19-9-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పండితుఁడనఁ దప్పుఁ బలుకువాఁడె”(లేదా...)“మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్”(డా. వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)
సమస్య :మాటల దప్పుగా బలుకు మానవుడే కద పండితుండనన్ ( రాకుమారి విద్యావతిపై పగబూని నిరక్షరాస్యుని పండితునిగా అలంకరించి తెచ్చిన దుష్టమంత్రి వాని మోటుపలుకులను సభలో సమర్థిస్తూ ...)చేటుగ నెంచబోకుడిటు చెల్వుగ బల్కెను సార్థకాఖ్యు ; డీ మేటి సుధీవతంసకుని మించిన వాగ్విభవుండు లేడెటన్ ;మీటిన వీణతంత్రి వలె మేలగు భాషణ సేయుచుండెడిన్ ;మాటల దప్పుగా బలుకు మానవుడే కద ! పండితుండనన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వచనమర్థమెరిగి పలుకు చుండెడివాడెపండితుఁడనఁ ; దప్పుఁ బలుకువాఁడెచిక్కుల బడుచుండు జీవితమందున ,దప్పుపలుక నెపుడు ముప్పుగలుగు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్పష్టమైనభాష చక్కని భాషణఖండితముననుండు పండితుడనదప్పు పలుకు వాడె గొప్పచెప్పుకొనినగౌరవమ్ముపొందగలుగలేడు
ఆటవెలదిఅయిన వారిఁ జంపు నని నుండగా లేనుకృష్ణ! తొలగుదునను క్రీడి గెలువగీత బలికి నొసఁటి గీత మార్చిన మేటిపండితుఁడనఁ దప్పుఁ బలుకువాఁడె?ఉత్పలమాలపాటవమొప్పు వీరుడగు పార్థుడు బంధములెంచి యుద్ధమున్జేటొనరించనన్ దగని చింతన నొప్పక గీత బోధతోమేటిగ దీర్చ కృష్ణుఁడట మిన్నగ గెల్పును బొంది మోహపున్మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
వేటయె జీవనమ్మయిన వేదవిదూరుడు దేవభాషవౌమాటల తప్పుగాబలుకు; మానవుడేగద పండితుండనన్ ధాటిగ మాటలాడగల దార్ఢ్యము గల్గి వివేకవంతుడైదాట భవాబ్ధినిన్ దగిన దారినిజూపగ శిక్షకుండునై
ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏
క్రొవ్విడి వెంకట రాజారావు: మూర్ఖ వాద మెంచు మూఢమతి కెపుడు వాస్తవమ్మె నీదు వాక్కు యనుచు అంగదనిడు వాడె యాతని దృష్టిలో పండితుడనగ, దప్పు బలుకు వాడె?
సూటిగ సత్యమున్ బలుకు శుద్ధమనస్కుల మెచ్చరెవ్వ రేనాటికి నేటికిన్ నరులు నమ్ముదు రెప్పు డసత్య వాదులన్;చేటును దల్పనట్టి విధిఁ జెల్వము నొప్పగ సత్ప్రవర్తనన్,మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్.
చక్కని పూరణ! అభినందనలు!👏👏💐💐
ఆర్తిగా బిలిచిన నధిదైవమే వచ్చిప్రోచు నంచు పలుక బుధుడు, తానుపల్మరులు పిలిచిన వాడురాక తలచెపండితుడనఁ దప్పుఁ బలుకు వాఁడె.
కూటముతోడ పిల్చినను కూరిమితో నరుదెంచు నంచు నోమేటి బుధానుడచ్చట సమీకృత భక్తులతో వచింపగా చాటుగ విన్న పామరుడు సామిని పిల్చిన రాక తల్చెనే మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుడే కద పండితుండనన్.
అన్ని తెలిసిన ట్టి యాఢ్యు డై వెల్గునుపండితుడన :దప్పు పలుకు వాడె తనకు తెలియు నంచు దర్పంబు జూపించిగొప్ప యనగ వెల్గి మెప్పు నందు
నాలుగవ పాదం లో వెల్గ జూచు నట్టి వెఱ్ఱి వాడు అని సవరణ జేయడ మైనది
విద్యలందునొజ్జ విజ్ఞాన ఖని తానుపలుకు మాటలందు జిలుకు సుధలుసకల శాస్త్రములను చదివిన వాడగుపండితుఁడనఁ దప్పుఁ బలుకువాఁడె?
కె.వి.యస్. లక్ష్మి: పలుకులందు పాటవమ్ము జూపెడివాడె పండితుడనగ; దప్పు బలుకు వాడెచెప్పు నీతులెన్నొ చెన్నైన రీతిని పుడమినందు తానె ప్రోఢ ననుచు.
క్రొవ్విడి వెంకట రాజారావు: పాటి నొసంగలేని పలు భాషితముల్ ప్రవచించుచుండునౌ మేటి వివేకహీనుకట మెచ్చులు నిచ్చుచు సాధువాదముల్ నాటుచు గొప్పగా పొగడు నర్తకుడాతని దృష్టినిన్ సదా మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్.
చేటును కోరు దూషణలు, చిఱ్ఱు నడంచగ లేక దూఱు నాయీటెల బోలు దెప్పరము లెంతయు నీచపు నీసడింపుతో ఘాటుగ దోచు శబ్దములు కల్లరి నోటను జారునట్టివౌ మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్
ధీటగుయుద్దమే జరుగదీరులుధర్మజచక్రవర్తులేసూటిగగెల్పుగోరుకొనిసూనృతవాక్యముసృష్టిచేసిరోగాటుగ మన్షియోగజమొకాంచగసద్గునిసంహరింపగామాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్” ...తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో టైపు దోషాలున్నవి.
మాటున చేరి పెద్దలకు మాదిరి కావ్యము నల్లుటందునన్పాటవమంత బొందుపడ బద్యమ నొక్కటి నాల్గు పాదముల్నాటగ వ్రాసి చూపగనె నర్థము భానము లేకనున్న నామాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. టైపాట్లున్నవి. "...చూపగనె యర్థము భావము.."
🙏🏽🙏🏽🙏🏽
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కూటికి లేనివాడనుచు క్రూరపు వాక్కులనాడ నీశుడేధాటిగ పద్యమున్ బలికి తద్దయు క్రోధము పిచ్చలింపగాచేటును కల్గజేయగను, చేసిన బన్నము కాల్చఁ జిత్తమున్,మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుడే కద పండితుండనన్
అన్ని శాస్త్రములను నవలీల జెప్పును పండీతుడన,దప్పు పలుకు వాడెయపహసింపబడును నందఱి చేతనునొప్పు పలుక వలయు నెప్పు డిలను
ఉ: బాటలు వేయు వ్రాయుటకు పద్యములెన్నియొ భావయుక్తమైధీటుగ విన్నవించు పలు దిక్కులు మెచ్చగ ధర్మ శాస్త్రముల్కూటికి నోచ కున్న దన కుత్తుక నెంచడు దప్పు బల్కగా,మాటలు తప్పుగా బలుకు మానవుడే కద ! పండితుండనన్వై. చంద్రశేఖర్
కాటమరాయుడా,వినుము కాపురు షుండుగ వాసికెక్కుదామాటల దప్పుగా బలుకు మానవుడేకద,పండితుండనన్ మాటలు సొంపునున్ గలిగి మానవకోటికా భారతాదులన్ బాటవమొప్పగానుడువు ప్రాఙ్ఞత బుద్ధియు నుండువాడహో
మానవకోటికి
సమముదర్శనంబుసాగనిచోటునపండితుండనఁబలుకువాడెశకునిమాటవినుచుసంగరమందుననుత్సహించెరాజునోర్పువిడిచి
ఆటలఱాయిరప్పలనునాదరినీదరిుోఁగుఁజేయుచున్చేటలఁబోసిచెర్గగనుచేవనులేనివిశబ్దజాలమున్పోటుననేర్చికూర్చుచునుపోడిమినందగఁజూతురేగదామాటలఁదప్రుగాబలుకుమానవుడేగదపండితుండనన్
భీతి నైన తనదు పేరాస నైననుమెప్పు కొఱకు నైన ముప్పు నెంచి యెవ్వ రైన నేమి యీతని వీక్షించి పండితుఁ డనఁ దప్పుఁ బలుకు వాఁడెపాటున కోర్చి తర్కమును బన్నుగఁ జేసి సు నిశ్చితాత్ముఁడై పాటవ మొప్ప నే నరుని పక్షము నూనక యాలకించుచున్ మాటల నందు నొప్పయిన మాటల నొప్పుగఁ జెప్పి తప్పులౌ మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుం డనన్
పాటవమొప్పగాను పరిపాటిగ బోటుల మేనిసొంపులన్తేటగ వెల్లడించి పలుతీరుల వర్ణనజేసి కావ్యముల్మేటిగ వ్రాయగాను భయమేటికి మాకని చేటుదెచ్చునౌమాటల తప్పుగాబలుకు మానవుడేగద పండితుండనన్
నిండు కుండ లాగ, నేర్పులు తగజెప్పుపండితుఁడనఁ; దప్పుఁ బలుకువాడె కవి, యది తను బలుక గ్రాహ్యమగుచు నొప్పు,నుపమలు పలు జూడ నుర్వి కలవు.
ఘాటుగ ముక్క సూటిగను ఖండన జేయుచు ధూర్త చర్యలన్బూటక నాయకోత్తముల పుక్కిటిమాటలు నీతి హీనమౌనాటక మెండగట్టుటను నచ్చనివారల భావమింతియేమాటలు తప్పుగా బలుకు మానవుడే గద, పండితుండనన్
కాటుక కన్నులద్భుతము కమ్మని వాతెర జుంటితేనె విస్ఫోటనమైన మేరువును పోలు పయోధర సౌష్టవమ్మునున్జూటము కాలనాగు కటి సోమమటంచును సుందరాంగితో*మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
చేటొనరించునెల్లపుడు శ్రీయన ఛీయను నీతిబాహ్యుడా మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద; పండితుండనన్ తేటల మాటలన్ హితము తెల్లముగా వచియించు నాతడేమేటియటంచునెల్లరును మెచ్చ చరించును సచ్చరిత్రుడై
సకల శాస్త్రములను చదివిన సుజనుడే పండితుడన దప్పు పలుకువాడెపామరుడన బరగు పదుగురిలో తానుచదువు సంధ్యలు విడి చవట యగుచు
సమస్య :
రిప్లయితొలగించండిమాటల దప్పుగా బలుకు
మానవుడే కద పండితుండనన్
( రాకుమారి విద్యావతిపై పగబూని నిరక్షరాస్యుని
పండితునిగా అలంకరించి తెచ్చిన దుష్టమంత్రి
వాని మోటుపలుకులను సభలో సమర్థిస్తూ ...)
చేటుగ నెంచబోకుడిటు
చెల్వుగ బల్కెను సార్థకాఖ్యు ; డీ
మేటి సుధీవతంసకుని
మించిన వాగ్విభవుండు లేడెటన్ ;
మీటిన వీణతంత్రి వలె
మేలగు భాషణ సేయుచుండెడిన్ ;
మాటల దప్పుగా బలుకు
మానవుడే కద ! పండితుండనన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివచనమర్థమెరిగి పలుకు చుండెడివాడె
రిప్లయితొలగించండిపండితుఁడనఁ ; దప్పుఁ బలుకువాఁడె
చిక్కుల బడుచుండు జీవితమందున ,
దప్పుపలుక నెపుడు ముప్పుగలుగు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్పష్టమైనభాష చక్కని భాషణ
రిప్లయితొలగించండిఖండితముననుండు పండితుడన
దప్పు పలుకు వాడె గొప్పచెప్పుకొనిన
గౌరవమ్ముపొందగలుగలేడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిఅయిన వారిఁ జంపు నని నుండగా లేను
కృష్ణ! తొలగుదునను క్రీడి గెలువ
గీత బలికి నొసఁటి గీత మార్చిన మేటి
పండితుఁడనఁ దప్పుఁ బలుకువాఁడె?
ఉత్పలమాల
పాటవమొప్పు వీరుడగు పార్థుడు బంధములెంచి యుద్ధమున్
జేటొనరించనన్ దగని చింతన నొప్పక గీత బోధతో
మేటిగ దీర్చ కృష్ణుఁడట మిన్నగ గెల్పును బొంది మోహపున్
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండివేటయె జీవనమ్మయిన వేదవిదూరుడు దేవభాషవౌ
రిప్లయితొలగించండిమాటల తప్పుగాబలుకు; మానవుడేగద పండితుండనన్
ధాటిగ మాటలాడగల దార్ఢ్యము గల్గి వివేకవంతుడై
దాట భవాబ్ధినిన్ దగిన దారినిజూపగ శిక్షకుండునై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమూర్ఖ వాద మెంచు మూఢమతి కెపుడు
వాస్తవమ్మె నీదు వాక్కు యనుచు
అంగదనిడు వాడె యాతని దృష్టిలో
పండితుడనగ, దప్పు బలుకు వాడె?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసూటిగ సత్యమున్ బలుకు శుద్ధమనస్కుల మెచ్చరెవ్వ రే
రిప్లయితొలగించండినాటికి నేటికిన్ నరులు నమ్ముదు రెప్పు డసత్య వాదులన్;
చేటును దల్పనట్టి విధిఁ జెల్వము నొప్పగ సత్ప్రవర్తనన్,
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచక్కని పూరణ! అభినందనలు!👏👏💐💐
తొలగించండి
రిప్లయితొలగించండిఆర్తిగా బిలిచిన నధిదైవమే వచ్చి
ప్రోచు నంచు పలుక బుధుడు, తాను
పల్మరులు పిలిచిన వాడురాక తలచె
పండితుడనఁ దప్పుఁ బలుకు వాఁడె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికూటముతోడ పిల్చినను కూరిమితో నరుదెంచు నంచు నో
మేటి బుధానుడచ్చట సమీకృత భక్తులతో వచింపగా
చాటుగ విన్న పామరుడు సామిని పిల్చిన రాక తల్చెనే
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుడే కద పండితుండనన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅన్ని తెలిసిన ట్టి యాఢ్యు డై వెల్గును
రిప్లయితొలగించండిపండితుడన :దప్పు పలుకు వాడె
తనకు తెలియు నంచు దర్పంబు జూపించి
గొప్ప యనగ వెల్గి మెప్పు నందు
నాలుగవ పాదం లో వెల్గ జూచు నట్టి వెఱ్ఱి వాడు అని సవరణ జేయడ మైనది
తొలగించండివిద్యలందునొజ్జ విజ్ఞాన ఖని తాను
రిప్లయితొలగించండిపలుకు మాటలందు జిలుకు సుధలు
సకల శాస్త్రములను చదివిన వాడగు
పండితుఁడనఁ దప్పుఁ బలుకువాఁడె?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిపలుకులందు పాటవమ్ము జూపెడివాడె
పండితుడనగ; దప్పు బలుకు వాడె
చెప్పు నీతులెన్నొ చెన్నైన రీతిని
పుడమినందు తానె ప్రోఢ ననుచు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపాటి నొసంగలేని పలు భాషితముల్ ప్రవచించుచుండునౌ
మేటి వివేకహీనుకట మెచ్చులు నిచ్చుచు సాధువాదముల్
నాటుచు గొప్పగా పొగడు నర్తకుడాతని దృష్టినిన్ సదా
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేటును కోరు దూషణలు, చిఱ్ఱు నడంచగ లేక దూఱు నా
రిప్లయితొలగించండియీటెల బోలు దెప్పరము లెంతయు నీచపు నీసడింపుతో
ఘాటుగ దోచు శబ్దములు కల్లరి నోటను జారునట్టివౌ
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధీటగుయుద్దమే జరుగ
రిప్లయితొలగించండిదీరులుధర్మజచక్రవర్తులే
సూటిగగెల్పుగోరుకొని
సూనృతవాక్యముసృష్టిచేసిరో
గాటుగ మన్షియోగజమొ
కాంచగసద్గునిసంహరింపగా
మాటలఁ దప్పుగాఁ బలుకు
మానవుఁడే కద పండితుండనన్”
...తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో టైపు దోషాలున్నవి.
మాటున చేరి పెద్దలకు మాదిరి కావ్యము నల్లుటందునన్
రిప్లయితొలగించండిపాటవమంత బొందుపడ బద్యమ నొక్కటి నాల్గు పాదముల్
నాటగ వ్రాసి చూపగనె నర్థము భానము లేకనున్న నా
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిటైపాట్లున్నవి. "...చూపగనె యర్థము భావము.."
🙏🏽🙏🏽🙏🏽
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూటికి లేనివాడనుచు క్రూరపు వాక్కులనాడ నీశుడే
రిప్లయితొలగించండిధాటిగ పద్యమున్ బలికి తద్దయు క్రోధము పిచ్చలింపగా
చేటును కల్గజేయగను, చేసిన బన్నము కాల్చఁ జిత్తమున్,
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుడే కద పండితుండనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅన్ని శాస్త్రములను నవలీల జెప్పును
తొలగించండిపండీతుడన,దప్పు పలుకు వాడె
యపహసింపబడును నందఱి చేతను
నొప్పు పలుక వలయు నెప్పు డిలను
ఉ:
రిప్లయితొలగించండిబాటలు వేయు వ్రాయుటకు పద్యములెన్నియొ భావయుక్తమై
ధీటుగ విన్నవించు పలు దిక్కులు మెచ్చగ ధర్మ శాస్త్రముల్
కూటికి నోచ కున్న దన కుత్తుక నెంచడు దప్పు బల్కగా,
మాటలు తప్పుగా బలుకు మానవుడే కద ! పండితుండనన్
వై. చంద్రశేఖర్
కాటమరాయుడా,వినుము కాపురు షుండుగ వాసికెక్కుదా
రిప్లయితొలగించండిమాటల దప్పుగా బలుకు మానవుడేకద,పండితుండనన్
మాటలు సొంపునున్ గలిగి మానవకోటికా భారతాదులన్
బాటవమొప్పగానుడువు ప్రాఙ్ఞత బుద్ధియు నుండువాడహో
మానవకోటికి
తొలగించండిసమముదర్శనంబుసాగనిచోటున
రిప్లయితొలగించండిపండితుండనఁబలుకువాడె
శకునిమాటవినుచుసంగరమందున
నుత్సహించెరాజునోర్పువిడిచి
ఆటలఱాయిరప్పలనునాదరినీదరిుోఁగుఁజేయుచున్
రిప్లయితొలగించండిచేటలఁబోసిచెర్గగనుచేవనులేనివిశబ్దజాలమున్
పోటుననేర్చికూర్చుచునుపోడిమినందగఁజూతురేగదా
మాటలఁదప్రుగాబలుకుమానవుడేగదపండితుండనన్
భీతి నైన తనదు పేరాస నైనను
రిప్లయితొలగించండిమెప్పు కొఱకు నైన ముప్పు నెంచి
యెవ్వ రైన నేమి యీతని వీక్షించి
పండితుఁ డనఁ దప్పుఁ బలుకు వాఁడె
పాటున కోర్చి తర్కమును బన్నుగఁ జేసి సు నిశ్చితాత్ముఁడై
పాటవ మొప్ప నే నరుని పక్షము నూనక యాలకించుచున్
మాటల నందు నొప్పయిన మాటల నొప్పుగఁ జెప్పి తప్పులౌ
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుం డనన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాటవమొప్పగాను పరిపాటిగ బోటుల మేనిసొంపులన్
తొలగించండితేటగ వెల్లడించి పలుతీరుల వర్ణనజేసి కావ్యముల్
మేటిగ వ్రాయగాను భయమేటికి మాకని చేటుదెచ్చునౌ
మాటల తప్పుగాబలుకు మానవుడేగద పండితుండనన్
నిండు కుండ లాగ, నేర్పులు తగజెప్పు
రిప్లయితొలగించండిపండితుఁడనఁ; దప్పుఁ బలుకువాడె
కవి, యది తను బలుక గ్రాహ్యమగుచు నొప్పు,
నుపమలు పలు జూడ నుర్వి కలవు.
ఘాటుగ ముక్క సూటిగను ఖండ
రిప్లయితొలగించండిన జేయుచు ధూర్త చర్యలన్
బూటక నాయకోత్తముల పుక్కిటి
మాటలు నీతి హీనమౌ
నాటక మెండగట్టుటను నచ్చని
వారల భావమింతియే
మాటలు తప్పుగా బలుకు మాన
వుడే గద, పండితుండనన్
కాటుక కన్నులద్భుతము కమ్మని వాతెర జుంటితేనె వి
రిప్లయితొలగించండిస్ఫోటనమైన మేరువును పోలు పయోధర సౌష్టవమ్మునున్
జూటము కాలనాగు కటి సోమమటంచును సుందరాంగితో
*మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
చేటొనరించునెల్లపుడు శ్రీయన ఛీయను నీతిబాహ్యుడా
రిప్లయితొలగించండిమాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద; పండితుండనన్
తేటల మాటలన్ హితము తెల్లముగా వచియించు నాతడే
మేటియటంచునెల్లరును మెచ్చ చరించును సచ్చరిత్రుడై
సకల శాస్త్రములను చదివిన సుజనుడే
రిప్లయితొలగించండిపండితుడన దప్పు పలుకువాడె
పామరుడన బరగు పదుగురిలో తాను
చదువు సంధ్యలు విడి చవట యగుచు