25, నవంబర్ 2021, గురువారం

సమస్య - 3912

 26-11-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కూర్మరూపాన దశకంఠుఁ గూల్చితె హర”
(లేదా...)
“కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా కూర్మావతారుండవై”

23 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా:

    నిలిపె మందరమును హరి నీరధి నెటు?
    జానకి చెఱ రాముడెటుల సడల జేసె?
    భక్తు లేమనగ భవుడు పల్కు నెపుడు?
    కూర్మరూపాన, దశకంఠు గూల్చితె, హర.

    రిప్లయితొలగించండి
  2. సిరినిగూడినవిష్ణువుసిద్ధమయ్యె
    శివుడుశ్రీకూర్మమందునచిత్రమయ్యె
    తోడుదోంగలుదేవుళ్లుదోర్బలమున
    కూర్మరూపానదశకంఠుకూల్చితెహర

    రిప్లయితొలగించండి
  3. ధర్మ,రక్షణ ధీక్షయే కర్మ యనగ
    నాచ రించియె జూపుచూ నవని గాచి
    కూర్మరూపాన, దశకంఠు గూల్చితె హర?
    సేత చెఱ బాపి గావగా ,శ్రీనివాస!!

    రిప్లయితొలగించండి


  4. అజితుండే భువిరాముడై దనుజుడౌ యా రావణుం జంపె, సం
    ధిజమున్ గ్రోలిన వాడొకండిటుల నీతిన్ వీడి వాచించెనే
    కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా కూర్మావతారుండవై
    సుజనుండెవ్వడు మెచ్చబోడు కదరా చోద్యంబు నీమాటలే.

    రిప్లయితొలగించండి
  5. క్రమాలంకారంలో -----
    ఎత్తె మంధర గిరిని దా నెటుల హరి?
    రామ మీరేరి గూల్చితె రణము నందు?
    గరళ మెవ్వరు దాల్చిరి కంఠ మందు?
    కూర్మ రూపాన :: దశకంఠు గూల్చితె : హర

    రిప్లయితొలగించండి
  6. పెద్ద కవ్వపుకొండను వీపునభరి
    యించ దలచినంత నవతరించినావు
    కూర్మరూపాన; దశకంఠుఁ గూల్చితె హర
    జయుని కవనిపై రెండవ జన్మముగిసె

    రిప్లయితొలగించండి


  7. రావణుని జంపె నెవడన రాముడనుచు
    నెరుగ కుండగ సఖులతో మొఱకుడొకడు
    స్వాదు రసమును గ్రోలుచు పలికె నిటుల
    కూర్మరూపానదశకంఠుఁ గూల్చితె హర.

    రిప్లయితొలగించండి
  8. నిజభక్తుండగురావణున్గలియగానీరూపమున్జూపగా
    స్రుజనన్నేర్పునరామువైగదిసికౌశల్యంబుకన్పట్టగన్
    ప్రజలన్గీవగదుష్టశిక్షణనునీప్రాబల్యంబునన్వాడలో
    కుజనుండౌదశకంఠుఁజంపితెహరాకూర్మావతారుండవై

    రిప్లయితొలగించండి
  9. క్షీరసాగర మథనమ్ము సేయువేళ
    మందరము మోసినావుగా మాధవుండ
    కూర్మరూపాన, దశకంఠుఁ గూల్చితె హర
    వినుత దశరథతనయుగా విమలచరిత
    పెరిగె పాపము పుడమిపై వేగరమ్ము

    రిప్లయితొలగించండి
  10. పర్వతము దోడ జిలుకగ వనధి నందు
    మునుగకుండ హరీ ! దాని మోసి తివిగ
    కూర్మరూపాన ; దశకంఠుఁ గూల్చితె హర !
    యతని మదిని చెడుదలపు నావహించి

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    జయుఁడె ద్వారపాలకుఁడు దశాననుండు
    ప్రాణ' హరు' నిగ హరి! బ్రోచ రామ! వైరి
    వరము మేరకు దాచి 'దైవత్వము' నట
    ' కూర్మరూపాన' దశకంఠుఁ గూల్చితె 'హర'!

    మత్తేభవిక్రీడితము
    సుజనుండౌ జయుఁడంద శాపమున దుష్టుండౌచుఁ దా జన్మమున్
    నిజతత్వంబు నెఱింగి ప్రాణహరుఁ డై నిర్జించి మోక్షమ్మిడన్
    గుజకై మాధవ! దాచి దైవతమునే కూర్మమ్మువోలెన్ భువిన్
    కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా! కూర్మావతారుండవై!

    రిప్లయితొలగించండి
  12. కొండ మునగకుండగ మోసె, మండె వీపు
    కూర్మరూపాన; దశకంఠుఁ గూల్చితె హర!
    హర! యనుచు వాడు మలిగె,హరికె బాధ
    లన్ని ధర్మమును నిలుప నవని పైన

    రిప్లయితొలగించండి
  13. శ్రీ కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్యకు నా పూరణములు

    సమస్య:కూర్మ రూపాన దశకంఠుఁగూల్చితె హర.

    పూరణము

    ఆటవెలది:

    మందరంబు నెత్తి మహనీయ మూర్తివై
    సాగర మథనాన సాయ పడవె
    పాప నాశ!/కూర్మ రూపాన, దశకంఠుఁ
    గూల్చితె హర /వినుత!కోసలేశ!

    సమస్య

    కుజనుండౌ దశకంఠుఁజంపితె హరా!కూర్మావతారుండవై

    మత్తేభము

    ప్రజలెల్లంగొనియాడుచుండ మును శ్రీరామావతారుండవై
    కుజనుండౌ దశకంఠుఁజంపితె హరా!,కూర్మావతారుండవై
    నిజ పృష్ఠంబున నెత్తి మందరమునే నిల్పన్ మహానందమై
    భజియించెంగద దేవకోటి మిము సౌభాగ్యంబు సిద్ధించగన్ .

    ————దువ్వూరి రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  14. ప్రజలన్ గావగనుద్భవింతువు భువిన్ ఫాలాక్ష! రాముండవై
    కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా! కూర్మావతారుండవై
    భజియించంగను దేవదానవులు గ్రావమ్ముంచితే వీపుపై
    రుజలన్ గాంచు మభిన్నమూర్తి! వడి నిర్మూలించు నాబాధలన్

    రిప్లయితొలగించండి
  15. చదివినవి పెక్కు లున్నవి చదివి నట్టి
    వాని మఱవ నెన్నండును నేను నిజము
    నే నెఱుంగుదు నిక్కము నీవె రామ!
    కూర్మరూ పాన దశకంఠుఁ గూల్చితె హర

    [కూర్మ రూపు +ఆన =కూర్మరూ పాన; హర =చంపు వాఁడ]


    గజవిక్రాంత విలాస సద్గమన! మేఘశ్యామ రాజద్విరా
    జి! జగన్నాథ! ప్రభాకరాన్వయ మణీ! సీతాపహారిన్ ఖలుం
    బ్రజలన్ మౌనుల వేఁచు చుండ హరి! వే రామావతారుండవై
    కుజనుండౌ దశకంఠుఁ జంపితె హ రాకూర్మావతారుండవై

    [హర + అకూర్మావతారుండు = హ రాకూర్మావతారుండు: హరుఁడు నకూ ర్మావతారుఁడు; హరుఁడు = పాపములను హరించు వాఁడు, విష్ణువు]

    రిప్లయితొలగించండి
  16. మ:

    సృజనా శక్తిని బెంపు సేయ నిటులై చిక్కెంచి ప్రశ్నావళిన్
    ప్రజలన్ జేరగ వేసి పూరణలనున్ పంతమ్ముగా వ్రాయగన్
    భుజముల్ దట్టగ మీకు సాటి యెవరౌ , ముందుంచిరీ పాదమున్
    కుజనుండౌ దశకంఠు జంపితె హరా కూర్మావతారుండవై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  17. కూర్మ రూపాన దశకంఠు గూల్చితెహర!
    కాదు కాదని జెప్పుము కమలనాభ!
    రావణు దునుమాడినవాడు రాముడుకద
    మానవాకార మెత్తిన మాన్యు డతడు

    రిప్లయితొలగించండి
  18. ప్రజలన్ గావగ నిచ్చనున్భువిని శ్రీరామావతారంబుతో
    కుజనుండౌ దశకంఠు జంపితెహరా! కూర్మావతారుండవై
    సుజనుల్ మెచ్చగ గొండలేపితివిగాసోత్కర్షమింపారగన్
    భజనల్ సేసిరిదేవదానవులె యింపారంగజేజేలతో

    రిప్లయితొలగించండి
  19. స్వజనంబందున గొప్పపండితునిగా ప్రస్తావముం బొందుచున్
    ద్విజుడొక్కండుపురాణపాఠములలో దిట్టంచు తానిట్లనెన్
    కుజనుండౌ దశకంఠుఁ జంపితె హరా కూర్మావతారుండవై
    భజియింతున్ గిరిఁ వేలినెత్తిన దొరా భద్రాద్రివాసా శివా!

    రిప్లయితొలగించండి
  20. పాలసాగరమందునపర్వతమును
    వీపుననిడి యొసగితివి వేగ సుధను
    కూర్మరూపాన;దశకంఠుగూల్చితె,హర
    గరళమునునుచితివిగద గళమునందు

    రిప్లయితొలగించండి