23-10-2021 (శనివారం)
కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె”(లేదా...)“కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో”
వనిత యొకతె తాను వనమందు నుండు నే కాకి నొక్క ఖలుడు గౌగలించె నామె యరు పు వినియు నాఢ్య o డు వానిని చితక బాద వాడు చేష్టలుడిగె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చుట్టరాకనెంచిసూడిదగనలేకకాకికూతనాపకరవునందుఇంటిగుట్టుదెలిసియిల్లాలిసుఖమెంచికాకినోక్కఖలుడుకౌగిలించె
భార్య యున్న గాని బరితెగి నొక్కడునల్ల నైన మొరటు పిల్ల తోడతిరుగ మరుగ జనులు దెప్పి పలికిరిట్లుకాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
ఆటవెలదిఅందగత్తె రంభ నతిలోకసుందరిన్గోడలి వరుసౌదు కూడదనినరావణుండు వొందె! కావరమెగయ నేకాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె!!ఉత్పలమాలచేకొనఁ బోవఁగన్ మదిరఁ జేరఁగ వచ్చిన మాలినీ మణిన్దూకుడు మీర మోహమున ధూర్తుఁడు కీచకుఁ డడ్డగించుచున్దాకుచు దగ్గరై వికృత దారుణ క్రీడలఁ బట్ట పారె! నేకాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో!( పెనుగులాడెడు మాలిని వికృతరీతిలో పట్టి ఆడుకున్నాడను భావం. ఆమె సూర్యభగవానుడొసంగిన శక్తితో అతని నుండి తప్పించుకుంది)
మాలినిని అని చదువుకొన మనవి.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
నాకనుదోయికీమెగననాకమునందలిరంభయౌగదామేకపుఁజేసినన్గనుదుమేనికిశోభయచిందులేయగాఈకలరంగువేయనగునీవిధినవ్యతకేకియౌననన్కాకినిమానవాధముడుగౌగిటబట్టిరమించెనయ్యయో
బాటసారి యైన ప్రవరాఖ్యు రూపునిలొంగదీయఁ దా వరూధి నెంచకామరూపుడైన గంధర్వుడంత, నేకాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె.
మగడు సంతుతోడ మరొక యూరికిబోవదాని నొక్క తగిన దరుణమంచువారి యింటికేగి పండుకొన్నట్టి యేకాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
చీకిన చీరలోననట చేతుల జాపుచు బిచ్చమెత్తెడిన్వాకొనలేని నారిఁ బరివారము లేనటువంటి వేళలోచీకటి మాటునన్ గదిసి చేతుల కాళుల గట్టివేసి యేకాకిని మానవాధముడు గౌగిట బట్టి రమించె నయ్యయో
లోకములోన గామమయ లోలురుబెర్గుచు నుండి రిప్పుడున్దారుణ నీచ కార్యములు ధైర్యముతో నొనరించుచుండి రీధారుణిలోన, నింట నొక తన్వి వసించుచు నుండగాంచి యేకాకిని మానవాధముడు కౌగిట బట్టి రమించె నయ్యయో!
౧.చీకు చింత లేని సిద్ధ హస్తుడొకడుదారు లన్ని దిరుగు త్రాష్టుడయ్యుకోర్కెనాపుకొనక కోమలాంగియగు నేకాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె!!౨.రాత్రి పూట విధుల రమణి ముగించుకొని, రహదారి వెంట వెరువకుండనడిచి పోవుచుండ నాతిని జూచి నేకాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
చీకటి పడెనంచు సీమంతిని యొకతిభీతి తోడ వడిని వెడలు చుండపానశాల చెంత పాణిందమమున నేకాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
నాకుడు పశ్చిమంబుదెస నశ్వరమందె తమోహరుండు నిర్మోకము జేరునత్తరిని ప్రోథము నందుచు సాగుచుండగాచీకటి యందు నా పడతి చెంతనలేడెవడంచు గాంచి యేకాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పేకల నాడవచ్చు,పొగ బీలిచి దట్టపు మేఘ రాజముల్నాకస మందు నేర్పడగ యద్భుథ రీతిగ నూద వచ్చు లే!పీకల దాక త్రాగునను పేరును పొందగ వచ్చు, నెట్టులన్కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె? నయ్యయో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'రాజముల్+ఆకసమందు' అన్నపుడు నుగాగమం రాదు. "మేఘపంక్తి యా యాకసమందు నేర్పడగ నద్భుత" అనండి.
ధన్యవాదాలు గురువుగారు! అలాగే సవరించాను.పేకల నాడవచ్చు,పొగ బీలిచి దట్టపు మేఘ పంక్తి యాయాకస మందు నేర్పడగ యద్భుథ రీతిగ నూద వచ్చు లే!పీకల దాక త్రాగునను పేరును పొందగ వచ్చు, నెట్టులన్కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె? నయ్యయో!
దుష్ట చేష్టలందు దృష్టిసారించుచుభ్రష్టులైన వారు పలువురోయివెంట తోడు లేక ఒంటరియైననే కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
ఉత్పలమాల:కోకనుఁ గట్టినట్టి గడకొయ్యను చూడగ చొల్లుగార్చు మా రాకులు వేయనట్టి దరహాసముఁ జూసి వికారమొందు యీ యాకలి పెచ్చుమీరి తుద కాడుది పక్షియొ గానడేమొ పో “కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో”---కటకం వేంకటరామ శర్మ.
ధన్యవాదములార్యా!
చీకటి రాత్రులందునను చెమ్మట నోర్చుచు ముత్తుకూరునన్ప్రాకట మొప్పగా తనరి ప్రభాకర శాస్త్రియె పోరుచుండగాభీకర రీతి మూల్గుచును భీతిని మాపుచు నర్థరాత్రినిన్కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో
సరాకు సార్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణభంగం. వాట్సప్ లో సవరణ సూచించాను.
సమస్య :కాకి నొక్క ఖలుడు గౌగిలించె (కాకి అరపు పదేపదే విని మనసు మారిన నీచుడు ఆప్యాయంగా చేసిన పని )" బ్రతుకు, ధనము, వృత్తి, భవనముల్,పదవులు,యౌవనమ్ము స్థిరము కావు కావ "టంచు నరవ డెంద మంతయు మారగా గాకి నొక్క ఖలుడు గౌగిలించె .( " అమర్ ఖయాం " కావ్యంలోని నాన్న గారి " స్థిరములు కావు కావు " అన్న పద్యస్ఫూర్తితో )
నిన్నటి సమస్యకు పూరణ పన్నగ భూషణు విడిదికిచిన్నగ చేర్చిరి, బ్రతుకున చేర్చిన ధనమున్చిన్నది గోచిని దోచిన్నన్నున్ నగ్నముగఁ గనుటఁ న్యాయమె నీకున్"…భారతీనాథ్ చెన్నంశెట్టి…
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'దోచిన్'?
ప్రకృతి విలయమందు పతినిఁగోల్పోయినయబలకిచ్చియాతడాశ్రయంబురిమ్మతెగులుబట్టి రేతిరి యందునేకాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
చాకిరి చేయుచుండ నొక చక్కని చేడియ దేవళమ్ములోసోకగ కామ దృష్టి యల సుందర రూపముఁ గాంచి నంతనేరూకల నాశ పెట్టుచు, పురోహితు డక్కడ లేనివేళ, యేకాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో
"చీకటి వేళనొంటరిగ చేడియ కన్పడ వీడకుండ,నే*కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో*”లోకము భ్రాంతినన్ మునగ, రూపము మార్చుచు నింతియొక్కతేవేకువ తెచ్చెనీ భువిని! వీడక రక్కసు నంతుజూడగన్
ఉ: ఏకుయె మేకుగా నిలిచి యెంతయు జెప్పిన గానకుండగన్పోకిరి చేష్టలన్ సలుపు పోరడు ప్రేమగ ; బోధ సేయనైనీకిది భావ్యమా చెలగు నిప్పులు పెద్ద లెరుంగుటయ్యి; నేకాకిని మానవాధముడు కౌగిట బట్టి రమించె నయ్యయోవై. చంద్రశేఖర్
ధన్యవాదములు; ఏకుయె / ఏకది
ఆటవెలదిపాండుపుత్రులు వనవాసాన యుండగ,సింధురాజు మోహ శీలుడగుచుకృష్ణ పొందు గోరి కీడుదలచక నేకాకి నొక్క ఖలుడు గౌగిలించె.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వనవాసాను నుండగ..." అనండి.
ధన్యవాదాలు గురువు గారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఒండునెవరు లేక నొక్కతేపోవునేకాకి నొక్కఖలుడు గౌగిలించెనట్టివాని కీయ గట్టిదౌ శిక్షనుజేయకుండ్రు నెవరు చేష్టలట్లు
నీకు నెఱుక కాదె లోకపు టీ తీరు చింత సెంద కయ్య సుంత యేనిదుష్టుఁ డగును సఖుఁడు దుష్టున కిలఁ బలుగాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించెప్రాకట ఖేలనప్రవర రాణ్మణి పైఁ జెలగంగ నాశలేకూఁకటి వేరునాఁ బరఁగు గొప్ప ప్రవీణుఁడె యోడె నక్కటాకూఁక సెలంగు నాట వడి గ్రుక్క మరల్పక తద్ద కూయు నాకాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో [రమించు = క్రీడించు]
ఆకుల భారతమ్మొకతె యంగడి యొద్దకు నేగుచుండ,నేకాకిని మానవాధముడు గౌగిట బట్టి రమించె నయ్యయోపోకిరివానిబట్టుకొని బోరున నేడ్చుచు నుండగా గసిన్ బీకను గట్టిగా నదిమి పిండుచు జావునుజూప నొప్పగున్
ఆ కొమరాలినొంటరిగనారసి దారిని గాచి దుష్టుడైతాకకు ముట్టబోకుమని తానటులెంతగ వేడుచున్ననే కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయోలోకవినాశకారులగు క్రూరులనంతమొనర్చుమీశ్వరా
వనిత యొకతె తాను వనమందు నుండు నే
రిప్లయితొలగించండికాకి నొక్క ఖలుడు గౌగలించె
నామె యరు పు వినియు నాఢ్య o డు వానిని
చితక బాద వాడు చేష్టలుడిగె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచుట్టరాకనెంచిసూడిదగనలేక
రిప్లయితొలగించండికాకికూతనాపకరవునందు
ఇంటిగుట్టుదెలిసియిల్లాలిసుఖమెంచి
కాకినోక్కఖలుడుకౌగిలించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభార్య యున్న గాని బరితెగి నొక్కడు
రిప్లయితొలగించండినల్ల నైన మొరటు పిల్ల తోడ
తిరుగ మరుగ జనులు దెప్పి పలికిరిట్లు
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిఅందగత్తె రంభ నతిలోకసుందరిన్
గోడలి వరుసౌదు కూడదనిన
రావణుండు వొందె! కావరమెగయ నే
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె!!
ఉత్పలమాల
చేకొనఁ బోవఁగన్ మదిరఁ జేరఁగ వచ్చిన మాలినీ మణిన్
దూకుడు మీర మోహమున ధూర్తుఁడు కీచకుఁ డడ్డగించుచున్
దాకుచు దగ్గరై వికృత దారుణ క్రీడలఁ బట్ట పారె! నే
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో!
( పెనుగులాడెడు మాలిని వికృతరీతిలో పట్టి ఆడుకున్నాడను భావం. ఆమె సూర్యభగవానుడొసంగిన శక్తితో అతని నుండి తప్పించుకుంది)
మాలినిని అని చదువుకొన మనవి.
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండినాకనుదోయికీమెగననాకమునందలిరంభయౌగదా
రిప్లయితొలగించండిమేకపుఁజేసినన్గనుదుమేనికిశోభయచిందులేయగా
ఈకలరంగువేయనగునీవిధినవ్యతకేకియౌననన్
కాకినిమానవాధముడుగౌగిటబట్టిరమించెనయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాటసారి యైన ప్రవరాఖ్యు రూపుని
రిప్లయితొలగించండిలొంగదీయఁ దా వరూధి నెంచ
కామరూపుడైన గంధర్వుడంత, నే
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమగడు సంతుతోడ మరొక యూరికి
రిప్లయితొలగించండిబోవ
దాని నొక్క తగిన దరుణమంచు
వారి యింటికేగి పండుకొన్నట్టి యే
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచీకిన చీరలోననట చేతుల జాపుచు బిచ్చమెత్తెడిన్
రిప్లయితొలగించండివాకొనలేని నారిఁ బరివారము లేనటువంటి వేళలో
చీకటి మాటునన్ గదిసి చేతుల కాళుల గట్టివేసి యే
కాకిని మానవాధముడు గౌగిట బట్టి రమించె నయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలోకములోన గామమయ లోలురు
రిప్లయితొలగించండిబెర్గుచు నుండి రిప్పుడున్
దారుణ నీచ కార్యములు ధైర్యముతో
నొనరించుచుండి రీ
ధారుణిలోన, నింట నొక తన్వి వసించు
చు నుండగాంచి యే
కాకిని మానవాధముడు కౌగిట బట్టి
రమించె నయ్యయో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి౧.
రిప్లయితొలగించండిచీకు చింత లేని సిద్ధ హస్తుడొకడు
దారు లన్ని దిరుగు త్రాష్టుడయ్యు
కోర్కెనాపుకొనక కోమలాంగియగు నే
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె!!
౨.
రాత్రి పూట విధుల రమణి ముగించుకొ
ని, రహదారి వెంట వెరువకుండ
నడిచి పోవుచుండ నాతిని జూచి నే
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిచీకటి పడెనంచు సీమంతిని యొకతి
భీతి తోడ వడిని వెడలు చుండ
పానశాల చెంత పాణిందమమున నే
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినాకుడు పశ్చిమంబుదెస నశ్వరమందె తమోహరుండు ని
ర్మోకము జేరునత్తరిని ప్రోథము నందుచు సాగుచుండగా
చీకటి యందు నా పడతి చెంతనలేడెవడంచు గాంచి యే
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపేకల నాడవచ్చు,పొగ బీలిచి దట్టపు మేఘ రాజముల్
రిప్లయితొలగించండినాకస మందు నేర్పడగ యద్భుథ రీతిగ నూద వచ్చు లే!
పీకల దాక త్రాగునను పేరును పొందగ వచ్చు, నెట్టులన్
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె? నయ్యయో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రాజముల్+ఆకసమందు' అన్నపుడు నుగాగమం రాదు. "మేఘపంక్తి యా యాకసమందు నేర్పడగ నద్భుత" అనండి.
ధన్యవాదాలు గురువుగారు! అలాగే సవరించాను.
తొలగించండిపేకల నాడవచ్చు,పొగ బీలిచి దట్టపు మేఘ పంక్తి యా
యాకస మందు నేర్పడగ యద్భుథ రీతిగ నూద వచ్చు లే!
పీకల దాక త్రాగునను పేరును పొందగ వచ్చు, నెట్టులన్
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె? నయ్యయో!
దుష్ట చేష్టలందు దృష్టిసారించుచు
రిప్లయితొలగించండిభ్రష్టులైన వారు పలువురోయి
వెంట తోడు లేక ఒంటరియైననే
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండికోకనుఁ గట్టినట్టి గడకొయ్యను చూడగ చొల్లుగార్చు మా
రాకులు వేయనట్టి దరహాసముఁ జూసి వికారమొందు యీ
యాకలి పెచ్చుమీరి తుద కాడుది పక్షియొ గానడేమొ పో
“కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో”
---కటకం వేంకటరామ శర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా!
తొలగించండిచీకటి రాత్రులందునను చెమ్మట నోర్చుచు ముత్తుకూరునన్
రిప్లయితొలగించండిప్రాకట మొప్పగా తనరి ప్రభాకర శాస్త్రియె పోరుచుండగా
భీకర రీతి మూల్గుచును భీతిని మాపుచు నర్థరాత్రినిన్
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో
సరాకు సార్!
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. వాట్సప్ లో సవరణ సూచించాను.
సమస్య :
రిప్లయితొలగించండికాకి నొక్క ఖలుడు గౌగిలించె
(కాకి అరపు పదేపదే విని మనసు మారిన నీచుడు ఆప్యాయంగా చేసిన పని )
" బ్రతుకు, ధనము, వృత్తి, భవనముల్,
పదవులు,
యౌవనమ్ము స్థిరము కావు కావ "
టంచు నరవ డెంద మంతయు మారగా
గాకి నొక్క ఖలుడు గౌగిలించె .
( " అమర్ ఖయాం " కావ్యంలోని నాన్న గారి " స్థిరములు కావు కావు " అన్న పద్యస్ఫూర్తితో )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినిన్నటి సమస్యకు పూరణ
రిప్లయితొలగించండిపన్నగ భూషణు విడిదికి
చిన్నగ చేర్చిరి, బ్రతుకున చేర్చిన ధనమున్
చిన్నది గోచిని దోచిన్
నన్నున్ నగ్నముగఁ గనుటఁ న్యాయమె నీకున్"
…భారతీనాథ్ చెన్నంశెట్టి…
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దోచిన్'?
ప్రకృతి విలయమందు పతినిఁగోల్పోయిన
రిప్లయితొలగించండియబలకిచ్చియాతడాశ్రయంబు
రిమ్మతెగులుబట్టి రేతిరి యందునే
కాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచాకిరి చేయుచుండ నొక చక్కని చేడియ దేవళమ్ములో
రిప్లయితొలగించండిసోకగ కామ దృష్టి యల సుందర రూపముఁ గాంచి నంతనే
రూకల నాశ పెట్టుచు, పురోహితు డక్కడ లేనివేళ, యే
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చీకటి వేళనొంటరిగ చేడియ కన్పడ వీడకుండ,నే
రిప్లయితొలగించండి*కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో*”
లోకము భ్రాంతినన్ మునగ, రూపము మార్చుచు నింతియొక్కతే
వేకువ తెచ్చెనీ భువిని! వీడక రక్కసు నంతుజూడగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిఏకుయె మేకుగా నిలిచి యెంతయు జెప్పిన గానకుండగన్
పోకిరి చేష్టలన్ సలుపు పోరడు ప్రేమగ ; బోధ సేయనై
నీకిది భావ్యమా చెలగు నిప్పులు పెద్ద లెరుంగుటయ్యి; నే
కాకిని మానవాధముడు కౌగిట బట్టి రమించె నయ్యయో
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు; ఏకుయె / ఏకది
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిపాండుపుత్రులు వనవాసాన యుండగ,
సింధురాజు మోహ శీలుడగుచు
కృష్ణ పొందు గోరి కీడుదలచక నే
కాకి నొక్క ఖలుడు గౌగిలించె.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వనవాసాను నుండగ..." అనండి.
ధన్యవాదాలు గురువు గారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఒండునెవరు లేక నొక్కతేపోవునే
రిప్లయితొలగించండికాకి నొక్కఖలుడు గౌగిలించె
నట్టివాని కీయ గట్టిదౌ శిక్షను
జేయకుండ్రు నెవరు చేష్టలట్లు
నీకు నెఱుక కాదె లోకపు టీ తీరు
రిప్లయితొలగించండిచింత సెంద కయ్య సుంత యేని
దుష్టుఁ డగును సఖుఁడు దుష్టున కిలఁ బలు
గాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె
ప్రాకట ఖేలనప్రవర రాణ్మణి పైఁ జెలగంగ నాశలే
కూఁకటి వేరునాఁ బరఁగు గొప్ప ప్రవీణుఁడె యోడె నక్కటా
కూఁక సెలంగు నాట వడి గ్రుక్క మరల్పక తద్ద కూయు నా
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో
[రమించు = క్రీడించు]
ఆకుల భారతమ్మొకతె యంగడి యొద్దకు నేగుచుండ,నే
రిప్లయితొలగించండికాకిని మానవాధముడు గౌగిట బట్టి రమించె నయ్యయో
పోకిరివానిబట్టుకొని బోరున నేడ్చుచు నుండగా గసిన్
బీకను గట్టిగా నదిమి పిండుచు జావునుజూప నొప్పగున్
ఆ కొమరాలినొంటరిగనారసి దారిని గాచి దుష్టుడై
రిప్లయితొలగించండితాకకు ముట్టబోకుమని తానటులెంతగ వేడుచున్ననే
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో
లోకవినాశకారులగు క్రూరులనంతమొనర్చుమీశ్వరా