3, నవంబర్ 2021, బుధవారం

సమస్య - 3891

4-11-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిలుకడ లేనట్టి నరుఁడె నిజముగ గెలుచున్”
(లేదా...)
“నిలుకడ లేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్”

24 కామెంట్‌లు:

  1. కలివిడిగ తిరిగి జగమున
    పలువురి ప్రాపున్ బడయుచు బలిమిని పొందున్
    యిలలో సుగ్రీవుడి వలె
    నిలుకడ లేనట్టి నరుఁడె నిజముగ గెలుచున్

    రిప్లయితొలగించండి

  2. అలయక విద్యా ర్జనలో
    పలుశాస్త్తంబుల ఁఁజదువుచుఁబాయనిశ్రద్ధన్
    విలువల నిచ్చెనఁబ్రాకిన
    నిలుకడ లేనట్టినరుడె నిజముగగెలుచున్
    నిలుకడ

    రిప్లయితొలగించండి
  3. గెలువగ లేడెప్పుడు దా
    నిలకడ లేనట్టి నరుడు : నిజముగ గెలుచున్
    పలు విధముల శ్రమి యించుచు
    సలుపుచు కృషి నెల్ల వేళ సాధన తోడన్

    రిప్లయితొలగించండి
  4. కులసతి పంతమాడుచును గుంభనలేకనుకయ్యమాడుచున్
    అలుకనునాదరింపకను యాదవుభావము దప్పుబట్టినన్
    కలికికిసేవఁజేసెగదకాదనకిచ్చెగకల్పవ్రుక్షమున్
    నిలుకడలేనిమానవులనేవరియంచునుగెల్పునిచ్చలున్
    దీపావళిశుభాకాంక్షలతో

    రిప్లయితొలగించండి
  5. కందం
    తలమునకలగుచు నుండఁగఁ
    దలచిన కార్యమ్మునందు, తడబడ జేయన్
    గలసినఁ గలుషమతులతో
    నిలుకడ లేనట్టి నరుఁడె నిజముగ గెలుచున్

    చంపకమాల
    తలచిన కార్యమందు తన దక్షతతో పునరంకితమ్మునై
    తలమునకల్ బడన్ గనుచు దారినఁబోయెడు కల్మషాత్మజుల్
    గలయుచు వ్యర్థ భాషణలఁ గాలముఁ బుచ్చఁగ వారిమధ్యలో
    నిలుకడ లేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      కలిగిరి పాదయాత్రఁగొని గద్దెను మేటిగ రాజశేఖరుల్
      గలిగిరి పాదయాత్రఁ గొని గద్దెను సాటిగ చంద్రబాబులున్
      గలిగిరి పాదయాత్రల జగన్ బరిపాలన, నోట్లపర్వమై
      నిలుకడ లేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్

      తొలగించండి

  6. తలచిన కార్యములవి ని
    శ్చలమగు పట్టుదలతోడ చరియించెడు వా
    రలకె ఫలియించునెవ్విధి
    నిలకడలేనట్టి నరుడె నిజముగ గెలుచున్.

    రిప్లయితొలగించండి

  7. కలలవి తీరునెప్పుడన కష్టమటంచు మదిన్ దలంపకన్
    దలచిన కార్యమందు కడు దక్షత జూపి చరించు వారు ని
    శ్చలమగు కార్య సాధకులు శ్రామికు లైనను గాదె, యెవ్విధిన్
    నిలుకడ లేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్?

    రిప్లయితొలగించండి
  8. కలగని భావిభారతము క్రన్నన విశ్వవిజేత యౌనటుల్
    బలముగ విశ్వసించుచును పన్నుగ నూత్న విధానమెంచుచు
    న్నలయక నంతరాయముల నాంక్షల దాటుచు యత్నమందునన్
    నిలుకడలేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్

    నిలుకడ = ముగింపు

    రిప్లయితొలగించండి
  9. సమస్య ;

    నిలుకడ లేని మానవుల
    నే వరియించును గెల్పు నిచ్చలున్

    ( ఆధునికాంధ్ర సాహిత్యంలో
    గురజాడ వారిది ' గురుజాడ ' )

    నిలువడె రాజుగారి మది
    నిండుగ గెల్చితి నంచు కోటలో ;
    నిలువడె " కన్యశుల్క " మును
    నెమ్మిగ వ్రాసితి నంచు దృప్తితో ;
    నిలువడె అప్పరాయకవి
    నిర్భయసంస్కరణంపు కైతలన్ ;
    నిలుకడ లేని మానవుల
    నే వరియించును గెల్పు నిచ్చలున్ .

    రిప్లయితొలగించండి
  10. నలుదిక్కుల నడయాడుచు
    పలువాగ్దానంబులిడుచు పదవీకాంక్షే
    కలలో నిలలో బలపడి
    నిలుకడ లేనట్టి నరుఁడె నిజముగ గెలుచున్

    రిప్లయితొలగించండి
  11. కలియుగమున నీ దినముల
    నిలుకడ లేనట్టి నరుఁడె నిజముగ గెలుచున్
    కలుషము లేదిట్లు బలుక
    పలు సమయంబుల నిది యలవాటయి పోయెన్

    రిప్లయితొలగించండి
  12. చలనము లేని జీవితము సాగదు
    ముందుకు సక్రమంబుగా
    కలలను దప్పకుండగను కష్టమొ
    నర్చుచు నివ్వహించుచు
    న్నలసట జెందబోకు సమయంబు
    వృధాజను, దృప్తిపై
    నిలుకడ లేని మానవులనే వరియిం
    చును గెల్పు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  13. పలువిధ వ్యాకులమ్ములనుపంటిబిగింపున నోర్చుకొంచు తా
    దలచిన కార్యసాధనముదక్షతతో నెరవేర్చు వానికిన్
    ఫలితముదక్కు నిక్కువముపంతము బూనుచు మానసంబునన్
    నిలుకడ లేని మానవులనేవరియించును గెల్పు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  14. పలువిధముల శమదమములు
    కలిగిన తానోర్చుకొనుచుఁ గడు పూనికతో
    తలచిన పని సఫలతకై
    నిలుకడ లేనట్టి నరుఁడె నిజముగ గెలుచున్

    రిప్లయితొలగించండి
  15. పలువితమైన పంటలను పైకము నార్జన చేయ నెంచుచున్
    విలువగు జీవితమ్మునల వెచ్చము సేయుచు క్షేత్రమందునన్
    సలుపుచు క్రొత్త శోధనల సత్ఫల మొందు స్థిరంపు ఇచ్చతో
    నిలుకడ లేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్
    ఇలుకడ : ఇంటి వద్ద

    రిప్లయితొలగించండి
  16. పలువురి మెప్పులే మిగులు పద్దతి గాపను లన్ ముగించినన్
    సులువుగ వీడరా దుగద సొంతమ యేవరకున్ జయమ్ములే
    సలుపద గున్ పనుల్ నిలన సాంతము గాను, ముగించుదా క నే
    నిలుకడ లేని మానవులనే, వరియించును గెల్పు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  17. చం:

    పలుకులు నమ్మి షేరులను పండుగ రోజు గడింప లాభమున్
    విలువగ నెచ్చు మూల్యమున పిచ్చిగ కొన్నటు మీద సుప్తమై
    నిలువగ నష్టముల్ కలిగి నీతి నెఱుంగరె, యెట్టకేలకున్
    నిలకడ లేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. అలవోకగ నంటి విటులఁ
    దెలిసియొ మఱి సుంత యేని తెలియకయో నీ
    పలికిన యట్టిది సత్యము
    నిలుకడ లేనట్టి నరుఁడె నిజముగ గెలుచున్

    [నిలుకడ = విరామము]


    అలయక యున్న నించుకయు యత్న మొకింతయుఁ జేయ నొల్లకే
    కలవర మంద మిక్కుటము కార్యము లెట్లు ఫలించుఁ జెప్పుమా
    పలు వచనమ్ము లేల నయ పల్క నిరంతర యత్న దీక్షతో
    నిలు కడ లేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్

    [ఇలు కడ లేని = ఇలు (విశ్రాంతికి) మఱియు నంతము (పనికి) లేని]

    రిప్లయితొలగించండి
  19. కాసినో రౌలెట్ (జూద గృహం) ఆట ఆడిన సందర్భంగా.

    కందం
    అలవాటులేని జూదరి
    పలురంగులు గల గడులన పందెము గాయన్
    వలతిగ ధనమును బొందెన్
    నిలుకడ లేనట్టి నరుడె నిజముగ గెలుచున్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  20. దీపావళి శుభాకాంక్షలతో.....

    కలతల బారిన బడునిల
    నిలుకడ లేనట్టి నరుడె,నిజముగ గెలుచున్
    గెలుపును గోరుచు యత్నము
    బలువిధముల జేయు నెడల భవ్యముగాగన్

    రిప్లయితొలగించండి
  21. నిలుకడలేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్
    గలియుగ ధర్మమేయిదియ కాదనలేరుగ నెవ్వరెప్పుడున్
    కలికిరొ! వింటివేగదిది కర్కశునేగద నమ్ము గొర్రెలున్
    నలఘు మనంబుతో దనరి యందరు నొక్కరుగానెజూడుమా

    రిప్లయితొలగించండి
  22. నిలువవు సంపదల్ గెలుపు నిక్కముగా వరియించదెన్నడున్
    నిలుకడ లేని మానవులనే; వరియించును గెల్పు నిచ్చలున్
    నిలకడ దోడ కార్యముల నించు మనీషుల నిశ్చయంబుగా
    నిలుపు యశంబు వారె మహనీయులుగా వెలుగొందగానిలన్

    రిప్లయితొలగించండి