు సెల్గ సత్య సతి చొప్పడ ధర్మము నాఁగ నాతి నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా
ఉ:
రిప్లయితొలగించండిహద్దులు గల్గు జీవితము నామడ దూరము పత్ను లెచ్చనన్
బుద్ధిగ నున్న నీకు కవి పుంగవు లెల్లరు చేర్చిరిద్దరున్
ముద్దుగ మువ్వురంచు కడు ముప్పొనరింపగ , నిగ్గుదేల్చు! నీ
కిద్దరు భార్యలున్న? వరియించితె వేఱొకతెన్? రఘూద్వహా!
వద్దని చెప్పినన్ జనకు పాత్రకు దానె సమర్థుడంచునా
రిప్లయితొలగించండిపెద్ద వయస్సు వాని నిలబెట్టిరి నాటకమందు గానయో
నిద్దుర మత్తులోనతడు నివ్వెరబోవగ బల్కెనిట్లు "నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా"
కం//
రిప్లయితొలగించండిపతనముజేయకు, భవునకు
గతి లేదంద్రు, భువిలోని కాంతకు వశమై !
మతిపోయెన శ్రీరామా, !
సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా !!
సతతము ప్రజచే మాదిరి
రిప్లయితొలగించండిక్షితిపతిగా ఖ్యాతు డైన సీతానాథా
సతమతమగు మతి నడిగెద
*సతులిద్దరు గలుగ మఱొక సతియేలనయా*
మరొక పూరణ
ముద్దుల శిష్యుడై మునికి మ్రొక్కుచు విల్లునునెక్కు పెట్టగన్
హద్దులులేనిసంతసము హర్షము గూర్చగ సీతకచ్చటన్
ముద్దుల భార్యగా ధరయు మోదముపెంచగనిర్వురొప్పగన్
*న్నిద్దరు భార్యలున్న వరియించితె వేరొకతెన్ రఘూద్వహా*